అన్వేషించండి

Battery as a Service India: ఈవీ మార్కెట్‌లో కొత్త "బాస్‌"! సగం ధరకే విద్యుత్‌ కార్లు! నిజంగానే ఇది సామాన్యుడికి వరమేనా?

Battery as a Service India: ఎలక్ట్రిక్ కార్ల ధరలను భారీగా తగ్గించే బ్యాటరీ యూజ్‌ ఏ సర్వీస్ విధానం గురించి మీకు ఏం తెలుసు? ఇది ఎలా పని చేస్తుంది? ఏయే కార్లు అందుబాటులో ఉన్నాయో చూద్దాం. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • పెట్రోల్ ధరల నుంచి ఉపశమనం, ఈవీల దిశగా వాహన కొనుగోలుదారులు.
  • బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్ (BaaS) తో ఈవీల కొనుగోలు సులభతరం అవుతుంది.
  • కారు బాడీ కొని, బ్యాటరీని అద్దెకు తీసుకునే విధానం ఇది.
  • తగ్గిన ప్రారంభ ధర, నెలవారీ అద్దెతో ఈవీలు అందుబాటులోకి వస్తున్నాయి.

Battery as a Service India: భారత్‌లో పెరిగిపోతున్న పెట్రోల్ ధరల నుంచి రక్షణ పొందేందుకు చాలా మంది ఈవీల వైపు చూస్తున్నారు. కానీ ధర వారిని బెదరగొడుతోంది. దీనికి తోడు బ్యాటరీపై ఉన్న అనుమానాలు వారికి పూర్తి భరోసా ఇవ్వలేకపోతున్నాయి. అందుకే చాలా మంది ఇంకా ఈవీలు కొనేందుకు తటపటాయిస్తున్నారు. ఈ సమస్యలు పరిష్కరించేందుకు ఈవీలను సామాన్యుల చెంతకు చేర్చేందుకు కంపెనీలు బాస్‌ (BaaS- బ్యాటరీ ఏజ్ ఏ సర్వీస్) అస్త్రాన్ని ప్రయోగిస్తున్నాయి. ఇంతకీ ఈ బాస్ అంటే ఏంటీ? ఇందులో ఉన్న లాభనష్టాలు ఏంటి? ఇది వినియోగదారులకు ఎలా ఉపయోగపడుతుంది? అనే అంశాల గురించి వివరంగా తెలుసుకుందాం. 

BaaS అంటే ఏంటీ?

సాధారణంగా మీరు ఒక ఎలక్ట్రిక్ కారు కొన్నప్పుడు, కారు బాడీతోపాటు అందులోని బ్యాటరీని కూడా పూర్తి ధర చెల్లించి కొంటారు. కానీ బాస్‌ పద్ధతిలో మీకు కేవలం కారు బాడీని మాత్రమే కొంటారు. బ్యాటరీ అనేది కంపెనీ ఆస్తిగానే ఉంటుంది. దీనికి బదులుగా మీరు బ్యాటరీని అద్దెకు తీసుకున్నట్టు లెక్క. మీరు కారును ఎన్ని కిలోమీటర్లు నడిపితే, అన్ని దీని వల్ల కారు కొనేటప్పుడు చెల్లించాల్సిన ప్రారంభ ధర భారీగా తగ్గుతుంది. ఉదాహరణకు 11 లక్షల రూపాయలు ఉండాల్సిన కారు ధర ఈ బాస్‌ పద్ధతిలో 6.5 లక్షల రూపాయలకే అందుబాటులోకి వస్తుంది. 

Also Read: Super Splendor XTEC 2.0 Launched: హీరో సూపర్ స్ప్లెండర్ ఎక్స్‌టెక్ 2.0 లాంచ్: సరికొత్త డిజైన్, మైలేజ్ ఫీచర్లతో వచ్చిన అప్‌డేటెడ్ బైక్

ఇది ఎప్పుడు ప్రారంభమైంది?

భారత్‌లో ఈ బాస్ కాన్సెప్ట్‌ను జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్‌ ఇండియా మొదటగా తమ విండర్స్‌ ఈవీ ద్వారా పరిచయం చేసింది. ఆ తర్వాత ఎంజీ కామెట్‌ ఈవీ, ఎంజీ జెడ్‌ఎస్ ఈవీలకు కూడా ఈ సౌకర్యాన్ని విస్తరించింది. ఎంజీ మోటార్స్ సాధించిన విజయాన్ని చూసి, టాటా మోటార్స్, మారుతి సుజుకి వంటి దిగ్గజ కంపెనీలు కూడా తమ ఎలక్ట్రిక్ కార్లను ఈ పథకం కిందకు తీసుకువచ్చాయి. ప్రస్తుత మార్కెట్‌లో ఎంజీ, టాటా, మారుతి కంపెనీల మధ్య ఈ బాస్ మోడల్లో గట్టిపోటీ నెలకొంది. 

బాస్‌ ఎలా పని చేస్తుంది?

ఈ విధానం పూర్తిగా సబ్‌స్క్రిప్షన్ మోడల్ మీద ఆధారపడి ఉంటుంది. వినియోగదారులు కారును ఫైనాన్స్ ద్వారా కొనుగోలు చేసినట్టే, బ్యాటరీకి కూడా కొన్ని ఫైనాన్స్‌ కంపెనీలో ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. 

Read Also: Best CNG Cars: ధరలు పెరగకముందే ఈ CNG కార్లు కొనేయండి.. పెట్రోల్ ఖర్చుల నుంచి బిగ్ రిలీఫ్

మీరు నెలకు ఎన్ని కిలోమీటర్లు తిరిగితే దాన్ని బట్టి అద్దె ఉంటుంది. ఉదాహరణకు ఎంజీ కామెట్‌ ఈవీకి కిలోమీటర్‌కు 2.5 రూపాయలు అద్దె చెల్లించాలి. కొన్ని కంపెనీలు నెలవారీ కనీస కిలోమీటర్ల పరిమితిని విధిస్తాయి. అంటే మీరు నిర్దేశించిన కిలోమీటర్లు తిరిగినా తిరగకపోయినా కనీస రెంట్ కట్టాల్సి ఉంటుంది. 

ఈ రెంటల్ కాస్ట్‌లో బ్యాటరీ ఛార్జింగ్ ఖర్చు ఉండదు. కరెంటు బిల్లు మీరే భరించాల్సి ఉంటుంది. మీరు కారుతోపాటు రెంట్‌ు తీసుకున్న బ్యాటరీకి కూడా మీరే ఇన్సూరెన్స్‌ పే చేయాల్సి ఉంటుంది.

బాస్‌ స్కీమ్‌లో ఉన్న టాప్‌‌ 5 ఈవీలు

ప్రస్తుతం మార్కెట్‌లో ఈ అద్భుతమైన ఆఫర్‌తో దొరుకుతున్న కార్ల వివరాలు చూస్తే....

ఎంజీ కామెట్‌ ఈవీ

సిటీ ట్రాఫిక్‌లో సులభంగా డ్రైవ్ చేయడానికి ఇది బెస్ట్ ఆప్షన్. దీని సాధారణ ధర 7.63 లక్షలు. బాస్ ఆప్షన్ తీసుకుంటే ఇది 4.99లక్షల నుంచే ప్రారంభమవుతుంది. 

టాటా పంచ్ ఈవీ

మధ్యతరగతి ప్రజల ఫేవరెట్‌ ఎస్‌యూవీ ఇప్పుడు బాస్ పద్ధతిలో అందుబాటులో ఉంది. దీని ధర 9.6 లక్షలు అయినా, బాస్‌ ఆప్షన్ తీసుకుంటే మాత్రం 6.49 లక్షలకే వస్తుంది. ఈ సంస్థ కిలోమీటర్‌కు అద్దె రూపంలో 2.6 రూపాయలు తీసుకుంటుంది. ఇది మార్కెట్‌లో అతి తక్కువ. 

ఎంజీ విండ్సర్‌ ఈవీ

లగ్జరీ, స్పేస్ కోరుకునే వారికి ఇది సరైన ఛాయిస్. ఇది బాస్‌ ఆప్షన్‌తో 9.99లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఈ సంస్థ కిలోమీటర్‌కు 3.5రూపాయలు తీసుకుంటుంది. ఇందులో వేరియేషన్స్‌ ఉన్నాయి. 38kWh బ్యాటరీకి రూ. 3.9 తీసుకుంటే, 52.9kWhకి 4.5 రూపాయలు తీసుకుంటుంది. 

మారుతి సుజుకి ఇ-విటారా

మారుతి నుంచి వస్తున్న తొలి ఎలక్ట్రిక్ కారు. ఇది బాస్ ఆఫ్షన్‌తో 10.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. వేరియంట్‌ను బట్టి కిలోమీటర్‌కు 3.99 నుంచి 4.39 వరకు అద్దె తీసుకుటుంది. 

ఎంజీ జెడ్‌ఎస్ ఈవీ

ప్రీమియం ఎస్‌యూవీ అనుభూతిని ఇచ్చే కారు ఇది. బాస్‌ ఆప్షన్‌తో 13.99 లక్షలకు వస్తుంది. ఇది కిలోమీటర్కు 4.5 రూపాయల అద్దె తీసుకుంటుంది.

ఎంజీ విండ్సర్ ఈవీ 

ఎంజీ విండ్సర్‌ ఈవీ కేవలం బాస్ ధరకే కాదు, దాని అడ్వాన్స్‌డ్‌ ఫీచర్ల వల్ల కూడా మార్కెట్‌లో హాట్ కేక్‌లా మారింది. ఈ కారులోని కొన్ని ముఖ్యమైన అంశాలు చూస్తే... 135 డిగ్రీల వరకు వెనక్కి వంగే సౌకర్యవంతమైన సీట్లు. 15.6 అంగుళాల అతి పెద్ద టచ్ స్క్రీన్. ఆరు ఎయిర్ బ్యాగ్‌లు, 360 డిగ్రీల కెమెరా, ఏడీఏఎస్‌ వంటి అధునాతన భద్రతా ప్రమాణాలు. మొదటి యజమానికి బ్యాటరీపై లైఫ్‌ టైమ్ వారంటీని కంపెనీ అందిస్తోంది. 

వినియోగదారునికి లాభమా నష్టమా?

బాస్ విధానం అందరికీ సెట్ అవుతుందా అంటే లేదనే చెప్పాలి. లక్షల రూపాయల ఆదా వెంటనే కనిపిస్తుంది. బ్యాటరీ పాడైతే మార్చే బాధ్యత కంపెనీదే. మూడు సంవత్సరాల తర్వాత అరవై శాతం బైబ్యాక్‌ వాల్యూ లభిస్తుంది. 

అయితే కారు మీ దగ్గర ఉన్నంత కాలం మీరు అద్దె కడుతూనే ఉండాలి. పదేళ్ల తర్వాత మీరు కట్టే అద్దే మొత్తం బ్యాటరీ అసలు ధర కంటే ఎక్కువగా ఉండొచ్చు. ఈఎంఐ కట్టినట్టు బ్యాటరీ మీ సొంత అవ్వదు. కారును సెకండ్‌ హ్యాండ్‌లో అమ్మాలంటే సదరు యజమాని కూడా ఈ రెంట్ ప్లాన్‌ను కొనసాగించాల్సి ఉంటుంది. 

బాస్‌పై ఆసక్తి చూపని వినియోగదారులు 

తక్కువ ధర ఉన్నప్పటికీ భారతీయ వినియోగదారులు బాస్ పద్ధతిపై అంతగా ఆసక్తి చూపడం లేదు. ప్రస్తుతం బాస్ మార్కెట్‌ వాటా కేవలం ఐదు శాతం కంటే తక్కువగా ఉంది. భారతీయులు ఎక్కువగా పూర్తి యాజమాన్యం కోరుకుంటారని, నెలవారీ అద్దెల కంటే ఒకేసారి డబ్బు చెల్లించి కారును తమ సొంతం చేసుకోవడానికి ఇష్టపడతారని నిపుణులు చెబుతున్నారు. 

భవిష్యత్ ఎలా ఉండబోతోంది?

ఈవీ కొనేవాళ్లు మరో ముఖ్యమైన విషయం చూడాలి. బ్యాటరీ స్వాపింగ్‌ ద్వారా సమయం ఆదా అవుతుంది. కానీ దీనికి మౌలిక సదుపాయాల ఖర్చు ఎక్కువ. మరోవైపు ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతోంది. భవిష్యత్‌లో ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీనే ఎక్కువగా వాడుకలోకి వచ్చే అవకాశం ఉందని మార్కెట్ అంచనా. 

మీరు కారును కేవలం మూడు లేదా ఐదేళ్ల పాటు వాడి మార్చేసే ఆలోచనలో ఉంటే బాస్ ఒక అద్భుతమైన ఎంపిక. కానీ లాంగ్ టర్మ్‌ వాడాలి అనుకుంటే మాత్రం పూర్తి ధర చెల్లించి బ్యాటరీతో సా కారును కొనుగోలు చేయడమే తెలివైన పని. 

Frequently Asked Questions

BaaS (బ్యాటరీ ఏజ్ ఏ సర్వీస్) అంటే ఏమిటి?

BaaS పద్ధతిలో, మీరు కారు బాడీని మాత్రమే కొనుగోలు చేస్తారు, బ్యాటరీ కంపెనీ ఆస్తిగా ఉంటుంది. మీరు బ్యాటరీని అద్దెకు తీసుకుంటారు, దీనివల్ల కారు ప్రారంభ ధర తగ్గుతుంది.

భారతదేశంలో BaaS సేవలను మొదటగా ఎవరు ప్రారంభించారు?

భారతదేశంలో BaaS కాన్సెప్ట్‌ను మొదటగా JS‌W ఎంజీ మోటార్‌ ఇండియా తమ విండర్స్‌ ఈవీ ద్వారా పరిచయం చేసింది.

BaaS మోడల్‌లో కారు ధర ఎలా తగ్గుతుంది?

BaaS పద్ధతిలో, మీరు బ్యాటరీని కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు, దాన్ని అద్దెకు తీసుకుంటారు. దీనివల్ల కారు ప్రారంభ ధర గణనీయంగా తగ్గుతుంది.

BaaS విధానంలో బ్యాటరీ అద్దె ఎలా లెక్కిస్తారు?

బ్యాటరీ అద్దె మీరు నెలకు నడిపే కిలోమీటర్ల సంఖ్యపై ఆధారపడి ఉంటుంది. కొన్ని కంపెనీలు నెలవారీ కనీస కిలోమీటర్ల పరిమితిని కూడా విధిస్తాయి.

BaaS విధానంలో వినియోగదారునికి లాభాలు మరియు నష్టాలు ఏమిటి?

లాభం: ప్రారంభ ధర తగ్గింపు, బ్యాటరీ మార్చే బాధ్యత కంపెనీదే. నష్టం: కారు ఉన్నంతకాలం అద్దె చెల్లించాలి, పదేళ్ల తర్వాత అద్దె అసలు ధర కంటే ఎక్కువ కావచ్చు.

టాప్ హెడ్ లైన్స్

రూ.లక్షల్లో కొత్త కారు, రూ.వేలల్లో మెయింటెనెన్స్‌ ఖర్చు! క్యాబ్‌లో తిరగడమే బెటర్‌ ఐడియానా?
సిటీలో డైలీ డ్రైవింగ్‌ కోసం కారు కొనడం మంచిదా? రోజూ క్యాబ్‌ బుక్‌ చేసుకోవడమే బెటరా?
Royal Enfield Himalayan 440: లాంచ్‌ అయిన నెలకే భారీ డిమాండ్‌.. 6 నెలల వెయిటింగ్‌ పిరియడ్‌, బుకింగ్స్‌ నిలిపివేత
ఈ బైక్‌ కొంటే ఇంటికి తీసుకెళ్లడానికి ఆరు నెలలు ఆగాలట! రష్‌ తట్టుకోలేక బుకింగ్స్‌ కూడా బంద్‌
ఖరీదైన కార్లకే కాదు.. తక్కువ ధర కార్లలోనూ ADAS సేఫ్టీ ఫీచర్లు! సుజుకి కొత్త ప్లాన్ ఇదే
సామాన్యుల కార్లలోనూ ADAS సేఫ్టీ.. సుజుకి కీలక నిర్ణయం, ఖర్చు తగ్గించే టెక్నాలజీపై ఫోకస్‌
కొత్త కారు కొనడానికి మీ బడ్జెట్‌ రూ.6 లక్షల లోపే ఉందా? అయినా పర్లేదు, ఎన్నో ఆప్షన్లు
రూ.6 లక్షల లోపులోనే కొనగలిగే 11 కార్లు.. ఈ దసరాకి కొత్త కారు మీ ఇంటికొస్తుంది!

వీడియోలు

Rohit Virat Final Match in Guwahati? | గౌహతి వేదికగా రోహిత్, కోహ్లీ చివరి మ్యాచ్?
Reason for Virat Kohli Test Retirement | విరాట్ టెస్ట్ రిటైర్మెంట్ వెనుక అసలు నిజం ఇదే
Ravindra Jadeja for 2027 World Cup | జడేజా స్థానంపై స్పష్టతనిచ్చిన కోచ్ బహుతులే
Virat Kohli's Century Sparks Viral Moment | కోహ్లీ సెంచరీ కొట్టినా స్పందించని గంభీర్
Virat Kohli Completes 15,000 ODI Runs | కెప్టెన్ గిల్‌తో బంధంపై విరాట్ కోహ్లీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Danam Nagender: ఈసీ ఆఫీస్, హైదరాబాద్ తగలబడి పోతుంది.. దానం నాగేందర్ హాట్ కామెంట్స్!
ఈసీ ఆఫీస్, హైదరాబాద్ తగలబడి పోతుంది.. దానం నాగేందర్ హాట్ కామెంట్స్!
Dorothy Telugu Trailer : ఇద్దరి మగాళ్ల మధ్య ప్రేమ - కీర్తి సురేష్ బోల్డ్ మూవీ... కాంట్రవర్సియల్ డోరతీ తెలుగు ట్రైలర్ చూశారా?
ఇద్దరి మగాళ్ల మధ్య ప్రేమ - కీర్తి సురేష్ బోల్డ్ మూవీ... కాంట్రవర్సియల్ డోరతీ తెలుగు ట్రైలర్ చూశారా?
Khairatabad Bypoll: ఖైరతాబాద్ ఉపఎన్నికపై సస్పెన్స్ - నోటిఫికేషన్ నిలిపివేయాలని హైకోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్ నేత విజయారెడ్డి!
ఖైరతాబాద్ ఉపఎన్నికపై సస్పెన్స్ - నోటిఫికేషన్ నిలిపివేయాలని హైకోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్ నేత విజయారెడ్డి!
Irumudi Like Incident In Ongole: ఒంగోలులో 'ఇరుముడి' తరహా ఘటన.. రిటైర్డ్ ఉద్యోగి ఇంటికి బాలికలను పంపిన వంట మనిషి!
ఒంగోలులో 'ఇరుముడి' తరహా ఘటన.. రిటైర్డ్ ఉద్యోగి ఇంటికి బాలికలను పంపిన వంట మనిషి!
Flydubai Flight 1073 Attack: ఫ్లైదుబాయ్ విమానంలో కోపైలట్ హైజాక్ యత్నం విఫలం - హీరో కెప్టెన్ స్మిత్ మచ్చార్ - ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు !
ఫ్లైదుబాయ్ విమానంలో కోపైలట్ హైజాక్ యత్నం విఫలం - హీరో కెప్టెన్ స్మిత్ మచ్చార్ - ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు !
Infection Linked Cancer Cases : ఇన్​ఫెక్షన్​ల​తో పెరుగుతోన్న క్యాన్సర్ కేసులు.. లాన్సెట్ అధ్యయనంలో షాకింగ్ విషయాలు
ఇన్​ఫెక్షన్​ల​తో పెరుగుతోన్న క్యాన్సర్ కేసులు.. లాన్సెట్ అధ్యయనంలో షాకింగ్ విషయాలు
Khairatabad Assembly Bypoll 2026: ఖైరతాబాద్ కాంగ్రెస్ ప్లాన్-బి - దానంకు షాక్.. పిజెఆర్ కుమార్తె విజయారెడ్డి రేసులోకి?
ఖైరతాబాద్ కాంగ్రెస్ ప్లాన్-బి - దానంకు షాక్.. పిజెఆర్ కుమార్తె విజయారెడ్డి రేసులోకి?
Fruit Custard Recipe : కస్టర్డ్ పౌడర్, షుగర్ లేకుండా ఫ్రూట్ కస్టర్డ్.. ఇలా చేస్తే టేస్టీగా, హెల్తీగా ఉంటుంది.. రెసిపీ ఇదే
కస్టర్డ్ పౌడర్, షుగర్ లేకుండా ఫ్రూట్ కస్టర్డ్.. ఇలా చేస్తే టేస్టీగా, హెల్తీగా ఉంటుంది, రెసిపీ ఇదే
Embed widget