అన్వేషించండి

సెకండ్‌హ్యాండ్‌ హ్యుందాయ్‌ ఎక్స్‌టర్‌ కొంటున్నారా? - మోసపోకుండా ఉండాలంటే ఏమేం చూడాలి?

సెకండ్‌హ్యాండ్‌ Hyundai Exter కొనాలనుకుంటున్నారా? AMT గేర్‌బాక్స్‌, ఎలక్ట్రానిక్స్‌, CNG వెర్షన్‌, హైదరాబాద్‌-విజయవాడ మార్కెట్‌ ధరలు, ఏమేం చెక్‌ చేయాలో పూర్తి గైడ్‌.

Used Hyundai Exter Price: 2023లో సబ్‌కాంపాక్ట్‌ SUV సెగ్మెంట్‌లోకి వచ్చిన Hyundai Exter, మార్కెట్లో బాగా పాపులర్‌ అయింది. Hyundai Motor India, ఈ మోడల్‌ను సిటీ వినియోగానికి అనుకూలంగా రూపొందించింది. ఈజీ డ్రైవింగ్‌, మంచి ఫీచర్లు, ప్రాక్టికాలిటీ - ఇవన్నీ కలిసివచ్చాయి.

ఇప్పుడు సెకండ్‌హ్యాండ్‌ మార్కెట్లో కూడా ఇది డిమాండ్‌లో ఉంది. కానీ, కొనే ముందు కొన్ని విషయాలు తప్పక చెక్‌ చేయాలి.

ఇంజిన్‌, మైలేజ్‌ - ఏది తీసుకోవాలి?

Hyundai Exterలో 1.2 లీటర్‌ నేచురల్లి ఆస్పిరేటెడ్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ ఉంది.

పవర్‌: 83 hp 

టార్క్‌: 114 Nm

గేర్‌బాక్స్‌: 5-స్పీడ్‌ మాన్యువల్‌ / AMT

CNG వెర్షన్‌ కూడా ఉంది:

పవర్‌: 69 hp 

టార్క్‌: 95.2 Nm

గేర్‌బాక్స్‌: మాన్యువల్‌ మాత్రమే

మైలేజ్‌:

పెట్రోల్‌ MT - 19.4 కి.మీ./లీటర్‌
పెట్రోల్‌ AMT - 19.2 కి.మీ./లీటర్‌
CNG - 27.1 కి.మీ./లీటర్‌

మీరు సిటీలోనే ఎక్కువ డ్రైవింగ్‌ చేస్తుంటే, AMT సౌకర్యంగా ఉంటుంది. ఎక్కువ రన్నింగ్‌ ఉంటే CNG మంచి ఎంపిక. అయితే ‘Duo’ CNG వెర్షన్‌ తీసుకోవడం మంచిది. ఇందులో స్ప్లిట్‌ ట్యాంక్‌ ఉండటం వల్ల బూట్‌ స్పేస్‌ ఉపయోగించుకోవచ్చు.

వేరియంట్లు, ఫీచర్లు

Exterలో EX, S, SX, SX(O), SX(O) Connect వేరియంట్లు ఉన్నాయి. టాప్‌ వేరియంట్‌లో... సన్‌రూఫ్‌, 8-ఇంచ్‌ టచ్‌స్క్రీన్‌, వైర్‌లెస్‌ Apple CarPlay, Android Auto, ఆటో క్లైమేట్‌ కంట్రోల్‌, డ్యూయల్‌ ఛానెల్‌ డ్యాష్‌క్యామ్‌, క్రూయిజ్‌ కంట్రోల్‌, కనెక్టెడ్‌ కార్‌ టెక్నాలజీ ఉన్నాయి.

సేఫ్టీ విషయానికి వస్తే... ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ESC, హిల్‌ అసిస్ట్‌, రియర్‌ పార్కింగ్‌ కెమెరా ఉన్నాయి. బడ్జెట్‌ ఉంటే SX(O) Connect మంచిది. లేదంటే SX కూడా మంచి విలువ ఇస్తుంది.

సెకండ్‌హ్యాండ్‌ ఎక్స్‌టర్‌ కొనేప్పుడు ఏమేం చూడాలి?

1) AMT గేర్‌బాక్స్‌ పరిస్థితి: టెస్ట్‌ డ్రైవ్‌ చేయండి. కారు స్మూత్‌గా స్టార్ట్‌ అవుతుందా చూడండి. డౌన్‌షిఫ్ట్‌లలో జర్క్‌ ఎక్కువగా ఉంటే జాగ్రత్త.

2) ఎలక్ట్రానిక్స్‌ చెకింగ్‌: టచ్‌స్క్రీన్‌ సరిగ్గా పనిచేస్తుందా? ఫోన్‌ కనెక్ట్‌ అవుతుందా? స్క్రీన్‌ ఫ్రీజ్‌ అవుతుందా? సన్‌రూఫ్‌, కనెక్టెడ్‌ ఫీచర్లు సరిగా ఉన్నాయా చూసుకోవాలి.

3) వినియోగ భాగాలు: బ్రేక్‌ ప్యాడ్లు, టైర్లు, సస్పెన్షన్‌ బుషింగ్‌లు చెక్‌ చేయాలి. అండర్‌బాడీలో తుప్పు ఉందా చూడండి. ముఖ్యంగా తీర ప్రాంతాల్లో నడిపిన కార్లు అయితే జాగ్రత్తగా పరిశీలించండి.

వారంటీ, సర్వీస్‌ నెట్‌వర్క్‌

Exterకు 3 ఏళ్లు / 1,00,000 కి.మీ. స్టాండర్డ్‌ వారంటీ ఉంది. ప్రస్తుతం సెకండ్‌హ్యాండ్‌గా చూస్తున్న కార్లు ఇంకా వారంటీలో ఉండే అవకాశముంది. హైదరాబాద్‌, విజయవాడలో హ్యుందాయ్‌ సర్వీస్‌ సెంటర్లు ఎక్కువగా ఉండటం కూడా ప్లస్‌ పాయింట్‌.

ధర ఎంత ఉండాలి?

సెకండ్‌హ్యాండ్‌ మార్కెట్లో Hyundai Exter ధర సాధారణంగా ₹5 లక్షల నుంచి ₹8 లక్షల మధ్య ఉంటుంది. టాప్‌ వేరియంట్‌కు ₹8 లక్షలకుపైగా ఖర్చు చేయడం కంటే కొత్త కారును కొనడం మంచిది.

సిటీ ప్రయాణాలకు సులభంగా డ్రైవ్‌ చేయగలిగే కాంపాక్ట్‌ SUV కావాలంటే Hyundai Exter మంచి ఎంపిక. అయితే AMT, ఎలక్ట్రానిక్స్‌, బాడీ పరిస్థితి చెక్‌ చేయకుండా అడ్వాన్స్‌ ఇవ్వొద్దు. జాగ్రత్తగా పరిశీలిస్తే మంచి డీల్‌ మీకే దక్కుతుంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

Small Cars: మీ ఇంటి దగ్గర రోడ్డు చాలా ఇరుకా? పార్కింగ్‌కు సరైన స్థలం లేదా? ఈ 8 కార్లు మీకు మంచి ఎంపిక
చిన్న సందులు, ఇరుకైన అపార్ట్‌మెంట్ పార్కింగ్‌లకు సులభంగా సరిపోయే 8 కార్లు ఇవే!
Car Warranty: డాష్‌క్యామ్ అమరిస్తే కారు వారంటీ రద్దవుతుందా? రూ.లక్షల నష్టం రాకుండా ఈ జాగ్రత్తలు పాటించండి!
కారులో డాష్‌క్యామ్ పెట్టించాలనుకుంటున్నారా? మీ కారు వారంటీ పోతుందేమో తెలుసుకోండి!
Hyundai Grand i10 Nios కొనే ప్లాన్‌లో ఉన్నారా? ముందు ఈ 5 విషయాలు తప్పక తెలుసుకోండి
హ్యుందాయ్‌ i10 నియోస్‌ కొనవచ్చా, వద్దా? 3 ప్లస్ పాయింట్లు, 2 మైనస్ పాయింట్లు
Kia Seltos సరికొత్త రికార్డ్‌.. 7 లక్షలు దాటిన అమ్మకాలు.. ఈ SUVకి ఇంత క్రేజ్ ఎందుకో తెలుసా?
ఇండియాలో 7 లక్షల మంది కొన్న క్రేజీ SUV.. ధర మీ బడ్జెట్‌లోనే!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gig Workers Scheme Bebefits: గిగ్ వర్కర్ల పథకాన్ని ప్రారంభించిన రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి.. వారికి వచ్చే బెనిఫిట్స్ ఇవే
గిగ్ వర్కర్ల పథకాన్ని ప్రారంభించిన రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి.. వారికి వచ్చే బెనిఫిట్స్ ఇవే
AP Local Body Elections: అభ్యర్థులు కోరితే నామినేషన్లకు ప్రత్యేక ఎస్కార్ట్‌.. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహక నగదు పెంపు: ఏపీ ఎస్‌ఈసీ
అభ్యర్థులు కోరితే నామినేషన్లకు ప్రత్యేక ఎస్కార్ట్‌.. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహక నగదు పెంపు
Elon Musk Supports Jensen Huang: మళ్లీ Nvidia CEO గా జెన్సన్ హువాంగ్‌‌..! ఎలాన్ మస్క్ సైతం మద్దతు
మళ్లీ Nvidia CEO గా జెన్సన్ హువాంగ్‌‌..! ఎలాన్ మస్క్ సైతం మద్దతు
Srikalahasti Temple: శ్రీకాళహస్తి ఆలయంలో స్పై కెమెరా కళ్లజోడుతో భక్తుడు.. అదుపులోకి తీసుకున్న సిబ్బంది
శ్రీకాళహస్తి ఆలయంలో స్పై కెమెరా కళ్లజోడుతో భక్తుడు.. అదుపులోకి తీసుకున్న సిబ్బంది
N Ramchander Rao: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు హౌస్ అరెస్ట్.. తెలంగాణలో రాజ్యాంగం అమలుపై ప్రశ్నలు 
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు హౌస్ అరెస్ట్.. తెలంగాణలో రాజ్యాంగం అమలుపై ప్రశ్నలు 
Cricketer Suicide: ప్రేమ పేరుతో వేధింపులు.. అండర్ 19 క్రికెటర్ ఆత్మహత్య- వికారాబాద్‌లో ఘటన
ప్రేమ పేరుతో వేధింపులు.. అండర్ 19 క్రికెటర్ ఆత్మహత్య- వికారాబాద్‌లో ఘటన
Small Cars: మీ ఇంటి దగ్గర రోడ్డు చాలా ఇరుకా? పార్కింగ్‌కు సరైన స్థలం లేదా? ఈ 8 కార్లు మీకు మంచి ఎంపిక
చిన్న సందులు, ఇరుకైన అపార్ట్‌మెంట్ పార్కింగ్‌లకు సులభంగా సరిపోయే 8 కార్లు ఇవే!
15-11-2026 ఆదివారం రాశిఫలాలు: ధనుస్సు, మకర, కుంభ, మీనం వారికి గ్రహాల శుభ ప్రభావంతో అదృష్టం!
15-11-2026 ఆదివారం రాశిఫలాలు: ధనుస్సు, మకర, కుంభ, మీనం వారికి గ్రహాల శుభ ప్రభావంతో అదృష్టం!
Embed widget