అన్వేషించండి

Rynox Apex Evo జాకెట్‌ రివ్యూ - స్పోర్టీ రైడర్ల కోసం పర్ఫెక్ట్ ఫిట్‌, పర్ఫెక్ట్‌ ప్రొటెక్షన్‌

స్పోర్టీ రైడర్ల కోసం తయారైన Rynox Apex Evo జాకెట్‌ ప్రొటెక్షన్‌, కంఫర్ట్‌ & ప్రీమియం మెటీరియల్‌తో బెస్ట్‌ రైడింగ్‌ అనుభవం ఇస్తుంది. స్లిమ్ బాడీ రైడర్లకు ఇది పర్ఫెక్ట్‌ ఫిట్‌.

Rynox Apex Evo Riding Jacket: ఇండియన్‌ బైకర్లలో రైనాక్స్‌ బ్రాండ్‌ అంటే మంచి నమ్మకం. ఇప్పుడు అదే కంపెనీ తీసుకొచ్చిన Rynox Apex Evo జాకెట్‌ స్పోర్టీ రైడర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన అత్యంత ఫోకస్డ్‌ గేర్‌. మొదటి చూపులోనే ఈ జాకెట్‌ ప్రీమియం ఫీలింగ్‌ ఇస్తుంది. Invista Cordura ఫ్యాబ్రిక్‌, స్ట్రెచ్‌ ప్యానెల్స్‌, ఎల్లో & షోల్డర్‌ స్లైడర్లు, ఛెస్ట్‌ మీద రైనాక్స్‌ బ్రాండింగ్‌ - ఇవన్నీ చూస్తేనే ఇది ఒక హై-ఎండ్ స్పోర్ట్స్‌ రైడింగ్‌ జాకెట్‌ అని అర్థమవుతుంది.

రైడర్‌ బాడీకి సరిపోయేలా డిజైనింగ్‌
జాకెట్‌ను వేసుకున్న వెంటనే అత్యంత పటిష్టమైన, పర్ఫెక్ట్‌ ఫిట్‌ అనిపిస్తుంది. చేతుల మీద వెల్క్రో అడ్జస్ట్‌మెంట్లను తీసేయడంతో, ఈ జాకెట్‌ రైడర్‌ బాడీకి సరిగ్గా అమరినట్లు సరిపోతుంది. టక్‌ అయ్యే పొజిషన్‌లోకి వంగినప్పుడు ముందుభాగంలో జాకెట్‌ బల్జ్‌ అవ్వకపోవడం రైడర్లకు పెద్ద ప్లస్‌ పాయింట్‌. వెయిస్ట్‌ వద్ద మాత్రమే సర్దుబాటు స్ట్రాప్‌ ఉంటుంది, కానీ చాలా మందికి అది అవసరం కూడా ఉండదు.

లెవల్‌ 2 ఆర్మర్‌
ఈ జాకెట్‌ CE Class AA సర్టిఫికేషన్‌తో పాటు పూర్తి లెవల్‌ 2 ఆర్మర్‌ అందిస్తుంది, ఇది ఇండియన్ మార్కెట్‌లో చాలా అరుదు. భుజాలు, మోచేతులు, వీపు భాగం, ఛాతీ భాగం.. ఇలా అన్ని ప్రాంతాల్లో ప్రొటెక్షన్‌ ఉండడం ఈ జాకెట్‌ ప్రధాన హైలైట్‌. షోల్డర్‌-ఎల్బో ప్రొటెక్షన్లు RHEON టెక్నాలజీతో ఉండగా, ఛెస్ట్‌ ప్రొటెక్టర్లు CERROS తో వచ్చాయి. స్లిమ్ బాడీ ఉన్న రైడర్లకు ఈ జాకెట్‌ అత్యంత గట్టిగా, కంఫర్ట్‌గా ఉంటుంది. అయితే మస్క్యులర్‌ బాడీ (కండలు తిరిగిన శరీరం) ఉన్నవారికి ఎల్బో ప్రాంతం కొంత కఠినంగా అనిపించొచ్చు.

అన్ని రకాల రైడ్స్‌కూ సూటబుల్‌
రైనాక్స్‌ ఏపెక్స్‌ ఈవో జాకెట్‌ను స్పోర్టీ రైడింగ్‌ కోసమే డిజైన్‌ చేసినప్పటికీ, ఎక్స్‌పర్ట్‌లు దీనిని వివిధ బైకులపై ఉపయోగించి పరీక్షించారు. లాంగ్‌ రైడ్స్‌, సిటీ రైడ్స్‌ సహా అన్ని సందర్భాల్లో ఇది చాలా కంఫర్ట్‌గా అనిపించిందని వెల్లడించారు. ముఖ్యంగా, మెడ ప్రాంతంలో సాఫ్ట్ మెటీరియల్‌ ఉండడం వల్ల స్కిన్‌ను ఇబ్బంది పెట్టదు.

జాకెట్‌ను వాష్‌ చేసి తిరిగి ధరించిన తర్వాత, ఎల్బో ఆర్మర్‌ను మళ్లీ పెట్టడం కొంచెం కష్టంగా ఉంటుంది, ముఖ్యంగా S సైజ్‌ను వాడే వారికి ఇది మరింత కఠినంగా ఉండవచ్చు.

సేఫ్టీ 
ఎల్బో-షోల్డర్‌ స్లైడర్లు కొంచెం స్పోర్ట్స్‌ బైక్‌ ట్రాక్‌ ఫీల్‌ ఇస్తాయి. కానీ ఇవి లుక్స్‌ కోసం మాత్రమే కాదు. యాక్సిడెంట్‌ సమయంలో ఇది రోడ్డును రాసుకుంటూ జారిపోయేలా ఉండి, రైడర్‌ బాడీ మీద ఇంపాక్ట్‌ తగ్గించేలా డిజైన్‌ చేశారు. ఇవి వెల్క్రోతో అతికించారు కాబట్టి రైడర్‌ ఇష్టానికి అనుగుణంగా తీసేయవచ్చు కూడా.

పాకెట్లు
పాకెట్ల విషయానికి వస్తే - రెండు బయటి పాకెట్లు, ఒక ఇంటర్నల్‌ పాకెట్‌ ఉంటుంది. పెద్ద స్మార్ట్‌ ఫోన్లు కూడా ఈ పాకెట్లలో సులభంగా సెట్ అవుతాయి.

ధర
మొత్తంగా చూస్తే, రైనాక్స్‌ ఏపెక్స్‌ ఈవో జాకెట్‌, స్లిమ్‌గా ఉండే రైడర్లకు చక్కగా సరిపోయేలా తయారు చేశారు. ధర 15,750 రూపాయలు. ఒక ఇండియన్‌ జాకెట్‌కు ఇది కొంచెం ఎక్కువ రేటు అనిపించినా, దీనిలో వాడిన ప్రీమియం మెటీరియల్‌, లెవల్‌ 2 ఆర్మర్‌, స్ట్రాంగ్‌ కన్‌స్ట్రక్షన్‌ దృష్ట్యా ఈ ధర న్యాయమే అనిపిస్తుంది.

సేఫ్టీ, స్పోర్టీనెస్‌ & డైలీ యూజ్‌ - ఈ మూడు ఒకేసారి కావాలనుకునే రైడర్లకు Rynox Apex Evo ఒక బెస్ట్‌ పిక్‌.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

Flex Fuel Cars Bikes: ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల రిజిస్ట్రేషన్లలో బైకుల సంఖ్య 14,928, కార్లు కేవలం 23.. ఇదేందయ్యా ఇదీ!
ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల్లో బైకులదే రాజ్యం.. కార్లను పట్టించుకున్నవాళ్లే లేకపాయ!
టాటా నెక్సాన్ EVకి పోటీగా వస్తున్న Hyundai Ioniq P EV.. లాంగ్‌ రేంజ్‌, రెండు బ్యాటరీ ఆప్షన్లు, లెవల్ 2 ADAS
సంక్రాంతి కానుకగా హ్యుందాయ్‌ కొత్త EV.. ₹9.79 లక్షల ధర, టాటా నెక్సాన్‌కు గట్టి పోటీ!
Winter Car AC Tips: చలికాలంలో కారు ఏసీని ఎలా వాడాలి? ఈ గుర్తుల అసలైన అర్ధం తెలిస్తే ఎన్నో ప్రయోజనాలు!
కారు ఏసీపై ఈ గుర్తులు గమనించారా? వాటి అర్థాలు తెలిస్తే చలికాలంలోనూ హ్యాపీ జర్నీ!
RC Smart Cards: మూడేళ్ల నిరీక్షణకు తెర.. ఏపీ వాహనదారుల చేతిలోకి కొత్త డ్రైవింగ్ లైసెన్సులు, RC కార్డులు!
ఆంధ్రప్రదేశ్‌ వెహికల్ ఓనర్లకు గుడ్‌న్యూస్‌.. కొత్త డ్రైవింగ్ లైసెన్సులు, RCలు వచ్చేస్తున్నాయోచ్‌!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
HMDA Miyapur Layout: మియాపూర్‌లో HMDA మెగా లేఅవుట్.. 400 ఎకరాల్లో అన్ని వసతులతో భారీ ప్రాజెక్ట్.. త్వరలోనే ఈ-వేలం!
మియాపూర్‌లో HMDA మెగా లేఅవుట్.. 400 ఎకరాల్లో అన్ని వసతులతో భారీ ప్రాజెక్ట్.. త్వరలోనే ఈ-వేలం!
Missing Fishermen Safe: క్షేమంగా ఉప్పాడ తీరానికి చేరిన ఏడుగురు మత్స్యకారులు.. ఫలించిన గాలింపు చర్యలు
క్షేమంగా ఉప్పాడ తీరానికి చేరిన ఏడుగురు మత్స్యకారులు.. ఫలించిన గాలింపు చర్యలు
CM Chandrababu: భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో విషాదం.. ఏపీకి చెందిన BSF జవాన్ మృతి- సీఎం చంద్రబాబు విచారం
భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో విషాదం.. ఏపీకి చెందిన BSF జవాన్ మృతి- సీఎం చంద్రబాబు విచారం
Aadarsha Kutumbam OTT : ఓటీటీలోకి వచ్చేసిన ఆదర్శ కుటుంబం - ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఓటీటీలోకి వచ్చేసిన ఆదర్శ కుటుంబం - ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Rare Medical Case: వైద్యశాస్త్రంలో అరుదైన ఘటన.. కడుపునొప్పితో హాస్పిటల్‌కు వెళ్లిన యువకుడు.. గర్భాశయం తొలగించిన డాక్టర్లు
వైద్యశాస్త్రంలో అరుదైన ఘటన.. కడుపునొప్పితో హాస్పిటల్‌కు వెళ్లిన యువకుడు.. గర్భాశయం తొలగించిన డాక్టర్లు
Vijayasai Reddy Padayatra: జగన్‌కు పోటాపోటీగా విజయసాయిరెడ్డి పాదయాత్ర - వెన్నుపోటు ఆరోపణలతో ఎటాక్- ఏపీ రాజకీయాల్లో కొత్త సెగ!
జగన్‌కు పోటాపోటీగా విజయసాయిరెడ్డి పాదయాత్ర - వెన్నుపోటు ఆరోపణలతో ఎటాక్- ఏపీ రాజకీయాల్లో కొత్త సెగ!
Kadapa BPT Student: ప్రియుడి చేతిలో మోసపోయిన బీపీటీ విద్యార్థిని.. సోదరి పెళ్లి నగలు తాకట్టు పెట్టడంతో ఆత్మహత్య!
ప్రియుడి చేతిలో మోసపోయిన బీపీటీ విద్యార్థిని.. సోదరి పెళ్లి నగలు తాకట్టు పెట్టడంతో ఆత్మహత్య!
Parliament Session: ఈ 30 నుంచి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు.. నియోజకవర్గాల పునర్విభజన దిశగా కేంద్రం అడుగులు
ఈ 30 నుంచి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు.. నియోజకవర్గాల పునర్విభజన దిశగా కేంద్రం అడుగులు
Embed widget