Toyota First EV: మొదటి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని లాంచ్ చేయనున్న టయోటా - ఎప్పుడు రానుంది?
Toyota New Car: ప్రముఖ కార్ల బ్రాండ్ టయోటా తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది.
Toyota Kirloskar Motor: భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమ క్రమంగా ఎలక్ట్రిక్ వాహనాల వైపు కదులుతోంది. ఇందులో మారుతి సుజుకి, హోండా, స్కోడా, ఫోక్స్‌వ్యాగన్, టయోటా వంటి కార్ల తయారీదారులు ఈ పెరుగుతున్న విభాగంలోకి ప్రవేశించడానికి సిద్ధమవుతున్నారు. హ్యుందాయ్, కియా, టాటా రాబోయే సంవత్సరాల్లో తమ ప్రస్తుత ఈవీ పోర్ట్‌ఫోలియోను విస్తరించాలని ప్లాన్ చేస్తున్నాయి. ఇటీవలి నివేదిక ప్రకారం టయోటా కిర్లోస్కర్ మోటార్ కూడా తన మొదటి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని సెప్టెంబర్-అక్టోబర్ 2025 నాటికి విడుదల చేయబోతోంది. ఇది టయోటా అర్బన్ ఎస్‌యూవీ కాన్సెప్ట్ ప్రొడక్షన్ రెడీ మోడల్ అని తెలుస్తోంది. దీన్ని 2023 డిసెంబర్‌లో పరిచయం చేశారు. దీన్ని మారుతి సుజుకి ఈవీఎక్స్ ఆధారంగా రూపొందించారు.
డిజైన్ ఇలా...
టయోటా అర్బన్ ఎస్‌యూవీ కాన్సెప్ట్, మారుతి ఈవీఎక్స్ ఒకే ప్లాట్‌ఫారమ్ (27పీఎల్ స్కేట్‌బోర్డ్ ఆర్కిటెక్చర్), బాడీ ప్యానెల్స్, ఇంటీరియర్ ట్రిమ్‌పై ఆధారపడి ఉన్నాయి. ఈ నిర్మాణాన్ని దేశీయ, విదేశీ మార్కెట్ల కోసం మారుతి సుజుకి గుజరాత్ ఫెసిలిటీలో లోకలైజ్ చేసి తయారు చేస్తారు. అయితే రెండు మోడళ్ల డిజైన్, స్టైల్ భిన్నంగా ఉంటాయి. అర్బన్ ఈవీ రూపకల్పన బీజెడ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ కాన్సెప్ట్ ఆధారంగా ఉండనుంది. ఇందులో సీ ఆకారపు ఎల్ఈడీ డీఆర్ఎల్స్, స్పష్టమైన ఫ్రంట్ బంపర్, ఫ్లేర్డ్ వీల్ ఆర్చ్‌లు, సి పిల్లర్ ఇంటిగ్రేటెడ్ రియర్ డోర్ హ్యాండిల్, వెనుకవైపు ఎల్ఈడీ లైట్ బార్ ఉన్నాయి.
టయోటా అర్బన్ ఎస్‌యూవీ పొడవు 4300 మిల్లీమీటర్లుగానూ, వెడల్పు 1820 మిల్లీమీటర్లుగానూ, ఎత్తు 1620 మిల్లీమీటర్లుగానూ ఉండనుంది. దీని వీల్‌బేస్ దాదాపు 2,700 మిల్లీమీటర్లుగా ఉంది. కొత్త టయోటా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ పవర్‌ట్రెయిన్ ఆప్షన్లు రెండు బ్యాటరీ ప్యాక్‌లుగా ఉంటాయి. వీటిలో 48 కేడబ్ల్యూహెచ్ వేరియంట్ 400 కిలోమీటర్ల రేంజ్, 60 కేడబ్ల్యూహెచ్ వేరియంట్ 550 కిలోమీటర్ల రేంజ్‌ను అందించనుంది.
టయోటా టేజర్ త్వరలో
ఇది కాకుండా టయోటా కిర్లోస్కర్... మోటార్ మారుతి సుజుకి ఫ్రాంక్స్ రీ బ్యాడ్జ్ వెర్షన్‌ను లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. దీనికి టయోటా అర్బన్ క్రూయిజర్ టేజర్ అని పేరు పెట్టవచ్చు. దీని ఎక్స్‌టీరియర్‌లో చాలా మార్పులు చేసినప్పటికీ, ఇంటీరియర్, ఇంజన్ సెటప్ మారుతి ఫ్రాంక్స్ మాదిరిగానే ఉంటుంది. ఈ మైక్రో SUV 1.2 లీటర్ నేచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్, 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో మార్కెట్లోకి వచ్చింది. ఇది కాకుండా టయోటా తన కొత్త తరం ఫార్చ్యూనర్, ప్రీమియం 7 సీటర్ ఎస్‌యూవీని కూడా విడుదల చేస్తుంది.
టయోటా కరోలా భారతదేశంలో ఆల్టిస్ సర్‌నేమ్‌తో వాహనాన్ని విక్రయిస్తుందన్న సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు దీన్ని త్వరలో మార్కెట్లోకి తిరిగి తీసుకురావచ్చు. ఇన్నోవా హైక్రాస్‌తో పాటు హైబ్రిడ్ ఎస్‌యూవీ/క్రాస్ఓవర్‌గా అమ్మకానికి ప్రస్తుతం అందుబాటులో ఉంది. కరోలా క్రాస్ అనేది ఒక క్రాస్ఓవర్ మోడల్. ఇది మరింత శక్తివంతమైన లుక్‌తో వస్తుంది. సెడాన్ వంటి డ్రైవింగ్ అనుభవాన్ని ఇది అందిస్తుంది. కొత్త కరోలా క్రాస్ కొత్త లుక్ ఫ్రంట్ ఎండ్‌తో పాటు దిగువన ఉన్న నమూనా, క్రోమ్ హెవీ గ్రిల్‌తో చాలా స్మూత్‌గా కనిపిస్తుండటం విశేషం. ఇది క్రాస్‌ఓవర్ అయినప్పటికీ రూఫ్ రెయిల్స్, క్లాడింగ్, స్ట్రెయిట్ స్టాన్స్ వంటి కొన్ని ఎస్‌యూవీ తరహా ఫీచర్లను కూడా కలిగి ఉంది.