అన్వేషించండి

ఇథనాల్‌ దిశగా ముందడుగు! First Flex Fuel SUV కారు విడుదల చేయనున్న Tata Motors

First Flex Fuel Car: భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో E20 నుంచి E100 వరకు గల ఇథనాల్ మిశమాలపై నడవగలిగే Tata Punch Flex Fuel మోడల్‌ కారును ఆ సంస్థ ప్రదర్శించింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • టాటా మోటార్స్ 2026 నాటికి తొలి ఫ్లెక్స్-ఫ్యూయల్ కారును విడుదల చేయనుంది.
  • ఈ కారు పెట్రోల్, E100 ఇథనాల్ మిశ్రమ ఇంధనాలతో నడుస్తుంది.
  • ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాలు అధిక ఇథనాల్‌ను తట్టుకునేలా ప్రత్యేక ఇంజన్ కలిగి ఉంటాయి.
  • ప్రభుత్వం ఇథనాల్ వాడకాన్ని ప్రోత్సహిస్తూ, ముడి చమురు దిగుమతులు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న దేశాల్లో భారత్ ఒకటి. గత రెండున్నర నెలలుగా చమురు దిగుమతులపై అమెరికా, ఇరాన్ వార్ ప్రభావం చూపుతోంది. దాంతో పెట్రోల్, డీజిల్‌పై ఆధారపడటాన్ని తగ్గించడానికి ఇప్పుడు ఆటో కంపెనీలు కొత్త ఇంధన ఎంపికలపై (ఫ్యూయల్ ఆప్షన్స్) పనిచేస్తున్నాయి. టాటా మోటార్స్ (Tata Motors) త్వరలోనే తన మొదటి ఫ్లెక్స్-ఫ్యూయల్ కారును లాంచ్ చేయడానికి ప్లాన్ చేస్తోంది. ఈ కారు ప్రత్యేకత ఏంటంటే, ఇది కేవలం పెట్రోల్‌తోనే కాకుండా, E100 అంటే 100 శాతం ఇథనాల్ మిశ్రమ ఇంధనంతో కూడా నడుస్తుంది. విదేశీ చమురుపై ఆధారపడటాన్ని తగ్గించడంతో పాటు వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం కూడా నిరంతరం ఇథనాల్ బ్లెండింగ్‌ను ప్రోత్సహిస్తోంది.

తాజా నివేదికల ప్రకారం, టాటా మోటార్స్ తన మొదటి ఫ్లెక్స్-ఫ్యూయల్ కారును 2026 చివరి నాటికి మార్కెట్లోకి తీసుకురావాలని భావిస్తోంది. కంపెనీ భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో 'టాటా పంచ్ ఫ్లెక్స్ ఫ్యూయల్' (Tata Punch Flex Fuel) మోడల్‌ను ప్రదర్శించడంతో దీనిపై అంచనాలు పెరిగాయి. ఈ కారు E20 నుండి E100 వరకు ఇథనాల్ మిశ్రమంతో నడిపేందుకు వీలుంటుంది. అంటే ఈ కారు సాధారణ పెట్రోల్, ఇథనాల్ రెండింటి మిశ్రమంతో కూడా రోడ్లపై పరుగులు పెట్టగలదు. 

ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనం స్పెషాలిటీ ఏంటీ ?
ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాలు సాధారణ పెట్రోల్ కార్ల కంటే కొంచెం భిన్నంగా ఉంటాయి. వీటిలో ఇంజన్, ఫ్యూయల్ పైప్, ఇంజెక్టర్, ఫ్యూయల్ సిస్టమ్‌ను ఎంత ఎక్కువ ఇథనాల్ ఉన్న ఇంధనం అయినా ఎలాంటి నష్టం లేకుండా తట్టుకునే విధంగా రూపొందిస్తున్నారు. ఇథనాల్‌లో తేమ ఎక్కువగా ఉంటుంది. ఇది సాధారణ ఇంజన్ భాగాలలో తుప్పు పట్టడం లేదా పాడైపోవడం వంటివి చేయవచ్చు. అందువల్ల కార్ల కంపెనీలు ఇంజన్ టెక్నాలజీలో చాలా మార్పులు చేయాల్సి వస్తుంది. 

Also Read: Top 5 Hybrid Cars Mileage: ఆఫీసుకు వెళ్లేవారికి అద్భుతమైన మైలేజ్ ఇచ్చే టాప్ 5 హైబ్రిడ్ కార్లు ఇవే

రాబోయే కాలంలో భారత్‌లో E85, E100 వంటి ఇంధనాల వాడకాన్ని పెంచాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. దీని కోసం కొత్త రూల్స్, టెస్టింగ్ నార్మ్స్ కూడా సిద్ధం చేసే అవకాశాలున్నాయి. దేశంలో ఇథనాల్ వాడకం ఎక్కువైతే ముడి చమురు దిగుమతులపై ఆధారపడటం కొంతమేర తగ్గుతుందని, విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుందని, అలాగే ఇథనాల్‌ను చెరకు, మొక్కజొన్న వంటి పంటల నుంచి రూపొందిస్తారు. కనుక మన రైతులకు కూడా ప్రయోజనం చేకూరుతుందని కేంద్రం భావిస్తోంది.

Also Read: Car Maintenance Tips: కారు మైలేజ్ పెంచుకోవడానికి బెస్ట్ టిప్స్ - ఈ చిన్న మెయింటెనెన్స్ జాగ్రత్తలతో ఫ్యూయెల్ ఆదా చేసుకోండి

ఫ్యూచర్ అంతా ఎలక్ట్రిక్ కార్లదే 
కొంతమంది నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఫ్లెక్స్-ఫ్యూయల్ టెక్నాలజీ ప్రస్తుతం వాడుతున్న ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రత్యామ్నాయంగా మారవచ్చు. ముఖ్యంగా సుదూర ప్రయాణాలు చేసేవారికి, ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సమస్య తప్పించుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. మరోవైపు, భవిష్యత్తులో పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాలదే హవా అని చెబుతున్నారు. రాబోయే సంవత్సరాల్లో భారత్‌లో EV, ఫ్లెక్స్-ఫ్యూయల్ రెండు టెక్నాలజీల మధ్య పోటీ నెలకొంటుందని అంచనా వేశారు. 

 

Frequently Asked Questions

టాటా మోటార్స్ ఎప్పుడు తమ మొదటి ఫ్లెక్స్-ఫ్యూయల్ కారును విడుదల చేయనుంది?

టాటా మోటార్స్ 2026 చివరి నాటికి తమ మొదటి ఫ్లెక్స్-ఫ్యూయల్ కారును మార్కెట్లోకి తీసుకురావచ్చని నివేదికలు సూచిస్తున్నాయి. దీనిని భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో ప్రదర్శించారు.

ఫ్లెక్స్-ఫ్యూయల్ కారు అంటే ఏమిటి?

ఫ్లెక్స్-ఫ్యూయల్ కారు పెట్రోల్‌తో పాటు వివిధ స్థాయిలలో ఇథనాల్ మిశ్రమంతో కూడా నడవగలదు. ఇది E20 నుండి E100 వరకు ఇథనాల్‌తో పనిచేయగలదు.

ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాల్లో ప్రత్యేకత ఏమిటి?

ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాల ఇంజన్, ఫ్యూయల్ సిస్టమ్‌లు ఎక్కువ ఇథనాల్‌ను తట్టుకునేలా ప్రత్యేకంగా రూపొందించబడతాయి. ఇథనాల్‌లోని తేమ వల్ల కలిగే తుప్పు పట్టడాన్ని నివారించడానికి ఈ మార్పులు చేస్తారు.

ఫ్లెక్స్-ఫ్యూయల్ టెక్నాలజీ వల్ల ప్రభుత్వానికి ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి?

ఇథనాల్ వాడకం పెరిగితే ముడి చమురు దిగుమతులు తగ్గి, విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుంది. అలాగే, ఇథనాల్‌ను పంటల నుండి తయారు చేస్తారు కాబట్టి రైతులకు కూడా ప్రయోజనం కలుగుతుంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

మీ కారు RCని వేరే రాష్ట్రానికి ట్రాన్స్‌ఫర్ చేయాలా? ఆన్‌లైన్‌లోనే పని పూర్తి.. కావాల్సిన పత్రాలు, ఫీజుల వివరాలివే!
వెహికల్‌ RCని ట్రాన్స్‌ఫర్‌ చేయడం ఎలా? పూర్తి ప్రాసెస్‌, ఫీజుల వివరాలు
హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్ రివ్యూ: మోడ్రన్‌ ఫీచర్లు ఉన్న ఈ కారు డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్‌ ఎలా ఉంది?
Honda Elevate Facelift డ్రైవింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ నిజమైన రోడ్డుపై ఎలా ఉంది? కొనవచ్చా?
మారుతి బలెనోకు పోటీగా 2026 టయోటా గ్లాంజా ఫేస్‌లిఫ్ట్.. కొత్త ఇంజిన్‌తో మైలేజీ పెరుగుతుందా?
అక్టోబర్ 14న వస్తున్న టయోటా గ్లాంజా ఫేస్‌లిఫ్ట్‌.. కొత్తగా ఏం ఎక్స్‌పెక్ట్‌ చేయొచ్చు?
39hp పవర్‌తో కవాసాకి కొత్త బైక్‌ Kawasaki Z300.. రూ.3 లక్షల లోపే! ఇందులో ప్రత్యేకతలు ఏంటంటే?
నింజా 300 ఇంజిన్‌తో కొత్త స్ట్రీట్ ఫైటర్.. Kawasaki Z300 లుక్‌ ఇదే - KTM డ్యూక్‌కు గట్టి పోటీ!

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jantar Mantar: నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
CM Revanth Reddy: ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
AP ZPTC Election Reservations: ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
Vijayasai Reddy Party: కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
Hyderabad Crime News: బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
Drishyam 3 OTT : అజయ్ దేవగణ్ 'దృశ్యం 3' న్యూ రికార్డ్ - 450 కోట్ల సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్ ఎప్పుడు, ఏ ఓటీటీలోకి వస్తుందంటే?
అజయ్ దేవగణ్ 'దృశ్యం 3' న్యూ రికార్డ్ - 450 కోట్ల సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్ ఎప్పుడు, ఏ ఓటీటీలోకి వస్తుందంటే?
October Smartphones Launch: అక్టోబర్ 12 - 18 మధ్య ఫ్లాగ్‌షిప్ ఫోన్ల లాంచ్‌.. వన్‌ప్లస్ 16, రెడ్‌మ్యాజిక్ 12 ప్రో+ ఇంకా మరెన్నో!
అక్టోబర్ 12 - 18 మధ్య ఫ్లాగ్‌షిప్ ఫోన్ల లాంచ్‌.. వన్‌ప్లస్ 16, రెడ్‌మ్యాజిక్ 12 ప్రో+ ఇంకా మరెన్నో!
మీ కారు RCని వేరే రాష్ట్రానికి ట్రాన్స్‌ఫర్ చేయాలా? ఆన్‌లైన్‌లోనే పని పూర్తి.. కావాల్సిన పత్రాలు, ఫీజుల వివరాలివే!
వెహికల్‌ RCని ట్రాన్స్‌ఫర్‌ చేయడం ఎలా? పూర్తి ప్రాసెస్‌, ఫీజుల వివరాలు
Embed widget