అన్వేషించండి

కొత్త Thar నుంచి Tata Punch Facelift వరకు - రూ.10 లక్షల్లో రాబోతున్న టాప్‌ 5 SUVs

Sierra EV, Mahindra Thar Facelift & New Gen Hyundai Venue వంటి SUVలు ప్రస్తుత పండుగ సీజన్‌లో లాంచ్‌ కానున్నాయి. వాటి వివరాలను తెలుసుకుందాం.

Upcoming Affordable Cars Under Rs 10 Lakh: పాపులర్‌ కారు కంపెనీలు, ఈ పండుగ సీజన్‌లో (Festive Season 2025) కొత్త మోడళ్లను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాయి. పనోరమిక్ సన్‌రూఫ్‌, వెంటిలేటెడ్ సీట్లు & లెవల్-2 ADAS వంటి అధునాతన ఫీచర్లతో ఈ కొత్త కార్లు రాబోతున్నాయి. రూ.10 లక్షల కంటే తక్కువ ధరలో, త్వరలో విడుదల కానున్న ఐదు కొత్త SUVలు & సెడాన్‌లు ఇవే..

ఎలక్ట్రిక్ & ICE వెర్షన్లలో రాబోతున్న Tata Sierra
90ల నాటి ఐకానిక్ SUV టాటా సియెర్రా కొత్త అవతారంలో తిరిగి వస్తోంది. ఈ కంపెనీ, నవంబర్ 2025లో 65kWh & 75kWh బ్యాటరీ ప్యాక్‌లతో EV వెర్షన్‌ను విడుదల చేస్తుంది. దీని పరిధి 500km నుంచి 600km వరకు ఉంటుంది. దీని డిజైన్ ప్రీమియం & ఫ్యూచరిస్టిక్‌గా ఉంటుంది. స్లీక్‌ LED హెడ్‌లైట్‌లు, ఫ్లోటింగ్‌ రూఫ్‌ & కనెక్టెడ్‌ టెయిల్‌ల్యాంప్‌లు ఉంటాయి. ఇంటీరియర్‌లో.. ట్రిపుల్-స్క్రీన్ సెటప్, పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు & ADAS వంటి లక్షణాలు ఉంటాయి. ICE వెర్షన్ 1.5-లీటర్ టర్బో పెట్రోల్ & 2.0-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో శక్తినిస్తుంది. దీని ధర ₹20-30 లక్షల మధ్య ఉంటుందని, Hyundai Creta & Kia Seltos వంటి పాపులర్‌ SUV లతో పోటీ పడుతుందని భావిస్తున్నారు.

Mahindra Thar Facelift 2025
ఆఫ్-రోడింగ్ సామర్థ్యాలకు పేరుగాంచిన మహీంద్రా థార్, ఈ ఏడాది చివర్లో ఫేస్‌లిఫ్ట్‌ రూపంలో వస్తోంది. కొత్త థార్‌లో కొత్త ఫ్రంట్ గ్రిల్, అప్‌డేటెడ్‌ హెడ్‌లైట్లు & అల్లాయ్ వీల్స్ ఉంటాయి. ఇంటీరియర్‌లో పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 360-డిగ్రీ కెమెరా & ADAS వంటి లక్షణాలు ఉంటాయి. ఇంజిన్ ఎంపికల్లో.. 2.0-లీటర్ టర్బో పెట్రోల్ & 2.2-లీటర్ డీజిల్ ఉంటాయి, ఇవి 6-స్పీడ్ మాన్యువల్ & ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లతో అనుసంధానమై ఉంటాయి. ధరలు ₹15-20 లక్షల వరకు ఉంటాయని అంచనా.

Tata Punch Facelift 2025
టాటా పంచ్ కూడా ఫేస్‌లిఫ్ట్‌ వెర్షన్‌లో రాబోతోంది. కొత్త ఫ్రంట్‌ & రియర్‌ డిజైన్, LED హెడ్‌లైట్‌లు & కొత్త అల్లాయ్ వీల్స్‌ ఉంటాయి. ఇంటీరియర్‌లో 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్, వైర్‌లెస్ ఛార్జింగ్ & వెంటిలేటెడ్ సీట్లు వంటి ఫీచర్లు యాడ్‌ అవుతాయి. ఇప్పటికే ఉన్న 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్ (86 bhp) & CNG ఎంపికలు అలాగే ఉంటాయి, కొత్త టర్బో-పెట్రోల్ ఇంజిన్‌ను కూడా తీసుకురావచ్చు. దీని ధర ₹7-11 లక్షల మధ్య ఉంటుంది. Maruti Ignis & Hyundai Exter తో ఇది పోటీ పడవచ్చు.

New Gen Hyundai Venue
కొత్త హ్యుందాయ్ వెన్యూ అక్టోబర్ లేదా నవంబర్ 2025లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. Hyundai Creta నుంచి ప్రేరణతో దీనిని డిజైన్‌ చేశారు. నిలువుగా పేర్చినట్లు ఉండే LED హెడ్‌లైట్లు & కనెక్టెడ్‌ DRLs హైలైట్‌ కావచ్చు. ఇంటీరియర్‌లో డ్యూయల్ 12.3-అంగుళాల స్క్రీన్ సెటప్, పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు & లెవల్-2 ADAS వంటి లక్షణాలను చూడవచ్చు. ఇంజిన్ ఎంపికలలో... 1.2-లీటర్ పెట్రోల్, 1.0-లీటర్ టర్బో పెట్రోల్ & 1.5-లీటర్ డీజిల్ ఉంటాయి. ధరలు ₹8-14 లక్షల వరకు ఉండొచ్చని అంచనా. ఈ SUV Tata Nexon & Maruti Fronx తో పోటీ పడుతుంది.

MG Majestor
కొత్త రాబోతున్న SUVలలో, MG ప్రీమియం సెడాన్ మెజెస్టర్‌ పేరు కూడా ఉంది. ఇది 7-స్పీడ్ DCT గేర్‌బాక్స్‌తో అనుసంధానమైన 1.5-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ లేదా హైబ్రిడ్ ఇంజిన్‌తో శక్తినిస్తుంది. ఇంటీరియర్‌లో పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ & ADAS ఉంటాయి. దీని ధర ₹15-20 లక్షల మధ్య ఉంటుంది. Honda City & Hyundai Verna తో ఇది పోటీ పడవచ్చు.

టాప్ హెడ్ లైన్స్

17 వేల EMIపై Hyundai Creta కొనాలంటే డౌన్ పేమెంట్ ఎంత చెల్లించాలి
17 వేల EMIపై Hyundai Creta కొనాలంటే డౌన్ పేమెంట్ ఎంత చెల్లించాలి
Maruti Dzireకు ప్రత్యామ్నాయంగా Honda Amaze కొనబోతున్నారా? ముందు ఈ నిజాలు కచ్చితంగా తెలుసుకోండి
కొత్త Honda Amaze కొనేవాళ్లకు అలెర్ట్‌! ఈ సెడాన్‌లో మీకు తెలియాల్సిన 3 ప్లస్‌లు, 3 మైనస్‌లు!
Ethanol: పెట్రోల్ తర్వాత డీజిల్‌పైనా ప్రయోగం.. ఇథనాల్‌పై కేంద్రం ఎందుకు వెనక్కి తగ్గింది?
డీజిల్‌లో ఇథనాల్ కలపడం కుదరదు.. అసలు కారణం ఇదే!
బాబర్ బైక్ సెగ్మెంట్‌లో కొత్త పోరు.. గోవాన్ క్లాసిక్ 350తో హోండా రెబెల్ 300 పోటీ!
హోండా రెబెల్ 300 vs రాయల్ ఎన్‌ఫీల్డ్‌ గోవాన్ క్లాసిక్ 350 - ఏది స్పెషల్‌ బైక్‌?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Embed widget