అన్వేషించండి

Hero Pleasure Plus లో మూడు వేరియంట్లు - వాటి మధ్య తేడాలేంటి, ఏది మీకు బెస్ట్ ఆప్షన్?

Hero Pleasure Plus స్కూటర్ మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. LX, VX, XTEC ZX ఫీచర్లు, ఎక్స్‌-షోరూమ్‌ ధరలు, తెలుగు రాష్ట్రాల్లో ఆన్‌-రోడ్‌ ఖర్చు వివరాలు తెలుసుకోండి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • హీరో ప్లెజర్ ప్లస్ మూడు వేరియంట్లలో లభ్యమవుతుంది.
  • LX వేరియంట్ బేస్ మోడల్, అనలాగ్ క్లస్టర్ తో వస్తుంది.
  • VX వేరియంట్ లో టెలిస్కోపిక్ సస్పెన్షన్, అలాయ్ వీల్స్ ఉంటాయి.
  • XTEC ZX లో డిజిటల్ క్లస్టర్, LED లైట్స్, బ్యాక్‌రెస్ట్ ఉంటాయి.

Hero Pleasure Plus Price And Features: Hero MotoCorp బ్రాండ్‌ నుంచి చాలా కాలంగా మార్కెట్లో ఉన్న స్కూటర్ Pleasure Plus. తేలికైన బాడీ, మంచి మైలేజ్, సామాన్యులు కూడా భరించగలిగే ధరతో యువత, మహిళల మధ్య ఈ స్కూటర్ మంచి పేరు సంపాదించింది. ప్రస్తుతం ఈ స్కూటర్ మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది, అవి - LX, VX, XTEC ZX. ఒక్కో వేరియంట్‌లో ఏమేం ఫీచర్లు ఉన్నాయి? ధర ఎంత? మీకు ఏది సరైన ఎంపిక అవుతుందో తెలుసుకుందాం.

ఇంజిన్ విషయానికి వస్తే...

మూడు వేరియంట్లలో కూడా ఒకే 109.5cc సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఇచ్చారు. అంటే పవర్, పనితీరు పరంగా పెద్ద తేడా ఉండదు. ఫీచర్లు, సస్పెన్షన్, డిజైన్ అంశాల్లోనే తేడా ఉంటుంది.

LX - బేస్ వేరియంట్

LX అనేది Pleasure Plus లో బేస్ వేరియంట్. ఇందులో స్టీల్ వీల్స్ ఇస్తారు. టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్ ఉండదు. అలాగే Hero i3S ఐడిల్ స్టార్ట్ స్టాప్ సిస్టమ్ కూడా ఉండదు. బ్లూటూత్ కనెక్టివిటీ సదుపాయం కూడా ఇవ్వరు.

ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ పూర్తిగా అనలాగ్ రూపంలో ఉంటుంది. హెడ్‌ల్యాంప్స్‌ హాలోజన్ టైప్. క్రోమ్ ఫినిష్ ఉండే ఫ్రంట్ ఫాస్షియా కనిపిస్తుంది. కానీ పిలియన్ బ్యాక్‌రెస్ట్ ఉండదు. ఇన్నర్ ప్యానెల్ బ్లాక్ ఫినిష్‌లో ఉంటుంది.

ఎక్స్‌-షోరూమ్‌ ధర (ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ): ₹65,473. అన్ని ఖర్చులు, పన్నులు కలుపుకుంటే తెలుగు రాష్ట్రాల్లో ఆన్‌-రోడ్‌ ధర దాదాపు ₹81,957 వరకు ఉంటుంది.

VX - మధ్య వేరియంట్

VX వేరియంట్ LX కంటే ఒక మెట్టు పై స్థాయిలో ఉంటుంది. ఇందులో టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్ ఇస్తారు. అలాగే కాస్ట్ అలాయ్ వీల్స్ కూడా ఉంటాయి. Hero i3S సిస్టమ్ కూడా ఇందులో అందిస్తారు.

ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ డిజి-అనలాగ్ రూపంలో ఉంటుంది. కానీ బ్లూటూత్ కనెక్టివిటీ ఇవ్వరు. హెడ్‌ల్యాంప్స్‌ మాత్రం హాలోజన్ టైప్‌గానే ఉంటాయి. LX మాదిరిగానే పిలియన్ (వెనుక కూర్చునేవారికి) బ్యాక్‌రెస్ట్ ఉండదు.

ఎక్స్‌-షోరూమ్‌ ధర (ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ): ₹67,160, LX కంటే ₹1,613 ఎక్కువ. అన్ని ఖర్చులు కలుపుకుని, తెలుగు రాష్ట్రాల్లో ఆన్‌-రోడ్‌ ధర దాదాపు ₹84,295 వరకు ఉంటుంది.

XTEC ZX - టాప్ వేరియంట్

XTEC ZX ఈ లైనప్‌లో టాప్ వేరియంట్. ఇందులో టెలిస్కోపిక్ సస్పెన్షన్, కాస్ట్ అలాయ్ వీల్స్, i3S సిస్టమ్ ఉంటాయి. అదనంగా బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఇస్తారు.

హెడ్‌ల్యాంప్స్‌ ప్రొజెక్టర్ LED టైప్. ఇన్నర్ ప్యానెల్ డ్యూయల్ టెక్స్చర్ ఫినిష్‌లో ఉంటుంది. ముఖ్యంగా ఈ వేరియంట్‌లో మాత్రమే పిలియన్ బ్యాక్‌రెస్ట్ అందిస్తారు.

ఎక్స్‌-షోరూమ్‌ ధర (ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ): ₹75,501. ఇది VX కంటే ₹4,333 ఎక్కువ. అన్ని ఖర్చులు కలుపుకుని, తెలుగు రాష్ట్రాల్లో ఆన్‌-రోడ్‌ ధర దాదాపు ₹93,972 వరకు ఉంటుంది.

ఏ వేరియంట్ తీసుకోవాలి?

మీరు కేవలం తక్కువ బడ్జెట్‌లో స్కూటర్ కావాలనుకుంటే LX సరిపోతుంది. కొంచెం మంచి సస్పెన్షన్, అలాయ్ వీల్స్ కావాలంటే VX సరైన ఎంపిక. అయితే పూర్తి ఫీచర్లు, బ్లూటూత్, LED లైటింగ్ కావాలంటే XTEC ZX బెస్ట్ ఆప్షన్.

తెలుగు రాష్ట్రాల్లో నగర ప్రయాణాలకు ఈ స్కూటర్ మంచి ఆప్షన్‌. కొనుగోలు చేసే ముందు మీ అవసరం, బడ్జెట్, రోజువారీ వినియోగం చూసుకుని సరైన వేరియంట్ ఎంచుకుంటే మంచిది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Frequently Asked Questions

Hero Pleasure Plus స్కూటర్ ఎన్ని వేరియంట్లలో లభిస్తుంది?

Hero Pleasure Plus స్కూటర్ ప్రస్తుతం మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది: LX, VX, మరియు XTEC ZX.

Pleasure Plus లోని అన్ని వేరియంట్లకు ఒకే ఇంజిన్ ఉంటుందా?

అవును, అన్ని మూడు వేరియంట్లలోనూ ఒకే 109.5cc సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. కాబట్టి పవర్, పనితీరులో పెద్ద తేడా ఉండదు.

LX వేరియంట్ యొక్క ముఖ్య లక్షణాలు ఏమిటి?

LX అనేది బేస్ వేరియంట్. ఇందులో స్టీల్ వీల్స్, హాలోజన్ హెడ్‌ల్యాంప్స్‌, అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటాయి. Hero i3S, బ్లూటూత్ కనెక్టివిటీ, పిలియన్ బ్యాక్‌రెస్ట్ ఉండవు.

XTEC ZX వేరియంట్‌లో ప్రత్యేకతలు ఏమిటి?

XTEC ZX టాప్ వేరియంట్. ఇందులో టెలిస్కోపిక్ సస్పెన్షన్, అలాయ్ వీల్స్, i3S, బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన పూర్తి డిజిటల్ క్లస్టర్, ప్రొజెక్టర్ LED లైటింగ్, మరియు పిలియన్ బ్యాక్‌రెస్ట్ ఉంటాయి.

టాప్ హెడ్ లైన్స్

Pulsar Bikes Discount Sale: యూత్ ఇష్టపడే పల్సర్ బైకులపై భారీ డిస్కౌంట్.. డౌన్‌పేమెంట్, నెలవారీ EMI వివరాలు
యూత్ ఇష్టపడే Pulsar Bikes పై భారీ డిస్కౌంట్.. డౌన్‌పేమెంట్, నెలవారీ EMI వివరాలు
Triumph Bonneville T40 vs పోటీ బైక్‌లు: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌, హోండా, జావా.. ధర, ఫీచర్లలో ఏది బెటర్‌ ఆప్షన్‌?
ట్రయంఫ్ బొన్నెవిల్ T40 vs రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ క్లాసిక్‌ 350, హోండా CB350C, జావా 350 - ఏది బెటర్‌?
Bonneville T40 తో పాటు ట్రయంఫ్ నుంచి 3 కొత్త బైక్‌లు.. 798cc భారీ ఇంజిన్‌తో స్ట్రీట్ ట్రిపుల్ బైక్‌
798cc ఇంజిన్‌తో కొత్త Triumph Street Triple 798 బైక్‌.. Tiger 900, Tiger 1200 బైకుల్లో రాడార్‌ టెక్నాలజీ!
350cc ఇంజిన్‌తో Triumph Bonneville T40 లాంచ్.. 5 రైడింగ్ మోడ్‌లు, క్రూయిజ్ కంట్రోల్‌తో అదుర్స్!
యూత్‌ కోసం ట్రయంఫ్ బొన్నెవిల్ T40 వచ్చేసింది.. ఈ బైక్‌లో చాలా స్పెషల్స్ గురూ!

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Virt Kohli: ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
Chana Dal Coconut Curry : శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
Telangana Padayatra Politics: 2027లో తెలంగాణలో పాదయాత్రల జోరు - ప్రతీ పార్టీ నుంచి రోడ్డెక్కనున్న కీలక నేతలు - ఇక ఎన్నికల హడావుడే ?
2027లో తెలంగాణలో పాదయాత్రల జోరు - ప్రతీ పార్టీ నుంచి రోడ్డెక్కనున్న కీలక నేతలు - ఇక ఎన్నికల హడావుడే ?
Andhra Pradesh Politics: స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చర్చించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. జనసేన ఏం కోరుతోంది!
స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చర్చించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. జనసేన ఏం కోరుతోంది!
Hair Transplant : హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి? కచ్చితంగా తెలుసుకోండి
హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి? కచ్చితంగా తెలుసుకోండి
Shreyas Iyer Breaks Virat Kohli Record: కోహ్లీ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన శ్రేయస్ .. తొలి టీ20లో మెరుపు సెంచరీతో సరికొత్త చరిత్ర
కోహ్లీ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన శ్రేయస్ .. తొలి టీ20లో మెరుపు సెంచరీతో సరికొత్త చరిత్ర
Tirumala: బుధవారం తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు విడుదల.. 10 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
బుధవారం తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు విడుదల.. 10 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Embed widget