అన్వేషించండి

Tesla Launches Y Premium Variant: టెస్లా మోడల్ వై లైనప్ లో మార్పులు: కొత్త ప్రీమియం వేరియంట్ లాంచ్.. ధర ఏకంగా రూ. 10 లక్షలకు పైగా తగ్గింపు

టెస్లా ఇండియాలో సరికొత్త మోడల్ వై ప్రీమియం ఆర్ డబ్ల్యూడీ వెర్షన్ ను తక్కువ ధరకు లాంచ్ చేస్తూ పాత లాంగ్ రేంజ్ మోడల్ ను నిలిపివేసింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • టెస్లా ఇండియా మోడల్ Y ప్రీమియం RWD కొత్త వేరియంట్‌ను విడుదల చేసింది.
  • కొత్త మోడల్ ధర రూ. 50.89 లక్షలు, రూ. 10 లక్షల కంటే తగ్గింది.
  • 16-అంగుళాల టచ్‌స్క్రీన్, 500 కి.మీ. రేంజ్‌తో ఈ కారు వస్తుంది.
  • రూ. 39,990 EMI ఆప్షన్‌తో కారును సొంతం చేసుకోవచ్చు.

Tesla Launches New Model Y Premium Variant In India:  ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా ఇండియా మార్కెట్లో తన మోడల్ వై (Model Y) లైనప్ ను అప్‌డేట్ చేసింది. కంపెనీ సరికొత్త 2026 మోడల్ వై ప్రీమియం ఆర్ డబ్ల్యూడీ (Premium RWD) ట్రిమ్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇదే సమయంలో టాప్-స్పెక్ లాంగ్ రేంజ్ ప్రీమియం ఆర్ డబ్ల్యూడీ వేరియంట్ అమ్మకాలను నిలిపివేసింది. ఈ మార్పు వల్ల బేస్ మోడల్ ధర భారీగా తగ్గింది. నిలిపివేసిన పాత లాంగ్ రేంజ్ వెర్షన్ తో పోలిస్తే కొత్త వేరియంట్ ధర ఏకంగా రూ. 10 లక్షల కంటే ఎక్కువగా తగ్గడం విశేషం. సరికొత్త టెస్లా మోడల్ వై ప్రీమియం రేర్-వీల్ డ్రైవ్ ధరను రూ. 50.89 లక్షలుగా (ఎక్స్-షోరూమ్) కంపెనీ నిర్ణయించింది. 

Read Also: Tata Tiago Facelift Review: టాటా టియాగో ఫేస్‌లిఫ్ట్ రివ్యూ: కొత్త కారులో నచ్చే 5 అద్భుతమైన ఫీచర్లు.. నిరాశ పరిచే 3 మైనస్ పాయింట్లు  

రూ. 50.89 లక్షల ధరతో సరికొత్త ఎంట్రీ లెవెల్ కార్..

గతంలో అందుబాటులో ఉన్న లాంగ్ రేంజ్ ప్రీమియం ఆర్ డబ్ల్యూడీ వేరియంట్ ధర రూ. 67 లక్షల పైనే ఉండేది. ఇప్పుడు టెస్లా ఇండియాలో తన లైనప్ ను సింప్లిఫై చేస్తూ కేవలం రెండు వేరియంట్లను మాత్రమే విక్రయించనుంది. ఇందులో 5 సీట్ల కెపాసిటీ ఉన్న మోడల్ వై ప్రీమియం ఆర్ డబ్ల్యూడీ, అలాగే 6 సీట్లతో వచ్చే మోడల్ వై ఎల్ ప్రీమియం ఏడబ్ల్యూడీ (Model Y L Premium AWD) ఉన్నాయి. కొత్తగా వచ్చిన బేస్ మోడల్ వై ప్రీమియం కారు టెస్లా ఇండియా పోర్ట్‌ఫోలియోలోనే అత్యంత చౌకైనదిగా మారింది. ఇది బిగ్ సైజ్ మోడల్ వై ఎల్ కంటే రూ. 11.1 లక్షలు తక్కువ ధరకు లభిస్తుంది. ఈ సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ డెలివరీలు 2026 జూలై నుంచి స్టార్ట్ అవుతాయి.

Read Also: Tata Tiago EV 2026: ఏడు లక్షలకే సరికొత్త టాటా టియాగో ఈవీ లాంచ్! బ్యాటరీకి లైఫ్‌టైమ్ వారంటీ!

బిగ్ టచ్‌స్క్రీన్ తో పాటు జెన్ గ్రే ఇంటీరియర్.. 

ఈ కొత్త ఈవీ క్యాబిన్ లోపల ఆల్-బ్లాక్ ఇంటీరియర్ థీమ్ తో పాటు అప్‌డేటెడ్ యూఐ (UI) కలిగిన పెద్ద 16-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ను అమర్చారు. స్టాండర్డ్ బ్లాక్ థీమ్ కాకుండా కస్టమర్ల కోసం 'జెన్ గ్రే' అనే సరికొత్త ఇంటీరియర్ కలర్ ఆప్షన్ ను కూడా టెస్లా ఆఫర్ చేస్తోంది. ఈ కారులో పవర్-ఫోల్డింగ్ సీట్లతో పాటు ఏకంగా 2138 లీటర్ల భారీ స్టోరేజ్ స్పేస్ దొరుకుతుంది. పర్ఫార్మెన్స్ పరంగా ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కేవలం 5.9 సెకన్లలోనే 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. సింగిల్ ఛార్జ్ పై ఇది గరిష్టంగా 500 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ ఇస్తుందని కంపెనీ స్పష్టం చేసింది.

ఎక్కువ మంది చదివిన ఈ టాప్ ట్రెండింగ్‌లో వార్తలు మిస్ అవ్వొద్దు
1 సీఎన్జీ కారు మైలేజీ పెంచే ఐదు చిట్కాలు!
2 ఈవీ మార్కెట్‌లో కొత్త "బాస్‌"!
3 6 గంటల ప్రయాణం కేవలం 15 నిమిషాల్లోనే...!

రూ. 39,990 స్టార్టింగ్ ఈఎమ్‌ఐ ఆప్షన్.. 

ఈ కొత్త వేరియంట్ కొనుగోలుపై టెస్లా బెస్ట్ ఓనర్‌షిప్ బెనిఫిట్స్ ను అనౌన్స్ చేసింది. కస్టమర్లు రూ. 6 లక్షల డౌన్ పేమెంట్ చెల్లించి, నెలకు రూ. 39,990 స్టార్టింగ్ ఈఎమ్‌ఐ (EMI) ఆప్షన్ తో ఈ కారును సొంతం చేసుకోవచ్చు. ఇండియాలోని అన్ని రాష్ట్రాల్లో తమ 'హోమ్ ఛార్జింగ్ ప్రోగ్రామ్' యాక్టివ్ అయిందని, కస్టమర్లు తమ ఇళ్ల వద్దే ఈజీగా కారును ఛార్జ్ చేసుకోవచ్చని కంపెనీ ప్రతినిధి తెలిపాడు. ఈ బేస్ మోడల్ తో పాటు గత నెలలోనే లాంచ్ అయిన 6 సీట్ల మోడల్ వై ఎల్ వేరియంట్ కూడా అందుబాటులో ఉంటుంది. ఇది సింగిల్ ఛార్జ్ పై 681 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. తక్కువ బడ్జెట్ లో టెస్లా కారు కొనాలనుకునే వారికి కొత్త మోడల్ బెస్ట్ ఆప్షన్ కానుంది.

Frequently Asked Questions

టెస్లా ఇండియాలో కొత్త మోడల్ Y ప్రీమియం RWD వేరియంట్ ధర ఎంత?

కొత్త టెస్లా మోడల్ Y ప్రీమియం RWD వేరియంట్ ధర రూ. 50.89 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా నిర్ణయించబడింది.

కొత్త మోడల్ Y ప్రీమియం RWD వేరియంట్ డెలివరీలు ఎప్పుడు ప్రారంభమవుతాయి?

ఈ సరికొత్త ఎలక్ట్రిక్ SUV డెలివరీలు 2026 జూలై నుంచి ప్రారంభమవుతాయి.

కొత్త టెస్లా మోడల్ Y ప్రీమియం RWD లో ఇంట్రియర్ ఆప్షన్స్ ఏమిటి?

కొత్త మోడల్ Y లో ఆల్-బ్లాక్ ఇంటీరియర్ తో పాటు 'జెన్ గ్రే' అనే కొత్త ఇంటీరియర్ కలర్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది.

ఈ కొత్త EV ఎంత డ్రైవింగ్ రేంజ్ ఇస్తుంది?

ఈ ఎలక్ట్రిక్ SUV సింగిల్ ఛార్జ్ పై గరిష్టంగా 500 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ ఇస్తుంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

రూ.20 వేల డౌన్ పేమెంట్‌తో Tata Tiago CNG కొనుగోలు చేస్తే EMI ఎంత కట్టాలి
రూ.20 వేల డౌన్ పేమెంట్‌తో Tata Tiago CNG కొనుగోలు చేస్తే EMI ఎంత కట్టాలి
టోల్‌గేట్‌ టెన్షన్‌కు చెక్.. NHAI రూ.350 టోల్ పాస్‌తో నెల మొత్తం అన్‌లిమిటెడ్‌ ట్రావెల్స్‌!
కేవలం రూ.350 మంత్లీ పాస్‌.. ఒక నెలలో టోల్ ప్లాజా నుంచి ఎన్నిసార్లయినా ప్రయాణం!
సిటీ రైడింగ్‌ అయినా, ఆఫ్‌రోడ్ ట్రైల్స్‌ అయినా.. Decathlon కొత్త సైకిళ్ల ప్రత్యేకతలివే!
డెకాథ్లాన్ నుంచి 3 కొత్త సైకిళ్లు.. Rockrider సిరీస్‌లో అదిరిపోయే మోడల్స్!
యమహా RayZR 125 వేరియంట్లలో ఏది బెస్ట్‌? ధరలు, ఫీచర్ల వివరాలు మీ కోసం!
లక్ష రూపాయల్లోనే యమహా స్పోర్టీ స్కూటర్‌.. 4 వేరియంట్లలో ఉన్న ఫీచర్లేంటి?
Advertisement

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gayatri Bronze Win: బ్రాంజ్ తో మెరిసిన తెలుగు తేజం.. విమెన్స్ డబుల్స్ లో పోరాడి ఓడిన గాయ‌త్రీ.. వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్
బ్రాంజ్ తో మెరిసిన తెలుగు తేజం.. విమెన్స్ డబుల్స్ లో పోరాడి ఓడిన గాయ‌త్రీ.. వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్
AP Job Calendar: 10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Cab Drivers Strike: తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
Gachibowli Building Collapse: అలాంటి బిల్డింగ్స్ అన్నీ కూల్చివేస్తాం.. గచ్చిబౌలి ఘటనా స్థలాన్ని పరిశీలించిన రంగనాథ్
అలాంటి బిల్డింగ్స్ అన్నీ కూల్చివేస్తాం.. గచ్చిబౌలి ఘటనా స్థలాన్ని పరిశీలించిన రంగనాథ్
Konda Surekha Letter To TPCC: నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Viral Video: న్యూసెన్స్ చేసిన బెటాలియన్ కానిస్టేబుల్‌ను లాఠీతో చితకబాదిన బీట్ కానిస్టేబుల్
న్యూసెన్స్ చేసిన బెటాలియన్ కానిస్టేబుల్‌ను లాఠీతో చితకబాదిన బీట్ కానిస్టేబుల్
Embed widget