అన్వేషించండి

Tata Punch New Update: కొత్త ఫీచర్లతో టాటా పంచ్ - ఈసారి అప్‌డేట్ మామూలుగా లేదు - పోటీ కార్లకు గడ్డుకాలం!

Tata Punch: టాటా పంచ్‌ను కొత్త డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో కంపెనీ అప్‌డేట్ చేయనుంది.

Tata Punch Update: నెక్సాన్ సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ సక్సెస్ తర్వాత భారతదేశంలో టాటా మోటార్స్ నుంచి అత్యధికంగా అమ్ముడైన రెండో ఎస్‌యూవీగా టాటా పంచ్ నిలిచింది. ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో మారుతి సుజుకి ఫ్రంట్, హ్యుందాయ్ ఎక్స్‌టర్‌లకు పోటీగా, టాటా మోటార్స్ ఇప్పుడు డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో పంచ్‌కు సంబంధించిన అన్ని వేరియంట్‌ల్లో మార్పులు చేసింది. పంచ్ లో ఎండ్ వేరియంట్‌లను పరిశీలిస్తే ట్రిప్ మీటర్, ఓడోమీటర్, స్పీడ్ టైమ్, వార్నింగ్ లైట్ వంటి సమాచారాన్ని ప్రదర్శించే 4 అంగుళాల డిజిటల్ స్క్రీన్‌తో కనిపిస్తుంది. అయితే టాప్ వేరియంట్ అయిన క్రియేటివ్ ఆఫ్ పంచ్ 7.0 అంగుళాల పార్ట్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను పొందుతుంది.

టాటా పంచ్ డిజిటల్ క్లస్టర్
డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ని ప్రైమరీ ఫీచర్‌గా చేర్చడం వల్ల దాని ధరపై స్వల్ప ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు. అయితే ధరలను పెంచినట్లు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఈ అప్‌డేట్ హ్యుందాయ్ ఎక్సెంట్‌పై టాటా పంచ్‌కు పై చేయిని అందిస్తుంది. హ్యుందాయ్ ఎక్సెంట్‌లో 4.2 అంగుళాల ఎంఐడీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను ప్రైమరీగా అందించారు. హ్యుందాయ్ ఎక్సెంట్ ప్రస్తుత ఎక్స్ షోరూమ్ ధర రూ. 6 లక్షల నుంచి రూ. 10.15 లక్షల మధ్య ఉండగా, టాటా పంచ్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 6 లక్షల నుంచి రూ. 10.10 లక్షల మధ్య ఉంది.

త్వరలో టాటా పంచ్ ఈవీ
టాటా మోటార్స్ త్వరలో పంచ్‌కు సంబంధించిన ఎలక్ట్రిక్ వేరియంట్‌ను లాంచ్ చేయనుంది. ఈ ఎలక్ట్రిక్ మైక్రో ఎస్‌యూవీ పెద్ద 12.3 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను పొందుతుందని భావిస్తున్నారు. ఇది ఎక్కువ ట్రిమ్‌ల్లో కనిపిస్తుంది. 10.25 అంగుళాల యూనిట్ లోయర్, మిడ్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. దాని ఐసీఈ మోడల్ డిజైన్‌తో పాటు టాటా పంచ్.ఈవీకి సంబంధించిన కొన్ని వేరియంట్‌లలో సన్‌రూఫ్ కూడా చూడవచ్చు. ఇది ఈ ఫీచర్‌తో వచ్చే అత్యంత చవకైన EV అవుతుంది.

టాటా పంచ్ ఈవీ ఇంజిన్ ఎలా ఉండనుంది?
కంపెనీ రూపొందించిన జిప్‌ట్రాన్ పవర్‌ట్రెయిన్‌ను టాటా పంచ్ ఈవీలో ఉపయోగించనున్నారు. ఇందులో ముందు బంపర్‌పై ఛార్జింగ్ సాకెట్ కనిపిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ మోడల్ టాటా జెన్ 2 ఈవీ ప్లాట్‌ఫారమ్‌పై రూపొందనుంది. ఇది భారీగా అప్‌డేట్ అయిన ఆల్ఫా ఆర్కిటెక్చర్ వెర్షన్. ఇందులో ఎలక్ట్రిక్ వేరియంట్ డిజైన్‌లో ప్రత్యేక మార్పులు చేశారు. ఈ కారుతో టాటా మోటార్స్ భారతీయ మార్కెట్లో తన ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌ను మరింత విస్తరించనుంది.

టాటా పంచ్.ఈవీని 2023 చివరిలో, కర్వ్.ఈవీని 2024 ప్రారంభంలో టాటా మోటార్స్ లాంచ్ చేయనుంది. ఈ రెండూ మాత్రమే కాకుండా 2025లో హారియర్.ఈవీని కూడా లాంచ్ చేయడానికి టాటా సన్నాహాలు చేస్తుంది. జెన్ 1, జెన్ 2 ప్లాట్‌ఫారమ్‌ల ఆధారంగా రాబోయే కొత్త ఈవీలు ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 500 కంటే ఎక్కువ కిలోమీటర్ల రేంజ్ అందించనున్నాయని వార్తలు వస్తున్నాయి.

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply

Also Read: సూపర్ హిట్ టయోటా కామ్రీ అప్‌డేటెడ్ వెర్షన్ త్వరలో - ఈసారి హైబ్రిడ్ ఇంజిన్‌తో!

Also Read: లాంచ్‌కు రెడీ అవుతున్న కొత్త స్విఫ్ట్ - సరికొత్త ఇంజిన్, సూపర్ లుక్‌తో!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
KTR: 'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
10th Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
Embed widget