అన్వేషించండి

టర్బో AT పెర్ఫార్మెన్స్‌ కంపారిజన్‌: స్కోడా కైలాక్‌ Vs మహీంద్రా XUV 3XO - అసలైన పెర్ఫార్మెన్స్‌ కారు ఏది?

స్కోడా కైలాక్‌, మహీంద్రా XUV 3XO టర్బో ఆటోమేటిక్‌ మోడళ్ల మధ్య వేగం, రోలింగ్‌ యాక్సిలరేషన్‌, బ్రేకింగ్‌ పరీక్షల్లో ఏ కారు మెరుగో పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

Compact SUV Performance Comparison: భారత మార్కెట్లో కాంపాక్ట్‌ SUV సెగ్మెంట్‌ రోజురోజుకూ హాట్‌ అవుతోంది. ఈ విభాగంలో టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌తో మంచి పెర్ఫార్మెన్స్‌ ఇచ్చే రెండు ముఖ్యమైన మోడళ్లు ఉన్నాయి, అవి - స్కోడా కైలాక్‌ & మహీంద్రా XUV 3XO. ధర పరంగా దగ్గరగా ఉండే ఈ రెండు SUVలలో అసలు రోడ్డుపై ఏ కారు బెటర్‌ అనేది తెలుసుకోవాలంటే పెర్ఫార్మెన్స్‌ టెస్ట్‌ ఫలితాలు చూడాల్సిందే.

ఇంజిన్‌, పవర్‌ - ఏ కారుది పైచేయి?

 
స్కోడా కైలాక్‌ TP AT
మహీంద్రా XUV 3XO TP AT
ఇంజిన్
 
3 cyls, turbo-petrol
3 cyls, turbo-petrol
డిస్‌ప్లేస్‌మెంట్ (cc)
 
999
1197
పవర్ (hp)
 
116
130
టార్క్ (Nm)
 
178
230
కెర్బ్ బరువు (kg)
 
1,255
1,411
పవర్-టు-వెయిట్ (hp per tonne)
 
92.43
92.13
టార్క్-టు-వెయిట్ (Nm per tonne)
 
141.83
163
ధర పరిధి (రూ. లక్షల్లో)
 
9.25-12.99
9.71-14.55

మహీంద్రా XUV 3XO లో ఎక్కువ సామర్థ్యం గల టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌ ఉంది. అందుకే ఇది స్కోడా కైలాక్‌తో పోలిస్తే 14 hp, 52 Nm ఎక్కువ అవుట్‌పుట్‌ ఇస్తుంది. అయితే కైలాక్‌ బరువు 156 కేజీలు తక్కువగా ఉండటం వలన పవర్‌ టు వెయిట్‌ రేషియో కొంచెం మెరుగ్గా ఉంటుంది.

టార్క్‌ విషయానికి వస్తే XUV 3XO దాదాపు 15 శాతం మెరుగైన టార్క్‌ టు వెయిట్‌ రేషియో ఇస్తుంది. అంటే స్టార్ట్‌ తీసుకునే సమయంలో, లో స్పీడ్‌లో ఇది కొంచెం ఎక్కువ జోష్‌ చూపిస్తుంది.

0 నుంచి 100 కి.మీ. వేగ పరీక్ష

యాక్సిలరేషన్‌ టెస్ట్‌లో మహీంద్రా XUV 3XO అన్ని స్పీడ్‌ లెవెల్స్‌లోనూ వేగంగానే ఉంది. 0 నుంచి 100 కి.మీ. వేగాన్ని ఇది సుమారు 11.05 సెకన్లలో అందుకుంది. అదే సమయంలో స్కోడా కైలాక్‌ 11.69 సెకన్లు తీసుకుంది.
లో స్పీడ్‌లో కైలాక్‌లో స్వల్పంగా టర్బో ల్యాగ్‌ కనిపించినా, ఒకసారి స్పీడ్‌ పికప్‌ అయితే మిడ్‌ రేంజ్‌లో బలంగా దూసుకుపోతుంది. ఇందులో ఉన్న ప్యాడిల్‌ షిఫ్టర్స్‌ డ్రైవింగ్‌కు మరింత ఫన్‌ జోడిస్తాయి. XUV 3XO లో ప్యాడిల్స్‌ లేకపోయినా Zip, Zap, Zoom అనే మూడు డ్రైవ్‌ మోడ్స్‌తో యాక్సిలరేషన్‌ ఫీల్‌ను మార్చుకోవచ్చు.

రిఫైన్‌మెంట్‌ విషయానికి వస్తే మహీంద్రా SUV కొంచెం సైలెంట్‌గా ఉంటుంది. కైలాక్‌లో 3 సిలిండర్‌ సౌండ్‌ వినిపించినా అంత అసహనంగా అనిపించదు.

రోలింగ్‌ యాక్సిలరేషన్‌ - రియల్‌ వరల్డ్‌లో ఎలా?

మూడో గేర్‌లో 20 కి.మీ. నుంచి 80 కి.మీ. వేగం పెంచడంలో రెండు SUVలు సమానమైన పెర్ఫార్మెన్స్‌ చేశాయి. అయితే నాలుగో గేర్‌లో 40 నుంచి 100 కి.మీ. వేగానికి వస్తే XUV 3XO సుమారు 0.61 సెకన్లు ముందే చేరుకుంది. దీని అర్ధం, ఓవర్‌టేక్‌ చేసే సమయంలో మహీంద్రా మోడల్‌ కొంచెం మెరుగైన స్పందన ఇస్తుంది.

బ్రేకింగ్‌ టెస్ట్‌ - ఇక్కడ కైలాక్‌ ఆధిపత్యం

80 నుంచి 0 కి.మీ. వేగానికి చేరుకునే బ్రేకింగ్‌ పరీక్షలో స్కోడా కైలాక్‌ కేవలం 27.11 మీటర్లలో ఆగిపోయింది. దీనికోసం మహీంద్రా XUV 3XO అయితే 31.36 మీటర్లు తీసుకుంది. అంటే కైలాక్‌ 4.25 మీటర్లు తక్కువ దూరంలోనే (ముందే) ఆగింది. సమయ పరంగా కూడా కైలాక్‌ 2.37 సెకన్లు తీసుకోగా, XUV 3XO 3 సెకన్లు తీసుకుంది. ఎమర్జెన్సీ బ్రేకింగ్‌ సమయంలో ఈ మిల్లీ సెకన్లు కూడా చాలా కీలకమైన తేడాగా మారుతుంది.

సూటిగా చెప్పాలంటే, వేగం & యాక్సిలరేషన్‌ విషయానికి వస్తే మహీంద్రా XUV 3XO కొంచెం ముందుంది. కానీ బ్రేకింగ్‌ సామర్థ్యంలో స్కోడా కైలాక్‌ స్పష్టంగా మెరుగ్గా నిలిచింది. మీరు వేగానికి ప్రాధాన్యత ఇస్తే.. XUV 3XOను, కంట్రోల్‌ & బ్రేకింగ్‌ మీకు ముఖ్యమైతే.. కైలాక్‌ను మంచి ఎంపికగా భావించవచ్చు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Yamaha R15 కంటే పవర్‌ఫుల్‌.. ధర రూ.2 లక్షలు! ఆగస్టు 27న వస్తున్న R2పై భారీ అంచనాలు
Yamaha R2లో 220cc ఇంజిన్‌! - ఈ స్పోర్ట్స్‌ బైక్‌లో ఇంకా ఎలాంటి అద్భుతాలు ఉండొచ్చు?
టాటా సియెర్రా vs కియా సెల్టోస్‌ మధ్య స్పీడ్‌ టెస్ట్‌.. ఏ కారు గెలిచింది?
Tata Sierra vs Kia Seltos - డీజిల్‌ ఆటోమేటిక్‌లో ఏ కారుకు దూకుడు ఎక్కువ?
BaaS కింద ఎలక్ట్రిక్‌ కారును కొంటే కిలోమీటర్‌కు ఎంత ఖర్చువుతుంది? భారత్‌లో BaaS EVల పూర్తి లిస్ట్ ఇదే!
బ్యాటరీ కొనే పనే లేదు.. కారు ధర ఏకంగా రూ.8.35 లక్షలు తగ్గుతుంది! BaaSతో ఈ EVలన్నీ మీ సొంతం

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Embed widget