అన్వేషించండి

GST తగ్గింపు తర్వాత Tata Nexon ను ఎంత చవగ్గా కొనొచ్చో తెలుసా? మీకు ఎంత లాభం వస్తుందో తెలుసుకోండి

Tata Nexon New Price India: జీఎస్టీ సంస్కరణ తర్వాత టాటా నెక్సాన్ ధర తగ్గవచ్చు, ఇది మధ్య తరగతి కుటుంబాలకు ఉపశమనం కలిగించే విషయం. పన్ను తగ్గింపు తర్వాత టాటా నెక్సాన్ ధర ఎంత ఉంటుందో తెలుసుకుందాం.

Tata Nexon New Price After GST Reduction: భారతదేశంలో అత్యధికంగా కార్లు అమ్ముడవుతున్న కంపెనీలలో టాటా మోటార్స్ ఒకటి. ఆగస్టు 15 నాటి ప్రసంగంలో, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, GST సంస్కరణలను ప్రకటించారు. ఆ ప్రకటన ప్రకారం, ప్రభుత్వం ఇప్పుడు చిన్న కార్లపై పన్నును తగ్గించడానికి సన్నాహాలు చేస్తోంది.

ఇప్పటి వరకు, 1200cc కంటే తక్కువ ఇంజిన్ ఉన్న కార్లు & 4 మీటర్ల కంటే తక్కువ పొడవు ఉన్న కార్లపై 28% GST + 1% సెస్సును గవర్నమెంట్‌ వసూలు చేస్తోంది. ఇప్పుడు, ప్రతిపాదిత GST అమల్లోకి వస్తే, ఈ పన్ను 18% GST & 1% సెస్సుగా మారుతుంది. ఈ మార్పు టాటా నెక్సాన్ ధరను ఎంతగా ప్రభావితం చేస్తుందో అర్ధం చేసుకుందాం.

ధర ఎంత మారుతుంది? 
ఆంధ్రప్రదేశ్‌ & తెలంగాణ నగరాల్లో, టాటా నెక్సాన్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 8 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం, ఈ ఫోర్‌వీలర్‌ మీద 28% GST + 1% సెస్ వర్తిస్తున్నాయి. పన్ను 18% GST + 1% సెస్‌గా మారితే, టాటా నెక్సాన్ ప్రారంభ ధర దాదాపు రూ. 7.19 లక్షలకు తగ్గుతుంది. అంటే, ఎక్స్‌-షోరూమ్ రేటు నేరుగా 81,000 వరకు తగ్గుతుంది. అయితే, ఆన్-రోడ్ ధరలో రోడ్‌ టాక్స్‌, బీమా & ఇతర ఛార్జీలు కూడా ఉంటాయి కాబట్టి వాస్తవ ధర కొద్దిగా భిన్నంగా ఉండవచ్చు. ఏదేమైనా, 18% GST మీద టాటా నెక్సాన్ కొనే కస్టమర్లు భారీగా డబ్బు మిగుల్చుకుంటారు.             

టాటా నెక్సాన్ పవర్ & ఫీచర్లు
టాటా నెక్సాన్‌ అంటేనే పవర్‌ఫుల్‌ బండి, దీని పెర్ఫార్మెన్స్‌ కూడా స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఇది 1.2-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో పవర్‌ తీసుకుంటుంది, 120bhp శక్తిని & 170Nm టార్క్‌ను ఇస్తుంది. డీజిల్ వేరియంట్‌లో 1.5-లీటర్ ఇంజిన్ ఉంది, ఇది 110bhp శక్తిని & 260Nm టార్క్‌ను జనరేట్‌ చేస్తుంది.

టాటా కంపెనీ, నెక్సాన్ లోపలి భాగాన్ని చాలా ప్రీమియం & మోడ్రన్‌గా తయారు చేసింది. కారులో 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ & 10.25-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే ఉన్నాయి. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, ఎత్తు సర్దుబాటు చేయగల ఫ్రంట్ సీట్, క్రూయిజ్ కంట్రోల్ & JBL సౌండ్ సిస్టమ్ వంటి ఫీచర్లు కూడా ఈ కారులో ఉన్నాయి.

టాటా నెక్సాన్ భద్రతలు
టాటా నెక్సాన్‌లో, ప్రయాణీకుల భద్రతకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. 6 ఎయిర్‌ బ్యాగ్‌లు, ABS, హిల్-అసిస్ట్ & 360-డిగ్రీ కెమెరా వంటి అధునాతన భద్రత కవచాలను ఈ కారులో అమర్చారు. అందుకే ఈ కారు గ్లోబల్ NCAP క్రాష్‌ టెస్ట్‌లో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ సాధించింది.

శక్తిమంతమైన, సురక్షితమైన & ఆధునిక ఫీచర్లతో నిండిన SUV ని మీరు కొనాలని భావిస్తుంటే, టాటా నెక్సాన్‌ను పరిశీలించవచ్చు. కంపెనీ, ఈ కారుపై ఈ నెలలో (ఆగస్టు 2025‌) రూ. 50,000 వరకు తగ్గింపును కూడా ప్రకటించింది. మీరు 18% GST అమలయ్యే వరకు ఎదురు చూడగలిగితే ఇంకా ఎక్కువ డబ్బు మిగులుతుంది.

టాప్ హెడ్ లైన్స్

Honda Elevate Facelift.. హ్యుందాయ్ క్రెటాను ఢీకొట్టే సత్తా ఉందా? ఏ SUVని కొనడం లాభదాయకం?
హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్ vs హ్యుందాయ్ క్రెటా.. ఫీచర్లు, భద్రతలో తేడాలేంటి? ఏది కొనడం బెటర్‌?
కొత్త కారు కొనే ముందు జాగ్రత్త! షోరూమ్‌ రేటు గురించి తప్ప ఈ 5 ఖర్చుల గురించి డీలర్‌ మీకు ముందే చెప్పరు!
కొత్త కారు కొంటున్నారా? షోరూమ్ ధర చూసి మురిసిపోకండి.. మీ జేబుకు చిల్లు పెట్టే 5 అదనపు ఖర్చులివి!
Maruti Brezza CNG కారు 2 లక్షలు డౌన్ పేమెంట్ చెల్లిస్తే EMI ఎంత కట్టాలి? మైలేజీ, పూర్తి వివరాలు
Maruti Brezza CNG కారు 2 లక్షలు డౌన్ పేమెంట్ చెల్లిస్తే EMI ఎంత కట్టాలి? మైలేజీ, పూర్తి వివరాలు
2026 Skoda Slaviaలో ఏ వేరియంట్ కొనాలి? మీ డబ్బుకు తగిన విలువ ఇచ్చేది ఇదే!
2026 Skoda Slavia.. ఈ వేరియంట్‌లోనే అసలైన వాల్యూ! ఫీచర్లు కూడా అదుర్స్!

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila House Arrest: ఛలో లోక్ భవన్ నిరసన.. విజయవాడలో మూడంచెల భద్రత, పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్
ఛలో లోక్ భవన్ నిరసన.. విజయవాడలో మూడంచెల భద్రత, పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్
Telangana Govt Good News: జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
TVK Wins Tamil Nadu By Polls: తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
Nobel Peace Prize 2026: భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
EYES Web Series Review - 'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
AI Abuse Prevention: ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
Gade Saikrishna Custodial Death Case: గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
BC Reservations In AP: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
Embed widget