అన్వేషించండి

Bike Maintenance Tips : మీ బైక్‌ మైలేజీ పెంచుకునే చిట్కాలు ఇవే! ఇది ఖర్చు కాదు, పెట్టుబడి!

Bike Maintenance Tips : బైక్ ప్రతి భాగానికి ఒక నిర్ణీత కాలపరిమితి ఉంటుంది. ఆ సమయంలో దాన్ని మార్చడం లేదా క్లీన్ చేయడం చాలా కీలకం

Bike Maintenance Tips Telugu 2026: భారతీయ రహదారులపై ముఖ్యంగా హైదరాబాద్‌ వంటి మెట్రో నగరాల్లో ప్రతి రోజూ ప్రయాణించే వారికి బైక్ అనేది జీవితంలో భాగమై ఉంటుంది. అయితే పెరిగిపోతున్న పెట్రోల్‌ ధరలు, మెయింటెనెన్స్‌ ఖర్చుల దృష్ట్యా, తమ బైక్‌ను ఎలా జాగ్రత్తగా ఉంచుకోవాలో తెలియక చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. హీరో గ్లామర్‌, హోండా ఎస్పీ 125 లేదా హీరో స్ప్లెండర్‌ వంటి 125సీసీ బైక్‌లను నడిపే వారికి మైలేజీని పెంచడం, ఖర్చులను తగ్గించడం, భద్రతను మెరుగుపరచడం ఎలాగో చూద్దాం. 

మైలేజీ పెరగడానికి, ఆదాకు మార్గాలు ఇవే 

బైక్‌ మెయింటెనెన్స్‌ అనేది ఎప్పటికీ డిమాండ్ ఉండే ఒక ముఖ్యమైన అంశం సరైన సమయంలో సర్వీసింగ్ చేయడం వల్ల కేవలం బైక్ లైఫ్ పెరగడమే కాకుండా, నెలవారీ పెట్రోల్‌ ఖర్చులలో కూడా గణనీయమైన మార్పు వస్తుంది. ఇలా క్రమం తప్పకుండా మెయింటెనెన్స్‌ చేయడం వల్ల మీ బైక్‌ మైలేజీ పది నుంచి పదిహేను శాతం వరకు పెరుగుతుంది. దీని వల్ల ఒక సాధారణ వాహనదారుడు సంవత్సరానికి సుమారు మూడు వేల నుంచి ఐదు వేల వరకు ఆదా చేసుకోవచ్చు. 

ప్రతి నెలా మీ బైక్‌లో ఇంజిన్ ఆయిల్‌ సరిపడా ఉందా, రంగు మారిందా లేదా అన్నది చెక్ చేయాలి. ఆయిల్ తక్కువగా ఉన్నా, రంగు నలుపుగా మారినా వెంటనే మార్చడం ఉత్తమం. గాలి తక్కువగా ఉంటే ఇంజిన్‌పై ఒత్తిడి పడి మైలేజీ పడిపోతుంది. ముందు టైర్‌లో 25-30 పీఎస్‌ఐ, బ్యాక్‌ టైర్‌లో 30-35 పీఎస్‌ఐ ప్రెషర్ ఉండేలా చూసుకోవాలి. ప్రతి 500కిలోమీటర్లకు ఒకసారి చైన్‌ను క్లీన్ చేసి ల్యూబ్‌ చేయడం వల్ల చైన్ నుంచి వచ్చే కిర్రుమనే శబ్దాలు తగ్గడమే కాకుండా పవర్ ట్రాన్‌మిషన్ స్మూత్‌గా సాగుతుంది. బ్రేక్, లైట్లు, హార్న్‌ సరిగా పని చేస్తున్నాయోలేదో చూసుకోవడం సెక్యూరిటీలో కీలకమైన స్టెప్‌. 

మైలేజీ, పవర్ బూస్ట్  కోసం సర్వీస్ షెడ్యూల్‌ 

బైక్ ప్రతి భాగానికి ఒక నిర్ణీత కాలపరిమితి ఉంటుంది. ఆ సమయంలో దాన్ని మార్చడం లేదా క్లీన్ చేయడం ద్వారా అత్యుత్తమ పర్ఫార్మెన్స్‌  పొందవచ్చు. ప్రతి 2500 నుంచి మూడు వేల కిలోమీటర్లకు ఒకసారి ఇంజిన్ ఆయిల్ మార్చాలి. ప్రతి రెండు వేల కిలోమీటర్లకు ఒకసారి ఎయిర్‌ ఫిల్టర్‌ క్లీన్ చేయడం వల్ల ఇంజిన్‌కు గాలి ప్రసరణ పెరిగి పవర్ పెరుగుతుంది. పదివేల నుంచి పన్నెండు వేల కిలోమీటర్ల మధ్య స్పార్క్‌ ప్లగ్‌ను తనిఖీ చేయడం వల్ల స్టార్టింగ్ సమస్యలు లేకుండా స్మూత్‌గా సాగుతుంది. ప్రతి ఐదు వేల కిలోమీటర్లకు ఒకసారి వాల్వ్‌‌ క్లియరెన్స్‌ సర్దుబాటు చేయం వల్ల ఇంజిన్ లైఫ్ పెరుగుతుంది. 

సీజన్‌ మెయింటెనెన్స్‌ చిట్కాలు

వాతావరణ పరిస్థితులను బట్టి బైక్ కేర్ తీసుకోవడం చాలా ముఖ్యం. వర్షాకాలంలో చైన్, బ్రేక్స్‌ను అదనంగా చెక్ చేయాలి. ఎందుకంటే నీరు, మట్టి తగిలి ఇవి త్వరగా పాడయ్యే అవకాశం ఉంది. అదే విదంగా వేసవి కాలంలో బ్యాటరీ, కూలెంట్ స్థాయిలను నిరంతరం చెక్ చేయాలి. ఎక్కువ ఇంజిన్ ఆయిల్ పోస్తే ఇంజిన్‌కు మంచిదనే అపోహ మాత్రమే. దీని వల్ల ఇంజిన్ డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది. బైక్ మెయింటెనెన్స్ అనేది కేవలం ఖర్చు కాదు, అది ఒక పెట్టుబడి. ఈ చిట్కాలు పాటించడం ద్వారా మీ బైక్ పర్ఫార్మెన్స్‌ను మెరుగుపరుచుకోవడమే కాుకండా , దీర్ఘకాలంలో వేల రూపాయలను ఆదా చేసుకోవచ్చు.    

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Maruti Suzuki Dzire vs Honda Amaze: మారుతి సుజుకి డిజైర్, హోండా అమేజ్‌లో  ఏది తక్కువ EMIకి వస్తుంది? 
మారుతి సుజుకి డిజైర్, హోండా అమేజ్‌లో  ఏది తక్కువ EMIకి వస్తుంది? 
Honda Cancels EV Plans: హోండా EV కలలు ఆగిపోయాయా? ప్లాన్‌లను ఎందుకు రద్దు చేసింది?
హోండా EV కలలు ఆగిపోయాయా? ప్లాన్‌లను ఎందుకు రద్దు చేసింది?
Best Electric Bikes in India: పెట్రోల్ సంక్షోభం మధ్య ఎలక్ట్రిక్ బైక్ కోసం చూస్తున్నారా? రాయల్ ఎన్‌ఫీల్డ్ సహా బెస్ట్‌ ఆప్షన్స్‌ ఇవే! 
పెట్రోల్ సంక్షోభం మధ్య ఎలక్ట్రిక్ బైక్ కోసం చూస్తున్నారా? రాయల్ ఎన్‌ఫీల్డ్ సహా బెస్ట్‌ ఆప్షన్స్‌ ఇవే! 
Petrol and Diesel Prices: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు! కారణం ఏంటంటే? 
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు! కారణం ఏంటంటే? 
Advertisement

వీడియోలు

IPL 2026 First Phase Schedule | ఐపీఎల్ 2026 సమరానికి షెడ్యూల్ ఖరారు | ABP Desam
Irfan Pathan Predicts Future Captain of Team India | శ్రేయాస్ పై ఇర్ఫాన్ పఠాన్ కామెంట్స్ | ABP Desam
ICC T20 Rankings after T20WC | ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టీమిండియా హవా | ABP Desam
Shivam Dube's Secret Train Journey | ట్రైన్ లో ప్రయాణించిన వరల్డ్ కప్ హీరో | ABP Desam
Sanju Samson Phone Call with Sachin | సంజు విజయం వెనుక సచిన్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ustaad Bhagat Singh Ticket Rates : ఉస్తాద్ భగత్ సింగ్ టికెట్ రేట్స్ పెంపు - బెనిఫిట్ షో టైమింగ్స్ ఇవే!
ఉస్తాద్ భగత్ సింగ్ టికెట్ రేట్స్ పెంపు - బెనిఫిట్ షో టైమింగ్స్ ఇవే!
Farmer admired by CM Chandrababu: ప్రకృతి సేద్యపు ఋషి - 75 సెంట్లలో 52 పంటల అద్భుతం - చంద్రబాబు మెచ్చిన రైతు రోశయ్య
ప్రకృతి సేద్యపు ఋషి - 75 సెంట్లలో 52 పంటల అద్భుతం - చంద్రబాబు మెచ్చిన రైతు రోశయ్య
KTR Letter to Amit Shah: రేవంత్ రెడ్డి బినామీ అక్రమాల కేటీఆర్ ఆరోపణలు - అమిత్ షాకు లేఖ- సీబీఐ, ఈడీ విచారణకు డిమాండ్
రేవంత్ రెడ్డి బినామీ అక్రమాల కేటీఆర్ ఆరోపణలు - అమిత్ షాకు లేఖ- సీబీఐ, ఈడీ విచారణకు డిమాండ్
AP Cabinet decisions: పరిశ్రమలకు కేటాయించిన భూములు 22A నుంచి తొలగింపు -ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం
పరిశ్రమలకు కేటాయించిన భూములు 22A నుంచి తొలగింపు -ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం
Movie Ticket Rates : టికెట్ రేట్స్ హైక్... పవన్ ఉస్తాద్ భగత్ సింగ్‌కు లైన్ క్లియర్!... ఆ ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే
టికెట్ రేట్స్ హైక్... పవన్ ఉస్తాద్ భగత్ సింగ్‌కు లైన్ క్లియర్!... ఆ ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే
Tamil Nadu Assembly Elections 2026: కొత్త పార్టీతో వచ్చేసిన శశికళ - తమిళనాడు రాజకీయాల్లో మరో కీలక మలుపు
కొత్త పార్టీతో వచ్చేసిన శశికళ - తమిళనాడు రాజకీయాల్లో మరో కీలక మలుపు
IAF Wing Commander commits suicide: చత్తీస్‌ఘడ్‌లో వింగ్ కమాండ్ ఆత్మహత్య - భార్యతో గొడవలే కారణమా?
చత్తీస్‌ఘడ్‌లో వింగ్ కమాండ్ ఆత్మహత్య - భార్యతో గొడవలే కారణమా?
IPL 2026: ఐపీఎల్ టికెట్ల విక్రయాలు ఎప్పుడు ప్రారంభమవుతాయి? ఎలా బుక్ చేసుకోవాలి
ఐపీఎల్ టికెట్ల విక్రయాలు ఎప్పుడు ప్రారంభమవుతాయి? ఎలా బుక్ చేసుకోవాలి
Embed widget