Airtel Xstream Fiber : ఆల్ ఇన్ వన్ డాటా ఓటీటీ సబ్‌స్క్రిప్షన్స్ - ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ఫైబర్ కొత్త ప్లాన్స్ ఇవిగో ..
ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ఫైబర్ కొత్త ఆల్ ఇన్ వన్ ప్లాన్లు ప్రకటించింది. వాటి వివరాలు ...
Airtel Xstream Fiber : ఎయిర్‌టెల్ మూడు కొత్త ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లను ప్రకటించింది. ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ( Airtel Xstream ) బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లలో అపరిమిత డేటా, OTT సబ్‌స్క్రిప్షన్‌లు ఉంటాయి ఇందులో 17 OTTలు, 350 ప్లస్ టీవీ ఛానెల్స్ , 4K Xstream TV బాక్స్‌లు కూడా ఉంటాయి. ఈ ప్లాన్‌లు అపరిమిత డేటా, వాయిస్ కాలింగ్ మరియు DTH సేవలతో సహా ఉంటాయని ఎయిర్ టెల్ ( Airtal ) ప్రకటించింది.
Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?
ప్రస్తుతం బ్రాడ్ బ్యాండ్ వినియోగదారుల అవసరాలు మారాయని కంపెనీ భావిస్తోంది. వినియోగదారులు మునుపెన్నడూ లేనంతగా అనేక రకాల వినోదాలను డిమాండ్ చేస్తున్నారని విశ్వసనీయమైన హోమ్ ఇంటర్నెట్ ను కోరుకుంటున్నారని ఎయిర్ టెల్ చెబుతోంది. అందుకే ప్రీమియం గృహాల వినోద అవసరాలను తీర్చడానికి, భారతీ ఎయిర్‌టెల్ ఈ మూడు ‘కొత్త ఆల్ ఇన్ వన్ ప్లాన్‌లను’ ప్రకటించింది.
Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!
ఎయిర్ టెల్ ( Airtel ) చెప్పిన దాని ప్రకారం, కొత్త ప్లాన్‌ల ధరలు వరుసగా రూ. 699, రూ. 1,099 రూ. 1,599 ఉంటాయి. ఇవి వరుసగా 40 Mbps, 200 Mbps మరియు 300 Mbps స్పీడ్‌లను అందిస్తాయి. ఈ ప్లాన్‌లు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ మరియు డిస్నీ+ హాట్‌స్టార్‌తో సహా ప్రధాన OTT స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లకు సబ్‌స్క్రిప్షన్‌లను కూడా ప్యాక్ చేస్తాయి. 4K ఎక్స్‌స్ట్రీమ్ టీవీ బాక్స్ కోసం ఎయిర్‌టెల్ ఒక్కసారిగా రూ. 2000 ఛార్జ్ చేస్తుంది. ఇందుకు గాను సంస్థ ఎటువంటి ఇన్‌స్టాలేషన్ ఖర్చు లేకుండా మొదటి నెల అద్దె ఉచిత సేవను అందిస్తుంది.
18 నిమిషాల చార్జ్‌తో 500 కిలోమీటర్లు - కియా క్రేజీ ఎలక్ట్రిక్ కారు ఇదే - మనదేశంలో 100 మాత్రమే!
“మా కొత్త ప్లాన్‌లు భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న వినోద అవసరాల కోసం రూపొందించామని... ఈ ఆఫర్‌ల ద్వారా కస్టమర్‌లకు గొప్ప విలువను సౌకర్యాన్ని అందించగలమని " ఎయిర్‌టెల్ విశ్వాసం వ్యక్తం చేస్తోంది. ఈ ప్లాన్ల ద్వారా ఫైబర్ ఇంటర్నెట్ మార్కెట్లో మరింత వాటా పెంచుకోవాలని ఎయిర్ టెల్ కృతనిశ్చయంతో ఉంది. ఓటీటీల ఫ్రీ యాక్సెస్ అందర్నీ ఆకర్షిస్తుందని నమ్ముతోంది.