అన్వేషించండి

TVS Jupiter CNG: ప్రపంచంలోనే మొదటి CNG స్కూటర్‌ - 1 కి.మీ. డ్రైవింగ్ ఖర్చు కేవలం 1 రూపాయి!

World First CNG Scooter: TVS జూపిటర్ CNG ని ప్రపంచంలోనే మొట్టమొదటి CNG పవర్డ్ స్కూటర్ అని చెబుతున్నారు. దీని రన్నింగ్ ఖర్చు కిలోమీటరుకు రూ.1 కంటే తక్కువ అని కంపెనీ వెల్లడించింది.

World First CNG Scooter Launch India: టెక్నాలజీ ఎంత అప్‌డేట్‌ అవుతోందో చూడండి, ముఖ్యంగా ఆటోమొబైల్‌ రంగంలో. ప్రపంచంలోనే మొట్టమొదటి CNG బైక్‌ Bajaj Freedom 125 గత ఏడాది జులై 5 లాంచ్‌ అయింది. ఇప్పుడు, ప్రపంచంలోనే మొట్టమొదటి CNG స్కూటర్‌ను అదే కంపెనీ లాంచ్‌ చేయబతోంది, ఈ ఈవెంట్‌ అతి త్వరలో జరగబోతోంది. ఈ ఏడాది జనవరిలో, దిల్లీలో జరిగిన ఆటో ఎక్స్‌పో 2025లో TVS మోటార్‌ చాలా కొత్త ద్విచక్ర వాహన మోడళ్లను పరిచయం చేసింది. వాటిలో TVS Jupiter CNG పేరు కూడా ఉంది. నివేదికల ప్రకారం, TVS జూపిటర్ CNG స్కూటర్‌ను మరికొన్ని నెలల్లో లాంచ్‌ (TVS Jupiter CNG Launch) చేయవచ్చు.

1 కిలో CNG తో జూపిటర్ CNG స్కూటర్‌ ఎంత దూరం నడుస్తుంది?
TVS జూపిటర్ CNG ప్రపంచంలోనే మొట్టమొదటి CNG పవర్డ్ స్కూటర్ అని చెబుతున్నారు. ఈ CNG స్కూటర్‌ ప్రయాణ ఖర్చు కిలోమీటరుకు 1 రూపాయి కంటే తక్కువ అని కంపెనీ ప్రకటించింది. TVS జూపిటర్ CNG బండిలో 1.4 కిలోల CNG ట్యాంక్ అండర్ సీట్ స్టోరేజ్ ఏరియాలో ఏర్పాటు చేశారు. ఈ స్కూటర్ 1 కిలో CNG తో 84 కి.మీ. మైలేజీని ఇస్తుందని కంపెనీ చెప్పింది. ప్రస్తుతం, హైదరాబాద్‌లో కిలో CNG ధర 96 రూపాయలు. విజయవాడలో  కిలో CNG ధర 89 రూపాయలు. ఈ లెక్కన, TVS జూపిటర్ CNG రన్నింగ్‌ ఖర్చు 1 కిలోమీటరుకు దాదాపు 1 రూపాయి మాత్రమే.      

1 కిలో CNG కి 84 కి.మీ. మైలేజీ లెక్క ప్రకారం, TVS జూపిటర్ CNG స్కూటర్‌లోని 1.4 కిలోల ట్యాంక్‌ను నింపితే, ఈ బండి 126 కి.మీ. వరకు ప్రయాణించగలదు.        

TVS జూపిటర్ CNG పవర్‌ట్రెయిన్
TVS జూపిటర్ CNGలో OBD2B కంప్లైంట్ ఇంజిన్ ఉంది. ఇది 125cc బయో-ఫ్యూయల్ ఇంజిన్‌తో పని చేస్తుంది. ఇది 600 rpm వద్ద 5.3 kW శక్తిని & 5500 rpm వద్ద 9.4 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.      

జూపిటర్ CNG ఫీచర్లు     
జూపిటర్ CNG లో కొత్త & స్మార్ట్ ఫీచర్లు ఇస్తున్నారు. LED హెడ్‌లైట్లు, USB ఛార్జర్, స్టాండ్ కట్-ఆఫ్ & బ్లూటూత్ కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ స్కూటర్ పర్యావరణ అనుకూలమైనది & ఇంధన ఆదా కోసం ప్రత్యేకంగా తయారైంది. 

జూపిటర్ CNG అంచనా ధర
ప్రస్తుతం, TVS Jupiter 125 పెట్రోల్ వెర్షన్ ధర వేరియంట్‌ను బట్టి రూ. 88,174 - రూ. 99,015 మధ్య ఉంది. కొత్త CNG వెర్షన్ కూడా అదే శ్రేణిలో, రూ. 90,000 - రూ. 99,000 మధ్య లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. అయితే, CNG ట్యాంక్ కారణంగా, అండర్‌సీట్‌ స్పేస్ కొంచెం తక్కువగా ఉండవచ్చు.     

టాప్ హెడ్ లైన్స్

Local FASTag Pass: టోల్ ప్లాజా దగ్గర నివసిస్తున్నారా? రూ.1,500 లేదా రూ.3,000తో ఫాస్టాగ్‌ లోకల్ పాస్ పొందొచ్చు!
FASTag కొత్త రూల్స్.. నవంబర్ 1 నుంచి స్థానికులకు యాన్యువల్‌ పాస్‌లు.. ధరలు ఎంతంటే?
420cc ఇంజిన్‌, 48hp పవర్‌తో దూసుకెళ్లే BMW కొత్త స్పోర్ట్స్ బైక్... ఇండియాలోకి F 450 RR ఎప్పుడొస్తుంది?
కొత్త స్పోర్ట్స్ బైక్ BMW F 450 RR గురించి యువతరం తప్పక తెలుసుకోవాల్సిన 5 ముఖ్యమైన విషయాలు
సిటీ డ్రైవింగ్‌లో Mahindra XUV 3XO CNG టాప్.. హైవేపై Tata Nexon iCNG దూకుడు.. పూర్తి మైలేజీలో ఏ కారు బెస్ట్‌?
మహీంద్రా XUV 3XO CNG vs టాటా నెక్సాన్ CNG.. ఏది ఎక్కువ మైలేజీ ఇస్తుంది? రియల్ టెస్ట్‌లో తేలిన నిజాలివే!
Hyundai Bayon ఎక్స్‌-షోరూమ్‌ రేటు రూ.10 లక్షలు.. హైదరాబాద్‌, విజయవాడలో ఆన్‌రోడ్ ధర ఎంతవుతుందంటే?
హైదరాబాద్‌లో హ్యుందాయ్ బేయాన్ ఆన్‌రోడ్ ధర ఎంత? విజయవాడలో ఎంత?.. పూర్తి లెక్కలివే!

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IAS Transfers: తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు.. అటవీ శాఖకు జయేష్ రంజన్, ఇంధన శాఖకు వికాస్ రాజ్
తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు.. అటవీ శాఖకు జయేష్ రంజన్, ఇంధన శాఖకు వికాస్ రాజ్
Gottipati Ravi Kumar: అర్నబ్ తుపాను వేళ తెలంగాణ ప్రభుత్వ సాయం కోరిన ఏపీ మంత్రి గొట్టిపాటి
అర్నబ్ తుపాను వేళ తెలంగాణ ప్రభుత్వ సాయం కోరిన ఏపీ మంత్రి గొట్టిపాటి
Arnab Effect On AP: ఏపీపై విరుచుకుపడిన 'అర్నబ్‌' తుపాను... భారీగా చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలమట్టం.. నిలిచిన రవాణా సేవలు
ఏపీపై విరుచుకుపడిన 'అర్నబ్‌' తుపాను... భారీగా చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలమట్టం.. నిలిచిన రవాణా సేవలు
Flights Cancelled: శంషాబాద్ విమానాశ్రయంపై అర్నాబ్ తుపాను ఎఫెక్ట్.. ఏపీకి వెళ్లే పలు విమానాలు రద్దు
శంషాబాద్ విమానాశ్రయంపై అర్నాబ్ తుపాను ఎఫెక్ట్.. ఏపీకి వెళ్లే పలు విమానాలు రద్దు
Comedy Movie OTT: ఓటీటీలోకి మహేష్, ఎన్టీఆర్ పొగిడిన సినిమా... ఫాంటసీ కామెడీ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి మహేష్, ఎన్టీఆర్ పొగిడిన సినిమా... ఫాంటసీ కామెడీ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Telangana Drought Mandals: తెలంగాణలో కరవు కోరలు.. 31 జిల్లాల్లో 365 మండలాల్లో తీవ్ర ప్రభావం.. రూ.20 వేల కోట్ల కేంద్ర ప్యాకేజీ కోసం అభ్యర్థన
తెలంగాణలో కరవు కోరలు.. 31 జిల్లాల్లో 365 మండలాల్లో తీవ్ర ప్రభావం.. రూ.20 వేల కోట్ల కేంద్ర ప్యాకేజీ కోసం అభ్యర్థన
AP Local Body Elections: ఏపీ స్థానిక పోరులో కంట్రోల్ తప్పిన పొత్తులు - పరిషత్, పంచాయతీల్లో ఫ్రెండ్లీ కాంటెస్ట్ తప్పదా?
ఏపీ స్థానిక పోరులో కంట్రోల్ తప్పిన పొత్తులు - పరిషత్, పంచాయతీల్లో ఫ్రెండ్లీ కాంటెస్ట్ తప్పదా?
Telangana Congress: కాంగ్రెస్‌లో బిల్లుల మంటలు - ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఆమరణదీక్ష హెచ్చరికలు - రేవంత్ ప్రభుత్వం ఎలా చక్కబెడుతుంది?
కాంగ్రెస్‌లో బిల్లుల మంటలు - ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఆమరణదీక్ష హెచ్చరికలు - రేవంత్ ప్రభుత్వం ఎలా చక్కబెడుతుంది?
Embed widget