అన్వేషించండి

హీరో డెస్టిని 110 పెర్ఫార్మెన్స్‌ టెస్ట్‌: నగర ప్రయాణాలకు సరైన స్కూటరేనా? బ్రేకింగ్, స్పీడ్‌ పూర్తి విశ్లేషణ

Hero Destini 110 performance:హీరో డెస్టిని 110 యాక్సిలరేషన్, రోల్ ఆన్ వేగం, బ్రేకింగ్ పనితీరు ఎలా ఉంది? ధర ఎంత? హైదరాబాద్, విజయవాడ ధరలతో పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • హీరో డెస్టిని 110: 110.9cc ఇంజిన్ 8.1hp, 8.7Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది.
  • 0-60kmph వేగం 8.59 సెకన్లు, నగర ప్రయాణాలకు తగిన పనితీరు.
  • బ్రేకింగ్ 60-0kmph 20.62 మీటర్లు, అత్యవసరాల్లో జాగ్రత్త అవసరం.
  • ధర రూ.72,000 నుంచి రూ.79,750, రెండు వేరియంట్లలో లభ్యం.

Hero Destini 110 performance: తెలుగు రాష్ట్రాల్లో, 125cc కంటే 110cc స్కూటర్లకే మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా నగరాల్లో రోజువారీ ప్రయాణాలకు తక్కువ ఖర్చుతో, సౌకర్యంగా తీసుకెళ్లే వాహనం కావాలనుకునే వారికి ఇది మంచి ఆప్షన్‌. ఈ క్రమంలో, నిజమైన రోడ్డు పరిస్థితుల్లో హీరో డెస్టిని 110 పనితీరు ఎలా ఉందో తెలుసుకోవడానికి ఆటో ఎక్స్‌పర్ట్‌లు ఈ స్కూటర్‌ను టెస్ట్‌ డ్రైవ్‌ చేశారు.

ఇంజిన్ & ఫీచర్లు

హీరో డెస్టిని 110లో 110.9cc, సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజిన్ అందించారు. ఈ ఇంజిన్ 7,250 rpm వద్ద 8.1 hp శక్తిని, 5,750 rpm వద్ద 8.7 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 12 ఇంచుల అలాయ్ వీల్స్‌తో వస్తుంది. హీరో ప్రత్యేకంగా అందించే i3S టెక్నాలజీ ఇందులో ఉంది. ట్రాఫిక్‌ సిగ్నల్ లేదా ఎక్కడైనా బండిని కొన్ని సెకన్లు ఆపితే ఇంజిన్ దానంతట అదే ఆఫ్ అవుతుంది. థ్రాటిల్ తిప్పి బ్రేక్ వదిలితే మళ్లీ స్టార్ట్ అవుతుంది. దీనివల్ల ఇంధనం ఆదా అవుతుంది.

యాక్సిలరేషన్ టెస్ట్ ఫలితాలు

ఎక్స్‌పర్ట్‌లు ఈ బండిని పరీక్షించే సమయంలో వాతావరణ పరిస్థితులు పొడిగానే ఉన్నాయి. డెస్టిని 110 0 నుంచి 40 కి.మీ. వేగాన్ని 3.83 సెకన్లలో చేరింది. 0 నుంచి 60 కి.మీ. వేగానికి 8.59 సెకన్లు పట్టింది. 0 నుంచి 80 కి.మీ. వేగానికి 18.18 సెకన్లు తీసుకుంది.

నగర ప్రయాణాలకు ఇది సరిపడే పనితీరు అందిస్తుంది. 30 నుంచి 60 కి.మీ. వేగం మధ్య రైడింగ్ చేస్తే స్కూటర్ మంచి స్పందన ఇస్తుంది. హైవే మీద కూడా క్రూయిజ్ వేగం అందుకుంటుంది కానీ ఓవర్‌టేక్ చేసే సమయంలో కొంత ప్లానింగ్ అవసరం.

రోల్ ఆన్ యాక్సిలరేషన్

20 నుంచి 50 కి.మీ. వేగానికి 4.74 సెకన్లు పట్టింది. 30 నుంచి 70 కి.మీ. వేగానికి 11.56 సెకన్లు తీసుకుంది. పవర్ డెలివరీ లీనియర్‌గా ఉంటుంది. థ్రాటిల్ స్పందన సాఫ్ట్‌గా ఉండటంతో కొత్త రైడర్లకు, పెద్దవారికి సులభంగా నియంత్రించగలిగే విధంగా ఉంది.

అయితే అధిక వేగాల్లో ఫ్లోర్‌బోర్డ్ వద్ద స్వల్ప వైబ్రేషన్లు కనిపిస్తాయి. నగర ప్రయాణాల్లో మాత్రం స్మూత్ అనుభూతి ఇస్తుంది.

బ్రేకింగ్ పనితీరు

టాప్ ZX వేరియంట్ ముందు డిస్క్ బ్రేక్‌తో వస్తుంది. 60 నుంచి 0 కి.మీ. వేగానికి ‍‌(పూర్తిగా) ఆగేందుకు 20.62 మీటర్ల దూరం తీసుకుంది. బ్రేకింగ్ సెట్‌అప్ నగర ప్రయాణాలకు సరిపోతుంది. అత్యవసర పరిస్థితుల్లో రెండు బ్రేక్ లీవర్లు ఒకేసారి బలంగా పట్టుకుంటే ముందు చక్రం లాక్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త అవసరం.

వేరియంట్లు & ధర

హీరో డెస్టిని 110 ధర రూ.72,000 నుంచి ప్రారంభమై రూ.79,750 వరకు ఉంది (ఎక్స్‌-షోరూమ్‌ ధర). హైదరాబాద్‌లో ఆన్ రోడ్ ధర సుమారు రూ.85,000 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. విజయవాడలో కూడా ఇదే స్థాయిలో ఉంటుంది. ఖచ్చితమైన ధర కోసం సమీప డీలర్‌ను సంప్రదించడం మంచిది.

ఇది రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. టాప్ ZX వేరియంట్‌లో ముందు డిస్క్ బ్రేక్, పిలియన్ బ్యాక్‌రెస్ట్ ఉన్నాయి. రెండు వేరియంట్లలో డిజి అనలాగ్ డ్యాష్ అందించారు. మొత్తం ఐదు కలర్ ఆప్షన్లు ఉన్నాయి. VX వేరియంట్ బ్లాక్, బ్లూ, వైట్ రంగుల్లో వస్తుంది. ZX వేరియంట్ గ్రే, రెడ్ రంగుల్లో అందుబాటులో ఉంటుంది.

మొత్తానికి రోజువారీ నగర ప్రయాణాలకు సౌకర్యంగా, సింపుల్ పనితీరు కావాలనుకునే వారికి హీరో డెస్టిని 110 సరైన ఎంపికగా కనిపిస్తోంది. ఇంధన పొదుపు, సౌకర్యవంతమైన రైడింగ్, తక్కువ నిర్వహణ ఖర్చు వంటి అంశాలు దీనికి ప్లస్ పాయింట్లు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

 

Frequently Asked Questions

హీరో డెస్టిని 110 స్కూటర్ ఇంజిన్ సామర్థ్యం ఎంత?

హీరో డెస్టిని 110 స్కూటర్ 110.9cc, సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది 7,250 rpm వద్ద 8.1 hp శక్తిని, 5,750 rpm వద్ద 8.7 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

హీరో డెస్టిని 110 స్కూటర్‌లోని i3S టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది?

i3S టెక్నాలజీ ట్రాఫిక్‌లో లేదా ఆగినప్పుడు ఇంజిన్‌ను ఆటోమేటిక్‌గా ఆపి, థ్రాటిల్ తిప్పగానే మళ్లీ స్టార్ట్ చేస్తుంది. దీనివల్ల ఇంధనం ఆదా అవుతుంది.

హీరో డెస్టిని 110 స్కూటర్‌లో బ్రేకింగ్ పనితీరు ఎలా ఉంది?

టాప్ ZX వేరియంట్‌లో ముందు డిస్క్ బ్రేక్‌తో వస్తుంది. 60 నుంచి 0 కి.మీ. వేగానికి ఆగడానికి 20.62 మీటర్ల దూరం పడుతుంది. అత్యవసర పరిస్థితుల్లో జాగ్రత్త వహించాలి.

హీరో డెస్టిని 110 స్కూటర్‌ ధర ఎంత?

హీరో డెస్టిని 110 ధర రూ.72,000 నుంచి రూ.79,750 వరకు (ఎక్స్‌-షోరూమ్‌) ఉంది. హైదరాబాద్‌, విజయవాడలలో ఆన్ రోడ్ ధర సుమారు రూ.85,000 నుంచి ప్రారంభం కావచ్చు.

టాప్ హెడ్ లైన్స్

ఫుల్ ట్యాంక్, ఒక్కసారి ఛార్జ్ చేస్తే MG Hector Tomahawk 1100 కి.మీ రేంజ్.. ఈ SUVకి భారీ డిమాండ్
ఫుల్ ట్యాంక్, ఒక్కసారి ఛార్జ్ చేస్తే MG Hector Tomahawk 1100 కి.మీ రేంజ్.. ఈ SUVకి భారీ డిమాండ్
Maruti Suzuki కారు కొనేవాళ్లకు ఈ దసరా చాలా స్పెషల్‌! ఆల్టో నుంచి విక్టోరిస్ వరకు పండుగ ఆఫర్లు
మారుతి కారు కొంటే రూ.1.36 లక్షల వరకు డిస్కౌంట్‌.. దసరా ఆఫర్‌ అదిరిపోలా!
LED vs HID Headlights: రాత్రి ప్రయాణాలు సురక్షితంగా ఉండాలంటే.. కారు హెడ్‌లైట్లలో LED, HID మధ్య తేడాలు తెలుసుకోండి!
కారుకు LED హెడ్‌లైట్లు మంచిదా? HID హెడ్‌లైట్లు మంచిదా? వెలుతురు, ధర, క్వాలిటీలో ఏది బెస్ట్?
MG Windsor EVతో 17,500 కి.మీ. ప్రయాణం.. లాంగ్ జర్నీ సమయంలో వెలుగులోకి వచ్చిన ఆసక్తికర విషయాలు!
MG Windsor EV రివ్యూ.. 17,500 కి.మీ. ప్రయాణించాక ఈ ఎలక్ట్రిక్ కారులో కనిపించిన ప్లస్‌లు, మైనస్‌లు!

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Governor Quota MLC Seats: గ్రాడ్యుయేట్ ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Graduate MLC ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Harish Rao: కత్తి ఆంధ్రావాడిది.. కానీ పొడిచేది తెలంగాణోడు: సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
కత్తి ఆంధ్రావాడిది.. కానీ పొడిచేది తెలంగాణోడు: సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
Chief Selector Twist: అగార్కర్ సీటులో హైదరాబాదీ స్పిన్నర్.. టీమిండియా చీఫ్ సెలెక్టర్ గా ప్రజ్ఞాన్ ఓజా సరికొత్త చరిత్ర, వెస్ట్ జోన్ నుంచి పొవార్ ఎంట్రీతో రేస్ క్లోజ్
అగార్కర్ సీటులో హైదరాబాదీ స్పిన్నర్.. టీమిండియా చీఫ్ సెలెక్టర్ గా ప్రజ్ఞాన్ ఓజా సరికొత్త చరిత్ర, వెస్ట్ జోన్ నుంచి పొవార్ ఎంట్రీతో రేస్ క్లోజ్
Abhijeet Dipke: జైలు నుంచి అభిజీత్ దీప్కే విడుదల.. సౌరవ్ దాస్, ఆశుతోష్ రిలీజ్ కోసం వెయిటింగ్ అని పోస్ట్
జైలు నుంచి అభిజీత్ దీప్కే విడుదల.. సౌరవ్ దాస్, ఆశుతోష్ రిలీజ్ కోసం వెయిటింగ్ అని పోస్ట్
RTC Special Buses: జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
TDP Second List of Candidates: పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
Horror Thrilelr OTT : ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
Washing Machines: ఫ్రంట్ లోడ్ వర్సెస్ టాప్ లోడ్ వాషింగ్ మెషీన్లు.. ఏది బెటర్? మోటార్, వాటర్, స్పిన్ స్పీడ్ తేడాలు ఇవే!
ఫ్రంట్ లోడ్ వర్సెస్ టాప్ లోడ్ వాషింగ్ మెషీన్లు.. ఏది బెటర్? మోటార్, వాటర్, స్పిన్ స్పీడ్ తేడాలు ఇవే!
Embed widget