క్రూయిజ్ కంట్రోల్‌తో Hero Glamour X 125 లాంచ్ - ధర రూ.90,000 మాత్రమే!
Hero Glamour X 125 Launched: హీరో కంపెనీ, కొత్త గ్లామర్ X 125 ను రూ. 90,000 రేటులో విడుదల చేసింది. ఈ విభాగంలో క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్ ఉన్న మొదటి బైక్ ఇదే.

Hero Glamour X 125 Price, Mileage And Features In Telugu: ద్విచక్ర వాహనాల దిగ్గజం హీరో మోటోకార్ప్, కొత్త "2025 Hero Glamour X 125" ను లాంచ్ చేసింది. ఈ బండి కోసం ప్రజలు, ముఖ్యంగా యువత చాలా కాలంగా ఎదురు చూస్తోంది. Hero Glamour X 125 ధర & స్మార్ట్ ఫీచర్ల గురించి సోషల్ మీడియాలో చాలా చర్చలు కూడా నడిచాయి. ఎట్టకేలకు, అన్ని అంచనాలకు తెర దించుతూ, హీరో ఈ మోస్ట్-అవెయిటెడ్ బైక్‌ను లాంచ్ చేసింది.
Hero Glamour X 125 బేస్ డ్రమ్ వేరియంట్ ధర రూ. 89,999 (ఎక్స్-షోరూమ్) గా కంపెనీ నిర్ణయించింది. టాప్-స్పెక్ డిస్క్ వేరియంట్ రూ. 1 లక్ష (ఎక్స్-షోరూమ్) రేటుకు అందుబాటులో ఉంటుంది.
ఈ విభాగంలో 'మొట్టమొదటి క్రూయిజ్ కంట్రోల్ బైక్'
కొత్త గ్లామర్ Hero Glamour X 125 లో అతి పెద్ద హైలైట్ దాని క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్. ఇప్పటి వరకు ఈ ఫీచర్ KTM 390 డ్యూక్ & TVS అపాచీ RTR 310 వంటి ప్రీమియం బైక్‌లలో మాత్రమే అందుబాటులో ఉంది. ఇప్పుడు, హీరో దీనిని 125cc విభాగంలో ప్రవేశపెట్టి సంచలనం సృష్టించింది, మిడ్ రేంజ్ యూజర్లు కూడా కాలర్ ఎగరేసేలా చేసింది. వాస్తవానికి, టూవీలర్ సెక్టార్‌లో ఇదొక గొప్ప పరిణామంగా, మారుతున్న సాంకేతికతకు నిదర్శనంగా చూడాలి. 2025 Hero Glamour X 125 లో రైడ్-బై-వైర్ థ్రోటిల్ & మూడు రైడ్ మోడ్‌లు ఉన్నాయి, అవి - ఎకో, రోడ్ & పవర్. రైడర్ తన అవసరం & స్టైల్ ప్రకారం బైక్ పెర్ఫార్మెన్స్‌ను మార్చుకోవచ్చు.
సాంకేతికత & స్మార్ట్ ఫీచర్లు
కొత్త గ్లామర్ X 125 టెక్నాలజీ పరంగా చాలా అద్భుతంగా, ఆధునికంగా ఉంటుంది. దీనిలో కలర్ TFT డిస్‌ప్లే, బ్లూటూత్ కనెక్టివిటీ & టర్న్-బై-టర్న్ నావిగేషన్ వంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో వచ్చింది. ఇంకా.. USB టైప్-C ఛార్జింగ్ పోర్ట్, పూర్తి-LED లైటింగ్ & కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ (CBS) కూడా కలిగి ఉంది. అందుకే, ఈ ధరలో ఇదొక మంచి ఆఫర్ అవుతుంది.
ఇంజిన్ & పెర్ఫార్మెన్స్
ఈ బైక్ 124.7cc సింగిల్-సిలిండర్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఈ ఇంజిన్ 8,250 rpm వద్ద 11.4 bhp పవర్‌ను & 6,500 rpm వద్ద 10.5 Nm టార్క్‌ను ఇస్తుంది. దీనికి 5-స్పీడ్ గేర్‌బాక్స్ జత చేశారు, రైడింగ్ చాలా స్మూత్‌గా సాగిపోతుంది. పనితీరు పరంగా, ఈ బైక్ ఇప్పుడు Hero Xtreme 125R తో సమానంగా ఉంది.
వేరియంట్లు & కలర్ ఆప్షన్స్
హీరో గ్లామర్ X 125 ని రెండు వేరియంట్లలో తీసుకువచ్చారు. మొదటిది డ్రమ్ వేరియంట్, ఇది Matt Magnetic Silver & Candy Blazing Red కలర్ ఆప్షన్లలో లాంచ్ అయింది. రెండోది డిస్క్ వేరియంట్, ఇది Metallic Nexus Blue, Black Teal Blue & Black Pearl Red వంటి స్టైలిష్ రంగులలో లభిస్తుంది.
బుకింగ్ & డెలివరీ
Hero Glamour X 125 బుకింగ్ ఇప్పటికే ప్రారంభమైంది, త్వరపడండి. మీకు కావాలనుకుంటే, దేశంలో ఏ హీరో డీలర్‌షిప్‌లోనైనా లేదా అధికారిక వెబ్‌సైట్ నుంచి ఈ స్టైలిష్ బండిని బుక్ చేసుకోవచ్చు. కంపెనీ త్వరలోనే తెలుగు రాష్ట్రాల్లో ఈ బైక్ డెలివరీలు ప్రారంభించబోతోంది.





















