Triumph Upcoming Bike: ట్రయంఫ్ 'స్క్రాంబ్లర్ 400 XC' టీజర్ రిలీజ్ - ఆఫ్‌రోడ్, ఆన్‌రోడ్ దేనికైనా రెడీ!
Triumph Scrambler 400 XC: ట్రయంఫ్ తన అప్‌కమింగ్ బైక్ స్క్రాంబ్లర్ 400 XC టీజర్‌ను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో షేర్ చేసింది. ఈ బైక్ అతి త్వరలో భారత్‌లో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు.

2025 Triumph Scrambler 400 XC Engine, Design and Features: ట్రయంఫ్ మోటార్‌సైకిల్స్, భారతదేశంలో త్వరలో లాంచ్ చేయనున్న స్క్రాంబ్లర్ 400 XC కోసం బైక్ ప్రేమికులు ఎదురు చూస్తున్నారు. న్యూస్ లీక్స్ ఆధారంగా, లాంచింగ్‌కు ముందే ఈ బండిపై భారీ అంచనాలు ఉన్నాయి. సిటీ రైడ్ & లాంగ్ రైడ్ చేసే క్లాస్ రైడర్లు, ఆఫ్-రోడింగ్‌లో అడ్వెంచర్లు చేసే మాస్ రైడర్లు ఈ మోటర్ సైకిల్ ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు రౌండ్స్ కొడదామా అని వెయ్యి కళ్లతో వెయిట్ చేస్తున్నారు.
బైక్ రైడింగ్ ప్రేమికుల ఆతృత నడుమ, ట్రయంఫ్, తన అప్‌కమింగ్ బైక్ స్క్రాంబ్లర్ 400 XC అధికారిక టీజర్ విడుదల చేసింది. ఈ మోటార్ సైకిల్ కంపెనీ, ఈ టీజర్‌ను తన సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో షేర్ చేసింది. ఈ టీజర్‌ను బట్టి బైక్ డిజైన్ & ఇంజిన్, ఫీచర్ల గురించి ఒక అవగాహనకు రావచ్చు. ఈ బైక్ రాబోయే కొన్ని వారాల్లో భారతీయ రోడ్లపైకి వస్తుందని భావిస్తున్నారు.
స్టైలిష్ ఎక్స్‌టీరియర్ & న్యూ కలర్
స్క్రాంబ్లర్ 400 XC టీజర్ చూస్తే, ఈ బైక్ కొత్త పసుపు రంగులో లాంచ్ కానుందని స్పష్టంగా తెలుస్తుంది, ఇప్పటివరకు ఏ ఇతర ట్రయంఫ్ మిడిల్ వెయిట్ బైక్‌లోనూ ఇది కనిపించలేదు. ఈ మోటార్ సైకిల్‌లో చెప్పుకోవాల్సిన అత్యంత ప్రత్యేక ఫీచర్ ట్యూబ్‌లెస్ టైర్లతో వచ్చే క్రాస్-స్పోక్ వీల్స్. బైక్‌కు సూపర్ సస్పెన్షన్ సపోర్ట్ అందించడానికి 43 mm USD ఫ్రంట్ ఫోర్కులు & అడ్జస్టబుల్ రియర్ మోనో-షాక్ బైక్‌లో ఉండవచ్చు. ఇది ఈ బండి ఆఫ్-రోడింగ్ కెపాసిటీని పెంచుతుంది, మట్టి రోడ్లపై దుమ్ము రేపుతుంది, అడ్వెంచర్ బైక్‌గా ప్రత్యేకంగా నిలుస్తుంది.
స్క్రాంబ్లర్ 400 XC ఇంజిన్ & పెర్ఫార్మెన్స్
ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 400 XC 398cc సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌తో పవర్ పొందుతుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 39.5 bhp పవర్ & 37.5 Nm టార్క్ ఉత్పత్తి చేయగలదు. 398cc పవర్‌ఫుల్ ఇంజిన్‌కు 6-స్పీడ్ గేర్ బాక్స్‌ను యాడ్ చేశారు. ఈ రెండూ కలిసి బండిని వందే భారత్ వేగంతో నడిపిస్తాయి, అదే సమయంలో స్మూత్ రైడింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను కూడా అందిస్తాయి. ఈ అప్‌కమింగ్ బైక్‌లో కంపెనీ కొన్ని కాస్మెటిక్ అప్‌డేట్స్ కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది, ఈ మార్పులు ట్రయంఫ్ స్టాండర్డ్ 400X కంటే భిన్నంగా ఉండవచ్చు. రిపోర్ట్స్ ప్రకారం, 2025 స్క్రాంబ్లర్ 400 XC ధర స్టాండర్డ్ 400X రేటు కంటే దాదాపు రూ. 25,000 నుంచి రూ. 30,000 వరకు ఎక్కువగా ఉండవచ్చు.
ఓవరాల్‌గా చూస్తే... 2025 ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 400 XC ఒక స్టైలిష్ & పవర్‌ఫుల్ మోటార్‌సైకిల్‌గా రాబోతోంది. ఆకట్టుకునే అద్భుతమైన డిజైన్, పవర్‌పుల్ ఇంజిన్, అడ్వాన్స్‌డ్ ఫీచర్లు & ఆఫ్-రోడింగ్ కెపాసిటీతో ఈ బండి కంప్లీట్ ప్యాకేజ్‌గా ఉండొచ్చు. మరికొన్ని వారాల్లో లాంచ్ కానున్న స్క్రాంబ్లర్ 400 XC, భారతీయ మార్కెట్లో ఎంత ధర (2025 Triumph Scrambler 400 XC Price) పలుకుతుందో చూడాలి.





















