Tata Punch EV: టాటా పంచ్ ఈవీ లాంచ్ డేట్ ఇదే - ఈ నెలలోనే ఎంట్రీ - ఫీచర్లు ఇలా!
Tata Punch EV Price: టాటా పంచ్ ఈవీ ఎలక్ట్రిక్ మోడల్ డిసెంబర్ 21వ తేదీన లాంచ్ కానుంది.
Tata Punch Electric SUV: టాటా పంచ్ ఈవీ 2023 డిసెంబర్ 21వ తేదీన భారత మార్కెట్లో లాంచ్ కానుంది. నెక్సాన్ ఈవీ, టిగోర్ ఈవీ, టియాగో ఈవీ తర్వాత కంపెనీ తన నాలుగో ఎలక్ట్రిక్ కారుగా పంచ్ ఈవీని మార్కెట్‌లోకి తీసుకువస్తుంది. ఇది సిట్రోయెన్ ఈసీ3, రాబోయే హ్యుందాయ్ ఎక్స్‌టర్ ఈవీతో పోటీపడుతుంది. టాటా ఎలక్ట్రిక్ మైక్రో ఎస్‌యూవీ ధర తక్కువగా ఉండనుంది. దీని బేస్ వేరియంట్ ధర దాదాపు రూ.10-11 లక్షల మధ్యలో ఉండనుంది. ఇక టాప్ వేరియంట్ ధర దాదాపు రూ. 12.50 లక్షల వరకు ఉంటుందని అంచనా.
టాటా జెన్ 2 ఈవీ ప్లాట్‌ఫారమ్‌పై...
దీని అధికారిక వివరాలు రానున్న వారాల్లో వెల్లడి కానున్నాయి. నెక్సాన్ ఈవీ మాదిరిగానే పంచ్ ఈవీ కూడా రెండు ట్రిమ్‌లలో లాంచ్ కానుందని భావిస్తున్నారు. మీడియం రేంజ్ (ఎంఆర్), లాంగ్ రేంజ్ (ఎల్ఆర్)ల్లో అందుబాటులో ఉంటుంది. పవర్‌ట్రెయిన్ సెటప్‌లో లిక్విడ్ కూల్డ్ బ్యాటరీతో కూడిన శాశ్వత మాగ్నెట్ సింక్రోనస్ మోటార్ ఉంటుంది. టాటా పంచ్ ఈవీ... టాటా జెన్ 2 ఈవీ ప్లాట్‌ఫారమ్ (సిగ్మా)పై ఆధారపడి ఉంటుంది. ఇది ఆల్ఫా ఆర్కిటెక్చర్‌కు సంబంధించిన అప్‌డేటెడ్ వెర్షన్.
ఫీచర్లు ఇలా...
లాంగ్ రేంజ్ బ్యాటరీ ప్యాక్ అధిక ట్రిమ్‌లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇది టూ స్పోక్ స్టీరింగ్ వీల్, కొత్త 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, రౌండ్ షేప్ డిస్‌ప్లే, ఇంటిగ్రేటెడ్ గేర్ డయల్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ఆర్మ్‌రెస్ట్, ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, వెనుక డిస్క్ బ్రేక్‌లతో సహా మరింత అధునాతన ఫీచర్లను కూడా పొందుతుంది.
పంచ్ ఈవీ బంపర్ పైన మౌంట్ అయిన ఛార్జింగ్ సాకెట్ సదుపాయాన్ని కలిగి ఉంటుంది. ఇది ఏ టాటా ఎలక్ట్రిక్ కారులో చూడటం అయినా మొదటిసారి. అదనంగా ఇది భారతదేశంలో అందుబాటులో ఉన్న అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కారుగా సన్‌రూఫ్‌తో రావచ్చు. డిజైన్ పరంగా, ఈ మైక్రో SUV దాని ఎలక్ట్రిక్ వెర్షన్‌లో కొన్ని ప్రత్యేక డిజైన్ అంశాలతో రానుంది. ఇందులో ప్రత్యేకంగా రీడిజైన్ అయిన ఫ్రంట్ గ్రిల్, ఛార్జింగ్ సాకెట్‌తో అప్‌డేట్ అయిన ఫ్రంట్ బంపర్, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, కొత్తగా రూపొందించిన అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.
మరోవైపు హ్యుందాయ్ మోటార్ ఇండియా తన మూడు కొత్త ఎస్‌యూవీలను 2024లో విడుదల చేయనుందని తెలుస్తోంది. అవే క్రెటా, అల్కజార్, టక్సన్ అప్‌డేటెడ్ వెర్షన్లు. ఈ మూడు కార్లూ త్వరలో మార్కెట్లో లాంచ్ కానున్నాయి. జనవరి 16వ తేదీన జరగనున్న కంపెనీ ఈవెంట్‌లో హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ మార్కెట్లోకి రానుందని అంచనా. ఇది అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) టెక్నాలజీతో కూడిన అధునాతన డిజైన్, ఫీచర్లతో కూడిన ఇంటీరియర్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply
Also Read: రూ.15 వేలలోపు ది బెస్ట్ 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ మొబైల్స్ లిస్ట్ మీకోసమే!