Xiaomi YU7: 3 నిమిషాల్లో 2 లక్షల మంది బుక్ చేశారు - తర్వాత CEO చెప్పింది విని షాక్ అయ్యారు!
Xiaomi YU7 Bookings: షియోమి కంపెనీ, ఎలక్ట్రానిక్ పరికరాల విషయంలోనే కాదు, కార్ల అమ్మకాల్లోనూ కొత్త రికార్డ్‌లు సృష్టిస్తోంది. ఆ కంపెనీ CEO ఒక షాకింగ్ స్టేట్‌మెంట్ చేశారు.

Xiaomi YU7 Price, Range And Features In Telugu: స్మార్ట్‌ఫోన్‌లు, టీవీలు సహా అనేక రకాల ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లను తయారు చేసే కంపెనీ షియోమి, ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో ఒక పెద్ద మైలురాయిని సాధించింది. ఈ కంపెనీ ఎలక్ట్రిక్ SUV అయిన Xiaomi YU7 ని కేవలం 3 నిమిషాల్లోనే 2 లక్షల మంది బుక్ చేసుకున్నారు. బుకింగ్స్ ప్రారంభించిన కేవలం ఒక గంటలోపు ఈ సంఖ్య 2 లక్షల 89 వేల యూనిట్లకు చేరుకుంది. షియోమి ఈ ఎలక్ట్రిక్ SUVని మొదటి నెలలో 6 వేల మందికిపైగా కస్టమర్లకు డెలివరీ చేసింది.
బ్లూమ్‌బెర్గ్ రిపోర్ట్ చేసిన వివరాల ప్రకారం, Xiaomi వ్యవస్థాపకుడు లీ జున్ ఒక షాకింగ్ స్టేట్‌మెంట్ చేశారు. YU7 కొనుగోలుదారులు, భవిష్యత్తులో, వేరే కంపెనీ నుంచి కారు కొనాలని లీ జున్ సూచించారు. ఒక కార్ల తయారీ సంస్థ CEO, తన కస్టమర్లను మరో కంపెనీ కారును కొనమని అడగడం ఇదే మొదటిసారి.
Xiaomi ఎలక్ట్రిక్ కారు ప్రత్యేకత ఏంటి?
Xiaomi YU7 డిజైన్, దీనికంటే ముందు లాంచ్ అయి & పాపులర్ అయిన SU7 సెడాన్ ప్రేరణతో రూపొందింది. YU7 డిజైన్ Porsche Macan & Ferrari Purosangue వంటి హై-ఎండ్ కార్లను పోలి ఉంటుంది. ఈ SUV రెండు వేరియంట్లలో (రియర్-వీల్ డ్రైవ్ - RWD & ఆల్-వీల్ డ్రైవ్ - AWD) లాంచ్ అయింది. ఈ SUVలో అమర్చిన ఎలక్ట్రిక్ మోటారు 288kW పవర్ & 528Nm టార్క్ ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది, ఇది పెర్ఫార్మెన్స్ పరంగా చాలా అద్భుతంగా పని చేస్తుంది.
వేరియంట్‌లు
Xiaomi YU7 ను కంపెనీ మూడు వేర్వేరు బ్యాటరీ వేరియంట్‌లతో అందిస్తోంది. కస్టమర్, తన అవసరాలకు అనుగుణంగా ఒక ఆప్షన్ ఎంచుకోవచ్చు. మొదటి బ్యాటరీ వేరియంట్ 96.3 kWh బ్యాటరీతో వస్తుంది, ఇది రియర్-వీల్ డ్రైవ్ కాన్ఫిగరేషన్‌లో 835 కిలోమీటర్ల వరకు డ్రైవింగ్ రేంజ్ ఇస్తుంది.
రెండో వేరియంట్ కూడా 96.3 kWh బ్యాటరీతో వస్తుంది, కానీ ఇది ఆల్-వీల్ డ్రైవ్ (AWD Pro) సిస్టమ్‌తో ఉంటుంది, ఫుల్ ఛార్జ్‌తో 760 కి.మీ. దూరం ప్రయాణిస్తుంది. మూడో & అత్యంత శక్తిమంతమైన వేరియంట్ 101.7 kWh బ్యాటరీని కలిగి ఉంది, ఇది AWD మ్యాక్స్ కాన్ఫిగరేషన్‌లో 770 కి.మీ. వరకు నడపగల సామర్థ్యంతో వస్తుంది. ఈ గణాంకాలు YU7ని టెస్లా మోడల్ Y & ఇతర హై-ఎండ్ ఎలక్ట్రిక్ వాహనాలతో పోటీగా రేసులోకి తీసుకొచ్చాయి.
Xiaomi YU7 ధర
Xiaomi YU7 ప్రారంభ ధర 2,53,500 యువాన్లు. భారతీయ కరెన్సీలో దాదాపు రూ. 30 లక్షలు. ఇది టెస్లా మోడల్ Y కంటే దాదాపు 1.19 లక్షలు తక్కువ రేటు. అంటే.. Xiaomi YU7 సాంకేతికంగా అధిక సామర్థ్యాన్ని కలిగి ఉంది, ధర పరంగా డబ్బును ఆదా చేస్తుంది. ముఖ్యంగా మిడ్-ప్రీమియం EV SUV సెగ్మెంట్ కస్టమర్లకు ఇది బెస్ట్ ఛాయిస్.





















