అన్వేషించండి

2026 టాటా పంచ్‌ ఫేస్‌లిఫ్ట్‌ రివ్యూ: కొత్త ఇంజిన్‌ పవర్‌ ఎంత?, ఉపయోగపడే ఫీచర్లు ఇచ్చారా?

2026 Tata Punch Facelift కొత్త టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌, అప్‌డేటెడ్‌ డిజైన్‌, లేటెస్ట్‌ ఫీచర్లతో మార్కెట్‌లోకి వచ్చింది. డ్రైవింగ్‌ అనుభవం నుంచి ధర వరకు పూర్తి రివ్యూ తెలుసుకోండి.

2026 Tata Punch Facelift Review: ఐదేళ్ల ప్రయాణం, ఏడు లక్షలకుపైగా కస్టమర్లు. టాటా మోటార్స్‌కు Tata Punch అంత పెద్ద సక్సెస్‌ అనడానికి ఇవే సరైన ఉదాహరణలు. అయితే కాలం మారింది, కస్టమర్‌ అంచనాలు కూడా పెరిగాయి. అందుకే 2026లో టాటా పంచ్‌కు మిడ్‌-లైఫ్‌ అప్‌డేట్‌ తప్పనిసరి అయింది. కొత్త ఇంజిన్‌, తాజా డిజైన్‌, మరిన్ని ఫీచర్లతో 2026 Tata Punch Facelift మార్కెట్‌లోకి అడుగుపెట్టింది.

2026 Tata Punch Facelift: ఇంజిన్‌ & గేర్‌బాక్స్‌

ఈ ఫేస్‌లిఫ్ట్‌లో పెద్ద అప్‌డేట్‌ అంటే కొత్త 1.2 లీటర్‌ టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌. టాటా నెక్సాన్‌లో ఇప్పటికే నిరూపించుకున్న ఈ 3-సిలిండర్‌ ఇంజిన్‌ ఇప్పుడు పంచ్‌లోకి వచ్చింది. ఇది 120 హార్స్‌పవర్‌, 170 Nm టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. దీనితో పాటు 6-స్పీడ్‌ మాన్యువల్‌ గేర్‌బాక్స్‌ మాత్రమే లభిస్తుంది.

ఇప్పటికే ఉన్న 1.2 లీటర్‌ న్యాచురల్‌ ఆస్పిరేటెడ్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ కూడా కొనసాగుతోంది. ఇది పెట్రోల్‌లో 88 హార్స్‌పవర్‌, 115 Nm, CNG మోడ్‌లో 73 హార్స్‌పవర్‌, 103 Nm ఇస్తుంది. దీనికి 5-స్పీడ్‌ మాన్యువల్‌, 5-స్పీడ్‌ AMT ఆప్షన్లు ఉన్నాయి.

టర్బో పెట్రోల్‌ డ్రైవింగ్‌ అనుభవం

రూ.10 లక్షల లోపు సెగ్మెంట్‌లో ఇది అత్యంత శక్తిమంతమైన ఇంజిన్‌లలో ఒకటి. స్టార్ట్‌ చేసిన క్షణం నుంచే పంచ్‌ షార్ప్‌గా స్పందిస్తుంది. 2,000 rpm దాటాక ఇంజిన్‌ పూర్తి ఉత్సాహంతో పుల్‌ ఇస్తుంది. ఓవర్‌టేకింగ్‌, అకస్మాత్తుగా వేగం పెంచాల్సిన సందర్భాల్లో ఇది బాగా సహాయపడుతుంది.

అయితే హార్డ్‌గా రేవ్‌ చేసినప్పుడు ఫ్లోర్‌ దగ్గర కొద్దిగా వైబ్రేషన్లు కనిపిస్తాయి. NVH లెవెల్స్‌ ఇంకా మెరుగుపర్చవచ్చు. హైవేలో మాత్రం ట్రిపుల్‌ డిజిట్‌ స్పీడ్స్‌ సులభంగా చేరుతుంది. గేర్‌బాక్స్‌ కొద్దిగా రఫ్‌గా అనిపిస్తుంది. క్లచ్‌ ట్రావెల్‌ ఎక్కువగా ఉండటంతో సిటీ ట్రాఫిక్‌లో ఎడమ కాలు అలసిపోవచ్చు.

CNG AMT & ప్యాడిల్‌ షిఫ్టర్స్‌

CNG కారులో ప్యాడిల్‌ షిఫ్టర్స్‌ అవసరమా అనే సందేహం మొదట వస్తుంది. కానీ రియల్‌ వరల్డ్‌లో ఇవి నిజంగా ఉపయోగపడతాయి. CNG మోడ్‌లో ఇంజిన్‌ పనితీరు మితంగా ఉంటుంది. ఇక్కడ ఫ్యూయల్‌ ఎఫిషియెన్సే ప్రాధాన్యం.

AMTలో గేర్‌ లీవర్‌ మార్చాల్సిన అవసరం లేకుండా ప్యాడిల్స్‌ ద్వారా గేర్‌ కంట్రోల్‌ లభించడం పెద్ద ప్లస్‌. ఓవర్‌టేక్‌ సమయంలో 5,500 rpm వరకూ గేర్‌ను పట్టుకోవచ్చు. ఈ సెగ్మెంట్‌లో ఇది మంచి డ్రైవింగ్‌ కంట్రోల్‌ ఇస్తుంది. NVH కూడా ఇక్కడ మెరుగ్గా ఉంటుంది.

రైడ్‌ & హ్యాండ్లింగ్‌

రూ.10 లక్షల లోపు ధరలో, బ్యాడ్‌ రోడ్లపై బెస్ట్‌ డ్రైవింగ్‌ క్వాలిటీ ఇవ్వగల కారు పంచ్‌ అని చెప్పొచ్చు. దీని సస్పెన్షన్‌.. గుంటలు, బ్రేకర్లు సులభంగా తట్టుకుంటుంది. 190 mm గ్రౌండ్‌ క్లియరెన్స్‌, 16 అంగుళాల వీల్స్‌, 400 mm వాటర్‌ వేడింగ్‌ సామర్థ్యంతో చెడు రోడ్లపై ధైర్యం ఇస్తుంది. స్టీరింగ్‌ బాగా వెయిటెడ్‌గా ఉన్నా, సెంటర్‌ దగ్గర కొద్దిగా వాగ్‌నెస్‌ ఉంటుంది. ఎత్తైన బాడీ కారణంగా కార్నర్లలో బాడీ రోల్‌ కనిపిస్తుంది.

డిజైన్‌ మార్పులు

ముందు ఉన్న భారీ హాలోజన్‌ యూనిట్ల స్థానంలో ఇప్పుడు వర్టికల్‌గా అమర్చిన LED హెడ్‌ల్యాంప్స్‌, స్లిమ్‌ DRLs వచ్చాయి. వెనుక కనెక్టెడ్‌ లైట్‌ బార్‌ కొత్తగా కనిపిస్తుంది. బ్లాక్‌-సిల్వర్‌ బంపర్‌ డిజైన్‌ కారు లుక్‌ను షార్ప్‌గా మార్చింది. సైడ్‌ ప్రొఫైల్‌ పెద్దగా మారలేదు. బ్లాక్‌ క్లాడింగ్‌ మాత్రం ఇంకా ఎక్కువగానే ఉంది.

క్యాబిన్‌ & ఫీచర్లు

10.25 అంగుళాల టచ్‌స్క్రీన్‌, వైర్‌లెస్‌ Android Auto, Apple CarPlay, కనెక్టెడ్‌ ఫీచర్లు ఉన్నాయి. టాప్‌ వేరియంట్లలో సన్‌రూఫ్‌, వైర్‌లెస్‌ ఛార్జర్‌, హార్మన్‌ ఆడియో, 360 డిగ్రీ కెమెరా లభిస్తాయి. కొత్త డెనిమ్‌ ఫాబ్రిక్‌ సీట్లు, మెరుగైన అండర్‌-థై సపోర్ట్‌ కంఫర్ట్‌ను పెంచాయి. బూట్‌ స్పేస్‌ CNGతో 210 లీటర్లు, లేకపోతే 366 లీటర్లు.

ఎక్స్‌-షోరూమ్‌ ధర రూ.5.59 లక్షల నుంచి రూ.10.54 లక్షల వరకు ఉన్న ఈ పంచ్‌ ఫేస్‌లిఫ్ట్‌ ఇప్పుడు Swift, Baleno, Fronx, Exter, Kiger, Magniteలకు గట్టి పోటీ ఇస్తుంది. మైలేజ్‌లో మారుతి ముందుంటే.... రైడ్‌ క్వాలిటీ, భద్రత (5-స్టార్‌ Bharat NCAP)లో పంచ్‌ బలంగా నిలుస్తుంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

Car Warranty: డాష్‌క్యామ్ అమరిస్తే కారు వారంటీ రద్దవుతుందా? రూ.లక్షల నష్టం రాకుండా ఈ జాగ్రత్తలు పాటించండి!
కారులో డాష్‌క్యామ్ పెట్టించాలనుకుంటున్నారా? మీ కారు వారంటీ పోతుందేమో తెలుసుకోండి!
Hyundai Grand i10 Nios కొనే ప్లాన్‌లో ఉన్నారా? ముందు ఈ 5 విషయాలు తప్పక తెలుసుకోండి
హ్యుందాయ్‌ i10 నియోస్‌ కొనవచ్చా, వద్దా? 3 ప్లస్ పాయింట్లు, 2 మైనస్ పాయింట్లు
Kia Seltos సరికొత్త రికార్డ్‌.. 7 లక్షలు దాటిన అమ్మకాలు.. ఈ SUVకి ఇంత క్రేజ్ ఎందుకో తెలుసా?
ఇండియాలో 7 లక్షల మంది కొన్న క్రేజీ SUV.. ధర మీ బడ్జెట్‌లోనే!
Denza Z9 GT: 3 సెకన్లలో 100km స్పీడ్‌, 670km రేంజ్‌, 1156hp పవర్‌.. లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్‌లో మరో సంచలనం!
దాదాపు రూ.2 కోట్ల కారు.. దీని ప్రత్యేకతలు తెలిస్తే 'ఓయబ్బో' అంటారు!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
N Ramchander Rao: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు హౌస్ అరెస్ట్.. తెలంగాణలో రాజ్యాంగం అమలుపై ప్రశ్నలు 
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు హౌస్ అరెస్ట్.. తెలంగాణలో రాజ్యాంగం అమలుపై ప్రశ్నలు 
Cricketer Suicide: ప్రేమ పేరుతో వేధింపులు.. అండర్ 19 క్రికెటర్ ఆత్మహత్య- వికారాబాద్‌లో ఘటన
ప్రేమ పేరుతో వేధింపులు.. అండర్ 19 క్రికెటర్ ఆత్మహత్య- వికారాబాద్‌లో ఘటన
US Flight Shutdown: అమెరికాలో నిలిచిన 11 వేల విమాన సర్వీసులు.. అన్ని విమానాలపై నిషేధం, కుట్ర కోణంపై టెన్షన్!
అమెరికాలో నిలిచిన 11 వేల విమాన సర్వీసులు.. అన్ని విమానాలపై నిషేధం, కుట్ర కోణంపై టెన్షన్!
Raptadu Accused Hemant: మొన్న కాలు పోయింది.. ఇప్పుడు ప్రాణాలకు ముప్పు ? రాప్తాడు నిందితుడు హేమంత్ పరిస్థితి విషమం
మొన్న కాలు పోయింది.. ఇప్పుడు ప్రాణాలకు ముప్పు ? రాప్తాడు నిందితుడు హేమంత్ పరిస్థితి విషమం
Hyundai Grand i10 Nios కొనే ప్లాన్‌లో ఉన్నారా? ముందు ఈ 5 విషయాలు తప్పక తెలుసుకోండి
హ్యుందాయ్‌ i10 నియోస్‌ కొనవచ్చా, వద్దా? 3 ప్లస్ పాయింట్లు, 2 మైనస్ పాయింట్లు
Gurnoor Brar News: టెస్ట్ సిరీస్‌కు ముందు టీమిండియాలో అనూహ్య మార్పులు.. స్పిన్నర్ కుల్దీప్ అవుట్ , పేసర్ బ్రార్‌కు పిలుపు, వెల్లింగ్టన్ చేరుకున్న పంత్
టెస్ట్ సిరీస్‌కు ముందు టీమిండియాలో అనూహ్య మార్పులు.. స్పిన్నర్ కుల్దీప్ అవుట్ , పేసర్ బ్రార్‌కు పిలుపు, వెల్లింగ్టన్ చేరుకున్న పంత్
AP CII Partnership Summit 2026: 12 లక్షల కోట్ల పెట్టుబడుల లెక్కలు సరే.. సామాన్యుడికి కావాల్సింది ఏంటి? రాజకీయంగా లాభమా, నష్టమా?
12 లక్షల కోట్ల పెట్టుబడుల లెక్కలు సరే.. సామాన్యుడికి కావాల్సింది ఏంటి? రాజకీయంగా లాభమా, నష్టమా?
Hyderabad Cyber Fraud: హైదరాబాద్‌లో ఆన్‌లైన్ ట్రేడింగ్ మోసం.. లాభాలు ఆశచూపి రూ.12.31 కోట్లు కొట్టేసిన సైబర్ కేటుగాడు
హైదరాబాద్‌లో ఆన్‌లైన్ ట్రేడింగ్ మోసం.. లాభాలు ఆశచూపి రూ.12.31 కోట్లు కొట్టేసిన సైబర్ కేటుగాడు
Embed widget