అన్వేషించండి

ఫిబ్రవరి 2026 ఎలక్ట్రిక్‌ టూ వీలర్‌ సేల్స్‌: టీవీఎస్‌ టాప్‌, నెలనెలా పడిపోతున్న ఓలా అమ్మకాలు

ఫిబ్రవరి 2026లో ఎలక్ట్రిక్‌ టూ వీలర్‌ అమ్మకాలు 1.11 లక్షలు దాటాయి. టీవీఎస్‌ 28% మార్కెట్‌ షేర్‌తో ముందంజలో నిలిచింది. ఓలా ఆరో స్థానానికి దిగజారింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఫిబ్రవరి 2026లో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు 46% పెరిగాయి.
  • TVS మోటార్ 31,600 యూనిట్లతో మార్కెట్ లీడ్‌ సాధించింది.
  • బజాజ్‌ ఆటో, ఏథర్‌ 20,000 పైగా స్కూటర్లు విక్రయించాయి.
  • హీరో, గ్రీవ్స్‌ల వృద్ధి; ఓలా అమ్మకాలు తగ్గాయి.

February 2026 electric two wheeler sales: భారతదేశంలో ఎలక్ట్రిక్‌ రెండు చక్రాల వాహనాల మార్కెట్‌ మరింత వేగం అందుకుంది. ఫిబ్రవరి 2026 నెలలో ఈ విభాగం బలమైన వృద్ధిని నమోదు చేసింది. మొత్తం 1,11,680 యూనిట్లు రిటైల్‌గా విక్రయమయ్యాయి. గత ఏడాది (2025) ఇదే నెలలో 76,720 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. అంటే, ఒక్క ఏడాదిలోనే 46 శాతం పెరుగుదల కనిపించింది.

FY2026లో, అక్టోబర్‌ 2025 తర్వాత ఇదే రెండో అత్యధిక నెలవారీ అమ్మకాల రిపోర్ట్‌. ఆర్థిక సంవత్సరం మొదటి 11 నెలల్లో మొత్తం అమ్మకాలు ఇప్పటికే 12 లక్షల యూనిట్లు దాటాయి. గత ఆర్థిక సంవత్సరపు మొత్తం 11.5 లక్షల రికార్డును కూడా ఈ నంబర్‌ ఇప్పటికే అధిగమించింది. మార్చి అమ్మకాలను కూడా కలుపుకుంటే కొత్త రికార్డు నమోదయ్యే అవకాశం ఉంది.

టీవీఎస్‌ మోటార్‌ ముందంజ

గత నెల (ఫిబ్రవరి 2026)లో, టీవీఎస్‌ మోటార్‌ మొత్తం 31,600 యూనిట్లు విక్రయించి మొదటి స్థానాన్ని నిలబెట్టుకుంది. అంటే, దేశవ్యాప్తంగా జనం ఎక్కువగా కొన్నది ఈ కంపెనీ స్కూటర్లనే. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే ఇది 67 శాతం ఎక్కువ. ఇప్పుడు, ఎలక్ట్రిక్‌ టూవీలర్ల సేల్స్‌లో టీవీఎస్‌ మార్కెట్‌ షేర్‌ 28 శాతంగా ఉంది. ఈ కంపెనీ తీసుకొచ్చిన iQube, Orbiter వంటి మోడళ్లకు మంచి స్పందన లభిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు కంపెనీ 2,90,746 యూనిట్లు విక్రయించింది. సంవత్సరం ముగిసే సరికి సుమారు 3,25,000 యూనిట్ల రికార్డుకు చేరే అవకాశముంది.

బజాజ్‌ ఆటో రెండో స్థానంలో

బజాజ్‌ ఆటో ఫిబ్రవరిలో 25,323 చేతక్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్లు విక్రయించింది. 23 శాతం మార్కెట్‌ షేర్‌ సాధించింది. ఇటీవల చేతక్‌ C2501ను రూ.91,399 (ఎక్స్‌-షోరూమ్‌ ధర, బెంగళూరు) ధరతో మనకు పరిచయం చేసింది. 2.5 కిలోవాట్‌ హవర్స్‌ బ్యాటరీతో 113 కిలోమీటర్ల IDC రేంజ్‌ అందిస్తుందని కంపెనీ చెబుతోంది. హైదరాబాద్‌లో ఈ మోడల్‌ ధర సుమారు రూ.1 లక్ష దాటే అవకాశం ఉంది.

ఏథర్‌ ఎనర్జీ బలమైన వృద్ధి

గత నెలలో, ఏథర్‌ ఎనర్జీ 20,581 యూనిట్లను విక్రయించింది. గత సంవత్సరం ఇదే కాలం కంటే 72 శాతం వృద్ధి సాధించి 18 శాతం మార్కెట్‌ షేర్‌ పొందింది. ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటిసారి 2 లక్షల యూనిట్ల మైలురాయిని దాటింది. రిజ్టా ఫ్యామిలీ స్కూటర్‌కు మంచి డిమాండ్‌ ఉంది.

హీరో మోటోకార్ప్‌ - Vida దూకుడు

హీరో మోటోకార్ప్‌ Vida బ్రాండ్‌ ద్వారా 12,512 యూనిట్లను విక్రయించింది. 2025 ఫిబ్రవరి నెలతో పోలిస్తే ఈసారి ఏకంగా 364 శాతం పెరుగుదల సాధించింది. వరుసగా ఎనిమిదో నెల కూడా 10,000 యూనిట్ల సేల్స్‌ను దాటింది. ఇటీవల VX2 3.4 కిలోవాట్‌ హవర్స్‌ వేరియంట్‌ను అందించింది.

గ్రీవ్స్‌ ఎలక్ట్రిక్‌ ఓలాను దాటింది

గ్రీవ్స్‌ ఎలక్ట్రిక్‌ మొబిలిటీ (Ampere బ్రాండ్‌) 4,725 యూనిట్లు విక్రయించి ఐదో స్థానానికి చేరుకుంది. ఈ కంపెనీ, ఓలా ఎలక్ట్రిక్‌ను తొలిసారి అధిగమించింది. ఓలాతో పోలిస్తే 757 యూనిట్లు ఎక్కువగా అమ్మింది. మొత్తం కలిపి కంపెనీ 2.70 లక్షల యూనిట్లు దాటింది.

ఓలా ఎలక్ట్రిక్‌ పతనం

ఓలా ఎలక్ట్రిక్‌ ఫిబ్రవరిలో కేవలం 3,968 యూనిట్లు మాత్రమే విక్రయించింది. నాలుగో అతి తక్కువ నెలవారీ అమ్మకాలుగా ఇది నిలిచింది. ప్రస్తుతం నాలుగు అంకెల అమ్మకాలకే పరిమితమైంది. మార్కెట్‌ షేర్‌ కేవలం 4 శాతానికి పడిపోయింది. గతంలో 24 శాతం మార్కెట్‌ షేర్‌తో ముందంజలో ఉన్న కంపెనీకి ఇది చాలా గట్టి షాక్‌.

తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి

హైదరాబాద్‌, విజయవాడ వంటి నగరాల్లో ఎలక్ట్రిక్‌ స్కూటర్లపై ఆసక్తి పెరుగుతోంది. ఇంధన ధరలు పెరగడం, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, తక్కువ నిర్వహణ ఖర్చు కారణంగా ఈవీలపై వైపు మళ్లుతున్నారు. రాబోయే నెలల్లో మరింత పోటీ పెరిగే అవకాశం ఉంది.

మొత్తానికి FY2026 సంవత్సరం ఎలక్ట్రిక్‌ టూవీలర్‌ విభాగానికి రికార్డు సంవత్సరంగా నిలిచే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Frequently Asked Questions

ఫిబ్రవరి 2026లో ఎలక్ట్రిక్ టూ-వీలర్ల అమ్మకాలు ఎలా ఉన్నాయి?

ఫిబ్రవరి 2026లో 1,11,680 యూనిట్లు రిటైల్​గా అమ్ముడయ్యాయి. ఇది గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే 46 శాతం పెరుగుదల.

ఎలక్ట్రిక్ టూ-వీలర్ల అమ్మకాలలో ఏ కంపెనీ ముందుంది?

ఫిబ్రవరి 2026లో టీవీఎస్​ మోటార్​ 31,600 యూనిట్లు విక్రయించి మొదటి స్థానంలో నిలిచింది. ఈ కంపెనీ మార్కెట్​ వాటా 28 శాతం.

బజాజ్​ ఆటో ఫిబ్రవరి 2026లో ఏ మోడల్​ను విడుదల చేసింది?

బజాజ్​ ఆటో ఇటీవల చేతక్​ C2501ను రూ.91,399 (ఎక్స్​-షోరూమ్​) ధరతో విడుదల చేసింది. ఇది 113 కిలోమీటర్ల రేంజ్​ అందిస్తుంది.

ఏథర్​ ఎనర్జీ ఫిబ్రవరి 2026లో అమ్మకాల పరంగా ఎలా ఉంది?

ఏథర్​ ఎనర్జీ 20,581 యూనిట్లను విక్రయించి, 72 శాతం వృద్ధి సాధించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 2 లక్షల యూనిట్ల మైలురాయిని దాటింది.

ఓలా ఎలక్ట్రిక్​ ఫిబ్రవరి 2026లో అమ్మకాల పరంగా ఎలా ఉంది?

ఓలా ఎలక్ట్రిక్​ కేవలం 3,968 యూనిట్లు మాత్రమే విక్రయించింది. మార్కెట్​ వాటా 4 శాతానికి పడిపోయింది.

టాప్ హెడ్ లైన్స్

Hero Electric Bike: హీరో నుంచి రెడీ అవుతున్న ఈవీ బైక్.. ఓలా- బజాజ్‌లకు తప్పని పోటీ
హీరో నుంచి రెడీ అవుతున్న EV Bike.. ఓలా- బజాజ్‌లకు తప్పని పోటీ
కొత్త కారు కొనాలని చూస్తున్నారా? MG Hectorపై రూ.60,000 వరకు తగ్గింపు, 100 శాతం ఫైనాన్స్ కూడా!
యానివర్సరీ గిఫ్ట్‌ ఇస్తున్న కార్ల కంపెనీ - రూ.60,000 వరకు ఆదా, పూర్తి ఫైనాన్స్ ఫెసిలిటీ కూడా!
మూడు స్క్రీన్ల సెటప్‌తో కొత్త మహీంద్రా BE 07.. త్వరలో రాబోతున్న ఈ ఎలక్ట్రిక్ SUV ఎలా ఉంది?
మహీంద్రా కొత్త కారు BE 07 ఇంటీరియర్‌ ఎలా ఉంటుందో తెలిసిపోయింది - ఫోటోలు లీక్!
E20లో క్లోరైడ్, తేమ నిజంగానే పెరిగాయా? దేశవ్యాప్త తనిఖీల తర్వాత OMCలు ఏం చెప్పాయి?
E20 పెట్రోల్‌ కలుషిత ఇంధనమేనా? దేశవ్యాప్తంగా నిర్వహించిన పరీక్షల్లో ఏం తేలింది?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget