Fastest E-Bikes: ప్రపంచంలో ఫాస్టెస్ట్ ఇ-బైక్స్ ఇవే, రయ్యని దూసుకుపోవచ్చు!
అమెరికాలో ఇ-బైక్స్ వినియోగం భారీగా పెరిగింది. రోజు రోజుకు ఇ-బైక్స్ మార్కెట్ మరింత విస్తరిస్తుంది. ఈ ఏడాది అందుబాటులోకి వచ్చిన ఫాస్టెస్ట్ ఇ-బైక్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
అగ్రరాజ్యం అమెరికాలో ఇ-బైక్స్ అమ్మకాలు భారీగా పుంజుకుంటున్నాయి. పొల్యూషన్ ప్రీ ప్రయాణం పట్ల ప్రజల్లో అవగాహన పెరగడంతో పెట్రో వాహనాలకు గుడ్ బై చెప్పి.. గ్రీన్ వెహికల్స్ పట్ల మొగ్గుచూపుతున్నారు. ప్రయాణీకుల అభిరుచికి అనుగుణంగా అత్యంత వేగంతో నడిచే ఇ-బైక్స్ రూపొందిస్తున్నాయి కంపెనీలు. ప్రస్తుతం అమ్మకానికి ఉన్న అత్యంత వేగవంతమైన ఇ-బైక్‌లు ఏంటి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
1. Optibike R22 ఎవరెస్ట్
ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యంత వేగవంతమైన ఇ- బైక్ Optibike R22 ఎవరెస్ట్. ఈ ఇ-బైక్ 300 మైళ్ల శ్రేణిని అందిస్తుంది. అత్యంత దూరం ప్రయాణించే ఇ-బైక్‌లలో ఒకటి. ఇందుకు కారణం 3260Wh సామర్థ్యాన్ని కలిగిన బ్యాటరీ. రోజువారీ పనులకు ఈ బైక్ ఉపయోగకరంగా ఉంటుంది. ఇది థొరెటల్, ఎనోరమస్ బ్యాటరీ ప్యాక్ ను కలిగి ఉంటుంది. పట్టణ డ్రైవింగ్‌కు అనువుగా ఉంటుంది. R22కు సంబంధించిన ఎలక్ట్రిక్ మోటారు 190 Nm టార్క్ ను అందిస్తుంది. ఈ సూపర్ ఎలక్ట్రిక్ బైక్ 36 mph టాప్ స్పీడ్ తో ప్రయాణిస్తుంది. ఈ బైక్ ను మీరు కారుతో రీప్లేస్ చేసుకోవచ్చు. 36 mph టాప్ స్పీడ్‌ని ఉపయోగించుకోగలిగితే కారు వేగాన్ని అందుకోగలరు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే వారం మొత్తం ఛార్జింగ్ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు.
2. డెల్ఫాస్ట్ టాప్ 3.0i
డెల్ఫాస్ట్ టాప్ 3.0i అనేది ఫుల్-ఆన్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్. అమ్మకానికి ఉన్న అత్యంత వేగవంతమైన ఇ-బైక్‌లలో ఇది కూడా ఒకటిగా చెప్పుకోవచ్చు. ఇది ఫ్యూచరిస్టిక్ మోటోక్రాస్ బైక్ లాగా ఉంటుంది. కానీ, పూర్తిగా ఎలక్ట్రిక్‌తో కూడినందున ఎటువంటి సౌండ్ రాదు. ఇది 20 mphకి పరిమితం చేయబడిన క్లాస్ 2 ఇ-బైక్ గా మార్చుకోవచ్చు. కానీ, గరిష్ఠ వేగం 50 mph వరకు ఉంటుంది. ఈ ఇ-బైక్ పరిధి 200 మైళ్ల దూరంగా కంపెనీ ప్రకటించింది. డెల్ఫాస్ట్ టాప్ 3.0i కు సంబంధించి ఆకట్టుకునే విషయం ఏంటంటే.. రీప్లేస్‌మెంట్ మోటార్ల (న్యూ వీల్, టైర్ కాంబో)తో పాటు రీప్లేస్‌మెంట్ బ్యాటరీలను కలిగి ఉంటుంది.
3. హాయ్ పవర్ సైకిల్స్ రివల్యూషన్ XX
HPC రివల్యూషన్ XX అనేది అత్యంత వేగం కలిగి ఇ-బైక్స్ లో ఒకటి. ఇ-బైక టాప్ స్పీడ్ 70+ MPHగా కంపెనీ వెల్లడించింది. అంతే కాదు, 38T/95T సమానమైన ప్లానెటరీ గేర్డ్ చైన్ రింగ్‌తో తయారు చేయబడిన Schlumpf హై స్పీడ్ డ్రైవ్ కస్టమ్ ను కలిగి ఉంది. ఇది టెస్లా మోడల్ S ప్లాయిడ్, లూసిడ్ ఎయిర్ సూపర్ EVల మధ్యన ఉంది. వీటిలో కేవలం 20 సూపర్ ఇ-బైక్‌లు మాత్రమే తయారు చేసింది కంపెనీ. వాటి ధర 20,000 డాలర్లుగా కంపెనీ నిర్ణయించింది. వీటితో పాటు మరికొన్ని ఫాస్టెస్ట్ ఇ-బైక్స్ కూడా మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. మున్ముందు మరిన్ని ఇదే కోవకు చెందిన బైక్ లు వినియోగదారుల ముందుకురానున్నాయి. అమెరికాలో ప్రస్తుతం ఇ-బైక్స్ అమ్మకాలు భారీగా కొనసాగుతున్నాయి.