Bike Launches: డిసెంబర్‌లో లాంచ్ కానున్న బైకులు ఇవే.. భారీ స్పోర్ట్స్ బైకులు కూడా!
డిసెంబర్‌లో ప్రపంచ మార్కెట్లో, భారతదేశంలో ఎంట్రీ ఇవ్వనున్న బైకులు ఇవే..
ప్రతి నెలా ప్రపంచ మార్కెట్లోకి ఎన్నో కొత్త బైకులు వస్తుంటాయి. అలాగే ఈ నెల కూడా ఎన్నో కొత్త బైకులు ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధం అయ్యాయి. ఇక్కడ అన్నిటికంటే ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ నెలలో రెండు ఐకానిక్ మోటార్ సైకిల్ బ్రాండ్లు రీ-ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధం అయ్యాయి. అసలు ఈ నెలలో లాంచ్ కానున్న టాప్ బైకులు ఇవే..
1. హార్లే డేవిడ్‌సన్ స్పోర్ట్‌స్టర్ ఎస్
హార్లే డేవిడ్‌సన్ స్పోర్ట్‌స్టర్ ఎస్ ధర మనదేశంలో కొన్ని రోజుల్లో రివీల్ కానుంది. 2018లో కంపెనీ ప్రదర్శించిన కస్టం ప్రోటోటైప్ 1250 ఆధారంగా దీన్ని రూపొందించారు. ఇందులో 1,252 సీసీ వీ ట్విన్ ఇంజిన్ అందించనున్నారు. ఈ ఇంజిన్ 121 బీహెచ్‌పీ, 127 నానోమీటర్ పీక్ టార్క్‌ను అందించనున్నాయి.
2. కేటీఎం ఆర్‌సీ 390
దీనికి సంబంధించిన గ్లోబల్ డెబ్యూ ఈ సంవత్సరమే జరిగింది. మనదేశంలో కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో కూడా ఈ బైక్ లిస్ట్ అయింది. అయితే అధికారిక లాంచ్ ఈ నెలలో ఏ తేదీన జరుగుతుందనే సంగతి తెలియాల్సి ఉంది. అలాగే దీనికి సంబంధించిన ధరలు కూడా ఇంకా రివీల్ చేయలేదు. ఇందులో స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ, టీఎఫ్‌టీ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ట్రాక్షన్ కంట్రోల్, లీన్ యాంగిల్ సెన్సిటివ్ కార్నరింగ్ యాబ్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
3. యెజ్డీ రోడ్‌కింగ్
యెజ్డీ మనదేశంలో కమ్‌బ్యాక్ ఇవ్వనుంది. కంపెనీ లాంచ్ చేయనున్న కొత్త అడ్వెంచర్ బైక్ ఇదే కానుంది. ఇందులో గుండ్రటి హెడ్‌ల్యాంప్, వైడ్ స్క్రీన్, నకుల్ గార్డ్‌లు, వైర్ స్పోక్ వీల్స్, డ్యూయల్ పర్పస్ చక్రాలు ఉండనున్నాయి. జావా పెరాక్ అందించిన 334 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్‌నే ఇందులో కూడా అందించనున్నట్లు తెలుస్తోంది.
4. కొత్త బీఎస్ఏ బైక్
బీఎస్ఏ మోటార్‌సైకిల్స్ బ్రాండ్ ఈనాటిది కాదు. గత కొన్ని సంవత్సరాలుగా సైలెంట్‌గా ఉన్న ఈ బ్రాండ్ ఇప్పుడు కొత్త బైక్‌తో మళ్లీ రానుంది. ఈ కంపెనీ లాంచ్ చేయనున్న కొత్త బైక్ కూడా డిసెంబర్‌లోనే లాంచ్ కానుంది. అయితే ప్రస్తుతానికి ఈ బైక్ యూకేలో మాత్రమే లాంచ్ కానుంది. త్వరలో మిగతా దేశాల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
Also Read: Kia Carens: కియా కొత్త కారు వచ్చేస్తుంది.. అదిరిపోయే ఫీచర్లు.. డిజైన్ సూపర్!
Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!
Also Read: New Hyundai Creta: హ్యుండాయ్ క్రెటా కొత్త వేరియంట్.. అదిరిపోయే డిజైన్.. ఎలా ఉందంటే?
Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?