అన్వేషించండి

తక్కువ పెట్రోల్‌తో ఎక్కువ మైలేజ్‌ - టాప్‌-5 లిస్ట్‌లో 4 మారుతి కార్లు

పెట్రోల్‌ ధరలు కొండెక్కి కూర్చున్న తరుణంలో ఎక్కువ మైలేజ్‌ ఇచ్చే కార్లు అందరికీ అవసరమే. 28.65 kmpl ఇచ్చే మారుతి కారు నుంచి హోండా సిటీ హైబ్రిడ్‌ వరకు టాప్‌ 5 కార్ల పూర్తి వివరాలు తెలుసుకోండి.

Most Fuel Efficient Cars India 2026: ఇప్పటి పరిస్థితుల్లో, కారు కొనేటప్పుడు చాలామంది ముందుగా చూసేది మైలేజ్‌. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఇప్పటికే పీక్‌ స్టేజ్‌లో ఉన్నాయి, ఇంకా ఎంత పెరుగుతాయో చెప్పలేం. రోజూ ఆఫీస్‌ వెళ్లే వాళ్లు, ఫ్యామిలీ ట్రిప్స్‌ చేసే వాళ్లు, హైవే ప్రయాణాలు చేసే వాళ్లు - అందరికీ తక్కువ ఇంధన ఖర్చు చాలా ముఖ్యం. అందుకే ఎక్కువ మైలేజ్‌ ఇచ్చే కార్లు ఎప్పుడూ డిమాండ్‌లో ఉంటాయి. ప్రస్తుతం, మన  మార్కెట్‌లో అత్యధిక మైలేజ్‌ ఇస్తున్న టాప్‌ 5 కార్లు ఇవే:

1) మారుతి సుజుకి విక్టోరిస్‌ హైబ్రిడ్‌ - 28.65 kmpl

ఈ జాబితాలో ఫస్ట్‌ ప్లేస్‌లో ఉన్నది మారుతి సుజుకి విక్టోరిస్‌ హైబ్రిడ్‌. కంపెనీ డేటా ప్రకారం ఇది లీటరుకు 28.65 కిలోమీటర్ల మైలేజ్‌ ఇస్తుంది. ఇందులో 1.5 లీటర్‌ స్ట్రాంగ్‌ హైబ్రిడ్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ ఉంటుంది. 116 hp పవర్‌, 144 Nm టార్క్‌ ఇస్తుంది. e-CVT గేర్‌బాక్స్‌తో వస్తుంది. అదనంగా 1.5 లీటర్‌ నేచురల్లి ఆస్పిరేటెడ్‌ పెట్రోల్‌, AWD, CNG ఆప్షన్లు కూడా ఉన్నాయి.

ఫీచర్లలో వెంటిలేటెడ్‌ ఫ్రంట్‌ సీట్లు, సన్‌రూఫ్‌, 10.25 అంగుళాల డిజిటల్‌ క్లస్టర్‌, 10.1 అంగుళాల టచ్‌స్క్రీన్‌, 360 డిగ్రీ కెమెరా, లెవల్‌ 2 ADAS వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.

2) మారుతి సుజుకి గ్రాండ్‌ విటారా / టయోటా హైరైడర్‌ - 27.97 kmpl

మారుతి సుజుకి గ్రాండ్‌ విటారా, టయోటా హైరైడర్‌ రెండూ ఒకే ప్లాట్‌ఫామ్‌పై తయారైనవే. స్ట్రాంగ్‌ హైబ్రిడ్‌ వేరియంట్‌ మైలేజ్‌ 27.97 kmpl. 1.5 లీటర్‌ హైబ్రిడ్‌ ఇంజిన్‌ 116 hp పవర్‌ ఇస్తుంది. e-CVT గేర్‌బాక్స్‌తో అందుబాటులో ఉంటుంది. అలాగే మాన్యువల్‌, AWD, CNG ఆప్షన్లు కూడా ఉన్నాయి.

3) హోండా సిటీ e HEV - 27.26 kmpl

ఈ జాబితాలో ఉన్న ఏకైక సెడాన్‌ హోండా సిటీ e HEV. ఇది లీటరుకు 27.26 km మైలేజ్‌ ఇస్తుంది. 1.5 లీటర్‌ అట్కిన్సన్‌ సైకిల్‌ ఇంజిన్‌కు రెండు ఎలక్ట్రిక్‌ మోటార్లు జత చేశారు. మొత్తం 125 hp పవర్‌, 253 Nm టార్క్‌ ఇస్తుంది. e-CVT గేర్‌బాక్స్‌తో వస్తుంది. 8 అంగుళాల టచ్‌స్క్రీన్‌, కనెక్టెడ్‌ కార్‌ టెక్నాలజీ, సన్‌రూఫ్‌, TFT క్లస్టర్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి.

4) మారుతి సుజుకి సెలేరియో - 26 kmpl

తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్‌ కోరుకునే వారికి సెలేరియో మంచి ఎంపిక. 1.0 లీటర్‌, 3 సిలిండర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ 69 hp పవర్‌ ఇస్తుంది. 5 స్పీడ్‌ మాన్యువల్‌ లేదా AMT గేర్‌బాక్స్‌ ఆప్షన్‌ ఉంటుంది. 7 అంగుళాల టచ్‌స్క్రీన్‌, ఆండ్రాయిడ్‌ ఆటో, ఆపిల్‌ కార్‌ప్లే సపోర్ట్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి.

5) మారుతి సుజుకి స్విఫ్ట్‌ - 25.75 kmpl

స్విఫ్ట్‌ కూడా మంచి మైలేజ్‌ ఇస్తుంది. 1.2 లీటర్‌ Z సిరీస్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ 82 hp పవర్‌, 112 Nm టార్క్‌ ఇస్తుంది. 9 అంగుళాల టచ్‌స్క్రీన్‌, వైర్‌లెస్‌ కార్‌ప్లే, కనెక్టెడ్‌ కార్‌ టెక్‌, రియర్‌ పార్కింగ్‌ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి.

మైలేజ్‌ విషయంలో హైబ్రిడ్‌ టెక్నాలజీ ఉన్న కార్లు ముందంజలో ఉన్నాయి. అయితే మీ బడ్జెట్‌, వాడకం ఆధారంగా సరైన ఎంపిక చేసుకోవాలి. రోజూ ఎక్కువ ప్రయాణం చేసేవాళ్లకు ఎక్కువ మైలేజ్‌ కారు తీసుకోవడం వల్ల దీర్ఘకాలంలో మంచి ఆదా అవుతుంది.

గమనిక: ఈ కథనంలో చెప్పిన మైలేజ్‌ వివరాలు ఆయా కంపెనీల అధికారిక డేటా నుంచి తీసుకున్నవి. నిజ జీవిత వాడకంలో ఈ మైలేజ్‌ తగ్గవచ్చు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

హైడ్రోజన్ కారుతో JCB సంచలనం.. గంటకు 654 కి.మీ. వేగంతో ప్రపంచ రికార్డు!
ఈ కారు స్పీడ్‌ గంటకు 654km, బుల్లెట్‌ ట్రైన్‌ కూడా ఈ వేగం ముందు బలాదూర్‌!
పెరిగింది రూ.15 వేలే.. కానీ కొత్త Ducati Monsterలో వచ్చిన మార్పులు ఇవీ!
కొత్త ఇంజిన్‌తో Ducati Monster V2.. పాత మోడల్‌కు దీనికి ఇంత తేడానా?
సింగిల్‌ ఛార్జ్‌తో 145 కి.మీ. హ్యాపీగా తిరిగిరావచ్చు.. కొత్త BGauss OoWah MAX Plus‌లో స్పెషల్ ఫీచర్లు!
145km రేంజ్ ఇచ్చే కొత్త BGauss ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్‌.. ఛార్జర్‌ పూర్తిగా ఉచితం
E20 ఇంధనంతో వాహనాల ఇంజిన్లకు ముప్పే! కార్‌ కంపెనీల తనిఖీల్లో సంచలన విషయాలు
E20 పెట్రోల్‌ మీద మళ్లీ రచ్చ.. ఆంధ్రప్రదేశ్‌లోనే అత్యధిక తేమ, రాష్ట్రాలవారీ వివరాలు లీక్‌

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Manasa Varanasi : తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
Sharwanand George Krish : శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
Embed widget