ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే MG Cyberster ఇది ఎంత దూరం ప్రయాణించగలదు?
MG Motor భారత్‌లో MG Cybersterని విడుదల చేసింది, ఇది పూర్తిగా ఎలక్ట్రిక్ రెండు సీట్ల స్పోర్ట్స్ కారు.
ఇందులో 77 kWh బ్యాటరీ ఉంది, దీని మందం కేవలం 110 mm, ఇది కారును చాలా ఏరోడైనమిక్‌గా చేస్తుంది.
కారులో డ్యూయల్ మోటార్ అమరిక ఉంది, ఇది 510PS శక్తిని, 725Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని ప్రారంభ ధర 24.9 లక్షల రూపాయలుగా నిర్ణయించారు.
ఈ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కార్ కేవలం 3.2 సెకన్లలో 0 నుంచి 100 కిమీ గంట వేగాన్ని అందుకోగలదు
MG Cyberster ఒకసారి పుల్ ఛార్జింగ్ చేస్తే 580 km దూరం ప్రయాణం చేయొచ్చు
MG Cyberster స్పోర్టీ లుక్‌తో రూపొందించారు. ఇందులో 4 డ్యూయల్-టోన్ కలర్ కాంబినేషన్లు, 2 రూఫ్ ఆప్షన్ కలిగి ఉంది.
దీని సాఫ్ట్ టాప్ రూఫ్ కేవలం 10 సెకన్లలో తెరుచుకుంటుంది లేదా మూసుకుంటుంది. అంతేకాకుండా, ఇందులో ఎలక్ట్రిక్ డోర్ బటన్లు ఇచ్చారు.
కారులో Bose 8-స్పీకర్ సిస్టమ్, మూడు డిజిటల్ స్క్రీన్లు, ADAS వంటి స్మార్ట్ సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.
అందులో స్మార్ట్ డ్రైవింగ్ మోడ్స్, మొబైల్ యాప్ కనెక్టివిటీ వంటి అధునాతన సాంకేతిక లక్షణాలు ఉన్నాయి.