News
News
X

TVS Apache: ఏకంగా 50 లక్షలు - సరికొత్త రికార్డు సృష్టించిన అపాచీ!

టీవీఎస్ అపాచీ సిరీస్ బైకుల సేల్స్ ప్రపంచవ్యాప్తంగా 50 లక్షల యూనిట్లను దాటింది.

FOLLOW US: 
Share:

ప్రపంచవ్యాప్తంగా టీవీఎస్ అపాచీ సిరీస్ సేల్స్ 50 లక్షల యూనిట్లను దాటినట్లు టీవీఎస్ మోటార్ కంపెనీ అధికారికంగా ప్రకటించింది. టీవీఎస్ తన మొట్టమొదటి అపాచీని 2005లో లాంచ్ చేసింది. అప్పటి నుంచి అపాచీ సిరీస్‌ను టీవీఎస్ కొనసాగిస్తుంది. దాన్ని విస్తరించింది కూడా. ప్రస్తుతం టీవీఎస్ అపాచీ ప్రపంచవ్యాప్తంగా 60కి పైగా దేశాల్లో అందుబాటులో ఉంది. అన్ని దేశాల్లో ఇది మంచి సేల్స్ నంబర్‌ను నమోదు చేస్తుంది.

అపాచీ సిరీస్‌లో బైక్స్ ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూనే ఉంటాయి. వీటిలో ఫీచర్లు కూడా చాలా ఎక్కువగా ఉంటారు. వినియోగదారులు కూడా ఎక్కువగా అపాచీ వైపే మొగ్గు చూపిస్తూ ఉంటారు. కర్ణాటకలోని హొసూర్‌కు చెందిన టీవీఎస్ ఫ్యాక్టరీ రేసింగ్ టీమ్‌కు దాదాపు 40 సంవత్సరాల అనుభవం ఉంది. ‘Track To Road’ ఫిలాసఫీ ఆధారంగా పని చేసే మోటార్ సైకిల్స్‌ను రూపొందించడానికి, డెవలప్ చేయడానికి ఈ అనుభవం ఉపయోగపడింది.

ఈ మైలురాయిని చేరుకోవడం టీవీఎస్ మోటార్ కంపెనీ ప్రీమియం బిజినెస్ హెడ్ విమల్ సంబ్లీ మాట్లాడారు. ‘ఈ గ్లోబల్ మైల్‌స్టోన్ చేరుకోవడంపై మేం చాలా థ్రిల్లింగ్‌గా ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా అపాచీ ఉపయోగించే వారందరికీ మా కృతజ్ఞతలు. టీవీఎస్ అపాచీని నిజమైన గ్లోబల్ బ్రాండ్‌గా మార్చాలనే నిజాయితీ గల ప్రయత్నాల కారణాలతోనే మా ప్రయాణం నిండి ఉంది.’ అన్నారు.

2021 టీవీఎస్ అపాచీ ఆర్ఆర్ 310
టీవీఎస్ తన అపాచీ కోసం ఎన్నో కొత్త అంశాలను ప్రయత్నించింది. మర్చండైజ్, అపాచీ ఓనర్స్ గ్రూప్ (AOG), అపాచీ రేసింగ్ ఎక్స్‌పీరియన్స్ (ARE), అపాచీ ప్రో పెర్ఫార్మెన్స్ (APP), టీవీఎస్ వన్ మేక్ ఛాంపియన్‌షిప్ వంటి వాటిని టీవీఎస్ ప్రారంభించింది. తన విభాగంలో మొదట ఎన్నో అడ్వాన్స్‌డ్ ఫీచర్లను అపాచీ ప్రారంభించింది.

రైడ్ మోడ్స్, ఫ్యూయల్ ఇంజక్షన్, డ్యూయల్ ఛానెల్ ఏబీఎస్ సిస్టం, స్లిప్పర్ క్లచ్, స్మార్ట్ఎక్స్‌కనెక్ట్ బ్లూటూత్ కనెక్టివిటీ వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. ఇందులో ఆర్‌టీఆర్ (రేసింగ్ త్రోటుల్ రెస్పాన్స్) సిరీస్ కూడా ఉంది. ప్రస్తుతం ఈ సిరీస్‌లో టీవీఎస్ అపాచీ ఆర్‌టీఆర్ 160, టీవీఎస్ అపాచీ ఆర్‌టీఆర్ 160 4వీ, టీవీఎస్ అపాచీ ఆర్‌టీఆర్ 180, ఫ్లాగ్‌‌షిప్ టీవీఎస్ అపాచీ ఆర్‌టీఆర్ 200 4వీ కూడా ఉన్నాయి.

టీవీఎస్ అపాచీ ఆర్ఆర్ 310 (రేస్ రెప్లికా) 2017లో లాంచ్ అయింది. టాప్ ఎండ్ మోడల్స్‌లో దీని విక్రయాలు ఎక్కువగానే సాగాయి. 2021లో ఫెయిర్డ్ సూపర్‌స్పోర్ట్ కోసం కంపెనీ బీటీవో (బిల్ట్ టు ఆర్డర్) ప్లాట్‌ఫారంను ప్రారంభించింది. ఏపీపీఎక్స్ (అపాచీ ప్రో పెర్ఫార్మెన్స్ ఎక్స్‌ట్రీమ్)లో భాగంగా మూడు సంవత్సరాల క్రితం లాంగెస్ట్ రన్నింగ్ స్టంట్ షోను ఎంతో ఎత్తులో ఉన్న స్పిటి వాలీలో నిర్వహించినందుకు గానూ ఆసియా బుక్ ఆఫ్ రికార్డుల్లోకి కూడా టీవీఎస్ ఎక్కింది.

ఇటీవలే టీవీఎస్ అపాచీ ఆర్‌టీఆర్ 165 ఆర్పీ కూడా లాంచ్ అయింది. దీని ఎక్స్-షోరూం ధర రూ.1.45 లక్షలుగా ఉంది. గతంలో లాంచ్ అయిన అపాచీ ఆర్‌టీఆర్ 160 4వీ ఆధారంగా ఈ కారును రూపొందించారు. అయితే ఇది దాని కంటే ఖరీదైనది. ఇందులో కొత్త ఇంజిన్‌ను అందించారు. దీంతో ఈ విభాగంలో ఇదే అత్యంత ఖరీదైన బైక్ కానుంది. ఇందులో కొన్ని మెకానికల్ చేంజెస్ కూడా చేశారు. దీనికి సంబంధించి కేవలం 200 యూనిట్లు మాత్రమే మనదేశంలో విక్రయిస్తానని టీవీఎస్ తెలిపింది.

Published at : 01 Mar 2023 07:36 PM (IST) Tags: TVS Apache TVS Apache Sales TVS Apache Series

సంబంధిత కథనాలు

Mahindra Thar SUV: సైలెంట్‌గా సూపర్ హిట్ అవుతున్న మహీంద్రా ఎస్‌యూవీ - కీలకమైన మైలురాయి!

Mahindra Thar SUV: సైలెంట్‌గా సూపర్ హిట్ అవుతున్న మహీంద్రా ఎస్‌యూవీ - కీలకమైన మైలురాయి!

Kia EV9 SUV: టెస్లా కంటే మెరుగైన ఆటోపైలట్ ఫీచర్‌తో కియా కొత్త కారు - మస్క్‌కి మంట పెడతారా?

Kia EV9 SUV: టెస్లా కంటే మెరుగైన ఆటోపైలట్ ఫీచర్‌తో కియా కొత్త కారు - మస్క్‌కి మంట పెడతారా?

Key steps To Buy Car: సెకండ్ హ్యాండ్ కారు కొనాలి అనుకుంటున్నారా? ఈ 5 విషయాల్లో జాగ్రత్తగా ఉండండి!

Key steps To Buy Car: సెకండ్ హ్యాండ్ కారు కొనాలి అనుకుంటున్నారా? ఈ 5 విషయాల్లో జాగ్రత్తగా ఉండండి!

Expensive Bikes: దేశంలో అత్యంత ఖరీదైన బైక్స్ ఇవే - చూడటం తప్ప కొనడం కష్టమే!

Expensive Bikes: దేశంలో అత్యంత ఖరీదైన బైక్స్ ఇవే - చూడటం తప్ప కొనడం కష్టమే!

Car Fuel Tank Tips: కారులో ట్యాంక్ ఫుల్ చేయిస్తున్నారా? - అయితే మీ వాహనం డేంజర్‌లో ఉన్నట్లే! - ఎందుకో తెలుసా?

Car Fuel Tank Tips: కారులో ట్యాంక్ ఫుల్ చేయిస్తున్నారా? - అయితే మీ వాహనం డేంజర్‌లో ఉన్నట్లే! - ఎందుకో తెలుసా?

టాప్ స్టోరీస్

Hyderabad Metro Charges : హైదరాబాద్ వాసులకు మెట్రో షాక్, రద్దీ సమయాల్లో రాయితీ ఎత్తివేత!

Hyderabad Metro Charges : హైదరాబాద్ వాసులకు మెట్రో షాక్, రద్దీ సమయాల్లో రాయితీ ఎత్తివేత!

GT vs CSK: గుజరాత్, చెన్నై ఏ ఆటగాళ్లతో బరిలోకి దిగుతాయి - మొదటి మ్యాచ్‌కు మరికొద్ది గంటలే!

GT vs CSK: గుజరాత్, చెన్నై ఏ ఆటగాళ్లతో బరిలోకి దిగుతాయి - మొదటి మ్యాచ్‌కు మరికొద్ది గంటలే!

Tenali Council Fight : తెనాలి మున్సిపల్ కౌన్సిల్ లో రసాభాస, చొక్కాలు చిరిగేలా కొట్టుకున్న టీడీపీ, వైసీపీ కౌన్సిలర్లు

Tenali Council Fight : తెనాలి మున్సిపల్ కౌన్సిల్ లో రసాభాస, చొక్కాలు చిరిగేలా కొట్టుకున్న టీడీపీ, వైసీపీ కౌన్సిలర్లు

Naga Chaitanya : చైతూను కావాలని టార్గెట్ చేశారా? డివోర్స్, డేటింగ్ రూమర్స్ - ప్లాన్ ప్రకారమే ప్రతిదీ తెరపైకి?

Naga Chaitanya : చైతూను కావాలని టార్గెట్ చేశారా? డివోర్స్, డేటింగ్ రూమర్స్ - ప్లాన్ ప్రకారమే ప్రతిదీ తెరపైకి?