Toyota Taisor: రెండు రోజుల్లో టయోటా టేజర్ లాంచ్ - వావ్ అనిపించే డిజైన్‌తో!
Toyota Taisor India Launch: ప్రముఖ కార్ల బ్రాండ్ టయోటా తన కొత్త కారును మనదేశంలో లాంచ్ చేయనుంది. అదే టయోటా టేజర్.
Toyota Taisor SUV in India: టయోటా ఇండియా తన అధికారిక వెబ్‌సైట్‌లో మారుతి సుజుకి స్విఫ్ట్ ఆధారిత క్రాస్‌ఓవర్ టేజర్‌ను టీజ్ చేయడం ప్రారంభించింది. ఈ మోడల్ భారతదేశంలో 2024 ఏప్రిల్ 3వ తేదీన లాంచ్ కానుంది. దీని ధరలను అప్పుడే ప్రకటించబోరని తెలుస్తోంది. రాబోయే నెలల్లో టయోటా టేజర్ ధరను కంపెనీ రివీల్ చేస్తుంది.
Get ready to #MakeYourWay. The time has come to experience a momentous phenomenon. The legacy and leadership of Toyota’s legendary SUVs has taken a whole new form. So, make your way and witness the #Awesome #ToyotaIndia pic.twitter.com/xHR5f1DEfm
— Toyota India (@Toyota_India) April 1, 2024
టయోటా టేజర్ డిజైన్
లీక్ అయిన ఫొటోల్లో చూస్తే టయోటా టేజర్ ఎరుపు రంగులో కొత్త ఎల్ఈడీ డీఆర్ఎల్స్, రీడిజైన్ చేసిన గ్రిల్‌తో రానుంది. డిజైన్ పరంగా మారుతి ఫ్రాంక్స్ నుంచి భిన్నంగా ఉండేలా ఇది అప్‌డేట్ చేసిన ఫ్రంట్, రియర్ బంపర్‌లు, కొత్త తరహాలోని ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, కొత్తగా డిజైన్ చేసిన టెయిల్ ల్యాంప్స్, కొత్త అల్లాయ్ వీల్స్‌లతొ ఫ్రంట్ ప్రొఫైల్‌లో చాలా కొత్త కనిపిస్తుంది.
టయోటా టేజర్ ఫీచర్లు
ఫీచర్ల గురించి చెప్పాలంటే టేజర్ కూడా ఫ్రాంక్స్ మాదిరిగానే అదే ఫార్మాట్‌లో అందుబాటులో ఉంటుంది. దీనిలో చాలా డివైసెస్ ఉంటాయి. ఇది వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 360 డిగ్రీ సరౌండ్ కెమెరా, హెడ్ అప్ డిస్‌ప్లే, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జర్, యాంబియంట్ లైటింగ్‌తో కూడిన పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా క్యాబిన్ మారుతి సుజుకి స్విఫ్ట్‌తో పోలిస్తే కొత్త థీమ్, విభిన్నమైన అప్హోల్స్టరీ రూపంలో స్వల్ప మార్పులను పొందే అవకాశం ఉంది.
టయోటా టేజర్ ఇంజిన్ ఇలా...
టేజర్ ముందు భాగంలో పవర్‌ట్రెయిన్‌ను కలిగి ఉంటుంది. అయితే టేజర్ నేచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్, సీఎన్‌జీ ఆప్షన్లతో మాత్రమే లాంచ్ కానుందని భావిస్తున్నారు. లాంచ్ అయిన తర్వాత టయోటా టేజర్ దాని విభాగంలో మారుతి సుజుకి, మహీంద్రా ఎక్స్‌యూవీ300, కియా సోనెట్, నిస్సాన్ మాగ్నైట్, రెనాల్ట్ కిగర్, టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూ వంటి కార్లతో పోటీపడుతుంది.