Tata Avinya: టాటా కొత్త ఎలక్ట్రిక్ కారు ఇదే - డిజైన్ అదరగొట్టారుగా - ఎలా ఉందో చూశారా?
టాటా మోటార్స్ కొత్త ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ కారు అవిన్యను రివీల్ చేసింది. ఈ కారు డిజైన్ ఎంతో ఫ్యూచరిస్టిక్‌గా ఉండటం విశేషం.
టాటా మోటార్స్ తన కొత్త ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ కారును ప్రదర్శించింది. దీనికి అవిన్య అని పేరు పెట్టింది. ఇది ఒక కొత్త ఎలక్ట్రిక్ కారు. రాబోయే రెండు సంవత్సరాల్లో 10 ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేయాలని టాటా లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగా ఈ కొత్త కాన్సెప్ట్‌ను రివీల్ చేసింది.
ఇది ప్రస్తుతానికి కాన్సెప్ట్ మాత్రమే. అయితే ఎలక్ట్రిక్ వాహనాలపై కంపెనీ భవిష్యత్ ఆలోచనలు ఏ స్థాయిలో ఉన్నాయో దీన్ని చూసి చెప్పవచ్చు. దీని క్యాబిన్ చూడటానికి లాంజ్ తరహాలో ఉంది. ఈ కారును కొత్త ఈవీ ఆర్కిటెక్చర్ ఆధారంగా రూపొందించారు. హ్యాచ్‌బ్యాక్/సెడాన్/ఎంపీవీలను మిక్సీలో వేసి బయటకు తీసినట్లు ఉంది.
దీని డిజైన్ కూడా చాలా స్మూత్‌గా ఉంది. సరికొత్త లైటింగ్ సిగ్నేచర్ కూడా ఇందులో చూడవచ్చు. ఈ లైన్స్ చూడటానికి సింపుల్‌గానే ఉన్నా ఫ్యూచరిస్టిక్‌గా ఉంది. అవిన్య అనేది ఒక కాన్సెప్ట్ కారు. ఇందులో ప్రత్యేకమైన డోర్లు ఉన్నాయి. ఇంటీరియర్ కూడా చాలా స్టైలిష్‌గా ఉంది.
కర్వ్ కాన్సెప్ట్ తరహాలో కాకుండా... ఈ కారు మరింత అడ్వాన్స్‌డ్ డిజైన్‌తో లాంచ్ అయింది. టాటా త్వరలో మరిన్ని ఎలక్ట్రిక్ వాహనాలను లాంచ్ చేయనుంది. ప్రస్తుతం భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో టాటానే ముందంజలో ఉంది. టాటాలో ఇప్పటికే నెక్సాన్ ఎలక్ట్రిక్ వెర్షన్ ఉంది. త్వరలో ఆల్ట్రోజ్, పంచ్‌ల్లో కూడా ఎలక్ట్రిక్ వెర్షన్స్ లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది.
Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!
Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!
Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?
View this post on Instagram