BOSCH in Hyderabad: భాగ్యనగరికి మరో మకుటం! తెలంగాణకు 'బాష్' రానుందన్న కేటీఆర్
బాష్ హైదరాబాదులో తన కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. తన సాఫ్ట్‌వేర్ విభాగానికి సంబంధించి సుమారు మూడు వేల మందితో భాగ్యనగరంలో ఒక క్యాంపస్ ని ఏర్పాటు చేస్తునట్లు ప్రకటించింది.
తెలంగాణ రాష్ట్రానికి అంతర్జాతీయ కంపెనీలు వరుస కడుతున్నాయి. తాజాగా బాష్ హైదరాబాదులో తన కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. తన సాఫ్ట్‌వేర్ విభాగానికి సంబంధించి సుమారు మూడు వేల మందితో భాగ్యనగరంలో ఒక క్యాంపస్ ని ఏర్పాటు చేస్తునట్లు ప్రకటించింది.
మంగళవారం కంపెనీ సీనియర్ ప్రతినిధి బృందంతో జరిగిన వీడియో సదస్సులో మంత్రి కే తారక రామారావు బాష్ కంపెనీని తెలంగాణకి ఆహ్వానించారు. హైదరాబాద్ నగరంలో అద్భుతమైన మౌలిక వసతులతో పాటు మానవ వనరులు ఉన్నాయని తెలిపిన కేటీఆర్, కంపెనీ ప్రస్తుతం నిర్దేశించుకున్న మూడు వేల మంది ఉద్యోగుల సంఖ్యను త్వరలోనే దాటి మరింత విస్తరిస్తున్నదన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. గతంలో తెలంగాణలో పెట్టుబడులు పెట్టిన అనేక కంపెనీలు అత్యంత వేగంగా విస్తరించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
సమావేశం తర్వాత మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా కంపెనీ కార్యాలయ ఏర్పాటుకు సంబంధించిన వివరాలను పంచుకున్నారు. జర్మనీకి చెందిన అత్యంత ప్రముఖ ఎంఎన్‌సీ కంపెనీ, మొబిలిటీ, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, హోమ్ అప్లయెన్సెస్ వంటి రంగాల్లో ప్రపంచ దిగ్గజ కంపెనీ అయిన బాష్ హైదరాబాద్ లో తన గ్లోబల్ సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సెంటర్ ఏర్పాటుతో మూడు వేల మందికి ఉపాధి అవకాశాలు రానున్నట్లు కేటీఆర్ తెలిపారు.
Also Read: ఐపీవో క్రేజ్ - పెట్టుబడి పెట్టే ముందు ఇవి గుర్తుపెట్టుకుంటే నష్టాలు రావు!
సరిగ్గా వంద సంవత్సరాల కింద భాష్ కంపెనీ భారతదేశంలో తన కార్యకలాపాలను ప్రారంభించడం యాదృచ్చికమని కేటీఆర్ అన్నారు. ఇలాగే 25 సంవత్సరాల కింద ఐటీ రంగంలో బెంగళూరులో కేంద్రాన్ని ఏర్పాటు చేసిందన్నారు. చాలా ఏళ్ల తర్వాత తెలంగాణ ప్రభుత్వ విధానాలు ఇక్కడి వాతావరణ అనుకూల పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని హైదరాబాద్ నగరంలో అడుగుపెట్టడం గొప్ప విషయం అని మంత్రి తెలిపారు. ఇది తెలంగాణ ప్రభుత్వ విధానాలను, ప్రగతిశీల పురోగతిని, రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడుల ఆకర్షణను తెలియజేస్తున్నదన్నారు.
ఈ కేంద్రానికి సంబంధించి కంపెనీ త్వరలోనే అధికారికంగా ఒక ప్రోగ్రామ్‌ను రూపొందించనుంది. బాష్ సీనియర్ ప్రతినిధి బృందం, సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ ఉపాధ్యక్షులు సెంటర్ హెడ్ సుందర రామన్ , ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి రంజన్ తదితరులు మంత్రితో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.
Also Read: ఆసియాలో రిచెస్ట్ పర్సన్‌గా గౌతమ్ అదానీ, రెండో స్థానానికి రిలయన్స్ అధినేత
BOSCH in Hyderabad! 😊
— KTR (@KTRTRS) February 8, 2022
German MNC & a world leader in Mobility, Industrial Engineering & Home Appliances has chosen Hyderabad as a strategic location with its Bosch Global Software Technologies and R&D presence. The proposed facility will provide employment to about 3000 people pic.twitter.com/vqAWo2SUPd