అన్వేషించండి

Mahindra XUV400 Pro లేదా Tata Nexon EV .. ఫీచర్లు, ధరలో ఏది బెస్ట్! మీకు ఏది బెటర్ ?

Electric Vehicle | మహీంద్రా XUV400, టాటా నెక్సాన్ EV లలో మీకు మంచిదో తెలియాలంటే వాటి ఫీచర్లు, ధర తెలుసుకుంటే ప్రయోజనం ఉంటుంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో EVల కొనుగోలుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు.
  • Tata Nexon EV, Mahindra XUV400 Pro ప్రీమియం లుక్, ఫ్యూచరిస్టిక్ డిజైన్ అందిస్తాయి.
  • Nexon EV మెరుగైన టచ్‌స్క్రీన్, వెంటిలేటెడ్ సీట్లతో ఇంటీరియర్‌లో ముందుంటుంది.
  • XUV400 Pro ఎక్కువ శక్తి, స్పోర్టీ డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది.
  • Nexon EV ఎక్కువ వేరియంట్లు, రేంజ్ ఎంపికలను అందిస్తుంది.

భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం గత రెండేళ్లలో భారీగా పెరిగింది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండటం, కొరత సైతం అప్పుడప్పుడు కనిపించడం వాహనదారులకు ఇబ్బందులకు గురిచేస్తోంది. దాంతో ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలను  కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. మీరు టాటా నెక్సాన్ ఈవీ (Tata Nexon EV), మహీంద్రా Mahindra XUV400 Pro లలో ఏదో ఒకటి కొనాలని ఆలోచిస్తున్నట్లయితే, 2 కార్లు కాంపాక్ట్ SUV విభాగంలోకి వస్తాయి. ఏ కారు ఎందులో బెటర్, ఎవరు కొంటే ప్రయోజనం ఉంటుందో ఇక్కడ తెలుసుకుందాం.

రెండు కార్ల డిజైన్, లుక్ పరిశీలిస్తే, వాటి శైలి మోడ్రన్, SUV లాగా దృఢంగా ఉంటుంది. టాటా Nexon EV డిజైన్ కొంచెం ఫ్యూచరిస్టిక్, ఆకర్షణీయంగా ఉందని చెబుతారు. అయితే XUV400 Pro లుక్ కొంచెం సింపుల్ గా ఉంటుంది. అయితే మీకు ప్రీమియం ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. రెండు కార్లలో LED లైట్లు, మోడ్రన్ డిజైన్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇవి రోడ్డుపై మిమ్మల్ని అనేలా చేస్తాయి. 

రెండు కార్లలో ఇంటీరియర్

కార్ల ఇంటీరియర్‌లో క్యాబిన్ విషయానికి వస్తే, Nexon EV ఇక్కడ కొంచెం ముందుంటుంది. ఇందులో పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వెంటిలేటెడ్ సీట్లు, డిజిటల్ డిస్‌ప్లే వంటి సౌకర్యాలు ఉన్నాయి. ఇవి లాంగ్ జర్నీలకు మరింత సౌకర్యవంతంగా ఉంటాయి. మహీంద్రా XUV400 Pro కూడా మంచి స్పేస్, ఫీచర్లను కలిగి ఉంది. కానీ వెంటిలేటెడ్ సీట్లు,  పెద్ద డిస్‌ప్లే వంటి కొన్ని మోడ్రన్ ఫీచర్లు ఇందులో స్ట్రాంగ్‌గా లేవు.

Read Also: Five Best Electric SUVs: పెట్రోల్ డీజిల్ ధరల సెగ-  మార్కెట్లో లభిస్తున్న టాప్ 5 బెస్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు ఇవే

కార్ల పనితీరు

రెండు కార్లు మంచి పవర్, టార్క్‌ను అందిస్తాయి. మహీంద్రా XUV400 Pro కొంచెం ఎక్కువ శక్తి, వేగవంతమైన టార్క్ వల్ల ఫేమస్ అయింది. అయితే టాటా Nexon EV బ్యాలెన్స్‌డ్ డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. ఈ కార్లు సిటీతో పాటు హైవే రెండింటిలోనూ సులభంగా నడుస్తాయి. అయితే మహీంద్రా XUV400 కొంచెం స్పోర్టీ అనుభూతిని ఇస్తుంది.

బ్యాటరీ, రేంజ్ ఎలా ఉన్నాయి..

రెండు కార్లు వేర్వేరు బ్యాటరీ ఆప్షన్లు కలిగి ఉంటాయి. టాటా Nexon EV ఎక్కువ వేరియంట్‌లు, ఎక్కువ రేంజ్ కలిగి ఉంది.  ఇది వినియోగదారులకు వారి అవసరాలకు తగ్గట్లుగా మోడల్‌ను ఎంచుకోవడానికి వీలు కల్పిస్తుంది. XUV400 Pro కూడా మంచి రేంజ్ అందిస్తుంది. కానీ ఆప్షన్లు కొంచెం తక్కువగా ఉన్నాయి. ఛార్జింగ్ పరంగా రెండు కార్లు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌  కలిగి ఉన్నాయి. 

Also Read: Car Airbag Safety Tips: కారులో ఎయిర్‌బ్యాగ్స్ ఉన్నప్పటికీ ఈ తప్పులు చేస్తే ప్రాణాలకే ప్రమాదం.. బీ అలర్ట్

సేఫ్టీ ఫీచర్లు, ధర

కారు సేఫ్టీ ఫీచర్ల విషయానికి వస్తే, రెండు SUVలు స్ట్రాంగ్ బాడీ, ఎయిర్‌బ్యాగ్‌లు, ABS, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి ఫీచర్లు కలిగి ఉన్నాయి. టాటా Nexon EV ఇప్పటికే భద్రత పరంగా నమ్మదగిన వాహనంగా భావిస్తారు. XUV400 Pro కూడా సురక్షితమైన డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. Tata Nexon EV ధర రూ. 14.49 లక్షల నుండి ప్రారంభమవుతుంది. మహీంద్రా XUV400 Pro ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 15.49 లక్షలుగా ఉంది. 

 

Frequently Asked Questions

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం ఎందుకు పెరుగుతోంది?

పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండటం, అప్పుడప్పుడు కొరత ఏర్పడటం వలన ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.

టాటా నెక్సాన్ ఈవీ మరియు మహీంద్రా XUV400 Pro ల డిజైన్ ఎలా ఉంటుంది?

రెండు కార్ల డిజైన్ మోడ్రన్, SUV లాగా దృఢంగా ఉంటుంది. నెక్సాన్ ఈవీ డిజైన్ కొంచెం ఫ్యూచరిస్టిక్, ఆకర్షణీయంగా ఉంటే, XUV400 Pro కొంచెం సింపుల్ గా, ప్రీమియం అనుభూతినిస్తుంది.

రెండు కార్లలో ఇంటీరియర్ సౌకర్యాలు ఎలా ఉన్నాయి?

నెక్సాన్ ఈవీలో పెద్ద టచ్‌స్క్రీన్, వెంటిలేటెడ్ సీట్లు, డిజిటల్ డిస్ప్లే వంటి అధునాతన సౌకర్యాలు ఉన్నాయి. XUV400 Pro లో మంచి స్పేస్, ఫీచర్లు ఉన్నప్పటికీ, వెంటిలేటెడ్ సీట్లు, పెద్ద డిస్ప్లే వంటివి లేవు.

టాటా నెక్సాన్ ఈవీ మరియు మహీంద్రా XUV400 Pro ల పనితీరు ఎలా ఉంది?

రెండు కార్లు మంచి పవర్, టార్క్ అందిస్తాయి. XUV400 Pro ఎక్కువ శక్తి, వేగవంతమైన టార్క్ కలిగి ఉంది, అయితే నెక్సాన్ ఈవీ బ్యాలెన్స్‌డ్ డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది.

బ్యాటరీ, రేంజ్ మరియు ఛార్జింగ్ విషయంలో ఈ కార్లు ఎలా ఉన్నాయి?

నెక్సాన్ ఈవీ ఎక్కువ వేరియంట్లు, ఎక్కువ రేంజ్ కలిగి ఉంది, వినియోగదారులకు ఎంపిక చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. XUV400 Pro కూడా మంచి రేంజ్ అందిస్తుంది. రెండు కార్లు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తాయి.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

KTM 390 Duke ఒకటే.. కానీ ఇంజిన్‌ వేరు, ధర వేరు - మీకు సరిపోయే వేరియంట్ ఏది?
KTM 390 Dukeలో రెండు వేరియంట్లు, రెండు ఇంజిన్లు - ధరలో భారీ తేడా ఎందుకో తెలుసా?
హ్యుందాయ్ కారు కొనేవాళ్లకు బిగ్‌ అలర్ట్.. సెప్టెంబర్ నుంచి ధరలు పెంపు - ఏ మోడల్‌పై ఎంత పెరుగుతుంది?
కొత్త కారు కొనేవాళ్లకు అలెర్ట్‌ - మరికొన్ని రోజుల్లో రేట్లు పెంచబోతున్న హ్యుందాయ్‌
బైక్ కాదు, కారు కాదు.. హైడ్రోజన్‌తో నడిచే రోబోటిక్ గుర్రం - కవాసకి ప్రయోగం
హైడ్రోజన్‌తో పరుగులు తీసే కీలుగుర్రం.. తయారు చేస్తున్న కవాసకి
ఇథనాల్ కలిపిన ఇంధనాన్ని 50 ఏళ్లుగా వాడుతున్న బ్రెజిల్.. ఇప్పుడు అక్కడి కార్లు, బైకుల పరిస్థితి ఏంటి?
బ్రెజిల్‌లో 50 ఏళ్లుగా ఇథనాల్‌ కలిపిన పెట్రోల్‌ వినియోగం - అక్కడి కార్లు, బైక్‌లకు ఏం కాలేదా?

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
PV Sindhu Says World Badminton Drama.!: సింధు నిష్క్రమణ.. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! 
పోరాడి ఓడిన సింధు .. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! వరల్డ్ చాంపియన్షిప్ టోర్నీ
Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
బైక్ కాదు, కారు కాదు.. హైడ్రోజన్‌తో నడిచే రోబోటిక్ గుర్రం - కవాసకి ప్రయోగం
హైడ్రోజన్‌తో పరుగులు తీసే కీలుగుర్రం.. తయారు చేస్తున్న కవాసకి
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Embed widget