అన్వేషించండి

మీ బడ్జెట్‌కు తగ్గట్లు రూ.10 లక్షల లోపు వచ్చే బెస్ట్‌ ఆటోమేటిక్‌ SUVలు - సిటీ ట్రాఫిక్‌కు సరైన ఆప్షన్స్‌

రూ.10 లక్షల లోపు అందుబాటులో ఉన్న చౌకైన ఆటోమేటిక్‌ SUVలు ఏవో తెలుసా? హైదరాబాద్‌, విజయవాడ ధరలతో పాటు ఫీచర్లు, మైలేజ్‌, వేరియంట్ల పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • భారత్‌లో రూ.10 లక్షల లోపు ఆటోమేటిక్‌ SUVల కొనుగోలుకు అనేక ఎంపికలు.
  • నిస్సాన్‌ మ్యాగ్నైట్‌, రెనాల్ట్‌ కైగర్‌ చౌకైన ఆటోమేటిక్‌ SUVలుగా అందుబాటులో ఉన్నాయి.
  • టాటా పంచ్‌, హ్యుందాయ్‌ ఎక్స్‌టర్‌ మంచి ఫీచర్లతో రూ.10 లక్షలలోపు వస్తున్నాయి.
  • మారుతి ఫ్రాంక్స్‌ నుండి మహీంద్రా XUV 3XO వరకు ఆటోమేటిక్‌ SUVలు లభ్యం.

Best Automatic SUVs India 2026: నగరాల్లో ట్రాఫిక్‌ రోజురోజుకీ పెరుగుతోంది. క్లచ్‌ నొక్కుతూ, గేర్‌ మారుస్తూ డ్రైవ్‌ చేయడం కాస్త అలసటగా మారుతోంది. అందుకే ఇప్పుడు చాలా మంది ఆటోమేటిక్‌ కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా రూ.10 లక్షల బడ్జెట్‌లో ఆటోమేటిక్‌ SUV కావాలనుకునే వారికి ఇప్పుడు మార్కెట్‌లో ఎన్నో ఆప్షన్లు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని ఎక్స్‌-షోరూమ్‌ ధరల ప్రకారం అందుబాటులో ఉన్న చౌకైన ఆటోమేటిక్‌ SUVల వివరాలు ఇవీ...

1) నిస్సాన్‌ మ్యాగ్నైట్‌ - ఎక్స్‌-షోరూమ్‌ ధర రూ.6.21 లక్షల నుంచి

ఈ జాబితాలో అత్యంత చౌకైన ఆటోమేటిక్‌ SUV ఇదే. 1.0 లీటర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌తో 5-స్పీడ్‌ AMT, అలాగే టర్బో పెట్రోల్‌తో CVT ఆప్షన్‌ లభిస్తుంది. హైదరాబాద్‌లో ఈ ధర వద్ద ప్రారంభమవుతుంది. మంచి స్పేస్‌, 8 అంగుళాల టచ్‌స్క్రీన్‌, 360 డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లు ఈ ధరలో రావడం పెద్ద ప్లస్‌.

2) రెనాల్ట్‌ కైగర్‌ - ఎక్స్‌-షోరూమ్‌ ధర రూ.6.95 లక్షల నుంచి

మ్యాగ్నైట్‌కు బ్రదర్‌ మోడల్‌ అయిన కైగర్‌లో AMT, CVT రెండూ లభిస్తాయి. 1.0 లీటర్‌ ఇంజిన్‌తో 19 kmpl వరకు మైలేజ్‌ ఇస్తుంది. ఫీచర్ల పరంగా కూడా మంచి విలువ ఇస్తుంది.

3) టాటా పంచ్‌ - ఎక్స్‌-షోరూమ్‌ ధర రూ.7.55 లక్షల నుంచి

1.2 లీటర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌తో 5-స్పీడ్‌ AMT లభిస్తుంది. 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్‌, సన్‌రూఫ్‌, 6 ఎయిర్‌బ్యాగ్స్‌ వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్‌, విజయవాడలో రూ.7.55 లక్షల నుంచి అందుబాటులో ఉంది.

4) హ్యుందాయ్‌ ఎక్స్‌టర్‌ - ఎక్స్‌-షోరూమ్‌ ధర రూ.7.68 లక్షల నుంచి

83hp శక్తిమంతమైన 1.2 లీటర్‌ ఇంజిన్‌తో 5-స్పీడ్‌ AMT అందుబాటులో ఉంది. వైర్‌లెస్‌ చార్జింగ్‌, సన్‌రూఫ్‌, 6 ఎయిర్‌బ్యాగ్స్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. మొత్తం AMT లైన్‌అప్‌ రూ.10 లక్షల లోపే ఉంటుంది.

5) మారుతి సుజుకి ఫ్రాంక్స్‌ - ఎక్స్‌-షోరూమ్‌ ధర రూ.8.15 లక్షల నుంచి

1.2 లీటర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌తో AMT లభిస్తుంది. మంచి మైలేజ్‌ ప్రధాన ఆకర్షణ. హైదరాబాద్‌లో డెల్టా, డెల్టా+ వేరియంట్లు ఈ బడ్జెట్‌లో వస్తాయి.

6) టయోటా అర్బన్‌ క్రూయిజర్‌ టైసర్‌ - ఎక్స్‌-షోరూమ్‌ ధర రూ.8.72 లక్షల నుంచి

5-స్పీడ్‌ AMT గేర్‌బాక్స్‌తో 1.2 లీటర్‌ ఇంజిన్‌ లభిస్తుంది. 22.8 kmpl వరకు మైలేజ్‌ ఇవ్వడం ప్రత్యేకత.

7) టాటా నెక్సాన్‌ - ఎక్స్‌-షోరూమ్‌ ధర రూ.8 లక్షల నుంచి

1.2 లీటర్‌ టర్బో పెట్రోల్‌తో 6-స్పీడ్‌ AMT లభిస్తుంది. 10.25 అంగుళాల స్క్రీన్‌, 6 ఎయిర్‌బ్యాగ్స్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి.

8) స్కోడా కైలాక్‌ - ఎక్స్‌-షోరూమ్‌ ధర రూ.9.25 లక్షల నుంచి

1.0 లీటర్‌ టర్బో పెట్రోల్‌తో 6-స్పీడ్‌ టార్క్‌ కన్వర్టర్‌ ఆటోమేటిక్‌ లభిస్తుంది. సన్‌రూఫ్‌, 6 ఎయిర్‌బ్యాగ్స్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి.

9) మహీంద్రా XUV 3XO - ఎక్స్‌-షోరూమ్‌ ధర రూ.9.71 లక్షల నుంచి

1.2 లీటర్‌ టర్బో పెట్రోల్‌తో 6-స్పీడ్‌ టార్క్‌ కన్వర్టర్‌ ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌ అందుబాటులో ఉంది. 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్‌, సన్‌రూఫ్‌, 6 ఎయిర్‌బ్యాగ్స్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి.

మొత్తంగా చూస్తే, రూ.10 లక్షల లోపు ఆటోమేటిక్‌ SUV కొనాలనుకునే వారికి ఇప్పుడు మంచి ఎంపికలు ఉన్నాయి. సిటీ డ్రైవ్‌కు సౌకర్యంగా ఉండే AMT, స్మూత్‌గా ఉండే CVT, పవర్‌ఫుల్‌ టార్క్‌ కన్వర్టర్‌ వంటి ఆప్షన్లు లభిస్తున్నాయి. హైదరాబాద్‌, విజయవాడ వంటి తెలుగు నగరాల్లో కొనుగోలు చేసే ముందు ఆన్‌-రోడ్‌ ధరలు, ఇన్సూరెన్స్‌, ఆఫర్లను చెక్‌ చేసి నిర్ణయం తీసుకోవడం మంచిది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Frequently Asked Questions

భారతదేశంలో 10 లక్షల లోపు బడ్జెట్‌లో లభించే ఆటోమేటిక్ SUVలు ఏవి?

రూ.10 లక్షల లోపు బడ్జెట్‌లో నిస్సాన్ మ్యాగ్నైట్, రెనాల్ట్ కైగర్, టాటా పంచ్, హ్యుందాయ్ ఎక్స్‌టర్, మారుతి సుజుకి ఫ్రాంక్స్, టయోటా అర్బన్ క్రూయిజర్ టైజర్, టాటా నెక్సాన్, స్కోడా కైలాక్, మహీంద్రా XUV 3XO వంటి ఆటోమేటిక్ SUVలు అందుబాటులో ఉన్నాయి.

అత్యంత చౌకైన ఆటోమేటిక్ SUV ఏది?

ఈ జాబితాలో నిస్సాన్ మ్యాగ్నైట్ అత్యంత చౌకైన ఆటోమేటిక్ SUV. దీని ధర రూ.6.21 లక్షల నుండి ప్రారంభమవుతుంది.

ఆటోమేటిక్ SUVలలో ఎలాంటి ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి?

ఆటోమేటిక్ SUVలలో AMT (ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్), CVT (కంటిన్యుయస్లీ వేరియబుల్ ట్రాన్స్‌మిషన్), మరియు టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ వంటి ఆప్షన్లు లభిస్తున్నాయి.

టాటా పంచ్ SUVలో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో పాటు ఏ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి?

టాటా పంచ్ SUVలో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో 5-స్పీడ్ AMT లభిస్తుంది. దీంతో పాటు 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్, సన్‌రూఫ్, 6 ఎయిర్‌బ్యాగ్స్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.

టాప్ హెడ్ లైన్స్

Bayon vs Creta: క్రెటా కంటే బేయాన్ ధర తక్కువ.. ఏ కారులో ఫీచర్లు ఎక్కువ? కొనే ముందే ఈ తేడాలు తెలుసుకోండి!
హ్యుందాయ్ బేయాన్ vs హ్యుందాయ్ క్రెటా.. ఏది బెస్ట్ SUV?
2027 Triumph Tiger 1200 వచ్చేసింది.. ధర తెలిస్తే షాక్‌ అవుతారు! ఇందులోని రాడార్‌ టెక్నాలజీకి ఫిదా అవ్వాల్సిందే!
2027 ట్రయంఫ్‌ టైగర్‌ 1200 లాంచ్‌.. దీని లెవెలే వేరబ్బా! ఈ బైక్‌కు పెట్టే ఖర్చుతో ఒక లగ్జరీ కారు కొనొచ్చు
Hatchback Car Diwali Offers: దీపావళికి కొత్త హ్యాచ్‌బ్యాక్‌ కారు కొనాలనుకుంటున్నారా? టాటా నుంచి మారుతి వరకు లక్షల్లో డిస్కౌంట్లు!
కారు కొనడానికి ఇదే సరైన సమయం! హ్యాచ్‌బ్యాక్‌లపై దీపావళి ఆఫర్లు.. లక్షల్లో డిస్కౌంట్లు!
FASTag Pass: ఫాస్టాగ్‌ యాన్యువల్‌ పాస్‌ vs లోకల్‌ పాస్‌ vs రెగ్యులర్‌ రీఛార్జ్‌.. మీకు ఏది బెస్ట్?
హైవేపై మీ ప్రయాణానికి ఏ FASTag పాస్ ప్రయోజనం? మీ ఖర్చు తగ్గించే ఆప్షన్ ఇదే!

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Body Elections: ఏపీలో పట్టణ స్థానిక సంస్థలకు ముగిసిన ఎన్నికల ప్రచారం.. మైకులు బంద్
ఏపీలో పట్టణ స్థానిక సంస్థలకు ముగిసిన ఎన్నికల ప్రచారం.. మైకులు బంద్
Kavitha Kalvakuntla: చరిత్రలో తొలిసారి రైతులను పంటలు వేయొద్దన్న అసమర్థ సీఎం.. ఇంద్రవెల్లి సభలో కవిత ఘాటు విమర్శలు
చరిత్రలో తొలిసారి రైతులను పంటలు వేయొద్దన్న అసమర్థ సీఎం.. ఇంద్రవెల్లి సభలో కవిత ఘాటు విమర్శలు
NZ VS IND 4th T20 Result Update: కివీస్ కు ఓదార్పు విజ‌యం.. నాలుగో టీ20లో భార‌త్ ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన ఫిలిఫ్స్, డ‌ఫీ, తిల‌క్ ఒంట‌రి పోరాటం వృథా
కివీస్ కు ఓదార్పు విజ‌యం.. నాలుగో టీ20లో భార‌త్ ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన ఫిలిఫ్స్, డ‌ఫీ, తిల‌క్ ఒంట‌రి పోరాటం వృథా
Comrade Kalyan Movie OTT : ఓటీటీలోకి శ్రీవిష్ణు కొత్త మూవీ - నెల రోజుల్లోపే కామ్రేడ్ కల్యాణ్ మూవీ సడన్ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి శ్రీవిష్ణు కొత్త మూవీ - నెల రోజుల్లోపే కామ్రేడ్ కల్యాణ్ మూవీ సడన్ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
AP Local Body Elections: ఏపీ ఎస్ఈసీ కీలక నిర్ణయం.. వెబ్‌సైట్‌లో అభ్యర్థుల నామినేషన్ పత్రాలు
ఏపీ ఎస్ఈసీ కీలక నిర్ణయం.. వెబ్‌సైట్‌లో అభ్యర్థుల నామినేషన్ పత్రాలు
CM Revanth Reddy: మియాపూర్ భూములు కాజేసే కుట్ర.. పోరాడినందుకు నన్ను జైలుకు పంపారు: రేవంత్ రెడ్డి
BRS హయాంలో మియాపూర్ భూములు కాజేసే కుట్ర.. పోరాడితే నన్ను జైలుకు పంపారు: రేవంత్ రెడ్డి
Arnab Cyclone Effect: అర్నబ్ తుపాను ఎఫెక్ట్.. లారీ డ్రైవర్ల ఆకలి కేకలతో పలాస టోల్ గేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
అర్నబ్ తుపాను ఎఫెక్ట్.. లారీ డ్రైవర్ల ఆకలి కేకలతో పలాస టోల్ గేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
Tirupati Janasena: టికెట్ కోసం రూ.50 లక్షల డిమాండ్.. తిరుపతి జనసేన నేత ఆత్మహత్యాయత్నం!
టికెట్ కోసం రూ.50 లక్షల డిమాండ్.. తిరుపతి జనసేన నేత ఆత్మహత్యాయత్నం!
Embed widget