Indian tourists Vietnam: రన్వే, రైలు పట్టాలు - రీల్స్ కేదీ కాదు అనర్హం - భారతీయ పర్యాటకులపై తీవ్ర వ్యతిరేకత - వీడియోలు
Garba at Vietnam Airport: ట్రైన్ స్ట్రీట్, ఎయిర్‌పోర్ట్ టార్మాక్‌పై భారత్‌కు చెందిన గుజరాత్ పర్యాటకుల ఛైయ్యా ఛైయ్యా, గర్బా డ్యాన్స్‌లు నెట్టింట విమర్శలకు దారితీశాయి. వీడియోలు వైరల్ అయ్యాయి.

Vietnam Train Street dance: విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు మన సంస్కృతిని చాటుకోవడం వేరు, కానీ అత్యుత్సాహంతో ఇతరులకు ఇబ్బంది కలిగించడం వేరు. తాజాగా వియత్నాం పర్యటనకు వెళ్లిన కొంతమంది భారతీయ పర్యాటకుల తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. హనోయ్‌లోని ప్రసిద్ధ ట్రైన్ స్ట్రీట్ లో మరియు విమానాశ్రయ టార్మాక్‌పై భారతీయులు చేసిన నృత్యాలు నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాయి.
ట్రైన్ స్ట్రీట్‌లో బాలీవుడ్ మ్యాజిక్.. కానీ!
ముంబైకి చెందిన ఓ జ్యువెలరీ బ్రాండ్ యజమాని శ్వేతా జైన్, తన స్నేహితులతో కలిసి వియత్నాం పర్యాటక ఆకర్షణ అయిన ట్రైన్ స్ట్రీట్ లో షారుఖ్ ఖాన్ సూపర్ హిట్ సాంగ్ ఛైయ్యా ఛైయ్యా కు స్టెప్పులు వేశారు. వియత్నాం ట్రైన్ స్ట్రీట్‌కు వెళ్లి ఛైయ్యా ఛైయ్యా చేయకపోతే ఏం వెళ్లినట్లు అనే క్యాప్షన్‌తో ఆమె పోస్ట్ చేసిన వీడియో వైరల్ అయింది. అయితే, ఇరుకైన ఆ రైల్వే ట్రాక్ ప్రాంతంలో పర్యాటకులు ఇబ్బంది పడేలా డ్యాన్స్ చేయడంపై నెటిజన్లు పెదవి విరుస్తున్నారు.
Only question: why can’t we just act normal when we’re abroad? Foreign jaate hi sabka dance kyun bahr ane lagta hai ? Why do we feel the need to stand out everywhere across the globe? Everyone else is sitting quietly and enjoying the moment, but our people somehow have to pull… pic.twitter.com/WO4uwUL2u5
— Nikhil saini (@iNikhilsaini) May 29, 2026
విమానాశ్రయంలో గర్బా.. సెక్యూరిటీ మాటేమిటి?
ఇదే వియత్నాంలో మరో ఉదంతం వెలుగులోకి వచ్చింది. కొంతమంది భారతీయ పర్యాటకులు ఏకంగా విమానాశ్రయ రన్వే సమీపంలో, విమానం పక్కనే నిలబడి గర్బా నృత్యం చేశారు. విమానం ఎక్కే ముందు లేదా దిగిన తర్వాత అత్యంత భద్రతతో కూడిన ఆ ప్రాంతంలో ఇలా గుంపులుగా చేరి డ్యాన్స్ చేయడంపై భద్రతా పరమైన ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మిగిలిన ప్రయాణికులు వెళ్తున్నా పట్టించుకోకుండా వారు చేస్తున్న హంగామా నెట్టింట వైరల్ అవుతోంది.
A group of Indians act like this abroad and the whole country has to suffer from racism pic.twitter.com/B5JxMXruL9
— Lord Immy Kant (@KantInEastt) May 28, 2026
నెటిజన్ల ఘాటు స్పందన
ఈ వీడియోలపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. వీరు డ్యాన్స్ చేస్తుంటే.. భారతీయుడిగా నాకు సిగ్గుగా అనిపిస్తోంది అని ఒకరు కామెంట్ చేయగా, నేను భారతీయుడిని అని చెప్పకుండానే.. నేను భారతీయుడిని అని నిరూపించుకుంటున్నారు అంటూ మరికొందరు ఎద్దేవా చేస్తున్నారు. ఇలాంటి పనుల వల్లే భారతీయులకు వీసా ఆంక్షలు పెరుగుతాయి.. దయచేసి విదేశాల్లో దేశ పరువు తీయకండి అంటూ అభ్యర్థిస్తున్నారు.
నెగటివ్ ముద్ర
భారతీయ పర్యాటకులు ఎక్కడికి వెళ్లినా అరుపులు, కేకలు వేస్తూ పబ్లిక్ ప్లేస్‌లలో డ్యాన్స్ చేస్తారనే ప్రతికూల ముద్ర ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ఉంది. తాజా సంఘటనలు ఆ ముద్రను మరింత బలపరుస్తున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పర్యాటక ప్రాంతాల్లో స్థానిక నిబంధనలను గౌరవించడం, భద్రతా ప్రమాణాలను పాటించడం అనేది ఒక బాధ్యతాయుతమైన పర్యాటకుడి లక్షణమని నెటిజన్లు సలహాలిస్తున్నారు.
Before You Go
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
ట్రెండింగ్ వార్తలు





















