అన్వేషించండి

Budget Cars In India: ఫస్ట్ జాబ్‌ చేస్తున్న వారు కొనేందుకు 5 బెస్ట్ బడ్జెట్ కార్లు ఇవే..

Best Budget Cars: మీరు తొలిసారి జాబ్‌లో చేరినవారైతే ఫస్ట్ కారు కొనాలని చూస్తున్నారా.. కొనాలని చూస్తున్నట్లయితే, మీకు ఏ కారు అత్యంత సరసమైనదో తెలుసుకోవడం ముఖ్యం. ఆ వివరాలను తెలుసుకుందాం.

Budget Cars In India | భారత్‌లో గత ఏడాది సెప్టెంబర్ నెలలో కొత్త జీఎస్టీ స్లాబ్ అమలులోకి రావడంతో కార్ల ధరలు భారీగా దిగొచ్చాయి. తక్కువ బడ్జెట్ కార్లు కొనేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. జీఎస్టీ తగ్గించిన కారణంగా అత్యంత చౌకైన కార్ల జాబితాలో మార్పు వచ్చింది. జీఎస్టీ తగ్గింపు తర్వాత భారత్లో అత్యంత చౌకైన కారుగా మారుతి ఎస్-ప్రెస్సో (Maruti S-Presso) నిలిచింది. మారుతి ఎస్ ప్రెస్సో ప్రారంభ ధర రూ. 3.50 లక్షలకు చేరుకుంది. ఈ క్రమంలో మీరు మొదటి ఉద్యోగం చేస్తున్నా కూడా బడ్జెట్ ధరలో కారు కొనుగోలు చేయవచ్చు. దేశంలోని 5 చౌకైన కార్ల వివరాలు తెలుసుకుని కొనుగోలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. 

మారుతి ఎస్-ప్రెస్సో (Maruti S-Presso)
జీఎస్టీ తగ్గించాక మారుతి ఎస్-ప్రెస్సో దేశంలోనే అత్యంత చౌకైన కారుగా నిలిచింది. గతంలో ఈ కారు STD (O) వేరియంట్ ధర ₹4.26 లక్షలుగా ఉండేది. జీఎస్టీ రేట్లు తగ్గించిన తర్వాత అది రూ.3.49 లక్షలకు తగ్గింది. దీనివల్ల కస్టమర్లకు సుమారు రూ.76,600 డైరెక్ట్ లాభం చేకూరింది. ధరలో దాదాపు 18% తగ్గింపుతో, ఇది బడ్జెట్ సెక్టార్లో అత్యధిక డిమాండ్ ఉన్న కారుగా మారింది.

రెనాల్ట్ క్విడ్ (Renault Kwid)
రెనాల్ట్ క్విడ్ మూడవ స్థానంలో ఉంది. దీని 1.0 RXE వేరియంట్ గతంలో ₹4.69 లక్షలకు లభించేది. అయితే కొత్త ధర రూ. 4.29 లక్షలుగా ఉంది. దీని ద్వారా రెనాల్ట్ క్విడ్ కస్టమర్లకు సుమారు రూ.40,000 తగ్గింపు ప్రయోజనం లభిస్తోంది. SUV తరహా స్టైలింగ్‌తో ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ ఆప్షన్‌గా నిలుస్తోంది.

మారుతి ఆల్టో కె10 (Maruti Alto K10)
తక్కువ ధర విషయంలో రెండో స్థానంలో మారుతి ఆల్టో కె10 ఉంది. దీని STD (O) వేరియంట్ ధర ₹4.23 లక్షల నుండి ₹3.69 లక్షలకు తగ్గింది, దీనివల్ల కస్టమర్లకు దాదాపు రూ.53,100 ఆదా అవుతోంది. ఆల్టో కె10 ఇప్పటికీ నమ్మకంతో పాటు తక్కువ ధర కారణంగా కస్టమర్ల ప్రజాదరణలో ముందుంటుంది. 

టాటా టియాగో (Tata Tiago)
టాటా టియాగో నాలుగో స్థానంలో నిలిచింది. దీని XE వేరియంట్ ధర గతంలో రూ.4.99 లక్షలుగా ఉండగా, ప్రస్తుతం రూ. 4.57 లక్షలకు తగ్గింది. దీనివల్ల కస్టమర్లకు దాదాపు ₹42,500 ప్రయోజనం చేకూరింది. టియాగో తన పటిష్టమైన బిల్డ్ క్వాలిటీ, స్టైలిష్ లుక్ కారణంగా ఈ ధర వద్ద మంచి 'వాల్యూ ఫర్ మనీ' ఆప్షన్‌గా నిలుస్తోంది.

మారుతి సెలెరియో (Maruti Celerio)
ఆ తర్వాత తర్వాతి స్థానంలో మారుతి సెలెరియో ఉంది. ఇది కొత్తగా జాబ్‌లో చేరిన వారికి మంచి ఆప్షన్. దీని LXI వేరియంట్ ధర ఇప్పుడు రూ.4.69 లక్షలకు దిగొచ్చింది. దీనివల్ల కస్టమర్లకు సుమారు రూ. 94,100 ఆదా అయింది. ప్రస్తుతం ఎస్‌యూవీ విభాగం కార్లకు డిమాండ్ పెరుగుతున్నప్పటికీ.. తమ ఫస్ట్ కార్ కల నేర్చుకునేందుకు తక్కువ బడ్జెట్ కోసం చూస్తున్న వారు సైతం అదే స్థాయిలో పెరుగుతున్నారు. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Hybrid SUV: 1000 కిలోమీటర్ల రేంజ్‌, మంచి మైలేజీతో వస్తున్న 4 హైబ్రిడ్ SUVలు! 
1000 కిలోమీటర్ల రేంజ్‌, మంచి మైలేజీతో వస్తున్న 4 హైబ్రిడ్ SUVలు! 
Car Coolant: కారులో కూలెంట్ అయిపోతే ఏం చేయాలి? లేకుంటే జరిగే నష్టమేంటి?
కారులో కూలెంట్ అయిపోతే ఏం చేయాలి? లేకుంటే జరిగే నష్టమేంటి?
Top Car Exports From India 2026: భారత్‌లో తయారై, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన వాహనాల గురించి తెలుసా? 
భారత్‌లో తయారై, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన వాహనాల గురించి తెలుసా?
Alloy Wheel or Steel Wheel: అల్లాయ్ వీల్స్ లేదా స్టీల్ వీల్స్: ఏది మంచిది? ప్రతి విషయాన్ని ఇక్కడ తెలుసుకోండి!
అల్లాయ్ వీల్స్ లేదా స్టీల్ వీల్స్: ఏది మంచిది? ప్రతి విషయాన్ని ఇక్కడ తెలుసుకోండి!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Embed widget