TVS Sport: టీవీఎస్ స్పోర్ట్ బైక్‌ను ఈఎంఐలో ఎలా కొనాలి? - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
TVS Sport Down Payment: మంచి మైలేజీని డెలివర్ చేసే టీవీఎస్ స్పోర్ట్ బైక్‌ను ఈఎంఐ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఎంత డౌన్‌పేమెంట్ కట్టాలి? ఎంత ఈఎంఐ పెట్టుకోవాలి? అనే విషయాలు తెలుసుకుందాం.
TVS Sport Bike on Down Payment and EMI: భారతీయ మార్కెట్లో ద్విచక్ర వాహనాలకు భారీ డిమాండ్ ఉంది. రోజూ ఇంటి నుంచి ఆఫీసుకు వెళ్లేందుకు తక్కువ ధరలో మంచి మైలేజీనిచ్చే బైక్‌లు, స్కూటర్‌ల కోసం వెతుకుతుంటారు. భారత మార్కెట్‌లో వివిధ కంపెనీల మోటార్‌సైకిళ్లు అందుబాటులో ఉన్నాయి.
మీరు కొత్త మోటార్‌సైకిల్‌ని కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే టీవీఎస్ స్పోర్ట్ మీకు మంచి ఆప్షన్. బైక్ ఆన్ రోడ్ ధర, ఈఎంఐ, డౌన్ పేమెంట్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. టీవీఎస్ స్పోర్ట్ బైక్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. దీని బేస్ వేరియంట్ స్పోర్ట్ సెల్ఫ్ స్టార్ట్ అల్లాయ్ వీల్స్ ఆన్ రోడ్ ధర దాదాపు రూ.72 వేల వరకు ఉంది. దీని టాప్ వేరియంట్ స్పోర్ట్ సెల్ఫ్ స్టార్ట్ అల్లాయ్ వీల్ వేరియంట్ ఆన్ రోడ్ ధర దాదాపు రూ.86 వేలుగా ఉంది.
Also Read: కవాసకి బైక్‌లపై కళ్లు చెదిరే ఆఫర్లు - ఏకంగా రూ.45 వేల వరకు డిస్కౌంట్!
ప్రతి నెలా ఎంత ఈఎంఐ చెల్లించాలి?
మీరు రూ. 10,000 డౌన్ పేమెంట్ చెల్లించి బేస్ వేరియంట్‌ను కొనుగోలు చేస్తే మీరు దాని కోసం రూ. 62,000 కారు లోన్ తీసుకోవాలి. మీరు 9.7 శాతం వడ్డీ రేటుతో ఈ రుణాన్ని పొందుతారు అనుకుంటే. ఈ రుణాన్ని తిరిగి చెల్లించడానికి మీరు మూడు సంవత్సరాల పాటు ప్రతి నెలా రూ. 2,000 ఈఎంఐ చెల్లించాలి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే రుణం, వడ్డీ రేటు మీ క్రెడిట్ స్కోర్‌పై ఆధారపడి ఉంటుంది.
టీవీఎస్ స్పోర్ట్ బైక్ ఎంత మైలేజ్ ఇస్తుంది?
టీవీఎస్ స్పోర్ట్ విషయానికొస్తే ఈ బైక్ లీటరుకు 70 కిలోమీటర్ల కంటే ఎక్కువ మైలేజీని ఇస్తుందని కంపెనీ పేర్కొంది. ఇది టెలిస్కోపిక్ ఫోర్క్, ట్విన్ షాక్ అబ్జార్బర్ కలిగి ఉంది. ఈ బైక్ గరిష్ట వేగం గంటకు 90 కిలోమీటర్ల కంటే ఎక్కువ. మార్కెట్‌లో ఈ బైక్ హీరో హెచ్‌ఎఫ్ 100, హోండా సీడీ 110 డ్రీమ్, బజాజ్ సీటీ110ఎక్స్‌లకు పోటీగా ఉంది. హీరో హెచ్‌ఎఫ్ 100లో 97.6 సీసీ ఇంజన్ ఉంది. దీన్ని కంపెనీ అప్‌డేట్ చేసింది.
Also Read: రోజువారీ వాడకానికి బెస్ట్ బడ్జెట్ సీఎన్‌జీ కార్లు ఇవే - టాప్-3 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
Located in the tranquil surroundings of Dympep, Sohra, we’ve converted a simple container into a fully functioning service hub. Built from an empty container, this service hub is designed to bring seamless care to locations far from the city. Our dedicated experts stay on-site to… pic.twitter.com/W3LtPPfIhp
— TVS Motor Company (@tvsmotorcompany) December 14, 2024
We believe in fostering a culture of safe riding and safe tourism for all. Goa, with its breathtaking sunsets, winding roads, and vibrant December celebrations, attracts tourists eager to explore its beauty on two wheels.
— TVS Motor Company (@tvsmotorcompany) December 4, 2024
As part of our enduring commitment to safety, Mr. Vimal… pic.twitter.com/S8xrCQPuzi