Triumph Daytona 660 కొంటే ఏకంగా రూ.1 లక్ష డిస్కౌంట్ – Ninja 650కి డైరెక్ట్ కాంపిటీషన్ ఇచ్చే రేటు!
ట్రయంఫ్ డేటోనా 660పై రూ.1 లక్ష క్యాష్ డిస్కౌంట్ అందుబాటులోకి వచ్చింది. ఎంపిక చేసిన డీలర్‌షిప్‌ల్లో మాత్రమే లభించే ఈ ఆఫర్‌తో బైక్ ధర నింజా 650కి మరింత దగ్గరగా ఉంటుంది.

Triumph Daytona 660 Discount December 2025: స్పోర్ట్ బైక్‌లను ఇష్టపడే రైడర్లకు ట్రయంఫ్ ఇండియా ఒక సూపర్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. భారత మార్కెట్లో ఎంతో పాపులర్ అయిన ట్రయంఫ్ డేటోనా 660 కొనేవాళ్లకు ఇప్పుడు రూ.1 లక్ష క్యాష్ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ప్రస్తుతం దేశంలోని కొన్ని ఎంపిక చేసిన డీలర్‌షిప్‌ల్లో మాత్రమే ఈ ఆఫర్ ఉంది. అయితే ఈ ఆఫర్‌ను దేశవ్యాప్తంగా అందుబాటులో తెస్తారా, లేదా అనే విషయాన్ని ట్రయంఫ్ అధికారికంగా ఇప్పటికీ వెల్లడించలేదు.
ధర విషయంలో డేటోనా 660 ఇప్పుడు మరింత ఆకర్షణీయం
డేటోనా 660 వైట్ కలర్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర ₹9.88 లక్షలు కాగా, రెడ్/బ్లాక్ వేరియంట్లు ₹10.03 లక్షలు. ఇప్పుడు ₹1 లక్ష తగ్గింపుతో ఈ ధరలు నేరుగా Kawasaki Ninja 650 (₹7.77 లక్షలు ఎక్స్-షోరూమ్)కి దగ్గరకు వస్తాయి. అలాగే, Honda CBR650R (₹11.16 లక్షలు) కంటే మరింత తక్కువ ధరగా మారతాయి.
దిల్లీ డీలర్‌షిప్ డేటా ప్రకారం, డిస్కౌంట్ తర్వాత డేటోనా 660 ఆన్-రోడ్ ధర ₹11.40 లక్షల నుంచి స్టార్ట్ అవుతోంది. స్పోర్ట్ బైక్ సెగ్మెంట్‌లో ఇది మంచి డీల్‌గా చెప్పుకోవచ్చు.
ట్రయంఫ్ స్పెషాలిటీ ఇన్‌లైన్ ట్రిపుల్ ఇంజిన్
డేటోనా 660లో 660cc ఇన్‌లైన్-ట్రిపుల్ లిక్విడ్-కూల్డ్ ఇంజిన్ ఉంది. ఇది 95hp పవర్ (11,250rpm) & 69Nm టార్క్ (8,250rpm) ఇస్తుంది. ఈ ఇంజిన్‌కు 6-స్పీడ్ గేర్‌బాక్స్, స్లిప్-అసిస్ట్ క్లచ్ యాడ్ అయ్యాయి. సిటీలో కానీ, హైవే మీద కానీ ఈ ఇంజిన్ డైరెక్ట్‌గా పవర్ డెలివరీ ఇస్తూ రైడర్లను ఆకట్టుకుంటుంది.
హార్డ్‌వేర్ – ప్రీమియం స్పోర్ట్ బైక్‌కు తగ్గ సెటప్
డేటోనా 660, హ్యాండ్లింగ్ మీద కూడా బాగానే ఫోకస్ పెట్టిన బైక్. ముందు భాగంలో షోవా 41mm USD ఫోర్క్, వెనుక మోనోషాక్ ఉన్నాయి. బ్రేకింగ్ సెటప్ కూడా సాలిడ్‌గా ఉంటుంది, ముందు ట్విన్ 310mm డిస్కులు, వెనుక 220mm డిస్క్ ఉన్నాయి. హార్డ్ బ్రేకింగ్ పరిస్థితుల్లో కూడా ఈ బైక్ చాలా స్టేబుల్‌గా ఉంటుంది.
ఫీచర్లు – మోడర్న్ రైడర్ల కోసం పర్ఫెక్ట్ ప్యాక్
డేటోనా 660లో రైడ్-బై-వైర్ థ్రోటిల్, మూడు రైడింగ్ మోడ్‌లు (Sport, Road, Rain), అడ్జస్టబుల్ ట్రాక్షన్ కంట్రోల్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉన్నాయి. ఈ కాంబినేషన్ రైడింగ్ అనుభవాన్ని మరింత రిఫైన్డ్‌గా చేస్తుంది.
ఆఫర్ ఎంతకాలం ఉంటుంది?
డేటోనా 660 మీద ప్రకటించిన రూ.లక్ష ఈ డిస్కౌంట్ MY2025 మోడళ్లకు మాత్రమే వర్తిస్తుంది. అంతేకాదు, ఈ ఆఫర్ లిమిటెడ్ పీరియడ్ మాత్రమే అందుబాటులో ఉంటుంది. కానీ, ఈ డిస్కౌంట్ కోసం ఖచ్చితమైన ముగింపు తేదీ ట్రయంఫ్ ప్రకటించలేదు. కాబట్టి మీ ప్రాంతం డీలర్‌షిప్‌ను సంప్రదించి ఆఫర్ అందుబాటులో ఉందో, లేదో చెక్ చేసుకోవడం బెస్ట్.
ట్రయంఫ్ డేటోనా 660పై రూ.1 లక్ష తగ్గింపు రావడంతో, ఈ బైక్ ఇప్పుడు మరింత వ్యాల్యూ-ఫర్-మనీ ఆప్షన్. కొత్త ఆఫర్, స్పోర్ట్ రైడింగ్, ప్రీమియం ఫీచర్లు, బ్రాండ్ వాల్యూ అన్నీ కంబైన్డ్‌గా యువ రైడర్లను బాగా ఆకర్షించే అవకాశం ఉంది.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.





















