MG Comet EV రూ.4.99 లక్షలకే! అదిరిపోయే ఫీచర్లతో యువతను ఆకర్షిస్తున్న ఈవీ కారు!
MG Comet EV: చౌకగా లభిస్తున్న MG కామెట్ EV జూన్‌లో 856 యూనిట్లు అమ్ముడై నెలవారీగా 4% వృద్ధి సాధించింది. ధర రూ. 4.99 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. దీని రేంజ్ 230 కిలోమీటర్లు.

MG Comet EV With Cheap Price, Good Features: ఈవీలకు డిమాండ్ పెరుగుతున్న సమయంలో భారత ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో, కస్టమర్లకు తక్కువ ధరలో నాణ్యమైన ఎలక్ట్రిక్ కార్లు అందుబాటులోకి వస్తున్నాయి. వాటిలో, ఎంజీ కామెట్ ఎలక్ట్రిక్ వాహనం ప్రస్తుతం అత్యంత చౌకగా లభిస్తున్న EVగా పాపులర్ అయింది. ప్రత్యేకించి భారత్‌లో ఉండే నగరాలకు అనుకూలమైనది - క్యూట్ డిజైన్, డ్రైవింగ్‌కి అనువైన పరిమాణం, ఆధునిక ఫీచర్లతో ఆకట్టుకుంటోందీ ఈవీ.
230 km రేంజ్, AC ఛార్జింగ్ సపోర్ట్
MG కామెట్ EVలో 17.3 kWh లిథియం అయాన్ బ్యాటరీ ఉంటుంది. ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే 230 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. అంతేకాక, ఇది AC ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది, నగరంలో ప్రయాణాల కోసం ఈ సౌకర్యం బాగా ఉపయోగపడుతుంది.
జూన్ అమ్మకాల్లో 4% వృద్ధి
గత నెలలో (జూన్ 2025) MG కామెట్ EV మొత్తం 856 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇది, 2025 మే నెలలో అమ్ముడైన 823 యూనిట్లతో పోలిస్తే 4% వృద్ధి. అంటే నెలవారీగా 33 యూనిట్ల పెరుగుదల కనిపించింది. ఈ ప్రైస్ సెగ్మెంట్‌లో ఇది ఓ మంచి విజయ సూచికగా చెప్పవచ్చు.
BaaS పథకంతో రూ. 4.99 లక్షలకే!
స్టాండర్డ్ మోడల్ ధర (MG Comet EV ex-showroom price) రూ. 7.36 లక్షల నుంచి రూ. 9.86 లక్షల వరకు ఉంటుంది (ఎక్స్-షోరూమ్). కానీ Battery-as-a-Service (BaaS) ఎంపికతో ఈ ధరను రూ. 4.99 లక్షలకే తగ్గించవచ్చు. ఈ స్కీమ్ కింద, వినియోగదారులు కిలోమీటరుకు రూ. 2.90 చెల్లించాలి, దీని వల్ల ప్రారంభ ఖర్చు తగ్గుతుంది.
టెక్నాలజీ, ఇంటీరియర్ హైలైట్స్
MG కామెట్ EV టెక్నాలజీ & సౌకర్యాల మేటి కలయిక. కామెట్ EVలో రెండు డిజిటల్ టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేలు ఉన్నాయి, ఒకటి ఇన్ఫోటైన్‌మెంట్ కోసం, మరొకటి డ్రైవర్ డిస్‌ప్లే. 10.25-అంగుళాల పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో సంగీతం, టర్న్-బై-టర్న్ నావిగేషన్, వాతావరణ సమాచారం & రియల్-టైమ్ ట్రాఫిక్ అప్‌డేట్స్ వంటి సమాచారం పొందవచ్చు.
10.25-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే ముఖ్యమైన వాహన సంబంధిత డేటాను చూపిస్తుంది. స్మార్ట్‌ఫోన్‌తో ఇంటిగ్రేషన్ ఫెసిలిటీ కూడా ఈ కారులో ఉంది. వినియోగదారులు తమ స్మార్ట్‌ఫోన్‌ను కారు సిస్టమ్‌తో జత చేసి ద్వారా వాయిస్ కమాండ్‌లు, కాల్‌లు, సంగీతం మరియు నావిగేషన్ వంటి లక్షణాలను ఆస్వాదించవచ్చు.
యువతను ఆకట్టుకునే రంగుల ఎంపిక
ఈ కారు బే (నీలం), సెరినిటీ (ఆకుపచ్చ), సన్‌డౌనర్ (నారింజ), ఫ్లెక్స్ (ఎరుపు) రంగుల్లో లభిస్తుంది. ఇవన్నీ ప్రత్యేకించి యువత & సిటీ కస్టమర్లను టార్గెట్ చేస్తూ రూపొందించారు.
ఒక్క మాటలో చెప్పాలంటే... ధర, ఫీచర్లు, డిజైన్ & మైలేజ్ పరంగా MG కామెట్ EV, బడ్జెట్ EV సెగ్మెంట్‌లో టాప్ సెల్లింగ్ కారుగా నిలుస్తోంది. నగరాలలో ప్రయాణించే వారికి ఇది ఒక ప్రాక్టికల్, స్టైలిష్ & ఎకానమికల్ ఆప్షన్ అవుతుంది.





















