అన్వేషించండి

మిడిల్‌ క్లాస్‌ ఫేవరేట్‌ కార్‌ Tata Nexon మరింత చౌక - ఒకేసారి అర లక్ష రూపాయలు ఆదా

Tata Nexon Discount Offer: టాటా నెక్సాన్‌లో 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ ఉంటుంది, ఇది 120 bhp పవర్‌ & 170Nm టార్క్‌ను జనరేట్‌ చేస్తుంది. ఆగస్టు ఆఫర్‌తో ఈ కారు మరింత ఆకర్షణీయంగా మారింది.

Tata Nexon Discount Offer August 2025: టాటా మోటార్స్, తన బెస్ట్ సెల్లింగ్ SUV టాటా నెక్సాన్ మీద రూ. 50,000 వరకు తగ్గింపును అందిస్తోంది. ఈ ఆఫర్‌లో క్యాష్ డిస్కౌంట్ & ఎక్స్ఛేంజ్ బోనస్ రెండూ ఉన్నాయి. టాటా నెక్సాన్ పై ఈ తగ్గింపు (Tata Nexon Price Drop) మీ నగరం & డీలర్‌షిప్‌ను బట్టి స్వల్పంగా మారవచ్చు. మిడిల్‌ క్లాస్‌ ఫ్యామిలీలు ఎక్కువగా ఇష్టపడుతున్న కారు ఇది.

టాటా నెక్సాన్‌ లుక్స్‌ చాలా అగ్రెసివ్‌గా, స్టైలిష్‌గా కనిపిస్తాయి. కొత్తగా ఇచ్చిన షార్ప్‌ హెడ్‌ల్యాంప్స్‌ & సిగ్నేచర్‌ LED DRLs కారుకు మోడ్రన్‌ లుక్‌ ఇస్తాయి. వంపులు తిరిగిన కండల్లాంటి బంపర్లు, డ్యూయల్‌టోన్‌ బాడీ ఫినిషింగ్‌ ఈ SUVని ప్రీమియం ఫీల్‌లోకి తీసుకెళ్తాయి. కారు వెనుక భాగంలో క్రిస్టల్‌-ఇన్‌స్పైర్డ్‌ టెయిల్‌ల్యాంప్స్‌ కారు డిజైన్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చాయి.

తెలుగు రాష్ట్రాల్లో ధర
ఆంధ్రప్రదేశ్‌ & తెలంగాణలో టాటా నెక్సాన్ ఎక్స్‌-షోరూమ్‌ ధర రూ. 8 లక్షల (Tata Nexon ex-showroom price, Hyderabad Vijayawada) నుంచి ప్రారంభమవుతుంది & టాప్ మోడల్‌కు ఇది రూ. 15.60 లక్షల వరకు ఉంటుంది. ఆన్‌-రోడ్‌ రేటు విషయానికి వస్తే... హైదరాబాద్‌లో (Tata Nexon on-road price, Hyderabad) బేస్‌ వేరియంట్‌ను దాదాపు రూ. 9.55 లక్షలకు; విజయవాడలో (Tata Nexon on-road price, Vijayawada) దాదాపు రూ. 9.57 లక్షలకు కొనుగోలు చేయవచ్చు. 

టాటా నెక్సాన్ పవర్ & ఫీచర్లు 
పవర్‌ & పెర్ఫార్మెన్స్‌లో టాటా నెక్సాన్‌కు మంచి పేరుంది. ఇది 1.2-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో పవర్‌ఫుల్‌ పెర్ఫార్మెన్స్‌ ఇస్తుంది. ఈ ఇంజిన్‌ ది 120 bhp శక్తిని & 170Nm టార్క్‌ను జనరేట్‌ చేస్తుంది. టాటా నెక్సాన్ డీజిల్ వేరియంట్‌లో 1.5 లీటర్ ఇంజిన్ ఉంది, ఇది 110 bhp శక్తిని & 260 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఇంటీరియర్ & ప్రీమియం ఫీచర్లు
టాటా నెక్సాన్ లోపలి భాగాన్ని చాలా ప్రీమియంగా & మోడ్రన్‌ లుక్‌లో తయారు చేశారు. క్యాబిన్‌లో 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ & 10.25-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే ఉన్నాయి. ఇంకా.. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, ఎత్తు సర్దుబాటు చేయగల ఫ్రంట్ సీట్, క్రూయిజ్ కంట్రోల్ & JBL సౌండ్ సిస్టమ్ వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.

భద్రతా లక్షణాలు ఎలా ఉన్నాయి? 
టాటా నెక్సాన్, తన కస్టమర్ల భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడలేదు. 6 ఎయిర్‌ బ్యాగ్‌లు, ABS, హిల్-అసిస్ట్ & 360-డిగ్రీ కెమెరా వంటి అడ్వాన్స్‌డ్‌ సేఫ్టీ ఫీచర్ల నడుమ ఈ కారు ప్రయాణిస్తుంది. ఈ కారు గ్లోబల్ NCAP నుంచి 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ కూడా పొందింది.

ఈ ఆఫర్ ఎందుకు ప్రత్యేకమైనది?
శక్తిమంతమైన, సురక్షితమైన & ఆధునిక ఫీచర్లు ఉన్న SUVని కొనుగోలు చేయాలని ఆలోచిస్తుంటే, టాటా నెక్సాన్ ఆగస్టు 2025 ఆఫర్ మీకు గొప్ప అవకాశం కావచ్చు. టాటా నెక్సాన్ ఇప్పటికే దేశంలో నంబర్-1 సేఫ్టీ SUVగా పేరు గడించింది. ఇప్పుడు రూ. 50,000 వరకు తగ్గింపు దీనిని మరింత విలువైన కారుగా మార్చింది.

టాప్ హెడ్ లైన్స్

Tata Aeris కొనే ముందే మీకివి తెలియాలి! ఆకట్టుకునే ఫీచర్లు, నిరాశపరిచే అంశాలు
టాటా ఏరిస్ కొనాలా? వద్దా? ప్లస్‌ పాయింట్లతో పాటు మైనస్‌లు కూడా ఉన్నాయి!
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు
కేవలం రూ.21,000తో Renault Duster hybrid బుకింగ్స్ ప్రారంభం.. లీటర్‌కు 29 కి.మీ. అదిరిపోయే మైలేజ్!
లీటర్‌కు 29 కి.మీ. మైలేజ్ ఇచ్చే సూపర్‌ SUV.. రెనాల్ట్‌ డస్టర్ హైబ్రిడ్ బుకింగ్స్ ప్రారంభం, రూ.21,000 చాలు
Honda Elevate Facelift.. హ్యుందాయ్ క్రెటాను ఢీకొట్టే సత్తా ఉందా? ఏ SUVని కొనడం లాభదాయకం?
హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్ vs హ్యుందాయ్ క్రెటా.. ఫీచర్లు, భద్రతలో తేడాలేంటి? ఏది కొనడం బెటర్‌?

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dasara Special Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
Talliki Vandanam Phase 2: తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
Srikakulam Crime News: హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
Bloody Romeo: బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
CM Chandrababu: స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
11-10-2026 ఆదివారం నవరాత్రుల మొదటి రోజు మకర, కుంభ, మీన రాశుల భవిష్యత్తు ఎలా ఉందంటే!
11-10-2026 ఆదివారం నవరాత్రుల మొదటి రోజు మకర, కుంభ, మీన రాశుల భవిష్యత్తు ఎలా ఉందంటే!
YS Sharmila: మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
Abhijit Dipke Grandmother Passes Away: అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
Embed widget