అన్వేషించండి

Hunter 350 Graphite Grey: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌‌ చౌకైన బైక్‌కు కొత్త ‘గ్రాఫైట్‌ గ్రే’ రంగు – ఫీచర్లు, ధర వివరాలు

Royal Enfield Graphite Grey: అప్‌గ్రేడ్‌ చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్‌ హంటర్ LED హెడ్‌ల్యాంప్, ట్రిప్పర్ నావిగేషన్ పాడ్ & టైప్-సి USB ఛార్జింగ్ పోర్ట్‌తో సహా చాలా మోడ్రన్‌ ఫీచర్లను యాడ్‌ చేసుకుంది.

Updated Royal Enfield Hunter 350 Features Price: రాయల్ ఎన్‌ఫీల్డ్‌, తన చౌకైన బైక్ హంటర్ 350 ని కొత్త అవతారంలో ప్రవేశపెట్టింది. ఇప్పుడు దీనిని కొత్త కలర్ ఆప్షన్ "గ్రాఫైట్ గ్రే"లో ‍‌(Hunter 350 Graphite Grey) కూడా కొనుగోలు చేయవచ్చు. ఈ కొత్త రంగు మిడ్ వేరియంట్‌లో అందుబాటులో ఉంది & హంటర్ మొత్తం 7 కలర్ ఆప్షన్స్‌కు యాడ్‌ అయింది. రాయల్ ఎన్‌ఫీల్డ్‌ హంటర్ 350 ధర రూ.1.50 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో ఈ బండిని దాదాపు రూ. 1.82 లక్షల ఆన్‌-రోడ్‌ ధర (Hunter 350 on-road, Hyderabad Vijayawada) నుంచి కొనుగోలు చేయవచ్చు.

హంటర్‌ 350 లుక్స్‌
రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ హంటర్‌ 350 కాంపాక్ట్‌ & స్పోర్టీ డిజైన్‌తో నగర రైడింగ్‌కు పర్ఫెక్ట్‌గా కనిపిస్తుంది. రెట్రో స్టైల్‌తో పాటు మోడర్న్‌ టచ్‌ కలిగిన రౌండ్‌ హెడ్‌ల్యాంప్స్‌ & షార్ప్‌ ట్యాంక్‌ డిజైన్‌ దానికి ప్రత్యేక ఆకర్షణ తెస్తాయి. తక్కువ సీటు ఎత్తు, వెడల్పైన హ్యాండిల్‌బార్‌ రైడర్‌కి కంఫర్ట్‌ & కంట్రోల్‌ ఇస్తాయి. రంగుల కాంబినేషన్లు, నాణ్యమైన ఫినిషింగ్‌తో హంటర్‌ 350 రోడ్డు మీద అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.      

హంటర్‌ 350 అప్‌గ్రేడెడ్‌ ఫీచర్లు 
అప్‌గ్రేడ్ చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్‌ హంటర్‌లో అనేక ఆధునిక ఫీచర్లు యాడ్‌ అయ్యాయి. ఈ లిస్ట్‌లో.. LED హెడ్‌ల్యాంప్, ట్రిప్పర్ నావిగేషన్ పాడ్ & టైప్-సి USB ఛార్జింగ్ పోర్ట్ వంటి అప్‌గ్రేడ్స్‌ ఉన్నాయి. సీటును అధిక సాంద్రత కలిగిన ఫోమ్‌తో అందించారు, ఇది లాంగ్ రైడ్‌లకు ప్రత్యేకంగా సరిపోతుంది. బైక్ కొత్త రియర్‌ సస్పెన్షన్ & మెరుగైన సీటింగ్ సౌకర్యం వంటి ఫీచర్లు రైడర్ అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి & సౌకర్యవంతమైన రైడ్ అందిస్తాయి.

రాయల్ ఎన్‌ఫీల్డ్‌ హంటర్ 350 పవర్ & బుకింగ్
ఇంజిన్ దగ్గరకు వస్తే, హంటర్ 350 లో 349cc J-సిరీస్ ఎయిర్-కూల్డ్, సింగిల్-సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ఈ పవర్‌ట్రెయిన్ 20.2 bhp పవర్‌ను & 27 Nm టార్క్‌ను జనరేట్‌ చేస్తుంది. ఈ ఇంజిన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్ & స్లిప్ అసిస్ట్ క్లచ్‌తో వస్తుంది. అంటే, రైడింగ్‌ ఎంత స్ట్రాంగ్‌గా ఉంటుందో, అంత స్మూత్‌గా కూడా ఉంటుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్‌ హంటర్ 350  కొత్త కలర్ ఎడిషన్ (గ్రాఫైట్ గ్రే) కోసం బుకింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. దీనిని రాయల్ ఎన్‌ఫీల్డ్‌ డీలర్‌షిప్‌, అధికారిక వెబ్‌సైట్ & యాప్ ద్వారా బుక్‌ చేసుకోవచ్చు.

గ్రాఫైట్ గ్రే కలర్‌ స్పెషాలిటీ ఏంటి?
కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్‌ హంటర్ 350 గ్రాఫైట్ గ్రే వేరియంట్ మ్యాట్ ఫినిషింగ్‌తో వస్తుంది, ఇది చాలా ఆకర్షణీయమైన లుక్స్‌ ఇస్తుంది. ఈ వేరియంట్‌కు నియాన్ ఎల్లో హైలైట్స్ ఇచ్చారు & అర్బన్ గ్రాఫిటీ ఆర్ట్ నుంచి ప్రేరణతో దీనిని తీసుకున్నారు. ఈ రంగు మిడ్ వేరియంట్‌లలో, రియో వైట్ & డాపర్ గ్రే తో పాటు అందుబాటులో ఉంది. హంటర్ 350ని యువ కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని డిజైన్‌ చేశారు & ఇది నగర రైడింగ్‌కు ఒక స్టైలిష్ ఎంపిక.     

టాప్ హెడ్ లైన్స్

తొలి ఎలక్ట్రిక్ 7 సీటర్ కారు తీసుకొస్తున్న Maruti.. 500 కి.మీ రేంజ్ EV ప్రత్యేకతలు ఇవే
తొలి ఎలక్ట్రిక్ 7 సీటర్ కారు తీసుకొస్తున్న Maruti.. 500 కి.మీ రేంజ్ EV ప్రత్యేకతలు ఇవే
Bajaj Pulsar N250SS మార్కెట్‌లోకి వచ్చింది.. Pulsar N250తో పోలిస్తే ఏం మారింది? ధరలో డిఫరెన్స్‌ ఎంత?
పల్సర్ N250 వర్సెస్‌ పల్సర్ N250SS... ఈ రెండు బైక్‌ల మధ్య ప్రధాన తేడాలేంటి?
Ban on non-BS6 vehicles: కాలుష్యంపై కఠిన చర్యలు.. నాన్‌-BS6 వెహికల్స్‌కు నో ఎంట్రీ, PUC లేకుంటే పెట్రోల్‌ కూడా దొరకదు!
మీ వెహికల్‌ BS6 కాదా? అయితే, నవంబర్‌ 1 నుంచి సిటీలోకి 'నో ఎంట్రీ'!
Maruti Victorisని మరింత ఆకర్షణీయంగా మార్చేద్దామా? ఔరమ్ ఎడిషన్ లాంచ్‌.. ఈ కిట్‌లో ఏమేం ఉన్నాయంటే?
మారుతి విక్టోరిస్‌ కోసం కొత్త యాక్సెసరీస్ కిట్.. కేవలం రూ.22,990తో మరింత ప్రీమియం లుక్‌!

వీడియోలు

Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు
Two Day Marwar Festival 2026 In Jodhpur Heritage Camel Contingent | రాజస్థాన్‌లో రాజపుత్రుల వారసత్వ వేడుకలు - మీసాల పోటీలు కూడా స్పెషల్
Gambhir's Secret Words to Tilak Varma | న్యూజిలాండ్‌పై భారత్ సంచలన గెలుపు
IND vs NZ 2nd T20 Match Preview | స్టార్ బ్యాటర్‌కు గాయం, తుది జట్టులో కీలక మార్పులు!
Amit Mishra about Virat | కోహ్లీ నన్ను మోసం చేశారు.. అమిత్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dasara Holidays: బాసర ట్రిపుల్ ఐటీకి దసరా సెలవులు పొడిగింపు, విద్యార్థులు ఇంటిదారి.. కారణం ఏంటంటే
బాసర ట్రిపుల్ ఐటీకి దసరా సెలవులు పొడిగింపు, విద్యార్థులు ఇంటిదారి.. కారణం ఏంటంటే
Punganur Municipal Chairman: పెద్దిరెడ్డి కోటలో వైసీపీకి బిగ్ షాక్.. పుంగునూరు మున్సిపల్ పీఠం దక్కించుకున్న కూటమి
పెద్దిరెడ్డి కోటలో వైసీపీకి బిగ్ షాక్.. పుంగునూరు మున్సిపల్ పీఠం దక్కించుకున్న కూటమి
Hyderabad RTC Pass: హైదరాబాద్ ప్రజలకు ఆర్టీసీ శుభవార్త.. సరికొత్తగా వీక్లీ పాస్- ధర, పూర్తి వివరాలు
హైదరాబాద్ ప్రజలకు ఆర్టీసీ శుభవార్త.. సరికొత్తగా వీక్లీ పాస్- ధర, పూర్తి వివరాలు
Bigg Boss Season 10 Today October 25th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: షాలిని, దక్షి ఎలిమినేట్! ఒంటరైన రోహిత్! త్రిగుణ్‌కి జైలు శిక్ష!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: షాలిని, దక్షి ఎలిమినేట్! ఒంటరైన రోహిత్! త్రిగుణ్‌కి జైలు శిక్ష!
‌‌UPI Wrong Transfer: యూపీఐ యాప్‌లో పొరపాటున వేరే వాళ్లకు డబ్బులు పంపిస్తే?.. ఈ సింపుల్ చిట్కాలతో మీ డబ్బు వెనక్కి!
యూపీఐ యాప్‌లో పొరపాటున వేరే వాళ్లకు డబ్బులు పంపిస్తే?.. ఈ సింపుల్ చిట్కాలతో మీ డబ్బు వెనక్కి!
Jailer 2: ఇదీ రజనీకాంత్ రేంజ్... 'జైలర్ 2'లో హుకుమ్ పాటకు సింగపూర్ కస్టమ్స్ ఆఫీసర్ రీల్
ఇదీ రజనీకాంత్ రేంజ్... 'జైలర్ 2'లో హుకుమ్ పాటకు సింగపూర్ కస్టమ్స్ ఆఫీసర్ రీల్
JEE Main 2027 Registration: జేఈఈ మెయిన్ జనవరి సెషన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. ముఖ్య తేదీలు, దరఖాస్తు విధానం ఇలా!
జేఈఈ మెయిన్ జనవరి సెషన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. ముఖ్య తేదీలు, దరఖాస్తు విధానం ఇలా!
CBFC Leaks: ఓడియమ్మా... ఐదొందల సినిమా స్క్రిప్ట్స్ లీక్ - రిలీజ్ కాని సినిమాలు కూడా!
ఓడియమ్మా... ఐదొందల సినిమా స్క్రిప్ట్స్ లీక్ - రిలీజ్ కాని సినిమాలు కూడా!
Embed widget