Best Bikes: రోజువారీ జర్నీకి Hero Splendor Plus లేక Hero HF Deluxe.. ఏ బైక్ బెటర్.. ఇది తెలుసుకోండి
Hero Splendor Plus | హీరో స్ప్లెండర్ ప్లస్, హీరో HF డీలక్స్ భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న తక్కువ ధర, ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైకులు. రోజువారీ వినియోగం, మైలేజ్, ధర, నిర్వహణలో ఏది ఉత్తమం?

Hero Splendor Plus vs Hero HF Deluxe భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న బైక్‌లలో ఒకటిగా ఉన్నాయి. రెండూ కూడా రోజువారీ అవసరాలకు అత్యంత నమ్మదగిన, చవకైన ఎంపికలు. మీరు ఆఫీసుకు, కాలేజీక, లేదా రోజువారీ పని కోసం బైక్ కొనాలని ఆలోచిస్తున్నారా, ఈ రెండు మోడల్‌లు మీకు సరైన ఎంపిక కావచ్చు. అయితే, వాటి మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకోవడం ద్వారా వీటిలోనూ మీ అవసరానికి తగ్గట్లుగా బైక్ తీసుకోవడం మరింత సులభం అవుతుంది.
ధరలో ఏ బైక్ ఎక్కువ ఆదా చేస్తుంది?
ప్రతి కస్టమర్‌కు ధర ఒక ముఖ్యమైన విషయం. Hero HF Deluxe పూర్తిగా బడ్జెట్ ఫ్రెండ్లీ బైక్, Splendor Plus కంటే దాదాపు 15,000 తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. అందుకే దీనిని ఎంట్రీ-లెవెల్ కొనుగోలుదారులు ఎక్కువగా ఇష్టపడతారు. అదే సమయంలో Splendor Plus కొంచెం ప్రీమియం ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. దాని గ్రాఫిక్స్, బిల్డ్ క్వాలిటీ కూడా కొంచెం మెరుగ్గా ఉంటాయి. మీ బడ్జెట్ కొంచెం ఎక్కువగా ఉంటే, Splendor Plus మంచి ఎంపిక అవుతుంది.
ఇంజిన్ పనితీరులో వ్యత్యాసం ఏంటి..
ఇంజిన్ పరంగా రెండు బైక్‌లు దాదాపు ఒకేలా ఉంటాయి. రెండింటిలోనూ 97.2cc సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఇచ్చారు. ఇది దాదాపు 7.9 bhp శక్తిని, అదే విధంగా 8.05 Nm టార్క్‌ను అందిస్తుంది. రోజువారీ జర్నీలో రెండూ సులభంగా 0-60 kmph వేగాన్ని అందుకుంటాయి. కనుక ఇంజిన్ పనితీరు పరంగా మీకు పెద్దగా తేడా అనిపించదు.
మైలేజ్‌లో ఏది బెస్ట్ బైక్
మైలేజ్ రెండు బైక్‌ల అతిపెద్ద బలం. Hero Splendor Plus బైక్, HF Deluxe బైక్ రెండూ గరిష్టంగా 65 నుంచి 70 kmpl మైలేజ్ ఇస్తాయి. లీటరుకు అంత ఎక్కువ మైలేజ్ ఇచ్చే అతి తక్కువ బైకులలో ఈ రెండూ ఉంటాయి. రెండింటిలోనూ i3S (Idle Start-Stop) ఫీచర్ ఉంది. ఇది ట్రాఫిక్‌లో ఫ్యూయల్ ఆదా చేస్తుంది. మీరు రోజుకు 50- 100 కిలోమీటర్లు ప్రయాణిస్తుంటే, మీరు ఏడాదికి 5,000 నుండి 7,000 రూపాయల వరకు ఆదా చేయవచ్చు.
డిజైన్‌లో ఏ లుక్ బాగుంది?
Hero Splendor Plus లుక్ మరింత ప్రీమియం, క్లాసిక్‌గా కనిపిస్తుంది. దీని రంగు ఎంపికలు, స్టిక్కర్లు, బాడీ ఫినిషింగ్ HF Deluxe కంటే కొంచెం మెరుగ్గా అనిపిస్తుంది. HF Deluxe డిజైన్ సాధారణంగా ఉంటుంది. పూర్తిగా సాధారణ, చవకైన బైక్‌గా తయారు చేశారు.
కంఫర్ట్, బిల్డ్ క్వాలిటీలో ఎవరు ముందున్నారు?
2 బైక్‌లు రోజువారీ ఉపయోగం కోసం సౌకర్యవంతంగా ఉంటాయి. అయితే Splendor Plus సీటు, సస్పెన్షన్ సెటప్ కొంచెం మెరుగ్గా ఉంటాయి. అంత సరిగ్గా లేని రోడ్లపై సైతం Splendor కొంచెం బెటర్ నడుస్తుంది. వైబ్రేషన్ కూడా తక్కువగా అనిపిస్తుంది.
రీసేల్ విలువ ఎందులో ఎక్కువ
Hero బైక్‌లు తక్కువ నిర్వహణకు ప్రసిద్ధి చెందాయి. HF Deluxe, Splendor రెండింటి విడి భాగాలు, సర్వీస్ సెంటర్‌లు ప్రతిచోటా సులభంగా లభిస్తాయి. అయితే Splendor Plus బ్రాండ్ విలువ ఎక్కువ, దాని రీసేల్ విలువ HF Deluxe కంటే కొంచెం మెరుగ్గా ఉంటుంది.
ఏ బైక్ కొనడం మంచిది?
మీ బడ్జెట్ పరిమితంగా ఉండి, మీరు రోజువారీ రన్నింగ్ బైక్ కావాలనుకుంటే Hero HF Deluxe మీకు బెస్ట్ ఛాయిస్. మీరు కొంచెం స్టైలిష్, మరింత సౌకర్యవంతమై, ఎక్కువ కాలం మన్నికగల ప్రీమియం అనుభూతిని కోరుకుంటే Hero Splendor Plus కొనుగోలు చేయాలి. రెండు బైక్‌లు గరిష్టంగా 70 kmpl మైలేజ్ ఇవ్వడం ద్వారా రోజువారీ రన్నింగ్‌ను చాలా చౌకగా చేస్తాయి.






















