అన్వేషించండి

Income Tax Returns Filing Deadline: ట్యాక్స్ పేయర్లకు గుడ్‌న్యూస్- ఐటీఆర్‌ దాఖలుకు తుది గడువు పొడిగించిన సీబీడీటీ

ITR Filing Deadline Extends: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు కేంద్ర ప్రభుత్వం మరో అవకాశాన్ని కల్పించింది. సెప్టెంబర్ 16ను ఐటీఆర్ దాఖలుకు తుది గడువుగా సీబీడీటీ ప్రకటించింది.

Income Tax Returns Filing Date Extended | 2025-26 సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్నులు (ITR 2025) దాఖలు చేయడానికి గడువు తేదీని మొదట జూలై 31, 2025న నిర్ణయించగా, దానిని సెప్టెంబర్ 15, 2025 వరకు పొడిగించారు. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఈ ITRలను దాఖలు చేయడానికి గడువు తేదీని సెప్టెంబర్ 15 నుండి సెప్టెంబర్ 16, 2025 వరకు పొడిగించాలని నిర్ణయించింది. యుటిలిటీలలో మార్పులను ప్రారంభించడానికి, ఈ-ఫైలింగ్ పోర్టల్ 2025 సెప్టెంబర్ 16న ఉదయం 12:00 నుండి ఉదయం 02:30 వరకు మెయింటనెన్స్ మోడ్‌లో ఉంటుందని, ఆ సమయంలో ఐటీఆర్ దాఖలు చేయడం వీలుకాదని స్పష్టం చేసింది. 

మరోసారి గడువు పెంచిన సీబీడీటీ

ఆర్థిక సంవత్సరం FY24-25 (AY25-26) ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేసేందుకు చివరి రోజు నేడే. సెప్టెంబర్ 15తో ఐటీఆర్ ఫైలింగ్ తుది గడువు ముగియగా.. తాజాగా మరోసారి ఐటీఆర్ ఫైలింగ్ గడువు పొడిగించారు. గత రెండు మూడు రోజులుగాIncome Tax portal మొరాయిస్తోంది. చివరిరోజు కావడంతో సెప్టెంబర్ 15న పెండింగ్ ఉన్న అందరూ ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేందుకు ప్రయత్నిస్తుండటంతో సర్వర్ లోడ్ పెరిగి టెక్నికల్ ప్రాబ్లమ్ వచ్చింది. దాంతో కేంద్రం మరికొన్ని రోజులు గడువు పెంచుతుందని సోమవారం అర్ధరాత్రి వరకు ట్యాక్స్ ప్లేయర్లు ఎదురుచూశారు. అయితే సెప్టెంబర్ 16ను ఐటీఆర్ దాఖలుకు తుది గడువుగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (CBDT) నిర్ణయించింది. సోమవారం రాత్రి ఈ విషయాన్ని తమ ఎక్స్ ఖాతా ద్వారా తెలిపింది. 

 

నేటితో ముగియనున్న ఐటీఆర్ తుది గడువు

పన్ను చెల్లింపుదారులు (Income Tax Payers) సెప్టెంబర్ 16న కనుక ఐటీఆర్ దాఖలు చేయకపోతే కనుక జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. రూ.5 లక్షల లోపు ఆదాయం ఉన్న వారు రూ.1000 ఫైన్ కట్టాలి. రూ.5 లక్షలకు మించి ఆదాయం ఉన్న వారు రూ.5000 వరకు జరిమానా చెల్లించాల్సి వస్తుంది. కొన్ని సందర్భాలలో జరిమానాతో పాటు జైలుశిక్ష పడే అవకాశాలున్నాయి. అందుకే ఇన్‌కం ట్యాక్స్ వెబ్‌సైట్‌లో మీకు సంబంధించిన కరెక్ట్ వివరాలు నమోదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. మంగళవారం రాత్రిలోగా ఐటీఆర్ ఫైలింగ్ పూర్తి చేయాలని ప్రభుత్వం సూచించింది. 

ట్యాక్స్ పేయర్లు ఫారం 16, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, ఇన్వెస్టిమెంట్ ప్రూఫ్స్, హోమ్ లోన్ వడ్డీ సర్టిఫికేట్, ఫారం 26AS లాంటివి మీ వద్ద రెడీగా ఉంచుకుని ఐటీఆర్ ఫైల్ చేయాలని సూచిస్తున్నారు. పన్ను చెల్లింపుదారులు ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పుడు డాక్యుమెంట్స్, వివరాలు నమోదు చేయకూడదు. దాని వల్ల మీ ఐటీఆర్ ఫైలింగ్ ను క్యాన్సల్ చేసే అవకాశం ఉంది. కొన్ని సందర్బాలలో భారీ జరిమానా, ఎగవేసిన పన్ను మీద భారీ వడ్డీని వసూలు చేస్తారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
PMFME Scheme: ఫుడ్ బిజినెస్ చేసేవారికి గుడ్ న్యూస్.. రూ. 10 లక్షల రుణంపై 35% సబ్సిడీ.. ఎలా అప్లై చేసుకోవాలంటే?
ఫుడ్ బిజినెస్ చేసేవారికి రూ. 10 లక్షల రుణంపై 35% సబ్సిడీ.. ఎలా అప్లై చేసుకోవాలంటే
Care Health Insurance: తెలంగాణలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, ప్రజలకు ఇబ్బందులే... షాక్ ఇచ్చిన టీఎస్‌హెచ్‌ఏ!
తెలంగాణలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, ప్రజలకు ఇబ్బందులే... షాక్ ఇచ్చిన టీఎస్‌హెచ్‌ఏ!
Air India New CEO: ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ- ఎండీగా టేవోల్డే గెబ్రేమారియం.. ఎయిర్‌లైన్స్ దశ మారుతుందా?
ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ- ఎండీగా టేవోల్డే గెబ్రేమారియం.. ఎయిర్‌లైన్స్ దశ మారుతుందా?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mamata Banerjee Car Attack: మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Embed widget