అన్వేషించండి

Harley Davidson X440 2025 లైనప్‌ ఇదే - కొత్త T వేరియెంటే హైలైట్‌, Denim వేరియెంట్‌ ఔట్‌

2025 Harley Davidson, తన X440 లైనప్‌లో డెనిమ్‌ వేరియెంట్‌ నిలిపివేస్తూ, కొత్త X440 T‌ను ఫ్లాగ్‌షిప్‌గా ప్రవేశపెట్టింది. Vivid, S వేరియంట్ల ధరలు తగ్గగా, T వేరియెంట్‌లో మరిన్ని ఫీచర్లు జోడించింది.

Harley Davidson X440 Lineup 2025: హార్లే డేవిడ్‌సన్‌, 2025 కోసం తన X440 లైనప్‌ను రిఫ్రెష్‌ చేస్తూ కొన్ని కీలక మార్పులు చేసింది. ఇండియన్‌ మార్కెట్‌లో మంచి డిమాండ్‌ తెచ్చుకున్న ఈ మిడ్‌-సైజ్‌ రెట్రో స్ట్రీట్‌ మోటార్‌సైకిల్‌ను ఇప్పుడు మరింత అప్‌డేటెడ్‌గా, మరిన్ని విభిన్నమైన వేరియెంట్లతో అందుబాటులోకి తెచ్చింది. ముఖ్యంగా, Denim వేరియెంట్‌ను కంప్లీట్‌గా తీసేయడం, కొత్తగా T‌ వేరియంట్‌ని ఫ్లాగ్‌షిప్‌గా తీసుకురావడం పెద్ద అప్‌డేట్‌గా చెప్పుకోవచ్చు.

X440 లైనప్‌లో ఏం మారింది?
2025 లైనప్‌లో ఇప్పుడు మూడు వేరియెంట్లు మాత్రమే ఉన్నాయి, అవి - Vivid, S & కొత్తగా వచ్చిన T. డెనిమ్‌ వేరియెంట్‌ను తీసేయడంతో, ఎంట్రీ-లెవల్‌ ఆప్షన్‌గా ఇప్పుడు Vivid నిలిచింది. అదనంగా, Vivid & S వేరియెంట్ల ధరలను ₹25,000 తగ్గించడం కూడా కస్టమర్లకు మంచి బెనిఫిట్‌. ఈ ధర తగ్గింపు వల్ల కొత్త T వేరియెంట్‌ పర్ఫెక్ట్‌ ఫ్లాగ్‌షిప్‌ పొజిషన్‌లోకి వచ్చింది.

ఈ మూడు వేరియెంట్లలోనూ (Vivid, S & T) ఒకే ఇంజిన్‌ - 440cc సింగిల్‌ సిలిండర్‌, ఎయిర్/ఆయిల్‌ కూల్డ్‌ ఇంజిన్‌ - ఉంటుంది. ఇది 6-స్పీడ్‌ గేర్‌బాక్స్‌తో 27hp పవర్‌, 38Nm టార్క్‌ ఇస్తుంది. సస్పెన్షన్‌, బ్రేకులు, ఫ్రేమ్‌ వంటి ప్రధాన భాగాలు మొత్తం లైనప్‌లో (అన్ని వేరియంట్లకూ) ఒకేలా ఉంటాయి, మార్పులు లేవు.

X440 Vivid – ఎంట్రీ లెవల్‌, కానీ ఆకర్షణీయమైన ఫీచర్లు
Vivid ధర ₹2.35 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌). 
డెనిమ్‌ వేరియెంట్‌లో ఉన్న spoke వీల్స్‌ స్థానంలో, ఇప్పుడు, ఈ వేరియెంట్‌లో అలాయ్‌ వీల్స్‌, ట్యూబ్‌లెస్‌ టైర్లు వచ్చాయి. ట్యాంక్‌పై స్టిక్కర్‌ డిజైన్‌ ఉండగా, Sలో ఉన్న 3D లోగో ఇక్కడ లేదు. 3.5-అంగుళాల TFT డిస్‌ప్లే ఉన్నప్పటికీ, బ్లూటూత్‌ కనెక్టివిటీ మిస్సింగ్‌. కాబట్టి జియో-ఫెన్స్‌, రిమోట్‌ ఇమ్మోబిలైజర్‌, వెహికల్‌ డయాగ్నస్టిక్స్‌, ఫైండ్‌ మై బైక్‌, థెఫ్ట్‌ అలర్ట్స్‌ వంటి ఫీచర్లు అందుబాటులో ఉండవు. అయినా, ఈ ధర వద్ద ఇది మంచి విలువైన వేరియెంట్‌గానే చెప్పుకోవాలి.

X440 S – ప్రీమియం లుక్‌తో మధ్య స్థాయి వేరియెంట్‌
X440 S ధర ₹2.55 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌).
Vivid కంటే ₹20,000 ఎక్కువ అయిన ఈ వేరియెంట్‌ అదనపు కనెక్టివిటీ ఫీచర్లతో, మరింత ప్రీమియం లుక్‌తో వచ్చింది.
బ్లూటూత్‌ కనెక్టివిటీ వల్ల:
• నావిగేషన్‌
• మ్యూజిక్‌ కంట్రోల్‌
• కాల్‌ అలర్ట్స్‌
• ఫోన్‌ బ్యాటరీ స్టేటస్‌
• మెసేజ్‌ నోటిఫికేషన్లు
అందుబాటులో ఉంటాయి. డైమండ్‌ కట్‌ అలాయ్‌ వీల్స్‌, మెషిన్‌ ఫినిష్‌ ఇంజిన్‌ ఫిన్స్‌, కొన్ని బ్రాంజ్‌ అక్సెంట్స్‌ బైక్‌కు మోర్‌ రిచ్‌ ఫీలింగ్‌ ఇస్తాయి.

X440 T – కొత్త ఫ్లాగ్‌షిప్‌, మరింత టెక్నాలజీతో
X440 T ధర ₹2.80 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌).

2025 లైనప్‌లో అత్యంత ముఖ్యమైన అప్‌డేట్‌ ఇదే. ఈ T వేరియెంట్‌లో —
• రైడ్‌-బై-వైర్‌ థ్రోటిల్‌
• మార్చుకోదగిన ట్రాక్షన్‌ కంట్రోల్‌
• మార్చుకోదగిన ABS
• రోడ్‌ & రెయిన్‌ మోడ్స్‌
లభిస్తాయి. ఈ మోడ్స్‌ వల్ల థ్రోటిల్‌ రెస్పాన్స్‌ను మార్చడం, ట్రాక్షన్‌ సెట్టింగ్స్‌ మార్చడం వంటివి వీలవుతాయి.

కొత్తగా జోడించిన "పానిక్‌ బ్రేకింగ్‌ అలర్ట్‌"తో, హార్డ్‌ బ్రేకింగ్‌ సమయంలో అన్ని ఇండికేటర్లు ఆటోమేటిక్‌గా వెలుగుతాయి, వెనుక వెళ్తున్న వాహనాలకు వార్నింగ్‌లా పని చేస్తాయి.

డిజైన్‌ మార్పులు కూడా ముఖ్యమే
X440 T వెర్షన్‌లో రియర్‌ సెక్షన్‌ను పూర్తిగా రీడిజైన్‌ చేశారు. కొత్త సబ్‌ ఫ్రేమ్‌, పొడవైన టెయిల్‌ కౌల్‌, కొత్త పిలియన్‌ (కో-రైడర్‌) సీట్‌, గ్రాబ్‌ రైల్స్‌ ఈ బైక్‌ను మరింత బ్యాలెన్స్‌డ్‌గా కనిపించేలా చేస్తాయి. అదనంగా, బార్‌-ఎండ్‌ మిర్రర్లు కూడా మరో ప్రత్యేకత.

2025 Harley Davidson X440 లైనప్‌ కస్టమర్లకు మరింత క్లారిటీ, మరిన్ని ఫీచర్లు, మంచి ధరలో మంచి ఆప్షన్లు అందిస్తోంది. Vivid విలువైన ఎంట్రీ-లెవల్‌ వేరియెంట్‌, S మరింత ఫీచర్‌ రిచ్‌, T మాత్రం పూర్తిస్థాయి ప్రీమియం ఎక్స్‌పీరియన్స్‌ అందించే ఫ్లాగ్‌షిప్‌ వేరియంట్‌.

తెలుగు ప్రజల కోసం, ముఖ్యంగా యువత దృష్టితో చూస్తే - ధర, లుక్‌, ఫీచర్లు, టెక్నాలజీ పరంగా X440 T ఎక్కువ ఆకట్టుకుంటుంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

BMW F 450 RR వేరియంట్లలో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి? టాప్‌ మోడల్‌లో స్పెషల్‌ ఏంటి?
ఈ బైక్‌లో క్లచ్‌ వాడకుండానే గేరు మార్చొచ్చు.. BMW F 450 RR ప్రత్యేకతలు ఇవే!
రెనాల్ట్‌ డస్టర్‌ హైబ్రిడ్‌ vs మారుతి విక్టోరిస్‌ హైబ్రిడ్‌.. మైలేజీ, ఫీచర్లు, ధరలో ఏది ఎక్కువ బెనిఫిట్‌ ఇస్తుంది?
రెనాల్ట్‌ డస్టర్‌ హైబ్రిడ్‌ vs మారుతి విక్టోరిస్‌ హైబ్రిడ్‌.. ధర, ఫీచర్లు, మైలేజీలో ఏది బెస్ట్‌?
మీ వెహికల్‌ RC కార్డు పోతే టెన్షన్ వద్దు.. డూప్లికేట్ RC కోసం ఇంట్లో నుంచే దరఖాస్తు చేసుకోవచ్చు!
మీ బండి RC పోయిందా? డూప్లికేట్ పొందడం ఎలా? ఆన్‌లైన్‌లో దరఖాస్తు విధానం ఇదే!
Secon-hand Tata Nexon: సెకండ్‌హ్యాండ్‌లో టాటా నెక్సాన్‌ కొనాలా? అదిరిపోయే ఫీచర్లు.. కానీ ఈ 3 సమస్యలు ఉంటే మీ జేబుకు చిల్లు పడినట్టే!
సెకండ్ హ్యాండ్ టాటా నెక్సాన్ కొనాలనుకుంటున్నారా? లక్షలు పెట్టే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan In Pulivendula: ఈ 21నుంచి 3 రోజులు పులివెందులలోనే జగన్.. దగ్గరుండి వైసీపీ నామినేషన్లు పర్యవేక్షణ
ఈ 21నుంచి 3 రోజులు పులివెందులలోనే జగన్.. దగ్గరుండి వైసీపీ నామినేషన్లు పర్యవేక్షణ
VC Sajjanar: పాలపిట్టలను బంధిస్తే కఠిన చర్యలు.. ఈ నెంబర్లకు కాల్ చేయండి: హైదరాబాద్ సీపీ సజ్జనార్
పాలపిట్టలను బంధిస్తే కఠిన చర్యలు.. ఈ నెంబర్లకు కాల్ చేయండి: హైదరాబాద్ సీపీ సజ్జనార్
Vizag Araku Trains: దసరా రద్దీకి రైల్వే ఊరట.. విశాఖ- అరకు రైలుకు అదనపు విస్టాడోమ్ కోచ్ పెంపు!
దసరా రద్దీకి రైల్వే ఊరట.. విశాఖ- అరకు రైలుకు అదనపు విస్టాడోమ్ కోచ్ పెంపు!
Nagole Road Accident: నాగోల్‌‌లో పైప్‌లైన్‌ను ఢీకొట్టిన కారు, వ్యక్తి మృతి- వరద బీభత్సంతో నీటి సరఫరా బంద్
నాగోల్‌‌లో పైప్‌లైన్‌ను ఢీకొట్టిన కారు, వ్యక్తి మృతి- వరద బీభత్సంతో నీటి సరఫరా బంద్
Andhra Pradesh Rains: ఏపీకి తుపాను గండం.. మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు- 60 కి.మీ వేగంలో ఈదురుగాలులు
ఏపీకి తుపాను గండం.. మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు- 60 కి.మీ వేగంలో ఈదురుగాలులు
KTR New Look : క్లాస్ నుంచి మాస్ వైపు KTR - మేక్ ఓవర్‌తో ఓట్లు రాలతాయా.. కేవలం రాజకీయ గిమ్మిక్కేనా?
క్లాస్ నుంచి మాస్ వైపు KTR - మేక్ ఓవర్‌తో ఓట్లు రాలతాయా.. కేవలం రాజకీయ గిమ్మిక్కేనా?
Samson Super Fandom: రజినీకాంత్ సినిమా కోసం థియేటర్ మొత్తాన్ని బుక్ చేసిన సంజు .. జైలర్ 2 స్పెషల్ షోతో టీమిండియా స్టార్ భారీ సెలబ్రేషన్
రజినీకాంత్ సినిమా కోసం థియేటర్ మొత్తాన్ని బుక్ చేసిన సంజు .. జైలర్ 2 స్పెషల్ షోతో టీమిండియా స్టార్ భారీ సెలబ్రేషన్
Thalassemia in Kids : చిన్నపిల్లల్లో తలసేమియాకు కారణాలు, లక్షణాలు ఇవే.. తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
చిన్నపిల్లల్లో తలసేమియాకు కారణాలు, లక్షణాలు ఇవే.. తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
Embed widget