అన్వేషించండి

Mahindra XUV e9 vs Tata Harrier EV: ఏది బెస్ట్ ఎలక్ట్రిక్ SUV? ధర, ఫీచర్లు, పనితీరుతో పోల్చుకోండి!

Tata Harrier EV Vs Mahindra XEV 9e: మన దేశంలో టాటా ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది. పనితీరు & పరిధి ఆధారంగా టాటా హారియర్ EV & మహీంద్రా XUV 9e మధ్య మీకు ఏది రైట్‌ ఆప్షనో తెలుసుకుందాం.

Mahindra XEV 9e Vs Tata Harrier EV: చాలా కాలం ఎదురు చూపుల తర్వాత టాటా హారియర్ EV భారతీయ మార్కెట్లోకి ప్రవేశించింది. ఎలక్ట్రిక్ SUV విభాగంలో, ఇది మహీంద్రా XUV 9eకు పోటీగా టాటా మోటార్స్ ఈ బండి రోడ్డుపైకి తెచ్చింది. ఈ పరిస్థితిలో, ఈ రెండు EVలలో ఏది కొనడం బెటర్‌, ఏది ఎక్కువ ప్రయోజనకరం?, వివరంగా తెలుసుకుందాం.

బడ్జెట్‌కు తగిన విలువను అందించే బండి ఏది?
టాటా హారియర్ EV ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 21.49 లక్షలు, మహీంద్రా XUVe9 ఎక్స్-షోరూమ్ ధర రూ. 21.90 లక్షల నుంచి స్టార్ట్‌ అవుతుంది. దీనితో పోలిస్తే టాటా హారియర్ EV 40,000 తక్కువ. ఈ కంపెనీ టాప్ వేరియంట్లు కూడా మహీంద్రా కంటే ఎక్కువ రేంజ్‌ను & పెర్ఫార్మెన్స్‌ను అందిస్తాయి. హారియర్ EV కొంచెం చవకగా & డబ్బుకు తగిన విలువను అందించగలదు.

డిజైన్ పరంగా ఏది బెస్ట్‌?
ICE మోడల్ నుంచి ప్రేరణతో టాటా హారియర్ EV రూపొందింది. అయితే.. క్లోజ్డ్ గ్రిల్, ఏరో-ఆప్టిమైజ్డ్ 19-అంగుళాల అల్లాయ్ వీల్స్ & కనెక్టెడ్‌ LED టెయిల్ లాంప్స్ వంటి ఆధునిక టచ్‌లు ఇచ్చారు. మహీంద్రా XUV e9 ఇన్వర్టెడ్‌ L-షేప్‌ LED టెయిల్‌లైట్‌లు, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ & డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్‌తో కూడిన పవర్‌ఫుల్‌ కూపే-స్టైల్‌ SUV. దీని లుక్ మరింత యూత్‌ఫుల్‌గా & ఫూచరిస్టిక్‌గా కనిపిస్తుంది. టాటా హారియర్‌తో పోలిస్తే XUV e9 డిజైన్ మరింత మోడ్రన్‌ &డెవలప్డ్‌ మోడల్‌, ఇది యువతను ఆకర్షిస్తుంది.

ఇంటీరియర్స్ & టెక్నాలజీ
టాటా హారియర్ EV క్యాబిన్ డ్యూయల్-టోన్ థీమ్ & 14.5-అంగుళాల టచ్‌స్క్రీన్, 10.25-అంగుళాల డిజిటల్ క్లస్టర్, వెంటిలేటెడ్ సీట్లతో వచ్చింది & దీని ఇంటీరియర్ ప్రీమియం ఫీల్‌ ఇస్తుంది. మహీంద్రా XUV e9 మూడు స్క్రీన్‌లను అందిస్తుంది, అవి - డ్రైవర్ డిస్‌ప్లే, సెంటర్ ఇన్ఫోటైన్‌మెంట్ & ప్యాసింజర్ స్క్రీన్. ఇవన్నీ 12.3 అంగుళాల స్క్రీన్‌లు. పనోరమిక్ సన్‌రూఫ్, హర్మాన్ కార్డాన్ సౌండ్ సిస్టమ్ & మల్టీ-జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి హై-ఎండ్ ఫీచర్లు కూడా ఉన్నాయి. XUV e9 ఇంటీరియర్ మోర్‌ హై-టెక్ & లగ్జరీ అనుభవాన్ని అందిస్తుంది.

భద్రత లక్షణాలు
టాటా హారియర్ EV & మహీంద్రా XUV e9 రెంటింటిలో లెవల్-2 ADAS, 360-డిగ్రీ కెమెరా & వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి ఆధునిక భద్రత & సౌకర్యవంతమైన ఫీచర్లు ఉన్నాయి. అదనంగా, టాటా హారియర్ EVలో ట్రాన్స్‌పరెంట్‌ మోడ్, బూస్ట్ మోడ్ & ఆరు టెర్రైన్ మోడ్స్‌ వంటి ఆఫ్-రోడింగ్ ఫీచర్లు ఉన్నాయి, కఠినమైన రోడ్లపై మెరుగ్గా పనిచేయడానికి ఇవి వీలు కల్పిస్తాయి. మహీంద్రా XUV e9లో AR ఆధారిత హెడ్స్-అప్ డిస్‌ప్లే, ఆటో పార్క్ అసిస్ట్ & 1400W హర్మాన్ కార్డాన్ సౌండ్ సిస్టమ్ వంటి హై-టెక్ & ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి, ఇవి కారును సాంకేతికంగా మరింత ఉన్నతంగా నిలబెడతాయి. ఈ విధంగా చూస్తే.. హారియర్ EV ఆఫ్-రోడింగ్ ప్రియులకు అనుకూలంగా ఉంటుంది, XUV e9 ఇన్నోవేషన్‌ & లగ్జరీ ఫీచర్లకు ప్రాధాన్యతనిచ్చే కస్టమర్లను ఆకర్షిస్తుంది.

బ్యాటరీ & పనితీరు
టాటా హారియర్ EV రెండు ఆప్షన్స్‌లో (65kWh & 75kWh బ్యాటరీ ప్యాక్‌) లాంచ్‌ అయింది, అవి వరుసగా 505 km & 627 km డ్రైవింగ్‌ రేంజ్‌ను అందిస్తాయి. దీని పవర్ అవుట్‌పుట్ 235 bhp నుంచి 390 bhp వరకు ఉంటుంది & ఈ SUV కేవలం 6.3 సెకన్లలో 0 నుంచి 100 kmph వేగాన్ని అందుకోగలదు. దీని డ్యూయల్-మోటార్ ఆల్-వీల్ డ్రైవ్ (AWD) సెటప్ కారణంగా పెర్పార్మెన్స్‌ & గ్రిప్ రెండింటిలోనూ బలంగా ఉంటుంది. మహీంద్రా XUV e9 కూడా రెండు బ్యాటరీ ఎంపికలలో (59kWh & 79kWh) అందుబాటులో ఉంది, ఇది 542 & 656  km డ్రైవింగ్‌ రేంజ్‌ను ఇస్తుంది. దీని పవర్ అవుట్‌పుట్ 228 bhp నుంచి 282 bhp వరకు ఉంటుంది & ఇది 6.8 సెకన్లలో 0 నుంచి 100 kmph వేగాన్ని అందుకోగలదు. ఈ బండికి రియర్‌-వీల్‌ డ్రైవ్ (RWD) సెటప్ ఉన్నప్పటికీ ఈ SUV ఇచ్చే లాంగ్ రేంజ్ వల్ల సుదూర ప్రయాణాలకు మంచి ఆప్షన్‌ అవుతుంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ind vs SA 1st T20: కటక్‌ టీ20లో సౌతాఫ్రికాపై 101 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా
కటక్‌ టీ20లో సౌతాఫ్రికాపై 101 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా
Andhra Pradesh Latest News: స్క్రబ్ టైఫస్‌పై అధ్యయనానికి వైద్యనిపుణులతో టాస్క్‌ఫోర్స్ నియమించనున్న ఏపీ ప్రభుత్వం
స్క్రబ్ టైఫస్‌పై అధ్యయనానికి వైద్యనిపుణులతో టాస్క్‌ఫోర్స్ నియమించనున్న ఏపీ ప్రభుత్వం
Telangana Rising Summit: సినీ రంగానికి పూర్తి స్థాయి ప్రోత్సాహం - సీఎం రేవంత్ హామీ
సినీ రంగానికి పూర్తి స్థాయి ప్రోత్సాహం - సీఎం రేవంత్ హామీ
Ram Mohan Naidu summons IndiGo CEO: ఇండిగో సంక్షోభంపై ప్రభుత్వం ఆగ్రహం, 10% విమానాలను తగ్గించాలని కఠిన ఆదేశం
ఇండిగో సంక్షోభంపై ప్రభుత్వం ఆగ్రహం, 10% విమానాలను తగ్గించాలని కఠిన ఆదేశం

వీడియోలు

Tirupparankundram Temple Issue | తిరుప్పారన్‌కుండ్రం మురుగున్ ఆలయం వివాదం ఏంటి? | ABP Desam
Smriti In Nets After Wedding Cancellation | బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న స్మృతి మంధాన
SKY about Sanju Samson as Opener | టీమ్ పై కీలక వ్యాఖ్యలు చేసిన SKY
Gambhir about Team India Batting Order | గంభీర్ కొత్త స్టేట్మెంట్ అర్థం ఏంటి..?
Irfan Pathan Comments on Captain Shubman Gill | గిల్‌కు కీలక సూచన చేసిన ఇర్ఫాన్ పఠాన్‌

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs SA 1st T20: కటక్‌ టీ20లో సౌతాఫ్రికాపై 101 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా
కటక్‌ టీ20లో సౌతాఫ్రికాపై 101 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా
Andhra Pradesh Latest News: స్క్రబ్ టైఫస్‌పై అధ్యయనానికి వైద్యనిపుణులతో టాస్క్‌ఫోర్స్ నియమించనున్న ఏపీ ప్రభుత్వం
స్క్రబ్ టైఫస్‌పై అధ్యయనానికి వైద్యనిపుణులతో టాస్క్‌ఫోర్స్ నియమించనున్న ఏపీ ప్రభుత్వం
Telangana Rising Summit: సినీ రంగానికి పూర్తి స్థాయి ప్రోత్సాహం - సీఎం రేవంత్ హామీ
సినీ రంగానికి పూర్తి స్థాయి ప్రోత్సాహం - సీఎం రేవంత్ హామీ
Ram Mohan Naidu summons IndiGo CEO: ఇండిగో సంక్షోభంపై ప్రభుత్వం ఆగ్రహం, 10% విమానాలను తగ్గించాలని కఠిన ఆదేశం
ఇండిగో సంక్షోభంపై ప్రభుత్వం ఆగ్రహం, 10% విమానాలను తగ్గించాలని కఠిన ఆదేశం
Karthigai Deepam Row: ప్రభుత్వం Vs విపక్షాలు Vs కోర్టు - తమిళనాడు రాజకీయాల్లో సెగ రేపుతున్న ఆలయ దీపం
ప్రభుత్వం Vs విపక్షాలు Vs కోర్టు - తమిళనాడు రాజకీయాల్లో సెగ రేపుతున్న ఆలయ దీపం
Pilot Rostering Issues: భారత్‌లో పైలట్‌ల కొరతకు కారణాలేంటీ? యువత అటువైపుగా ఎందుకు ఆసక్తి చూపడం లేదు?
భారత్‌లో పైలట్‌ల కొరతకు కారణాలేంటీ? యువత అటువైపుగా ఎందుకు ఆసక్తి చూపడం లేదు?
IPL 2026 Auction :ఐపీఎల్ 2026 వేలం కోసం ఎంపికైన 350 మంది ఆటగాళ్ల వివరాలు ఇవే!
ఐపీఎల్ 2026 వేలం కోసం ఎంపికైన 350 మంది ఆటగాళ్ల వివరాలు ఇవే!
Dekhlenge Saala Song Promo: 'దేఖ్‌లేంగే సాలా' ప్రోమో వచ్చేసిందోచ్... మైఖేల్ జాక్సన్ స్టైల్‌లో పవర్ స్టార్ స్టెప్పులు - ఫ్యాన్స్‌కు పండగ
'దేఖ్‌లేంగే సాలా' ప్రోమో వచ్చేసిందోచ్... మైఖేల్ జాక్సన్ స్టైల్‌లో పవర్ స్టార్ స్టెప్పులు - ఫ్యాన్స్‌కు పండగ
Embed widget