అన్వేషించండి

Cheapest Disc Brake Bikes: భారత్‌లో చౌకైన 3 డిస్క్ బ్రేక్ బైక్‌లు.. టీవీఎస్ నుంచి బజాజ్ పల్సర్ వరకు ఫీచర్లు, రేంజ్ చూడండి

భారత్ లో చౌకైన బైక్స్ TVS Star City Plus, టీవీఎస్ రేడియన్ (TVS Radeon), బజాజ్ పల్సర్ 125 (Bajaj Pulsar 125). ఇవి మంచి మైలేజ్, డిస్క్ బ్రేక్ లతో వస్తాయి.

Cheapest Disc Brake Bikes in India: మీరు తక్కువ పెట్రోల్ ఖర్చులతో, డిస్క్ బ్రేక్ వంటి భద్రతా ఫీచర్లను అందించే బైక్ కోసం చూస్తున్నారా.. అయితే, భారతదేశంలో 3 బైక్‌లు మీ అవసరానికి తగ్గట్లుగా ఉన్నాయి. టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ (TVS Star City Plus), TVS Radeon, బజాజ్ పల్సర్ 125 (Bajaj Pulsar 125) తక్కువ ధరలోనే కాకుండా మైలేజ్, ఫీచర్లలో కూడా చాలా బాగుంటాయి. వీటి ధరలు తక్కువలో రూ. 73,200 నుంచి ప్రారంభమవుతాయి. ప్రత్యేకంగా నగరంలో ట్రాఫిక్, రోజువారీ రైడ్‌లను సులభతరం చేయడానికి రూపొందించారు. ఆ మూడు బైకుల ధర, వాటి ఫీచర్లను ఇక్కడ తెలుసుకుందాం.

టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ (TVS Star City Plus)

 ఈ జాబితాలో అత్యంత చవకైన బైక్ TVS Star City Plus. దీని ధర రూ. 73,200 నుండి ప్రారంభం కాగా, ఇది 240 mm ఫ్రంట్ డిస్క్ బ్రేక్‌ను కలిగి ఉంది. స్టార్ సిటీ ప్లస్ బైక్ 109.7cc ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది 8.08 bhp పవర్, అదే సమయంలో 8.7 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ 4 స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. దాదాపు 90 kmph గరిష్ట వేగాన్ని అందుకోగలదు. ఇది 83 kmpl వరకు మైలేజ్ ఇస్తుంది. 10 లీటర్ల ట్యాంక్ నింపితే, ఈ బైక్ దాదాపు 800 KM వరకు మైలేజ్ ఇస్తుంది. ఇది LED DRL, డిజిటల్ అనలాగ్ మీటర్, ట్యూబ్‌లెస్ టైర్‌లను కలిగి ఉంది. 

TVS Radeon

TVS Radeon ధర దాదాపు రూ. 80,700గా ఉంది. దీని 109.7cc ఇంజిన్ 8.08 bhp పవర్ తో పాటు 8.7 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌తో పాటు 4 స్పీడ్ గేర్‌బాక్స్ వస్తుంది. టీవీఎస్ Radeon బైక్ దాదాపు 74 kmpl వరకు మైలేజ్ ఇస్తుంది. కాబట్టి పెట్రోల్ ఖర్చు ఆదా అవుతుంది. దీని మంచి డిజైన్, స్ట్రాంగ్ బాడీ, సౌకర్యవంతమైన సీటు రోజువారీ ఉపయోగం కోసం మంచి బైక్‌గా చేస్తాయి.

బజాజ్ పల్సర్ 125 (Bajaj Pulsar 125)

మీరు కొంచెం స్పోర్టీగా కనిపించే బైక్‌ను ఇష్టపడే వారైతే Bajaj Pulsar 125 మీకు మంచి ఎంపిక. దీని డిస్క్ బ్రేక్ మోడల్ రూ. 79,048కి లభిస్తుంది. ఇది 124.4cc ఇంజిన్‌ను కలిగి ఉండగా, ఇది 11.8 PS పవర్, 10.8 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5 స్పీడ్ గేర్‌బాక్స్‌ను కలిగి ఉంది. దాదాపు 100 kmph గరిష్ట వేగం వరకు వెళ్లగల బైక్. మైలేజ్ దాదాపు 51 kmpl. బైక్ LED టెయిల్‌లైట్లు, స్ప్లిట్ సీటు, డిజిటల్ మీటర్, డిస్క్ బ్రేక్‌లను కలిగి ఉంది. ఇది సిటీలో, హైవే రోడ్లు.. రెండింటిలోనూ సులభంగా డ్రైవ్ చేయవచ్చు. 

మీకు ఏ బైక్ సరైనది?

మీరు చౌకైనది, ఎక్కువ మైలేజ్ కోరుకుంటే, TVS Star City Plus బైక్ సరైనది. మీరు రోజువారీ రైడ్ కోసం బెస్ట్ బైక్ కోసం చూస్తున్నట్లయితే TVS Radeon మంచిది. ఒకవేళ మీరు స్పోర్టీ, పవర్‌ఫుల్ బైక్ కోసం చూస్తున్నట్లయితే బజాజ్ Pulsar 125 మీకు మంచి ఎంపిక.

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Konaseema Vande Bharat: కోనసీమ వందే భారత్ ప్రారంభం నేడే.. ట్రైన్ టైమింగ్స్, టికెట్ ధరలు ఇలా
కోనసీమ వందే భారత్ ప్రారంభం నేడే.. ట్రైన్ టైమింగ్స్, టికెట్ ధరలు ఇలా
Ind vs Sa 3rd T20 Records: భారత్-దక్షిణాఫ్రికా మూడో టీ20లో 5 పెద్ద రికార్డులు.. పాండ్యా, తిలక్ వర్మ అరుదైన ఘనత
మూడో టీ20లో 5 పెద్ద రికార్డులు నమోదు.. పాండ్యా, తిలక్ వర్మ అరుదైన ఘనత
BJP National Working President: బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నితిన్ నబిన్, ఆయన బ్యాక్‌గ్రౌండ్ ఏంటి?
బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నితిన్ నబిన్, ఆయన బ్యాక్‌గ్రౌండ్ ఏంటి?
Sahana Sahana Song : 'ది రాజా సాబ్' నుంచి కూల్ మెలోడి సాంగ్ - 'సహానా సహానా' ప్రోమో చూశారా?
'ది రాజా సాబ్' నుంచి కూల్ మెలోడి సాంగ్ - 'సహానా సహానా' ప్రోమో చూశారా?
Advertisement

వీడియోలు

భారతదేశంలోనే అత్యంత విచిత్రమైన ఆచారాలు పాటించే ఉడిపి శ్రీకృష్ణ మందిరం
Abhishek Sharma to Break Virat Record | కోహ్లీ అరుదైన రికార్డుపై కన్నేసిన అభిషేక్
India vs South Africa 3rd T20 | భారత్ x సౌతాఫ్రికా మూడో టీ20
Robin Uthappa on Gambhir Ind vs SA | గంభీర్ పై ఉత్తప్ప కామెంట్స్
Suryakumar Yadav Form in SA T20 Series | సూర్య కుమార్ యాదవ్ పై ట్రోల్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konaseema Vande Bharat: కోనసీమ వందే భారత్ ప్రారంభం నేడే.. ట్రైన్ టైమింగ్స్, టికెట్ ధరలు ఇలా
కోనసీమ వందే భారత్ ప్రారంభం నేడే.. ట్రైన్ టైమింగ్స్, టికెట్ ధరలు ఇలా
Ind vs Sa 3rd T20 Records: భారత్-దక్షిణాఫ్రికా మూడో టీ20లో 5 పెద్ద రికార్డులు.. పాండ్యా, తిలక్ వర్మ అరుదైన ఘనత
మూడో టీ20లో 5 పెద్ద రికార్డులు నమోదు.. పాండ్యా, తిలక్ వర్మ అరుదైన ఘనత
BJP National Working President: బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నితిన్ నబిన్, ఆయన బ్యాక్‌గ్రౌండ్ ఏంటి?
బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నితిన్ నబిన్, ఆయన బ్యాక్‌గ్రౌండ్ ఏంటి?
Sahana Sahana Song : 'ది రాజా సాబ్' నుంచి కూల్ మెలోడి సాంగ్ - 'సహానా సహానా' ప్రోమో చూశారా?
'ది రాజా సాబ్' నుంచి కూల్ మెలోడి సాంగ్ - 'సహానా సహానా' ప్రోమో చూశారా?
Trending Jobs In 2025: ఈ ఉద్యోగాలకు ఏడాది పొడవునా డిమాండ్.. మార్కెట్లో ఈ రంగాలకు తగ్గని ఆదరణ
ఈ ఉద్యోగాలకు ఏడాది పొడవునా డిమాండ్.. మార్కెట్లో ఈ రంగాలకు తగ్గని ఆదరణ
Nissan కొత్త MPV ఫస్ట్ లుక్ రిలీజ్.. భారత మార్కెట్లోకి ఎప్పుడు వస్తుంది, ఫీచర్లు వివరాలు
Nissan కొత్త MPV ఫస్ట్ లుక్ రిలీజ్.. భారత మార్కెట్లోకి ఎప్పుడు వస్తుంది, ఫీచర్లు వివరాలు
Chia Seeds : బరువు తగ్గడానికి చియా సీడ్స్ తీసుకుంటున్నారా? రోజూ తీసుకునేవారు ఆ తప్పు చేయకండి
బరువు తగ్గడానికి చియా సీడ్స్ తీసుకుంటున్నారా? రోజూ తీసుకునేవారు ఆ తప్పు చేయకండి
Ind vs Sa 3rd t20 highlights: మూడో టీ20లో భారత్ ఘన విజయం.. బౌలర్లు భేష్, ఆపై అభిషేక్ తుఫాన్ ఇన్నింగ్స్
మూడో టీ20లో భారత్ ఘన విజయం.. బౌలర్లు భేష్, ఆపై అభిషేక్ తుఫాన్ ఇన్నింగ్స్
Embed widget