అన్వేషించండి

Fastest Cars India: భారతదేశ రోడ్లపై అత్యంత వేగంగా దూసుకెళ్తున్న టాప్‌-5 ఫాస్టెస్ట్‌ కార్లు ఇవే!

Top 5 Fastest Cars India: BMW, మెర్సిడెస్‌-AMG కార్లు టాప్‌లో నిలిచాయి. 0-100 కి.మీ. వేగాన్ని అత్యంత తక్కువ సమయంలో అందుకున్న 5 కార్ల లిస్ట్‌ ఇది. ధరలతో పాటు స్పీడ్‌ ఫిగర్స్‌ కూడా తెలుసుకోండి.

Luxury Sports Cars India 2025: భారత ఆటోమొబైల్‌ మార్కెట్లోకి ప్రతి నెలా చాలా కొత్త కార్లు ఎంట్రీ ఇస్తున్నాయి. కానీ వేగం విషయంలో మాత్రం కేవలం కొన్ని కార్లకే ప్రత్యేక స్థానం ఉంది. 0-100 కి.మీ. వేగాన్ని ఎంత త్వరగా అందుకుంటుంది? అనే విషయాన్ని బేస్‌ చేసుకుని, టాప్‌-5 కార్లతో ఒక లిస్ట్‌ రూపొందిస్తే, కేవలం రెండు కంపెనీలు మాత్రమే ఈ లిస్ట్‌లో చోటు దక్కించుకున్నాయి.

5. BMW XM – 4.44 సెకన్లు

BMW M డివిజన్‌ రూపొందించిన XM SUV లుక్స్‌లో క్లాస్‌గా, పెర్ఫార్మెన్స్‌లో మాస్‌గా ఉంటుంది. ఈ కారులో 4.4 లీటర్‌ ట్విన్‌-టర్బో V8 ఇంజిన్‌తో పాటు ప్లగ్‌-ఇన్‌ హైబ్రిడ్‌ బ్యాటరీ ప్యాక్‌ కలిసి పని చేస్తాయి. ఇవి కలిపి 653hp పవర్‌, 800Nm టార్క్‌ ఇస్తాయి. SUV అయినా, హైబ్రిడ్‌ వెయిట్‌ ఉన్నా కూడా ఈ కారు కేవలం 4.44 సెకన్లలో 0-100 కి.మీ. వేగాన్ని చేరుతుంది. ₹2.60 కోట్ల ఎక్స్‌-షోరూమ్‌ ధర ఉన్న ఈ కారు వేగాన్ని, ఎఫిషియెన్సీని ఒకేసారి అందిస్తుంది.

4. BMW M340i – 4.39 సెకన్లు

ఇది లిస్ట్‌లో “బెస్ట్‌ వ్యాల్యూ ఫర్ మనీ” కారు ఇది. 3.0 లీటర్‌ టర్బో స్ట్రైట్‌-సిక్స్‌ ఇంజిన్‌ తో 374hp పవర్‌, 500Nm టార్క్‌ ఇస్తుంది. 0-100 కి.మీ.ను 4.39 సెకన్లలో చేరడం దీని స్పెషాలిటీ. “M” బ్యాడ్జ్‌ లేకపోయినా కూడా ప్యూర్‌ స్పోర్ట్స్‌ కార్‌ ఫీలింగ్‌ ఇస్తుంది. ₹78.20 లక్షల ఎక్స్‌-షోరూమ్‌ ధరలో ఈ స్థాయి పనితీరు అంటే నిజంగా అదిరిపోయే ఆఫర్‌. స్పీడ్‌తో పాటు లగ్జరీ, కంఫర్ట్‌ కూడా ఇస్తుంది.

3. Mercedes AMG C 63 S E-Performance – 3.68 సెకన్లు

పాత మోడల్‌లోని V8 స్థానంలో ఇప్పుడు 2.0 లీటర్‌ టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌ + హైబ్రిడ్‌ టెక్‌ ఇచ్చారు. వెయిట్‌ పెరిగినా కూడా 680hp పవర్‌, 1,020Nm టార్క్‌ ఇస్తుంది. 0-100 కి.మీ.కి కేవలం 3.68 సెకన్లలో చేరే ఈ సూపర్‌-సెడాన్‌ నిజంగా ఒక “బీస్ట్‌”. ధర మాత్రం ₹1.95 కోట్లు (ఎక్స్‌-షోరూమ్‌), ఈ రేటులోనూ స్పీడ్‌ ప్రియులకు ఇది డ్రీమ్‌ కారు.

2. Mercedes AMG S 63 E-Performance – 3.46 సెకన్లు

“లగ్జరీ అంటే ఇది, స్పీడ్‌ అంటే ఇది” అన్నట్టుగా ఉండే కారు ఇది. సాధారణంగా సెడాన్‌ అంటే కంఫర్ట్‌ అని అనుకుంటాం. కానీ ఈ AMG వేరే లెవెల్‌. 4.0 లీటర్‌ ట్విన్‌-టర్బో V8 + హైబ్రిడ్‌ సెటప్‌ తో 802hp పవర్‌, 1,430Nm టార్క్‌ ఇస్తుంది. 3.46 సెకన్లలో 0-100 కి.మీ. వేగం అందుకోవడం హైలైట్‌. ₹3.34 కోట్లు (ఎక్స్‌-షోరూమ్‌) ధర ఉన్నా, ఈ కారు లగ్జరీతో పాటు రోడ్డుపై రేస్‌ట్రాక్‌ ఫీల్‌ ఇస్తుంది.

1. BMW M8 Competition – 3.45 సెకన్లు

ప్రస్తుతం దేశంలో ఉన్న ఫాస్టెస్ట్‌ కారు ఇదే. 3.45 సెకన్లలోనే 0-100 కి.మీ. చేరి, స్పీడ్‌ టెస్ట్‌లో టాప్‌ స్పాట్‌ సాధించింది. హైబ్రిడ్‌ టెక్‌ లేకపోయినా, 4.4 లీటర్‌ ట్విన్‌-టర్బో V8 ఇంజిన్‌, 625hp పవర్‌, 750Nm టార్క్‌ తో దూసుకెళ్తుంది. లుక్స్‌లో గ్రాండ్‌ టూరర్‌లా కనిపించినా, అసలు ఫీలింగ్‌ మాత్రం స్పోర్ట్స్‌ కార్‌ మాదిరిగానే ఉంటుంది. ధర ₹2.52 కోట్లు (ఎక్స్‌-షోరూమ్‌). రేటు విషయంలో, ఈ లిస్ట్‌లో మూడో చౌకైన కారు అయినప్పటికీ, స్పీడ్‌లో మాత్రం అగ్రస్థానం సాధించింది.

తెలుగు రాష్ట్రాల్లో “వేగం + లగ్జరీ” కాంబినేషన్‌ ఇష్టపడే వాళ్లు ఈ లిస్ట్‌ దగ్గర పెట్టుకోండి. BMW, మెర్సిడెస్‌-AMG ఫాస్టెస్ట్‌ బ్రాండ్స్‌గా ప్రూవ్‌ అయ్యాయి. స్పీడ్‌లో BMW M8 Competition టాప్‌ పొజిషన్‌లో ఉండగా, లగ్జరీలో AMG S 63 E-Performance రాజులా ఉంటుంది. ధరలు భారీగా ఉన్నా, ఈ కార్లను ఓన్‌ చేసుకోవడం ఒక స్టేటస్‌ సింబల్‌ అని చెప్పొచ్చు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Blowout: గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Hyderabad Water Supply: హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Blowout: గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Hyderabad Water Supply: హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Gold vs Silver for Investment : బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Embed widget