అన్వేషించండి

Seat Belt: కారులో ప్రయాణిస్తున్నప్పుడు సీట్ బెల్ట్ ఎందుకు ధరించాలి? అది ఎలా ప్రాణాలు కాపాడుతుంది?

ప్రమాద సమయంలో కారులో ప్రయాణిస్తున్న వారి ప్రాణాలను కాపాడటంతో సీటు బెల్టు కీలక పాత్ర పోషిస్తుంది. రోడ్డు ప్రమాదాల్లో చనిపోయిన వారిలో సగానికి పైగా ప్రయాణీకులు సీటు బెల్టు పెట్టుకోని వారే.

రోజు రోజుకు టెక్నాలజీ పెరుగుతున్న వేళ.. కార్లలో అత్యాధునిక సేఫ్టీ ఫీచర్లు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రమాద సమయంలో ప్రయాణీకుల ప్రాణాలను కాపాడేందుకు ఈ ఫీచర్లు ఉపయోగపడుతున్నాయి. వాటిలో అత్యంత ముఖ్యమైనది సీటు బెల్టు. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ప్రకారం, 83% డ్రైవర్లు, ప్రయాణీకులు తమ సీటు బెల్ట్‌లను ధరిస్తారు. 17% మంది వాహన ప్రయాణీకులు ప్రమాదాల సమయంలో గాయపడుతున్నారు. లేదంటే ప్రాణాలు కోల్పోతున్నారు. CDC ప్రకారం, సీటు బెల్టులు ప్రమాద మరణాలను సగానికిపైగా తగ్గిస్తాయని తేలింది. సీట్ బెల్ట్ ధరించడం మూలంగా చాలా లాభాలు ఉన్నాయి.  

సీటు బెల్టుతో ప్రాణాలు సేఫ్

ప్రయాణ సమయంలో కారు స్కిడ్ అయితే  సీటు బెల్ట్ మిమ్మల్ని కారులో సీటు నుంచి జారిపోకుండా కాపాడుతుంది. ఇన్సూరెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ హైవే సేఫ్టీ ప్రకారం.. వాహనం ప్రమాదానికి గురైనప్పుడు సీటు బెల్టు పెట్టుకుంటే వాహనంలో నుంచి బయటపడరు. కారు లోపలే ఉండటం మూలంగా ప్రాణాలకు ముప్పు కలగకుండా ఉంటుంది.  సీటు బెల్టు  తల, ఛాతీ, వెన్నెముక, పొత్తి కడుపుపై బలమైన గాయాలు కాకుండా కాపాడుతుంది.  కారులో ప్రయాణిస్తుంటే..  ప్రయాణీకుల శరీరం కూడా అదే వేగంతో ముందుకు వెళ్తుంది. ఆ సమయంలో ప్రమాదం జరిగితే డ్రైవర్ స్టీరింగ్ వీల్, డ్యాష్‌ బోర్డ్ లేదంటే సైడ్ విండోను తాకే అవకాశం ఉంటుంది.  సీట్ బెల్ట్ ధరించడం వలన ప్రయాణీకులు  సీటుకు సురక్షితంగా ఉంటారు.  కారు అకస్మాత్తుగా ఆగిపోతే వారి బాడీ కూడా అలాగే ఆగిపోతుంది. ప్రమాద సమయంలో తలకు బలమైన గాయాలు అవుతాయి. ఈ గాయాలు ఒక్కోసారి ప్రాణాలు తీసే అవకాశం ఉంది. అదే సమయంలో వెన్నెముక సైతం దెబ్బతినే అవకాశం ఉంటుంది. సీటు బెల్టు మూలంగా సీటుకు అంటిపెట్టుకుని ఉంటారు.       

ఏడాదికి 25 వేల మంది మృతి

కారు ప్రమాదాల్లో ఏడాదికి 25 వేల మంది చనిపోతున్నారు. వారిలో చాలా మంది సీటు బెల్టు పెట్టుకోని వారే. సీటు బెల్టు పెట్టుకుంటే ఈ సంఖ్య చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది. సీటు బెల్ట్ ధరించడం వల్ల తీవ్రమైన గాయాల ప్రమాదాన్ని 50% తగ్గించవచ్చు. సీటు బెల్ట్ వాడకం ప్రమాద మరణాలను 45% తగ్గిస్తుంది.  ప్రతి సంవత్సరం సీటు బెల్టు ద్వారా సగటున 15,000 మంది ప్రాణాలతో బయటపడుతున్నారు.

ఇతర భద్రతా లక్షణాలతో కూడిన సీట్ బెల్టులు

అద్భుతమైన భద్రతా రేటింగ్, అదనపు ఫీచర్లతో కారును నడుపుతున్నప్పటికీ, సీటు  బెల్టు ధరించడం చాలా ముఖ్యం.  ఎయిర్‌ బ్యాగ్‌ లు, లేన్ డిపార్చర్ వార్నింగ్‌ లు ఎక్కువగా ఉండటం వల్ల సీట్ బెల్టులు వాడుకలో లేవని కొందరు డ్రైవర్లు తప్పుగా భావిస్తున్నారు. అయితే, ఎయిర్‌ బ్యాగ్‌ లు సీట్ బెల్టులతో పనిచేసేలా రూపొందించబడ్డాయి. అవి ప్రత్యామ్నాయం కాదని గుర్తించాలి. ఎల్లవేళలా కారులో ప్రయాణం చేసే సమయంలో సీటు బెల్టు తప్పనిసరిగా ధరించాలి. ఈ ముఖ్యమైన విషయాన్ని ఇతరులతో కూడా షేర్ చేసుకోండి. 

టాప్ హెడ్ లైన్స్

RE Hunter 350 ఫైనాన్స్‌ ఆప్షన్లు - తెలుగు రాష్ట్రాల్లో హంటర్ 350 ధర, బెస్ట్‌ EMI ప్లాన్స్ ఇవే!
రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ హంటర్‌ 350 EMI ఆప్షన్లు - తక్కువ EMI కోసం ఏ ప్లాన్‌ ఎంచుకోవాలి?
Triumph Speed 400 కోసం కనీసం ఎంత డౌన్‌పేమెంట్‌ కట్టాలి? ప్రతి నెలా EMI ఎంత పడుతుంది?
కేవలం రూ.29,000కే ట్రయంఫ్ స్పీడ్ 400 మీ సొంతం - ఫ్లెక్సిబుల్ EMI ఆప్షన్లు ఉన్నాయ్‌!
సుజుకి e-యాక్సెస్ రోడ్ టెస్ట్: రేంజ్, స్పీడ్, స్టోరేజ్‌ వంటివన్నీ రూ.1.92 లక్షల ధరకు తగ్గట్లుగానే ఉన్నాయా?
సుజుకి తొలి ఎలక్ట్రిక్ స్కూటర్.. రూ.1.92 లక్షల పెట్టి కొనడం సరైన నిర్ణయమేనా?
ఫాసినో 125 కొనబోతున్నారా? రూ.78,000-రూ.99,000 రేంజ్‌లో మారే ఫీచర్లు ఏంటో తెలుసా?
యమహా ఫాసినో 125లో 3 వేరియంట్లు - కేవలం రూ.21,000 వ్యత్యాసంలో ఏది బెస్ట్‌ ఆప్షన్‌?

వీడియోలు

IND vs SL 2nd Test Day 1 | కోహ్లీ రికార్డ్‌ను బద్దలు కొట్టిన శుభ్‌మన్ గిల్
Yashasvi Jaiswal Fight With Asitha Fernando | అసిథ ఫెర్నాండోతో జైస్వాల్ గొడవ
Serial Actor Charishma Shreekhar Profile | అమ్మోరు' సీరియల్ నటి సక్సెస్ స్టోరీ ఇదే
Anasuya Bharadwaj Emotional Comments | సమాజంపై అనసూయ ఎమోషనల్ వీడియో
Gundenininda Gudigantalu Serial August 24 | రోహిణి, మనోజ్ రూమ్‌కి తాళం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Body Elections: ఏపీలో స్థానిక ఎన్నికల షెడ్యూల్- వారిపై కేసులు నమోదు చేస్తామని వార్నింగ్
ఏపీలో స్థానిక ఎన్నికల షెడ్యూల్- వారిపై కేసులు నమోదు చేస్తామని వార్నింగ్
Pithapuram AE Nookaraju Case: ఏఈ నూకరాజు కుటుంబ ఆత్మహత్య ఎపిసోడ్‌పై విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు! సోషల్ మీడియాలో సౌజన్య లేఖ వైరల్‌!
ఏఈ నూకరాజు కుటుంబ ఆత్మహత్య ఎపిసోడ్‌పై విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు! సోషల్ మీడియాలో సౌజన్య లేఖ వైరల్‌!
Janasena in Telangana MLC Elections: తెలంగాణలో జనసేన పొలిటికల్ యాక్టివిటీస్ షురూ! యువతను టార్గెట్ చేస్తూ కీలక నిర్ణయం!
తెలంగాణలో జనసేన పొలిటికల్ యాక్టివిటీస్ షురూ! యువతను టార్గెట్ చేస్తూ కీలక నిర్ణయం!
"నా గొంతు నొక్కేందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారు" కుటుంబ వివాదాలపై స్పందించిన జోగి రమేష్‌ 
Rashmika Mandanna : విజయ్ దేవరకొండతో రష్మిక - గాయం తర్వాత ఫస్ట్ టైం బయటకు... వీడియో వైరల్
విజయ్ దేవరకొండతో రష్మిక - గాయం తర్వాత ఫస్ట్ టైం బయటకు... వీడియో వైరల్
Chennai Suitcase Murder Case: చెన్నైలో ఒడిశా మహిళ హత్య! శరీర భాగాలు బిర్యానీ పాత్రలో ఉడికించిన నేరస్తులు!
చెన్నైలో ఒడిశా మహిళ హత్య! శరీర భాగాలు బిర్యానీ పాత్రలో ఉడికించిన నేరస్తులు!
Mahakali Glimpse : పెద్దమ్మ చూస్తుందిరా - చేతిలో బిడ్డతో మహాకాళి రౌద్ర రూపం... వయలెంట్ శుక్రాచార్య వార్
పెద్దమ్మ చూస్తుందిరా - చేతిలో బిడ్డతో మహాకాళి రౌద్ర రూపం... వయలెంట్ శుక్రాచార్య వార్
Triumph Speed 400 కోసం కనీసం ఎంత డౌన్‌పేమెంట్‌ కట్టాలి? ప్రతి నెలా EMI ఎంత పడుతుంది?
కేవలం రూ.29,000కే ట్రయంఫ్ స్పీడ్ 400 మీ సొంతం - ఫ్లెక్సిబుల్ EMI ఆప్షన్లు ఉన్నాయ్‌!
Embed widget