అన్వేషించండి

EV batteries Life: ఈవీ బ్యాటరీల లైఫ్ ఎంత? ఐదేళ్లకోసారి మార్చాల్సిందేనా?

EV batteries Life: ఆధునిక ఈవీలలో బ్యాటరీ అనేది కారు కంటే ఎక్కువ కాలం మన్నికనిచ్చే ఒక శక్తివంతమైన భాగం. సరైన నిర్వహణ,ఛార్జింగ్ పద్ధతులు పాటిస్తే బ్యాటరీ గురించి ఆందోళన అవసరం లేదు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • EV బ్యాటరీలు సగటున సంవత్సరానికి 2.3% తగ్గుతాయి, 8 ఏళ్లలో 82% సామర్థ్యం మిగులుతుంది.
  • టాటా నెక్సాన్ EV, MG ZS EV, Hyundai Ioniq 5 మంచి పనితీరు కనబరుస్తాయి.
  • హైదరాబాద్ వంటి వేడి వాతావరణం బ్యాటరీ క్షీణతను స్వల్పంగా పెంచుతుంది.
  • కంపెనీలు 8 ఏళ్లు లేదా 1.6 లక్షల కి.మీ. వరకు బ్యాటరీ వారంటీ ఇస్తాయి.

EV batteries Life: భారత దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల విప్లవం వేగంగా విస్తరిస్తోంది.అయితే కొత్తా ఈవీ కొనాలనుకునే వారిని ఇప్పిటకే వేధిస్తున్న ప్రధాన ప్రశ్న బ్యాటరీ ఎన్ని రోజులు వస్తుంది? ఐదేళ్ల తర్వాత ఫోన్ బ్యాటరికీ లాగానే ఇది కూడా పాడైపోతుందా? గ్లోబల్‌ స్టడీస్, భారతీయ రోడ్లపై తిరుగుతున్న వేల వాహనాల పని తీరును విశ్లేషించిన పరిశోధన సంస్థలు ఈవీ బ్యాటరీ సామర్థ్యంపై ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. 

బ్యాటరీలో క్షీణత ఎంత?

సుమారు 22, 700 కంటే ఎక్కువ ఎలక్ట్రిక్‌ వాహనాలపై జరిగిన జియోాబ్‌ అధ్యయనం ప్రకారం ఆధునిక ఈవీ బ్యాటరీల సగటు క్షీణత రేటు సంవత్సరానికి 2.3శాతంగా ఉందని చెబుతుంది. 2024లో ది1.8గా ఉండేదని ఇప్పుడు ఫాస్ట్‌ ఛార్జింగ్ వినియోగం పెరగడం వల్ల  రేటు స్వల్పంగా పెరిగినట్టు తెలుస్తోంది. ఈ లెక్కన ఐదేళ్ల తర్వాత బ్యాటరీ తన అసలు తన సామర్థ్యంలో సుమారు 88 శాతం నుంచి 90 శాతం వరకు నిలుపుకుంటుంది. అంటే కారు మైలేజీలో పది నుంచి  12 శాతం మాత్రమే తగ్గుతుంది. ఎనిమిదేళ్ల తర్వాత బ్యాటరీ కెపాసిటీ 81 శాతం నుంచి 82 శాతం మధ్య ఉంటుంది. రేంజ్‌ సుమారు 18 శాతం నుంచి 20 శాతం వరకు తగ్గే అవకాశం ఉంది. 

వాస్తవానికి చాలా బ్యాటరీలు 10 నుంచి ఇరవై సంవత్సరాల పాటు లేదా 16 లక్షల నుంచి 3.2 లక్షల కిలోమీటర్ల వరకు సమర్థవంతంగా పని చేస్తాయని, ఇది కారు మొత్తం జీవితకాలం కంటే ఎక్కువ కాలమని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. 

టాటా నెక్సాన్ ఈవీ: ఒకట్రెండు సంవత్సరాల వాడకం లేదా 15వేల నుంచి 40 వేల కిలోమీటర్ల ప్రయాణం తర్వాత కూడా బ్యాటరీ SOH 98 శాతంనుంచి 99 శాతం వరకు స్థిరంగా ఉంటోంది. లక్ష కిలోమీటర్లు తిరిగిన తర్‌వాత కూడా ఇది దాదాపు 85 శాతం సామర్థ్యాన్ని కలిగి ఉంటోంది. 

ఎంజీ జెడ్‌ఎస్‌ ఈవీ: ఇందులో ఉన్న లిక్విడ్‌- కూల్డ్ బ్యాటరీ కారణంగా, నాలుగేళ్ల వాడకం తర్వాత కూడా 80 శాతం నుంచి 82 శాతం కెపాసిటీని నిలుపుకుంటోంది. అయితే కొందరు వినియోగదారులు అధిక వాడకం వల్ల రెండేళ్లలోనే 91 శాతం SOHకి చేరుకోవడం గమనించారు. 

హ్యూందాయ్‌ అయానిక్‌5: అత్యంత అద్భుతమైన పని తీరు చూపిస్తున్న ఈ మోడల్‌, నాలుగు లక్షల కిలోమీటర్ల ప్రయాణం తర్వాత కూడా 90 శాతంం కంటే ఎక్కువ బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని పరీక్షల్లో తేలింది. 

హైదరాబాద్‌ వంటి వెదర్ కండీషన్ బ్యాటరీలపై ఎలా  ప్రభావం చూపుతాయి?

హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో 35 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉండే రోజులు బ్యాటరీపై అదనపు ప్రభావాన్ని చూపుతాయి. వేడి వాతారణం వల్ల మైల్డ్‌ క్లైమేట్‌ కంటే ఏటా అదనంగా 0.4 శాతం బ్యాటరీ క్షీణత ఉంటుంది. 

అయితే ఆధునిక ఈవీలలో వస్తున్న లిక్విడ్ కూలింగ్, ఎల్‌ఎఫ్‌పీ బ్యాటరీలు అధిక వేడిని సమర్థవంతంగా తట్టుకుంటున్నాయి. దీని వల్ల బ్యాటరీ క్షీణత పెద్దగా పెరగడం లేదు. కాకపోతే 100kW కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న డీసీ ఫాస్ట్‌ ఛార్జర్‌లను నిరంతరం వాడటం వల్ల క్షీణత రేటు  3శాతం వరకు పెరిగే ప్రమాదం ఉంది. 

బ్యాటరీలపై  కంపెనీ ఎంత వారంటీ ఇస్తోంది?

టాటా మోటార్స్‌కు చెందిన నెక్సాన్ ఈవీ, కర్వ్‌ ఈవీ మోడళ్లకు మొదటి యజమానికి లైప్‌టైమ్‌ బ్యాటరీ వారంటీ కల్పిస్తోంది. ఒక వేళ కారును సెకండ్ హ్యాండ్‌లో కొంటే, రెండో యజమానికి 8 సంవత్సరాలు లేదా 1.6 లక్షల కిలోమీటర్ల వారంటీ లభిస్తోంది. 

ఎంజీ, హ్యాందాయ్ సాధారణంగా 8 ఏళ్లు లేదా 1.5 నుంచి 1.6 లక్షల కిలోమీటర్ల వారంటీని ఇస్తున్నాయి. ఈ కాలంలో బ్యాటరీ సామర్థ్యం 70 శాతం నుంచి 80 కంటే తగ్గితే ఉచితంగా రీప్లేస్ చేస్తాయి. 

Frequently Asked Questions

EV బ్యాటరీల సగటు క్షీణత రేటు ఎంత?

ఆధునిక EV బ్యాటరీల సగటు క్షీణత రేటు సంవత్సరానికి 2.3% గా ఉంది. వేగవంతమైన ఛార్జింగ్ వినియోగం పెరగడం వల్ల ఇది కొద్దిగా పెరిగింది.

ఐదు సంవత్సరాల తర్వాత EV బ్యాటరీ సామర్థ్యం ఎంత వరకు ఉంటుంది?

ఐదు సంవత్సరాల తర్వాత బ్యాటరీ తన అసలు సామర్థ్యంలో 88% నుండి 90% వరకు నిలుపుకుంటుంది. అంటే కారు మైలేజీలో 10% నుండి 12% వరకు తగ్గుతుంది.

కొన్ని EV మోడల్స్ బ్యాటరీ పనితీరు ఎలా ఉంది?

టాటా నెక్సాన్ EV లక్ష కిలోమీటర్ల తర్వాత కూడా 85% సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. MG ZS EV 80-82% కెపాసిటీని నిలుపుకుంటుంది, Hyundai IONIQ 5 నాలుగు లక్షల కిలోమీటర్ల తర్వాత కూడా 90% కంటే ఎక్కువ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

హైదరాబాద్ వంటి వేడి వాతావరణం EV బ్యాటరీలపై ఎలా ప్రభావం చూపుతుంది?

35 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్న రోజులు బ్యాటరీపై అదనపు ప్రభావాన్ని చూపుతాయి, ఏటా 0.4% అదనపు క్షీణత ఉంటుంది. ఆధునిక కూలింగ్ సిస్టమ్స్ ఈ ప్రభావాన్ని తగ్గిస్తాయి.

EV బ్యాటరీలపై కంపెనీలు ఎంత వారంటీ ఇస్తున్నాయి?

కొన్ని కంపెనీలు మొదటి యజమానికి జీవితకాల వారంటీ ఇస్తున్నాయి. ఇతరులు 8 సంవత్సరాలు లేదా 1.6 లక్షల కిలోమీటర్ల వారంటీని అందిస్తున్నాయి. ఈ కాలంలో బ్యాటరీ సామర్థ్యం 70-80% కంటే తగ్గితే ఉచితంగా రీప్లేస్ చేస్తారు.

టాప్ హెడ్ లైన్స్

యూత్‌ కోసం కొత్త 4V ఇంజిన్‌తో వచ్చిన Bajaj Pulsar N160.. ఏ వేరియంట్‌ కొనాలి?
కొత్త Bajaj Pulsar N160 లో ఐదు వేరియంట్లు.. మీరు ఏ వేరియంట్‌ కొంటారు?
సింగిల్‌ ఛార్జ్‌తో హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్లొచ్చు - Avore EX2 ధర, బ్యాటరీ, ఫీచర్లపై పూర్తి వివరాలు!
సింగిల్‌ ఛార్జ్‌తో ఏకంగా 255km ప్రయాణం.. Avore EX2 కొనే ముందు ఈ 5 విషయాలు తెలుసుకోండి!
రూ.19.45 లక్షల నుంచి మహీంద్రా BE 6 Sporteq.. మీ అవసరానికి సరిపోయే వేరియంట్‌ ఇదే!
మహీంద్రా BE 6 Sporteqలో ఏ వేరియంట్‌ బెస్ట్? ధర, బ్యాటరీ, ఫీచర్ల పూర్తి వివరాలు!
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
BAN Defeats AUS In 1st Test: ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
Tadipatri High Tension: తాడిపత్రిలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి అనుచరుడి వాహనాలు ధ్వంసం చేయడంతో టెన్షన్ టెన్షన్ !
తాడిపత్రిలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి అనుచరుడి వాహనాలు ధ్వంసం చేయడంతో టెన్షన్ టెన్షన్ !
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?
Embed widget