Kia EV6: 18 నిమిషాల చార్జ్‌తో 500 కిలోమీటర్లు - కియా క్రేజీ ఎలక్ట్రిక్ కారు ఇదే - మనదేశంలో 100 మాత్రమే!
కియా కొత్త ఎలక్ట్రిక్ కారు ఈవీ6 మనదేశంలో త్వరలో లాంచ్ కానుంది. ఈ కారు మనదేశంలో లిమిటెడ్ క్వాంటిటీలో మాత్రమే అందుబాటులో ఉండనుంది.
కియా మనదేశంలో తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేయడానికి సిద్ధం అవుతోంది. అదే కియా ఈవీ6. ఇది ఒక ప్రీమియం క్రాస్ఓవర్ కారు. దీని ధరను కూడా పూర్తిస్థాయి ఇంపోర్టెడ్‌గానే నిర్ణయించనున్నారు. మనదేశంలో కేవలం 100 యూనిట్లు మాత్రమే విక్రయించనున్నారు. దీనికి సంబంధించిన బుకింగ్స్ కూడా త్వరలో ప్రారంభం కానున్నాయి. ఈవీ6 కొంతమంది కియా డీలర్ల వద్దనే లభించనుంది.
మనదేశానికి కేవలం 100 యూనిట్లు మాత్రమే కేటాయించారు. కాబట్టి ఎంపిక చేసిన నగరాల్లో సింగిల్ కియా డీలర్ల వద్ద మాత్రమే ఇది లభించనుంది. ఇది ప్రీమియం ఎలక్ట్రిక్ వాహనం. కియా ఈవీ6 ధర రూ.55 లక్షల రేంజ్‌లో ఉండే అవకాశం ఉంది. ఇందులో 77.4 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీని అందించనున్నారు. కాబట్టి ఒక్కసారి చార్జ్ చేస్తే 530 కిలోమీటర్ల రేంజ్‌ను అందించనుంది.
ఇందులో డ్యూయల్ మోటార్ వెర్షన్, సింగిల్ మోటార్ వెర్షన్ వేర్వేరు పవర్ అవుట్‌పుట్లను అందించే అవకాశం ఉంది. 800V చార్జింగ్ కెపాసిటీని కియా ఈవీ6లో అందించనున్నారు. కాబట్టి కేవలం 18 నిమిషాల్లోనే ఈ కారు పూర్తిగా చార్జ్ అయ్యే అవకాశం ఉంది. అయితే దీనికి ప్రత్యేకమైన ఫాస్ట్ డీసీ చార్జర్‌ను ఉపయోగించాలి.
ఆరు రీజనరేటివ్ బ్రేకింగ్ లెవల్స్, ఫ్లాట్ ఫోర్, భారీ స్పేస్ ఈ కారుకు ప్రధాన హైలెట్స్. 990 మిల్లీమీటర్ల లెగ్‌రూం ఇందులో ఉండనుంది. 12.3 అంగుళాల హై డెఫినిషన్ వైడ్ స్క్రీన్స్, ఆగ్మెంటెడ్ రియాలిటీ హెచ్‌యూడీ, 14 స్పీకర్ల మెరీడియన్ సరౌండ్ ఆడియో సిస్టం ఇందులో ఉండనున్నాయి. ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ కూడా దీంతోపాటు అందించనున్నారు.
ప్రపంచవ్యాప్తంగా కియా ఈవీ6కి భారీ డిమాండ్ ఉంది. అందుకే మనదేశానికి లిమిటెడ్ సప్లై మాత్రమే లభిస్తుంది. ఈ ధరలో కియా ఈవీ6 మాత్రమే ప్రీమియం ఎలక్ట్రిక్ కారుగా నిలవనుంది. ఈ ధరలో దీనికి కనీసం పోటీ కూడా లేదు. ఈ కారును సరికొత్త ఎలక్ట్రిక్ గ్లోబల్ మాడ్యులర్ ప్లాట్‌ఫాం (ఈ-జీఎంపీ)పై రూపొందించారు. దీన్ని ప్రత్యేకంగా ఎలక్ట్రిక్ వాహనాల కోసం మాత్రమే రూపొందించారు.
Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!
Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!
Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?