అన్వేషించండి

మారుతి స్విఫ్ట్‌ vs టాటా పంచ్‌: 5 ఏళ్ల ఓనర్‌షిప్‌ కాస్ట్‌, మైలేజీ పూర్తి తేడా తెలుసుకోండి? ఏ కారులో మీకు డబ్బు ఆదా?

Maruti Swift vs Tata Punch: మారుతి స్విఫ్ట్, టాటా పంచ్‌ ధరలు, మైలేజ్‌, మెయింటెనెన్స్, ఐదేళ్ల ఓనర్‌షిప్‌ ఖర్చు పూర్తి విశ్లేషణ. ఏ కారు కొంటే మీరు 2 లక్షలు ఆదా చేసుకోవచ్చు?

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • మారుతి స్విఫ్ట్, టాటా పంచ్ మధ్య ధర, మైలేజ్, నిర్వహణలో పోటీ.
  • స్విఫ్ట్ మెరుగైన మైలేజ్, తక్కువ నిర్వహణ ఖర్చులతో ఆకట్టుకుంటుంది.
  • పంచ్ ఫైవ్ స్టార్ సేఫ్టీ, SUV లుక్స్‌తో సవాలు విసురుతుంది.
  • నగర ప్రయాణానికి స్విఫ్ట్, హైవేలకు, భద్రతకు పంచ్ అనుకూలం.

Maruti Swift vs Tata Punch: భారత్ ఆటోమొబైల్ మార్కెట్ చాలా మలుపులు తిరుగుతోంది. ముఖ్యంగా మధ్య తరగతి వాహనదారుల ఫేవరెట్‌ ఛాయిస్‌లుగా ఉన్న మారుతి స్విఫ్ట్‌ 2026, టాటా పంచ్‌ మధ్య పోటీ ఇప్పుడు తీవ్రమైంది. లీటర్ పెట్రోల్‌ ధర వంద రూపాయలకు పేగా ఉన్నప్పుడు వినియోగదారులు కేవలం కొనుగోలు ధర మాత్రమే కాకుండా దాని నిర్వహణ ఖర్చులను కూడా పరిగణలోకి తీసుకుంటున్నారు. 

ఒకవైపు మారుతి స్విఫ్ట్‌ తన అద్భుతమైన మైలేజ్‌, కొత్త హైబ్రిడ్‌ టెక్నాలజీతో దూసుకుపోతుంటే, మరోవైపు టాటా పంచ్‌ తన మైక్రో ఎస్‌యూవీ లుక్స్, ఫైవ్‌ స్టార్ సేఫ్టీ రేటింగ్‌తో సవాల్ విసురుతోంది.  రెండు దిగ్గ కార్లలో ఏది కొంటే ఐదేళ్లలో మీకు లాభం. పెట్రోల్‌, సీఎన్జీ, లేదా హైబ్రిడ్‌.... ఏది ఉత్తమమైన ఎంపిక? లాంటి వివరాలపై సమగ్రమైన సమాచారాన్ని తెలుసుకుందాం. 

భారతీయ నగరాల్లో ట్రాఫిక్ రద్దీ పెరగడం వల్ల రియల్ వరల్డ్ మైలేజ్‌ అనేది కారు కొనుగోలులో ప్రధాన నిర్ణయాత్మక శక్తిగా మారింది. పెట్రోల్‌ ధర 105 రూపాయలు, సీఎన్జీ 90 రూపాయల వద్ద ఉన్న తరుణంలో, వాహనదారులు తమ వార్షిక ప్రయాణం సుమారు 1500 కిలోమీటర్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. 

మారుతి తన ఐకానిక్ హ్యాచ్‌ బ్యాక్ అయిన స్విఫ్ట్‌ను మరింత ఎఫిషియంట్‌ ఇంజిన్‌తో అప్‌డేట్ చేయగా, టాటా మోటార్స్‌ తన పంచ్‌ను సేఫ్టీ, ఫీచర్లలో రాజీ పడకుండా మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఈ రెండు కార్ల మధ్య ఉన్న పోలిక కేవలం డిజైన్ గురించి మాత్రమే కాదు, అది ఐదేళ్ల యాజమాన్య ఖర్చు గురించి కూడా ఆలోచిస్తున్నారు. 

ధరల్లో ఎవరు బెటర్?

టాటా పంచ్‌ ధరలు (హైదరాబాద్‌ ఎక్స్‌ షోరూమ్‌):

  • బేస్‌ (స్మార్ట్‌): 5.60 లక్షలు
  • మిడ్‌ (అడ్వెంచర్‌):6.50 లక్షల నుంచి 8 లక్షలు
  • టాప్‌ (అకాంప్లిష్డ్‌): 9 లక్షల నుంచి 10.55 లక్షలు

మారుతి స్విఫ్ట్‌ 2026 ధరలు (హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్‌)

  • బేస్‌(LXi): 5.79 లక్షలు
  • మిడ్‌(VXi): 6.59 నుంచి 8.80లక్షలు
  • టాప్‌(ZXi+): 8.20 నుంచి 8.80 లక్షలు 

బేస్‌ వేరియంట్‌లో టాటా పంచ్‌ ఇరవై వేల నుంచి 30 వేల రూపాయల వరకు తక్కువకి లభిస్తున్నప్పటికీ, టాప్ వేరియంట్లలో పంచ్‌ ధరలు స్విఫ్ట్‌ కంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. 

ఇంజిన్ పని తీరు- పవర్‌ vs స్మూత్‌ నెస్‌

ఈ రెండు వాహనాలు 1.2 లీటర్ల 3 సిలిండర్‌ ఇంజిన్‌లతో వస్తున్నప్పటికీ వాటి సామర్థ్యంలో గణనీయమైన తేడాలు ఉన్నాయి. మారుతి స్విఫ్ట్‌లో కొత్త z12E పెట్రోల్‌ ఇంజిన్ ఉంది. ఇది 82 PS పవర్‌ను, 112 Nm టార్క్‌ను అందిస్తుంది. ఇది అత్యంత స్మూత్, రిఫైన్డ్‌ డ్రైవింగ్ అనుభవాన్ని ఇస్తుంది. టాటా పంచ్ విషయానికి వస్తే 88 PS శక్తిని, 115Nm టార్క్‌ను అందిస్తుంది. ముఖ్యంగా పంచ్‌లో టర్బో ఆప్షన్ అందుబాటులో ఉంది. ఇది 120 PS శక్తిని, 170Nm టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది హైవే డ్రైవింగ్‌కు మంచి ఆప్షన్ అవుతుంది. స్విఫ్ట్ సిటీలో స్మూత్ పికప్ ఇస్తే, పంచ్ తన ఎస్‌యూవీ బాడీకి తగ్గట్టుగా ఎక్కువ టార్క్ కలిగి ఉంది. 

మైలేజ్‌లో సూపర్ ఎవరు?

మైలేజ్ విభాగంలో మారుతి స్విప్ట్‌ తిరుగులేని ఆధిపత్యంతో దూసుకుపోతోంది. ఈ కారు పెట్రోల్‌ వేరియంట్‌లో క్లెయిమ్డ్ మైలేజ్‌24.8-25.75kmpl; రియల్‌ వరల్డ్‌ అంటే హైదరాబాద్ ట్రాఫిక్‌లో 20- 23 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఇదే పెట్రోల్ విభాగంలో టాటా పంచ్‌ 18.9-20.9 kmpl ఇస్తుందని క్లెయిమ్ చేశారు. రియల్‌గా మాత్రం 15-18 కిలోమీటర్లు వస్తుంది. సీఎన్జీ వేరియంట్‌లో మారుతి స్విఫ్ట్‌ 32.85 కిలోమీటర్ల మైలేజీ ఇస్తే, టాటా పంచ్‌ 26.99 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. స్విఫ్ట్‌లో ఉన్న ఇడ్లింగ్‌ సాఫ్ట్‌, స్మార్ట్ హైబ్రిడ్‌ టెక్నాలజీ కారణంగా ఇది నగరాల్లో అత్యుత్తమ మైలేజీని ఇస్తుంది. పంచ్ ఎస్‌యూవీ డిజైన్, అధిక బరువు కారణంగా మైలేజీ తగ్గుతుంది. 

ఐదేళ్ల తర్వాత ఏది లాభదాయకం?

సర్వీస్ నెట్‌వర్క్, విడిభాగాల ధరల విషయంలో మారుతి సుజుకి బెటర్ ఆప్షన్‌గా చెప్పవచ్చు. ఈ కారు ఐదేళ్లు మెయింటెన్ చేయడానికి దాదాపు 21,516 నుంచి 26, 960 రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే ఏడాదికి 3500 నుంచి 5000 వేలు మాత్రమే ఖర్చు చేయాలి. అదే టాటా పంచ్‌ అయితే ఐదేళ్లకు 23, 561 నుంచి పాతిక వేలు వరకు ఖర్చు అవుతుంది. అంటే ఏడాదికి నాలుగు వేల నుంచి ఆరు వేల వరకు ఖర్చు పెట్టాలి. 

ఐదేళ్లలో టాటా పంచ్‌, మారుతి సుజుకి నికర ఓనర్‌ షిప్ ఖర్చు ఎంత? 

హైదరాబాద్‌లో ఐదేళ్ల పాటు 75వేల కిలోమీటర్లు తిరిగిన తర్వాత ఖర్చు లెక్కలు ఇలా ఉన్నాయి. 

ఖర్చు టాటా పంచ్‌    మారుతి స్విఫ్ట్‌
అన్‌ రోడ్ ధర(బేస్‌)   రూ. 6.99 లక్షలు రూ. 7.09 లక్షలు
ఫ్యూయల్‌ ఖర్చు(ఐదేళ్లు)    రూ. 2, 67, 500     రూ. 2, 14,000
మెయింటెనెన్స్‌+ ఇన్సూరెన్స్‌     రూ. 60, 000,  రూ. 50,000
 మొత్తం ఖర్చు     రూ. 10, 26, 500     రూ. 9, 73, 000
రీసేల్ వాల్యూ (ఐదేళ్ల తర్వాత)   రూ. 3, 49, 500   రూ. 4, 96, 300
నికర ఓనర్‌ షిప్ ఖర్చు   రూ. 6,77, 000   రూ. 4, 76, 700

ఈ అంచనాల ప్రకారం మారుతి స్విఫ్ట్‌ కొన్న వ్యక్తి ఐదేళ్లలో రెండు లక్షల రూపాయల వరకు ఆదా చేస్తారు. మేలేజీ, రీసేల్‌ వాల్యూ కూడా ఉంటుంది. 

ఎవరు ఏ కారు కొనాలి

మీకు ఎక్కువగా నగరంలో ప్రయాణిస్తుంటే, మీకు అత్యుత్తమ మైలేజీ, తక్కువ సర్వీస్ ఖర్చు కావాలనుకంటే మారుతి స్విఫ్ట్‌కు వెళ్లడం మంచిది. ఐదేళ్ల తర్వాత కారు అమ్మేటప్పుడు మంచి ధర రావాలన్నా సరే మారుతి మంచి ఆప్షన్. మీకు ఫైవ్ స్టార్‌ సేఫ్టీ, పటిష్టమైన బాడీ కావాలనుకుంటే టాటా పంచ్ మంచి ఛాయిస్‌. హైవే ప్రయాణాల్లో ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్‌, టర్బో పవర్ అవసరమైతే, మైక్రో ఎస్‌యూవీ, విశాలమైన క్యాబిన్‌ ఇష్టపడే వాళ్లకు పంచ్ నచ్చుతుంది. 

Frequently Asked Questions

మారుతి స్విఫ్ట్ మరియు టాటా పంచ్ లలో ఏది ఎక్కువ మైలేజ్ ఇస్తుంది?

మారుతి స్విఫ్ట్ పెట్రోల్ లో 24.8-25.75 kmpl, CNG లో 32.85 kmpl మైలేజ్ ఇస్తుంది. టాటా పంచ్ పెట్రోల్ లో 18.9-20.9 kmpl, CNG లో 26.99 kmpl ఇస్తుంది.

ఐదేళ్ల తర్వాత ఏ కారు నిర్వహణ ఖర్చు తక్కువగా ఉంటుంది?

మారుతి స్విఫ్ట్ ఐదేళ్ల నిర్వహణకు దాదాపు 21,516 - 26,960 రూపాయలు ఖర్చు అవుతుంది. టాటా పంచ్ కు 23,561 - 25,000 రూపాయలు ఖర్చు అవుతుంది.

సేఫ్టీ విషయంలో ఏ కారు మెరుగైనది?

టాటా పంచ్ ఫైవ్ స్టార్ సేఫ్టీ రేటింగ్ తో వస్తుంది, ఇది దాని పటిష్టమైన బాడీకి నిదర్శనం.

నగర ప్రయాణాలకు ఏ కారు మంచి ఎంపిక?

నగరాల్లో అత్యుత్తమ మైలేజ్ మరియు తక్కువ సర్వీస్ ఖర్చు కావాలనుకునే వారికి మారుతి స్విఫ్ట్ మంచి ఎంపిక.

టాప్ హెడ్ లైన్స్

Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
R15 కంటే పవర్‌ఫుల్ బైక్.. Yamaha R2 ని కేవలం రూ.10,000 తో బుక్‌ చేసుకోవచ్చు
కేవలం రూ.10,000 మీ దగ్గర ఉంటే చాలు, రూ.2 లక్షల Yamaha R2 మీ సొంతం!
Mahindra XUV700 Price on Road: మహీంద్రా XUV700 కొనడానికి ఎంత ఖర్చు అవుతుంది? EMI లెక్కేంటీ?
మహీంద్రా XUV700 కొనడానికి ఎంత ఖర్చు అవుతుంది? EMI లెక్కేంటీ?
అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లతో Ampere Magnus G Max అప్‌డేట్‌ వెర్షన్‌.. రేటు రూ.1.10 లక్షలు, చాలా స్పెషాలిటీలు
రూ.1.10 లక్షలకే ఆంపియర్‌ మాగ్నస్‌ G మ్యాక్స్‌.. ఇంతకుముందులా లేదు, 30కి పైగా కొత్త ఫీచర్లు

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Embed widget