అన్వేషించండి

రూ.15 లక్షల లోపులోనే 8 ఎలక్ట్రిక్ కార్లు - మీ బడ్జెట్‌లోనే కొనొచ్చు

రూ.15 లక్షల లోపు ఇండియాలో లభించే అన్ని ఎలక్ట్రిక్ కార్ల జాబితా ఇది. టాటా, ఎంజీ, మహీంద్రా, సిట్రోయెన్ మోడళ్ల ధరలు, రేంజ్ వివరాలు తెలుసుకోండి.

Electric Cars Under Rs 15 Lakh: కొన్నాళ్ల క్రితం వరకు, ఎలక్ట్రిక్ కార్లు అంటే ఖరీదైనవి, రేంజ్ తక్కువ అన్న అభిప్రాయం ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఆధునిక డిజైన్‌, మెరుగైన రేంజ్‌, అధునాతన ఫీచర్లతో ఎలక్ట్రిక్ కార్లు ఇప్పుడు పోటీ ధరలకే వస్తున్నాయి. ముఖ్యంగా రూ.15 లక్షల లోపులో కూడా ఎన్నో మంచి మోడళ్లు మన తెలుగు రాష్ట్రాల్లో అందుబాటులో ఉన్నాయి. 

ఇప్పుడు, మన మార్కెట్‌లో రూ.15 లక్షల లోపు లభించే ఎలక్ట్రిక్ కార్ల లిస్ట్‌:

8) MG Windsor EV

ధర: రూ.14 లక్షలు నుంచి రూ.18.49 లక్షలు
BaaS ధర: రూ.9.99 లక్షలు నుంచి + కిలోమీటరుకు ఛార్జ్

ఈ జాబితాలో అత్యంత ఖరీదైన మోడల్ అయినప్పటికీ, BaaS విధానం వల్ల తక్కువ ముందస్తు చెల్లింపుతో కొనుగోలు చేయవచ్చు. 38kWh & 52.9kWh బ్యాటరీ ఆప్షన్లు ఉన్నాయి. రేంజ్ 332 కి.మీ. నుంచి 449 కి.మీ. వరకు ఉంటుంది. విశాలమైన కేబిన్‌, సౌకర్యవంతమైన డ్రైవింగ్ ఈ మోడల్ ప్రత్యేకత.

7) Mahindra XUV 3XO EV

ధర: రూ.13.89 లక్షలు నుంచి రూ.14.96 లక్షలు

39.4kWh బ్యాటరీతో వస్తుంది. 350 కి.మీ. ARAI రేంజ్ ఇస్తుంది. రియల్ వరల్డ్ రేంజ్ సుమారు 270-300 కి.మీ. వరకు ఉంటుంది. AX5 & AX7L వేరియంట్లలో భిన్నమైన పవర్ అవుట్‌పుట్ అందిస్తుంది.

6) Citroen eC3

ధర: రూ.12.90 లక్షలు నుంచి రూ.13.53 లక్షలు

29.2kWh బ్యాటరీ, 57hp మోటార్‌తో 246 కి.మీ. రేంజ్ ఇస్తుంది. అయితే ఫీచర్ల పరంగా కొంత వెనుకబడి ఉంటుంది.

5) Tata Nexon EV

ధర: రూ.12.49 లక్షలు నుంచి రూ.17.29 లక్షలు

MR (30kWh) & 45 (45kWh) వేరియంట్లలో లభిస్తుంది. రేంజ్ 275 కి.మీ. నుంచి గరిష్టంగా 489 కి.మీ. వరకు ఉంటుంది. పనితీరు, ఫీచర్లు, రేంజ్ అన్ని పరంగా బ్యాలెన్స్‌డ్‌ ప్యాకేజీ.

4) Tata Tigor EV

ధర: రూ.12.49 లక్షలు నుంచి రూ.13.75 లక్షలు

26kWh బ్యాటరీతో 315 కి.మీ. రేంజ్ ఇస్తుంది. ఈ జాబితాలో ఏకైక సెడాన్ మోడల్.

3) Tata Punch EV

ధర: రూ.9.99 లక్షలు నుంచి రూ.14.44 లక్షలు

25kWh & 35kWh బ్యాటరీ ఆప్షన్లు ఉన్నాయి. రేంజ్ 315 కి.మీ. నుంచి 421 కి.మీ. వరకు ఉంటుంది. చిన్న SUV అయినప్పటికీ మంచి పనితీరు, ఫీచర్లతో ఆకట్టుకుంటుంది.

2) Tata Tiago EV

ధర: రూ.7.99 లక్షలు నుంచి రూ.11.14 లక్షలు

19.2kWh & 24kWh బ్యాటరీ ఆప్షన్లు ఉన్నాయి. రేంజ్ 223 కి.మీ. నుంచి 293 కి.మీ. వరకు ఉంటుంది. తక్కువ ధరలో మంచి ఫీచర్లతో అందుబాటులో ఉన్న నాలుగు తలుపుల హ్యాచ్‌బ్యాక్.

1) MG Comet EV

ధర: రూ.7.5 లక్షలు నుంచి రూ.10 లక్షలు
BaaS ధర: రూ.4.99 లక్షలు నుంచి + కిలోమీటరుకు ఛార్జ్

BaaS ధర: రూ.5 లక్షలతో, ఇండియాలోనే అత్యంత తక్కువ ధరలో లభించే ఎలక్ట్రిక్ కారు MG Comet EV. 17.3kWh బ్యాటరీతో 230 కి.మీ. రేంజ్ ఇస్తుంది. సైజ్‌ చిన్నగా ఉన్నప్పటికీ నగర ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది.

గమనిక: పైన చెప్పిన అన్ని మోడళ్ల డ్రైవింగ్‌ రేంజ్ వివరాలు ARAI సర్టిఫై చేసినవి. డ్రైవింగ్ స్టైల్‌, రోడ్ పరిస్థితులను బట్టి వాస్తవ రేంజ్ మారుతుంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

Ethanol EV Charger: ఈవీ ఛార్జింగ్‌లో కొత్త విప్లవం.. తెలంగాణలో ఇథనాల్ ఆధారిత ఛార్జర్ ప్రారంభం!
ఈవీ ఛార్జింగ్‌లో కొత్త విప్లవం.. తెలంగాణలో ఇథనాల్ ఆధారిత ఛార్జర్ ప్రారంభం!
ఫుల్ ఛార్జ్‌పై 421 కి.మీ రేంజ్.. Tata Punch EVపై రూ.1.45 లక్షల వరకు డిస్కౌంట్ ఆఫర్
ఫుల్ ఛార్జ్‌పై 421 కి.మీ రేంజ్.. Tata Punch EVపై రూ.1.45 లక్షల వరకు డిస్కౌంట్ ఆఫర్
Tata Curvv EVలో ప్లస్‌ పాయింట్లతో పాటు కొన్ని మైనస్‌లు కూడా ఉన్నాయి! కొనే ముందు ఓసారి ఆలోచించండి
Tata Curvv EV కొనడం తెలివైన పనేనా? ఈ కారులో ప్లస్‌లు, మైనస్‌లు ఏంటి?
రికార్డు సృష్టించిన TVS - వెనుకబడిన Ola.. ఎలక్ట్రిక్‌ స్కూటర్ల అమ్మకాల్లో టాప్ 10 కంపెనీలు ఇవే!
గత నెల రోజుల్లో మిడిల్‌క్లాస్‌ వాళ్లు ఎక్కువగా కొన్న ఎలక్ట్రిక్‌ స్కూటర్లు ఇవే

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Udhayanidhi Stalin: నా అరెస్ట్ పెద్ద కామెడీ- ఎవరికీ భయపడను, మళ్లీ మళ్లీ మాట్లాడతాను: ఉదయనిధి స్టాలిన్
నా అరెస్ట్ పెద్ద కామెడీ- ఎవరికీ భయపడను, మళ్లీ మళ్లీ మాట్లాడతాను: ఉదయనిధి స్టాలిన్
Telangana Police Vehicle Rapido: పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
Khanapur MLA Wedma Bojju: ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
AP High Court Rejects CBI Probe on Mega DSC: మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
Breastfeeding Diet : తల్లిపాలు ఇచ్చే సమయంలో అతిగా తినకూడదా? డైట్‌లో చేర్చుకోవాల్సిన, తీసేయాల్సిన ఫుడ్స్ ఇవే
తల్లిపాలు ఇచ్చే సమయంలో అతిగా తినకూడదా? డైట్‌లో చేర్చుకోవాల్సిన, తీసేయాల్సిన ఫుడ్స్ ఇవే
Harish Rao Black Magic Row: క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
Crop Insurance Scheme: రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
Udhayanidhi Stalin Bail: త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
Embed widget