Yezdi Roadster 2025: కారు లాంటి ఫీచర్లతో యెజ్డి స్టైలిష్ బైక్ లాంచ్ – ధర ఎక్కువేం కాదు!
Yezdi Roadster Specifications: యెజ్డి రోడ్‌స్టర్ బైక్‌లో 334cc లిక్విడ్-కూల్డ్, సింగిల్-సిలిండర్ ఇంజిన్ ఉంది, ఇది 28.6 bhp పవర్ & 30Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది. కారు తరహా ఫీచర్లు చూడవచ్చు.

2025 Yezdi Roadster Features And Price: యెజ్డి రోడ్‌స్టర్ 2025 భారతదేశంలో లాంచ్ అయింది, దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 2 లక్షల 10 వేలు. చాలా అప్‌డేట్స్ & కొత్త కలర్ స్కీమ్స్‌తో ఈ కొత్త మోడల్ వచ్చింది. ఇవి ఈ బండి లుక్స్‌ను ఇంకా ప్రీమియం అపీల్‌లోకి మార్చాయి. డ్రైవింగ్ అసిస్టెన్స్ కోసం ఇప్పటి మోడరన్ కార్లలో కనిపించే కొన్ని ఫీచర్లను రోడ్‌స్టర్ 2025లోనూ అందించారు. బ్రాండింగ్, ఈ బండికి ఇచ్చిన కొత్త అప్‌డేట్స్, అడ్వాన్స్‌డ్ ఫీచర్లను లెక్కలోకి తీసుకుంటే, ఈ బండి ధర ఎక్కువ అనిపించదు!.
కొత్త యెజ్డి రోడ్‌స్టర్ డిజైన్, క్లాసిక్ రోడ్‌స్టర్ స్టైల్‌ను జ్ఞాపకానికి తెస్తుంది. రౌండ్ LED హెడ్‌లైట్, టియర్‌డ్రాప్ ఆకారపు ఇంధన ట్యాంక్, వంపు తిరిగిన ఫెండర్స్ & సన్నని టెయిల్ ల్యాంప్‌లతో కొత్త కౌల్ కొత్త బండికి ఉంటాయి. ఫ్యాక్టరీ కస్టమ్ కిట్‌ల ఆప్షన్ ఈ బైక్‌ను ఇంకా ప్రత్యేకంగా నిలబెడతాయి. వీటిలో ఇంటిగ్రేటెడ్ టెయిల్ లైట్ & టర్న్ ఇండికేటర్లు, డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిషింగ్, హైడ్రోఫార్మ్డ్ హ్యాండిల్ బార్ & తొలగించగల పిలియన్ సీటు వంటి ఫీచర్లు ఉన్నాయి.
యెజ్డి రోడ్‌స్టర్ పవర్‌ట్రెయిన్
యెజ్డి రోడ్‌స్టర్ బలమైన స్టీల్ ఫ్రేమ్‌తో తయారైంది. ఈ మోటార్ సైకిల్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు & వెనుక భాగంలో ట్విన్ షాక్ అబ్జార్బర్‌లు స్మూత్ రైడింగ్‌కు మద్దతుగా నిలుస్తాయి. బైక్ అల్లాయ్ వీల్స్‌తో ట్యూబ్‌లెస్ టైర్లు అందించారు. బ్రేకింగ్ కోసం, ముందు భాగంలో 320mm డిస్క్ బ్రేక్‌లు & వెనుక భాగంలో 240mm డిస్క్ బ్రేక్‌లు అమర్చారు. ఇవి ఎంత వేగంలోనైనా రైడర్‌కు భద్రత బండి మీద చక్కటి నియంత్రణను అందిస్తాయి & బ్రేకింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను పెంచుతాయి.
2025 యెజ్డి రోడ్‌స్టర్ 334cc లిక్విడ్-కూల్డ్, సింగిల్-సిలిండర్ ఇంజిన్‌తో గాలితో పోటీ పడుతూ పరుగులు తీస్తుంది. ఈ ఇంజిన్ 28.6 bhp శక్తిని & 30Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌ను 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో అనుసంధానించారు, దీనివల్ల రైడింగ్ చాలా స్మూత్‌గా సాగిపోతుంది. ఇంకా, అసిస్ట్ & స్లిప్పర్ క్లచ్‌ను కూడా ఉంది, ఇది గేర్ షిఫ్టింగ్ పనిని చాలా సున్నితంగా మారుస్తుంది.
యెజ్డి బైక్‌పై వారంటీ కూడా
కంపెనీ, 2025 రోడ్‌స్టర్ కోసం 4 సంవత్సరాలు లేదా 50 వేల కిలోమీటర్ల ప్రామాణిక వారంటీని (ఏది ముందయితే అది) అందిస్తోంది. ఈ బైక్ కోసం బుకింగ్ ఇప్పటికే ప్రారంభమైంది & డెలివరీలు త్వరలో స్టార్ అవుతాయి.
ఇప్పుడు, రెట్రో లుక్స్ + మోడ్రన్ టచ్ కలిసిన మోటార్ సైకిళ్లను యూత్ కోరుకుంటున్నారు. మీరు కూడా ఈ ట్రెండ్ ఫాలో కావాలంటే యెజ్డి రోడ్‌స్టర్ 2025 బైక్ మీకు సరైన ఎంపిక కావచ్చు.





















